ఆప్టోమెట్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాడుకలో ఉన్న ఆప్టికల్ రిఫ్రాక్టర్ (ఫోరోప్టర్).

ఆప్టోమెట్రీ అనేది మానవులలో కళ్ళు మరియు అనుబంధ నిర్మాణాలు, అంతేకాక దృష్టి, దృష్టిసంబంధ వ్యవస్థలు, మరియు దృష్టి సమాచార విశ్లేషణకు సంబంధించిన ఆరోగ్య పరిరక్షణ వృత్తి. ఇన్ఫెక్షన్లు మరియు గ్లుకోమా వంటి కంటి వ్యాధులకు రోగనిర్ధారణ మరియు చికిత్స చేసేందుకు ఆప్టోమెట్రిస్టులు యోగ్యతపొంది ఉంటారు, మరియు సంయుక్త రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో చిన్న శస్త్రచికిత్స విధానాలు నిర్వహిస్తారు.

ఎన్నో వృత్తుల లాగే, ఆప్టోమెట్రీ విద్య, యోగ్యత, మరియు అభ్యాసం చాలావరకూ దేశాలలో నియంత్రితమై ఉంటాయి. ఆప్టోమెట్రిస్టులు మరియు ఆప్టోమెట్రీ-సంబంధ సంస్థలు కన్ను మరియు దృష్టి పరిరక్షణకై ప్రభుత్వ సంస్థలు, ఇతర ఆరోగ్య పరిరక్షణ వృత్తినిపుణులు, మరియు సమాజంతో సంప్రదింపులు జరుపుతూ ఉంటాయి. ఎన్నో U.S. రాష్ట్రాలలో ఆప్టోమెట్రిస్టులను ఆరోగ్యపరిరక్షణ పరిధిలోని వైద్యులుగా నిర్వచిస్తారు. ఆప్టోమెట్రిస్టులు మూడురకాల కంటి పరిరక్షణ వృత్తినిపుణులలో ఒకరు, ఇతరులు నేత్రవైద్యనిపుణులు, and నేత్రచికిత్సకులు.

నేపథ్యం[మార్చు]

"ఆప్టోమెట్రీ" అనే పదం గ్రీకు పదాలు ὄψις (ఆప్సిస్ ; "చూపు") మరియు μέτρον (మెట్రాన్ ; "కొలుచుటకు ఉపయోగించేది", "కొలత", "కొలమానం").

కన్ను, దాని నిర్మాణం మరియు పనితీరు అనేవి, ప్రాచీన కాలం నుండి శాస్త్రవేత్తలను మరియు సాధారణంగా ప్రజానీకాన్నీ ఆకర్షించాయి. అర్థం చేసుకోవడం అనే అర్థం వచ్చేలా ఎన్నో సమానార్థక దృష్టి సంబంధ పదాలు ఆంగ్లభాషలో ఉన్నాయి. నాకు తెలుసు అనడానికి "ఐ సీ," అనడం పరిపాటి.

ఎందరో రోగులు వారికి కంటి సమస్య ఉందని చెప్పినప్పుడు, ఇతర, మరింత ప్రాణాంతక వ్యాధుల కన్నా దృష్టి సంబంధ వ్యాధులు ఉన్నాయని తెలిసినప్పుడు ఎక్కువగా విచారిస్తారు.[ఉల్లేఖన అవసరం] దృష్టి లోపం అనేది మనస్సుపై తీవ్ర ప్రభావం చూపుతుంది, అంతేకాక ఆర్థిక మరియు సామాజిక ప్రభావం కూడా కలిగిస్తుంది.[ఉల్లేఖన అవసరం] ఎందరో అంధ వ్యక్తులకు రోజువారీ చర్యలకు సైతం గణనీయమైన సాయం అవసరమవుతుంది, మరియు తరచుగా వారు మునుపు చూడగలిగినప్పుడు ఉండిన లాభసాటి ఉద్యోగం కొనసాగించలేరు. ఒక రోగికి ఎలాంటి లక్షణాలయినా కనిపించక మునుపే, మయాస్థీనియా గ్రేవిస్, మధుమేహం, మరియు అతెరోస్క్లెరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధుల సంకేతాలు కంటి పరీక్షలో బయట పడతాయన్న విషయం అందరికీ తెలిసిందే.

