Jump to content

ఆనంద్​ అస్నోటికర్​

వికీపీడియా నుండి
ఆనంద్ వసంత్ అస్నోటికర్

పదవీ కాలం
2008  2013 మే 17
నియోజకవర్గం కార్వార్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (సెక్యులర్)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
బీజేపీ
తల్లిదండ్రులు వసంత్ అస్నోటికర్, శుభలత
వృత్తి రాజకీయ నాయకుడు

ఆనంద్ వసంత్ అస్నోటికర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన కర్ణాటక శాసనసభకు కార్వార్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మత్స్య , సైన్స్ & టెక్నాలజీ మంత్రిగా పని చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

అస్నోటికర్ ఆనంద్ వసంత్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కార్వార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి గణపతి దుమ్మ ఉల్వేకర్‌పై 19709 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి[5] భారతీయ జనతా పార్టీలో చేరి 2009లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా గెలిచి యడ్యూరప్ప మంత్రివర్గంలో 2010 సెప్టెంబర్ 23 నుండి 2011 జూలై 31 వరకు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా, సదానంద గౌడ మంత్రివర్గంలో 2011 ఆగస్టు 4 నుండి 2012 జూలై 12 వరకు మత్స్య, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా, జగదీష్ షెట్టర్ మంత్రివర్గంలో 12 జూలై 2012 నుండి 13 మే 2013 వరకు మత్స్య, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా పని చేశాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Anand Asnotikar hints at going back to the Congress" (in Indian English). The Hindu. 6 June 2023. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.
  2. "Former BJP Minister Asnotikar joins JD(S)" (in Indian English). The Hindu. 15 January 2018. Archived from the original on 22 February 2025. Retrieved 25 April 2025.
  3. "General Election - Karnataka Legislative Assembly 2008 - Election Statistics" (PDF). Archived (PDF) from the original on 2021-02-01.
  4. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  5. "Cong, JD-S MLAs quit, to join BJP" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 7 July 2008. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.
  6. "Planetariums in all city corporations" (in Indian English). The Hindu. 27 October 2012. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.