ఆనంద్ జైన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనంద్ జైన్
AJ Pic.jpg
ఆనంద్ జైన్
జననంJanuary 1957 [1]
జాతీయతIndian
వృత్తిBusiness executive
ప్రసిద్ధులుExpertise in financial services and real estate;
Close associate of Mukesh Ambani
శీర్షికChairman of Navi Mumbai SEZ Pvt. Ltd.
జీవిత భాగస్వామిSushma Jain
పిల్లలుNeha , Harsh

ఆనంద్ జైన్ (జననం 1957) భారతదేశానికి చెందిన ఒక వ్యాపారవేత్త. జై కార్ప్ లిమిటెడ్, నావి ముంబై ఎస్ఇజెడ్ ప్రైవేటు లిమిటెడ్, ముంబై ఎస్ఇజెడ్ లిమిటెడ్, రిలయన్స్ హర్యానా ఎస్ఇజెడ్ లిమిటెడ్ మరియు అర్బన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ వెంచర్ కాపిటల్ ప్రైవేటు లిమిటెడ్ (UIVCPL) సంస్థలకు అధ్యక్షుడు. ఆయనకు వివిధ వ్యాపార రంగాల్లో 25 సంవత్సరాల అనుభవం ఉంది, రియల్ ఎస్టేట్, ఆర్థిక రంగం, మరియు పెట్టుబడి రంగాల్లో నిపుణత కలిగి ఉన్నారు.

2007 ఫోర్బ్స్ భారత నలభై అత్యంత ధనవంతుల జాబితాలో ఆనంద్ జైన్ 19వ స్థానంలో ఉన్నారు.[2] ముకేష్ అంబానికి అత్యంత సన్నిహితుడిగా ఖ్యాతి చెందారు.[3][4]

విద్య[మార్చు]

ఆనంద్ జైన్ ముంబైలో ఉన్న హిల్ గ్రాన్జ్ ఉన్నత పాఠశాలలో చదివారు, అక్కడ ముకేష్ అంబాని ఆయన సహ విద్యార్థి.[5] ముంబై హెచ్.ఆర్.కళాశాల నుంచి వాణిజ్యంలో బ్యాచిలర్ పట్టా పుచ్చుకున్నారు. ఆయన లండన్ బిసినెస్ స్కూల్లో కూడా నిర్వహణ వ్యవస్థను అభ్యసించారు.

వ్యాపార జీవితం[మార్చు]

ది ఎకనామిక్ టైమ్స్ 2005లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, ఆనంద్ జైన్ 1980 మధ్య కాలంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ శాసిస్తున్న మను మానెక్ భల్లూక పక్షాన్ని అణగదొక్కి రిలయన్స్లో గుర్తింపు పొందారు.[5] తరువాతి కాలంలో రిలయన్స్ సంస్థలో, ముఖ్యంగా రిలయన్స్ ఇన్ఫోకామ్లో రోజువారీ కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తిగా ఎదిగారు. జనవరి 2005లో అనిల్ అంబాని (ముకేష్ అంబాని తమ్ముడు) ఆనంద్ జైన్ తో ఉన్న అభిప్రాయ భేదాలను ఉటంకిస్తూ, IPCL ఉప అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు.[6][7][8][9][10][11] జూన్ 2005లో, అంబాని సోదరులు ఇద్దరి మధ్య కుదిరిన రాజీ ప్రకారం జైన్ IPCL బోర్డు నుంచి వైతొలగుతారని మీడియా చెప్పింది.[12][13][14] అయినప్పటికీ, జూలై 2005లో ఆయన IPCL బోర్డులో కనసాగుతారు అని చెప్పింది.[15][16]

ఫార్చున్ 500 రిలయన్స్ సంస్థతో ఆనంద్ జైన్ కు పాతిక సంవత్సరాల అనుబంధం ఉంది. రిలయన్స్ కేపిటల్[17] ఉప అధ్యక్షుడిగా సేవలు అందించారు మరియు రిలయన్స్ సంస్థకు చెందిన ఇండియన్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ కి కూడా తన సేవలు అందించారు. (IPCL)

ఆనంద్ జైన్ ముంబై పోర్ట్ ట్రస్ట్, బోర్డు సభ్యునిగా రెండు సంవత్సరాల పదవీ కాలంతో రెండు పర్యాయాలు పనిచేసారు, అంతే కాకుండా జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ సభ్యునిగా కూడా ఏప్రిల్ 1994 నుంచి మార్చి 1995 వరకు కొనసాగారు. ముంబైలో ఓడరేవు అభివృద్ధి పధకం గ్రీన్ ఫీల్డ్, రేవాస్ పోర్ట్ లిమిటెడ్[18] సంచలకునిగా కూడా సేవలు అందించారు. ఈ ఓడరేవు తొందరలో ప్రారంభం కానున్న రెండు పెద్ద ఎస్ఇజెడ్లు అవి; NMSEZ, MSEZకు సింహ ద్వారంగా పనిచేస్తుంది. మొదటి ఐదు సంవత్సరాలలో ఆ రేవు 50 మిల్లియన్ టన్నుల సరుకు రవాణా చెయ్యాలని గురి పెట్టారు.

