ఆనంది ప్రసాద్ యాదవ్
| ఆనంది ప్రసాద్ యాదవ్ | |||
| పదవీ కాలం 2010 – 2015 నవంబర్ | |||
| ముందు | మురళీధర్ మండల్ | ||
|---|---|---|---|
| తరువాత | విజయ్ కుమార్ మండల్ | ||
| పదవీ కాలం 2000 – 2005 | |||
| ముందు | రామేశ్వర్ యాదవ్ | ||
| తరువాత | మురళీధర్ మండల్ | ||
| నియోజకవర్గం | సిక్తి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| ఇతర రాజకీయ పార్టీలు | ఎన్‌సీపీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఆనంది ప్రసాద్ యాదవ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు సిక్తి నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఆనంది ప్రసాద్ యాదవ్ భారతీయ జనతా పార్టీ పార్టీ అభ్యర్థిగా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2000 బీహార్ శాసనసభ ఎన్నికలలో సిక్తి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఎండీ అజీం ఉద్దీన్ పై 14,183 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 54,981 ఓట్లతో విజేతగా నిలవగా, ఎండీ అజీం ఉద్దీన్ 40,798 రెండోస్థానంలో నిలిచాడు.[2]
ఆనంది ప్రసాద్ యాదవ్ 2005 బీహార్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 14638 ఓట్లతో నాల్గొవ స్థానంలో, 2005 బీహార్ శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి 14433 ఓట్లతో నాల్గొవ స్థానంలో నిలిచాడు.
ఆనంది ప్రసాద్ యాదవ్ 2010 బీహార్ శాసనసభ ఎన్నికలలో సిక్తి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎల్‌జేపీ అభ్యర్థి విజయ్ కుమార్ మండల్ పై 9874 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 42076 ఓట్లతో విజేతగా నిలవగా, విజయ్ కుమార్ మండల్ 32202 రెండోస్థానంలో నిలిచాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Sikti Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". Result University. 4 January 2026. Archived from the original on 4 January 2026. Retrieved 4 January 2026.