కంటి ఆరోగ్య నిర్వహణ మరియు దృష్టిని తగ్గించే కంటి సమస్యలను సరిచేయడం అనేవి అన్ని రకాల ఔషధాలు అవకాశం ఇచ్చినంత వరకూ సుదీర్ఘ జీవితకాలం అందించడానికి దోహదపడతాయి. జీవన నాణ్యతకు దృష్టి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, చాలామంది ఆప్టోమెట్రిస్టులు తరచూ ఒక రోగి యొక్క దృష్టిని సరిదిద్దడం లేదా మెరుగుపరచడం చేయగల సామర్థ్యం తమకు ఉన్నందువలన, తమ ఉద్యోగం గొప్పదిగా భావిస్తారు.

ప్రవర్తనా ఆప్టోమెట్రీ అనేది కొందరు ఆప్టోమెట్రిస్టులు అభ్యసించే నాన్-స్ట్రాబిస్మస్ దృష్టి చికిత్స యొక్క అనుబంధ విభాగం. సాధారణంగా నేత్రవైద్యనిపుణులు మరియు ఆర్థాప్టిస్టులు దీనిని అభ్యసించరు. సాధారణంగా ఇందులో ఇంటివద్ద కంటి వ్యాయామాలతో, కనీసం వారానికో సారి సందర్శన అవసరమైన తీవ్రమైన చికిత్సతో కూడి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇది కేవలం కళ్ళద్దాలకంటే మెరుగైన దృష్టిని ప్రసాదిస్తుంది.

సంయుక్త రాష్ట్రాలలో, ఆప్టోమెట్రీ యొక్క అభ్యాస పరిధిని ప్రస్తుతం రాష్ట్ర బోర్డులు పర్యవేక్షిస్తున్నాయి. రాష్ట్రం నుండి రాష్ట్రానికి అభ్యాస పరిధి గణనీయంగా మారవచ్చు. ఆప్టోమెట్రిస్టులు మాత్రలు, కంటి చుక్కలు, మరియు ఇంజెక్షన్ల వంటి కొన్ని రకాల ఔషధాలని ఉపయోగంలోకి తేవడంలో విజయం సాధించారు.[1] ఒక్లహోమాలో, ఆప్టోమెట్రిస్టులు లేజర్ శస్త్రచికిత్స చేయడాన్ని రాష్ట్ర శాసన సభ అనుమతిస్తుంది.[2]

చరిత్ర[మార్చు]

ఆప్టోమెట్రిక్ చరిత్ర అనేది ఈ క్రింది విషయాల అభివృద్ధితో అనుసంధానించబడింది.

 • దృష్టి శాస్త్రం (వైద్యం, సూక్ష్మజీవశాస్త్రం, నాడీశాస్త్రం, శరీరధర్మశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం మొదలైన వాటి అనుబంధ రంగాలు)
 • నేత్రజ్ఞానశాస్త్రం, దృష్టిసంబంధ ఉపకరణాలు
 • దృష్టిసంబంధ పరికరాలు, దృశ్య పద్ధతులు
 • ఇతర నేత్ర పరిరక్షణ వృత్తులు

ఆప్టోమెట్రీ చరిత్ర ప్రారంభం అనేది నేత్రజ్ఞానశాస్త్రం మరియు కంటి ద్వారా దృశ్య నిర్మాణంపై ప్రారంభ పరిశోధనలతో మొదలైందని చెప్పవచ్చు.

ఆప్టోమెట్రిక్ విజ్ఞానం యొక్క మూలాలు కొన్ని వేల ఏళ్ళకు మునుపు అలంకరణకై కటకాలు ఉండడానికి రుజువులు కనుగొనడం వలన క్రీస్తు పూర్వం మొదలైందని చెప్పవచ్చు. మొట్టమొదటి కళ్ళజోళ్ళు ఎప్పుడు తయారయిన విషయం తెలియదు, కానీ బ్రిటిష్ శాస్త్రవేత్త మరియు చరిత్రకారుడు సర్ జోసెఫ్ నీధం తన పరిశోధనలో, ప్రాచీన చైనీస్ మొట్టమొదటి కళ్ళద్దాలను 1000 ఏళ్ళ క్రితం ఆవిష్కరించారని, మరియు వీటి గురించి వెనీషియన్ మార్కో పోలో, ప్రాచీన చైనాలో తన యాత్రల గురించి వ్రాస్తూ వీటి గురించి వ్రాసాడని తెలియజేసాడు. మరొక వాదం ప్రకారం, డేవిడ్ A. గాస్, O.D., Ph.D., పరిశోధన ప్రకారం 1305 AD లోని ఒక వ్రాతప్రతి ప్రకారం అవి విడిగా ఇటలీలో 13వ శతాబ్దం చివరలో ఆవిష్కరింపబడినట్టూ చెబుతారు, ఈ వ్రాతప్రతిలో పీసాలోని సన్యాసి రివాల్టో ఇలా చెప్పాడు “కళ్ళద్దాలు తయారు చేసే కళ మొదలై ఇప్పటికి 20 ఏళ్ళు కూడా కాలేదు”.[3] 1300 AD సమయానికి కళ్ళజోళ్ళు ఇటలీ, జర్మనీ, మరియు నెదర్లాండ్స్ లో తయారు చేయబడ్డాయి.