ఆయన భారతదేశ అతి పెద్ద రియల్ ఎస్టేట్ ప్రైవేటు ఈక్విటీ ఫండ్ పెరుగుదలకు తోడ్పడ్డారు ఈ ఫండ్ మొత్తం 3286 కోట్లకు చేరింది. దీనిలో చిన్న మదుపరులు మరియు వ్యవస్థాగత పెట్టుబడిదారులు కూడా పెట్టుబడి పెట్టారు.[19] ఈయన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ ఫండ్ సలహాదారునిగా పనిచేసారు. ఈ ఫండ్ అంతర్జాతీయ మదుపర్ల 500 మిలియన్ డాల్లర్లు నుంచి మరియు స్థానిక మదుపర్ల నుంచి 60 మిలియన్ డాలర్లు సేకరించింది. ఈ ఫండ్ మొత్తం విలువ 560 మిలియన్ డాలర్లు.

అర్బన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ వెంచర్ కేపిటల్ ఫండ్ ను నిర్వహిస్తున్న అర్బన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ వెంచర్ కేపిటల్ లిమిటెడ్ కి ఆనంద్ జైన్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఈ కింది సంస్థలకు సంచాలకునిగా సేవలు అందిస్తున్నారు.

  • రిలయన్స్ హర్యానా ఎస్ఇజెడ్ (ప్రైవేటు.) లిమిటెడ్. (25,000 ఎకరాలలో (101 కి.మీ²) ఎస్ఇజెడ్ అభివృద్ధి చేస్తున్నారు.
  • ఇండియన్ పెట్రోకెమికల్ కార్పోరేషన్ లిమిటెడ్. (IPCL)
  • రిలయన్స్ వెంచర్స్ లిమిటెడ్. (100% రిలయన్స్ ఇండ్.లిమిటెడ్ అనుబంధ సంస్థ).[20]
  • ఇండియన్ ఫిల్మ్స్ కంబైన్ ప్రైవేటు లిమిటెడ్.

ప్రస్తుతం రిలయన్స్ సంస్థలో కీలక కార్యనిర్వాహక పదవిలో కొనసాగుతున్నారు.మొదటి గ్రీన్ ఫీల్డ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్ఇజెడ్) రూపొందించిన నిపుణుల బృందానికి నేతృత్వం వహించారు.ఆ జోన్ కళను సాకారం చేసారు.[21] ఈయన భారత దేశం అంతటా ఎస్ఇజెడ్ లను ప్రారంభించటానికి ప్రోత్సహించారు, దీని వల్ల ప్రపంచ విపణిలో భారత వ్యాపారం సమర్ధవంతంగా ఉంటుందని భావించారు.[22]

యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీ అధ్యక్షులు నడుపుతున్నారు, ఈ సంస్థలో ఆనంద్ జైన్ క్రియాశీలక సభ్యుడు. ఆయన ముంబై లోని మంగోలియా దౌత్య కార్యాలయానికి గౌరవ సలహాదారునిగా వ్యవహరించారు మరియు ముంబై లోని సర్ హుర్కిసొందాస్ నరోత్తందాస్ ఆసుపత్రి మరియు పరిశోధన కేంద్రానికి కార్యనిర్వాహక సలహాదారునిగా ఉండేవారు. "ఎంపవర్డ్ కమిటి ఫర్ ట్రాన్స్ఫార్మేషన్ అఫ్ ముంబై ఇంటు ఎ వరల్డ్ క్లాస్ సిటీ", ఆయనను ఈ కమిటిలో సభ్యునిగా మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముంబైకి అంతర్జాతీయ గుర్తింపు తేవడానికి నడుం కట్టుకున్న "సిటిజెన్స్ యాక్షన్ గ్రూప్" సంస్థలో కూడా సభ్యుడు.

