రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో ఆనంద్ (గుజరాత్) జిల్లా (హిందీ:) ఒకటి. ఆనంద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.[1] జిల్లావైశాల్యం 4690 చ.కి.మీ.1997లో ఖెడా జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఆనంద్ జిల్లా ఏర్పాటు చేయబడింది. ఆనంద్ (గుజరాత్) పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో ఖెడా జిల్లా, తూర్పు సరిహద్దులో వడోదర జిల్లా, పశ్చిమ సరిహద్దులో అహమ్మదాబాదు జిల్లా దక్షిణ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ ఖంభాత్ ఉంది. జిల్లాలో కంభాత్, తారాపూర్ (గుజరాత్), పెత్లాబ్ మరియు సొజిత్ర మొదలైన ప్రధాన పట్టణాలు ఉన్నాయి.
ఆనంద్ జిల్లాలో పొగాకు, అరటి మొదలైన పంటలు ప్రధానంగా పండించబడుతున్నాయి. ఆనంద్ జిల్లాలో ప్రబల అమూల్ పరిశ్రమ ఉంది. విఠల్ ఉద్యోగ్ నగర్ వంటి బృహత్తర పరిశ్రమలు ఉన్నాయి. ఎల్కాన్ ఇంజనీరింగ్, వర్ం స్టీం, మిల్సెంట్ మరియు అట్లాంటా ఎలెక్ట్రానిక్స్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. అమూల్. ఇండియన్ డెయిరీ కోపరేటివ్ సంస్థ గుజరాత్ రాష్ట్రంలో స్థాపించబడింది. అమూల్ సంస్థ పాలు మరియు పాల ఉతపత్తులకు భారతదేశంలో శ్వేత విప్లవానికి నాంది పలికింది. అమూల్ భారతదేశంలో అతిపెద్ద ఆహారతయారీ సంస్థగా గుర్తించబడుతుంది. అమూల్ విదేశి మార్కెట్లలో కూడా ప్రవేశించింది.
↑US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Macedonia 2,077,328 July 2011 est.line feed character in |quote= at position 10 (help)