బెనిటో దాజా డే వాల్దేస్ 1623లో ఆప్టోమెట్రీ గురించి మూడవ పుస్తకం వ్రాసాడు, ఇందులో అతడు కళ్ళద్దాల ఉపయోగాన్ని మరియు బిగిన్చాదాన్ని వివరించాడు. ఆప్టోమెట్రిస్టు అనే పదాన్ని, "అద్దాలను బిగించడం" గురించి సూచిస్తూ, ఎడ్మండ్ లాందోల్ట్ 1886లో కనిపెట్టాడు. ఇంతకూ మునుపు, 19వ శతాబ్దంలో "వితరణ" మరియు "దృష్టిలోప నివారణ" నేత్రచికిత్సకులకు తేడా ఉండేది. తరువాతి కాలంలో వీరిలో రెండవ విభాగాన్ని ఆప్టోమెట్రిస్టులుగా పిలవడం మొదలైంది.[4]

1692లో, విలియం మాలీన్యూక్స్ హ్రస్వదృష్టి మరియు దగ్గరి దృష్టి గురించి తన భావనలను తెలుపుతూ నేత్రజ్ఞానశాస్త్రం మరియు కటకాల గురించి ఒక పుస్తకం వ్రాసాడు.

శాస్త్రవేత్తలు క్లాడిస్ టాలెమీ మరియు జోహాన్నెస్ కెప్లర్ సైతం ఆప్టోమెట్రీ సృష్టికి సహకరించారు. కంటిలోని రెటినా ఎలా దృష్టిని సృష్టిస్తుందని కెప్లర్ కనుగొన్నాడు.

1773 నుండి సుమారు 1829 వరకూ సమయంలో, థామస్ యంగ్ అసమదృష్టి వైకల్యాన్ని గుర్తించాడు, మరియు గోళస్థూపాకార కటకాలను ఉపయోగించి ఈ సమస్యను సరిచేసేందుకు అద్దాలను జార్జ్ బిడ్డెల్ ఐరీ రూపొందించాడు.[5]

USలో పేటర్ బ్రౌన్ అనే పేరుగల ఒక యాత్రికుడు కళ్ళజోడు వాడిన మొట్టమొదటి వ్యక్తిగా చెబుతారు, కానీ కళ్ళద్దాలు ఎంతో కాలంగా కేవలం యూరోప్‍లో తయారు చేయడం వలన, అవి ఎక్కువ ఖరీదైనవి మరియు దుర్లభమైనవిగా ఉండేవి. USలో 1783లో కళ్ళజోడు కొన్న మొట్టమొదటి వ్యక్తి ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా నుండి జాన్ మెక్‍ఆలిస్టర్ సీనియర్. మెక్‍ఆలిస్టర్, తన కుమారుడు జాన్ మెక్‍ఆలిస్టర్ జూనియర్‍తో కలిసి 1811లో USలో మొట్టమొదటి కళ్ళద్దాలను తయారుచేయడం ప్రారంభించాడు. వారి వ్యాపారం 20వ శతాబ్దం వరకూ కొనసాగింది. ఈ కుటుంబం వక్రీభవనం కూడా బోధించేవారు, మరియు వారి విద్యార్థులలో ఒకరైన జేమ్స్ W. క్వీన్ సైతం 1853లో తన స్వంత వ్యాపారం ప్రారంభించాడు.[3]