ఆయన తరచుగా వాణిజ్య ప్రచురణలలో కనిపిస్తుంటారు. కొత్త వ్యాసాన్ని బిసినెస్ వరల్డ్ పత్రికలో చదవచ్చు.

ముంబైని ప్రభావితం చేసిన డియెన్ఎలో 50 ప్రభావశాలి వ్యక్తులు ప్రచురణలో చోటు దొరికింది.

ఆనంద్ జైన్ ను కలవండి

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆనంద్ జైన్ ముంబైలో నివసిస్తున్నారు. ఆయన అర్ధాంగి శ్రీమతి సుష్మ జైన్. ఆయనకి ఇద్దరు సంతానం నేహ మరియు హర్ష్, ఇద్దరి విద్య పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో (వార్టన్ స్కూల్ అఫ్ బిసినెస్) జరిగింది. నేహ అనురాగ్ బాగారియతో వివాహ అనంతరం బెంగళూర్లో నివసిస్తున్నారు. ముంబైకి చెందిన రచనా షాతో హర్ష్ నిశ్చితార్ధం జరిగింది.

సూచనలు[మార్చు]

  1. Business Today article on the man
  2. "India's Richest: #19 Anand Jain". Forbes.com. November 14, 2007. Retrieved 2007-04-21. Cite web requires |website= (help)
  3. "Ambani bros to get equal share". The Times of India. 2005-01-07. Retrieved 2007-04-21. Cite news requires |newspaper= (help)
  4. "Ambani gives shape to new mega city". The Times of India. 2006-03-21. Retrieved 2007-04-21. Cite news requires |newspaper= (help)
  5. 5.0 5.1 "Anand Jain - the man behind Mukesh Ambani". The Economic Times. 2005-01-04. మూలం నుండి 2007-05-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-04-21. Cite news requires |newspaper= (help) (cached)
  6. "Anil quits IPCL board; accuses Anand Jain of conspiracy". Rediff.com. 2005-01-03. Retrieved 2007-09-21. Cite news requires |newspaper= (help)
  7. "A resignation amid rift at Reliance". International Herald Tribune. 2005-01-04. మూలం నుండి 2006-03-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-09-21. Cite news requires |newspaper= (help)
  8. "Anil Ambani resigns from IPCL". The Times of India. 2005-01-03. Retrieved 2007-09-21. Cite news requires |newspaper= (help)
  9. "Anil fires fresh salvo at Mukesh". The Times of India. 2005-01-13. Retrieved 2007-09-21. Cite news requires |newspaper= (help)
  10. "Anil Ambani quits as IPCL Vice-Chairman". The Hindu. 2005-01-03. Retrieved 2007-09-21. Cite news requires |newspaper= (help)
  11. "Stocks pause for breath". The Telegraph, Calcutta. 2005-01-05. Retrieved 2007-09-21. Cite news requires |newspaper= (help)
  12. "Anand Jain quits IPCL board". The Telegraph. 2005-06-19. Retrieved 2007-09-21. Cite news requires |newspaper= (help)
  13. "Anil wins; Anand Jain out of IPCL". Rediff.com. 2005-06-18. Retrieved 2007-09-21. Cite news requires |newspaper= (help)
  14. "Anil gets settlement bonus - shelving Anand Jain from IPCL". Outlook. 2005-05-18. Retrieved 2007-09-21. Cite news requires |newspaper= (help)
  15. "Anand Jain stays on IPCL board". The Hindu. 2005-07-14. Retrieved 2007-09-21. Cite news requires |newspaper= (help)
  16. "Jain still on IPCL board". The Telegraph. 2005-07-13. Retrieved 2007-09-21. Cite news requires |newspaper= (help)
  17. "Reliance Cap to issue preference shares". The Times of India. 2003-03-07. Retrieved 2007-09-21. Cite news requires |newspaper= (help)
  18. "Mukesh group cos buy stake in Rewas Port". The Times of India. 2006-09-09. Retrieved 2007-09-21. Cite news requires |newspaper= (help)
  19. "Anand Jain's fund raises Rs 2,200 cr". The Economic Times. 2006-06-20. Retrieved 2007-09-21. Cite news requires |newspaper= (help)
  20. "Zone of privileges". Frontline. 2006-08-26. Retrieved 2007-04-21. Cite web requires |website= (help)
  21. "Reliance cuts Rs 35,000 cr plan for SEZs". DNA. 2007-01-15. Retrieved 2007-09-21. Cite news requires |newspaper= (help)
  22. "Out-Of-The-Shadows". Business World. 2008-07-23. Retrieved 2008-07-23. Cite news requires |newspaper= (help)