బెంజమిన్ పైక్ మరియు జేమ్స్ ప్రెంటిస్ ఇరువురూ ఇంగ్లాండ్‍లో చదువుకుని 1847లో US చేరిన ఇతర ప్రారంభ ఆప్టోమెట్రిస్టులు. వారు తమ కుమారులను, మరియు జేమ్స్ కుమారుడు, చార్లెస్ ప్రెంటిస్‍లకు శిక్షణను అందించి, USలో ఆప్టోమెట్రీ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించారు.[3]

అప్పుడు మారిస్ స్టెయిన్‍ఫెల్డ్ ఏడుగురు ఆప్టోమెట్రిస్టులతో ఆప్టోమెట్రీ అనేది వ్యాపారమా లేదా వృత్తిగా కొనసాగాలా అని చర్చించి, జనవరి 11, 1922 నాడు ది అమెరికన్ ఆప్టోమెట్రిక్ అసోసియేషన్ ఏర్పాటు చేశాడు. ఈ సమావేశం చివర, వారు మొత్తం ఆప్టోమెట్రిక్ రంగాన్ని వైజ్ఞానిక ఆధారం కలిగిన వృత్తిగా మార్చే దృష్టితో అమెరికన్ అకాడెమి అఫ్ ఆప్టోమెట్రీ స్థాపించారు.[6] ది అమెరికన్ ఆప్టోమెట్రిక్ సొసైటీ ఆగష్టు 2009లో ఏర్పాటయింది. AOA నేతృత్వంలో విధాన నిర్ణయాలు ఈ వృత్తిలో అనేకమంది కోరికలకు అనుగుణంగా లేవని మరియు ఈ వృత్తి యొక్క పురోగతికి ప్రతికూలంగా ఉన్నాయని వైద్యులు విచారించారు.

ఆప్టోమెట్రీ యొక్క మొట్టమొదటి పాఠశాలలు 1850–1900 (USAలో) ఏర్పాటయ్యాయి, మరియు కాంటాక్ట్ లెన్సులు మొట్టమొదట 1940లలో ఉపయోగించబడ్డాయి.[7]

USలో మొట్టమొదటి ఆప్టోమెట్రీ పాఠశాలలు 1872లో ఇల్లినాయిస్ కాలేజీ అఫ్ ఆప్టోమెట్రీ మరియు 1894లో న్యూ ఇంగ్లాండ్ కాలేజీ అఫ్ ఆప్టోమెట్రీలతో 19వ శతాబ్దం చివరలో ప్రారంభమయ్యాయి. 1914లో, ఆప్టోమెట్రీ విద్యను ది ఒహియో స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చార్లెస్ షియార్డ్, ఒహియో స్టేట్ ఆప్టికల్ అసోసియేషన్ వద్ద ఒక ప్రెజంటేషన్ ఇచ్చి, ఈ విద్యకు ఆర్థిక సహాయం పొందాడు. ఇది రెండేళ్ళ కోర్సుగా మొదలై, తరువాత నాలుగేళ్ల-పట్టభద్ర కార్యక్రమం అయింది. 1937 వరకూ, ఈ కార్యక్రమాన్ని అప్లైడ్ ఆప్టిక్స్ అని పిలిచేవారు, తరువాత దీనిని ఆప్టోమెట్రీగా పిలవడం ప్రారంభమైంది.[8]

ఇప్పట్లో, ఎన్నో సమాజ మరియు స్థానిక వనరులు ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారికి ఉచిత లేదా తక్కువ ఖరీదైన కంటి పరిరక్షణను అందిస్తున్నాయి. అటువంటి సాయం అందుకోవడానికి ఆ ప్రాంతంలోని దాతృత్వ సంస్థలు లేదా లాభ-రహిత సంస్థలను సంప్రదించవచ్చు.[9]

లైసెన్సింగ్[మార్చు]

ఆప్టోమెట్రీ విద్య మరియు అభ్యాసం గురించి ఎన్నో దేశాలలో నియంత్రణావిధానాలు ఉన్నాయి. ఎందరో ఇతర ఆరోగ్య పరిరక్షణ వృత్తినిపుణులలాగే ఆప్టోమెట్రిస్టులు కూడా పరిరక్షణలోని అత్యాధునిక ప్రమాణాల గురించి తెలుసుకుంటూ ఉండడం కొరకు నిరంతరం విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఉండాలి.

ఆప్టోమెట్రీ అధికారికంగా గుర్తింపబడింది:

అర్జెంటీనా[మార్చు]

అర్జెంటీనాలో ఆప్టోమెట్రిస్టులు స్థానిక ప్రజా సమాచార మంత్రిత్వశాఖలో నమోదై ఉండాలి, కానీ అనుమతి అక్కర్లేదు. ఒక వ్రాత పరీక్ష పూర్తిచేసిన తరువాత పట్టభద్రులైన ఎవరైనా ఆప్టోమెట్రిస్టుగా నమోదు కావచ్చు. పరీక్ష రుసుము ప్రాదేశిక ప్రభుత్వం నిర్ణయిస్తుంది, మరియు ఇది ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా ఉంటుంది.

ఆస్ట్రేలియా[మార్చు]

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మూడు గుర్తింపు పొందిన ఆప్టోమెట్రీ కోర్సులు ఉన్నాయి. వీటిని యూనివర్సిటీ అఫ్ న్యూ సౌత్ వేల్స్ అందిస్తుంది: బ్యాచిలర్ అఫ్ ఆప్టోమెట్రీ బ్యాచిలర్ అఫ్ సైన్స్ (BOptom BSc), 5 ఏళ్ళ కోర్సు; క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ: బ్యాచిలర్ అఫ్ విజన్ సైన్స్ అండ్ మాస్టర్స్ అఫ్ ఆప్టోమెట్రీ, 5 ఏళ్ళ కోర్సు; మరియు మెల్బోర్న్ యూనివర్సిటీ, 4 ఏళ్ళ పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సు అయిన డాక్టర్ అఫ్ ఆప్టోమెట్రీ అందించేందుకు సిద్ధమౌతోంది. ఈ సంస్థలలో మునుపు అందించిన కోర్సులకు ఇవి విస్తరణగా ఆస్ట్రేలియాలో మరింతగా పెరిగిన ఆప్టోమెట్రిస్టుల అభ్యాస పరిధికి అవకాశం కలిగిస్తూ, ముఖ్యంగా కొన్ని ఔషధాలను సిఫారసు చేసేలా అభివృద్ధి కలిగించాయి.

దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లిన్డర్స్ యూనివర్సిటీలో క్రొత్త కోర్సులను అభివృద్ధి చేస్తున్నారు, ఇందులో 2010లో సైన్సు డిగ్రీ అందించడం జరుగుతుంది మరియు 2013లో ఈ కోర్సు యొక్క పోస్ట్-గ్రాడ్యుయేట్ విభాగాన్ని ప్రారంభిస్తుంది. 2012 ప్రారంభంలో గీలాంగ్, విక్‍లోని డీకిన్ యూనివర్సిటీలో రెండవ క్రొత్త కోర్సు ప్రారంభించాల్సి ఉంది.

కెనడా[మార్చు]

కెనడాలో ఆప్టోమెట్రిస్టులు డాక్టరేట్ అఫ్ ఆప్టోమెట్రీ డిగ్రీ కలిగి, వారు ప్రాక్టీసు చేయాలని భావించే ప్రాంతంలోని బోర్డుల ద్వారా అనుమతి పొంది ఉండాలి. ఇంకా రెండు ఆప్టోమెట్రీ పాఠశాలలు ఉన్నాయి, వీటిలో ఒకటి యూనివర్సిటీ అఫ్ వాటర్లూలోనూ మరొకటి యూనివర్సిటీ డే మాంట్రియల్‍లోనూ ఉన్నాయి.

కొలంబియా[మార్చు]

కొలంబియాలో ఆప్టోమెట్రీ విద్యకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ద్వారా ప్రామాణికత ఉంది. దేశంలో ఆరోగ్య పరిరక్షణ ప్రమాణాల గురించి చట్టాలకు అధికారిక సవరణ 1992లో లా 30 ద్వారా జరిగింది.[11] ప్రస్తుతం ICFES ద్వారా ఆప్టోమెట్రిస్టు యోగ్యతాపత్రాల్ని అందించే అధికార విశ్వవిద్యాలయాలు ఎనిమిది ఉన్నాయి. దేశంలోనికి మొట్టమొదటి ఆప్టోమెట్రిస్టులు ఉత్తర అమెరికా మరియు యూరోప్ నుండి సుమారు 1914లో ప్రవేశించారు. ఈ వృత్తినిపుణులు నేత్రజ్ఞానశాస్త్రం మరియు దృష్టిలోపనివారణలో నైపుణ్యం కలిగి ఉంటారు. 1933లో, ఆజ్ఞా పత్రాలు 449 మరియు 1291 ద్వారా, కొలంబియన్ ప్రభుత్వం అధికారికంగా ఆప్టోమెట్రీ రంగంలో వృత్తినిపుణులకై చట్టాలు రూపొందించింది. 1966లో లా సాల్లే యూనివర్సిటీ ఒక వృత్తినిపుణుల బృందం సిఫారసుపై అక్కడి మొట్టమొదటి ఫాకల్టీ అఫ్ ఆప్టోమెట్రీ ప్రారంభించింది. ప్రస్తుతం ఆప్టోమెట్రిస్టులకు క్రొత్త సాంకేతికతలతో దీటుగా తయారు కావడానికి కాంగ్రేసులు మరియు ప్రభుత్వం లేదా ప్రైవేటు రంగం (బాష్ & లాంబ్ వంటివి) అందించే ఉపకారవేతనాల ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది.

యూరోప్[మార్చు]

ప్రస్తుతం, ఆప్టోమెట్రీ విద్య మరియు లైసెన్సింగ్ యూరోప్ మొత్తంలో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు, జర్మనీలో ఆప్టోమెట్రిక్ విధులు నేత్రవైద్యనిపుణులు మరియు వృత్తినైపుణ్యంలో శిక్షణ మరియు యోగ్యతాపత్రం పొందిన నేత్రచికిత్సకులు నిర్వహిస్తారు. ఫ్రాన్సులో, నియంత్రణా యంత్రాంగం లేదు, మరియు ఆప్టోమెట్రిస్టులు కొన్నిసార్లు నేత్రవైద్యనిపుణుల ప్రైవేటు కార్యాలయంలో ఒక శిక్షణ పూర్తిచేయడం ద్వారా శిక్షితులవుతారు.[12]

యూరోపియన్ యూనియన్ ఏర్పాటు తరువాత, "అసోసియేషన్ అఫ్ యూరోపియన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అఫ్ ఆప్టోమెట్రీ (AESCO) ద్వారా, ఆప్టోమెట్రీలో యూరోప్-వ్యాప్తంగా పరీక్ష నిర్వహించడం ద్వారా వృత్తి ఏకీకరణకై" మరియు బహుశా EU దేశాలలో ప్రామాణిక అభ్యాసం మరియు విద్యా సూత్రాల ఏర్పాటుకు బలమైన ఉద్యమం నడుస్తోంది.[13] క్రొత్త యూరోపియన్ డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీకై మొట్టమొదటి పరీక్షలు 1998లో జరిగాయి, మరియు ఇది యూరోప్ ఖండంలో ఆప్టోమెట్రీకి సంబంధించిన ప్రధాన సంఘటన.[14]

ఐర్లాండ్[మార్చు]

ఆప్టోమెట్రీ వృత్తికి ఒక శతాబ్దం పైగా అసోసియేషన్ అఫ్ ఆప్టోమెట్రిస్టులు, ఐర్లాండ్ [AOI] ప్రతినిధిత్వం వహించింది. ఐర్లాండ్‍లో ఆప్టోమెట్రిస్టు మొట్టమొదట D.I.T. కెవిన్ స్ట్రీట్‍లో ఆప్టోమెట్రీకి సంబంధించిన నాలుగేళ్ల డిగ్రీ పూర్తిచేయాలి. ఈ డిగ్రీని విజయవంతంగా పూర్తిచేసిన తరువాత సదరు ఆప్టోమెట్రిస్టు, నేత్రచికిత్సకులు బోర్డు [Bord na Radharcmhaistoiri]లో నమోదు కోసం, వృత్తినైపుణ్యం అర్హతా పరీక్షలు ముగించాలి. ఆప్టోమెట్రిస్టులు రిపబ్లిక్ అఫ్ ఐర్లాండ్‍లో ప్రాక్టీసు చేయడానికి ఈ బోర్డులో నమోదై ఉండడం తప్పనిసరి.

A.O.I. ఐరిష్ ఆప్టోమెట్రిస్టుల తరఫున సమగ్ర నిరంతర విద్య మరియు వృత్తినైపుణ్యం అభివృద్ధి కార్యక్రమం నడుపుతుంది. ఆప్టోమెట్రీని నియంత్రించే చట్టం 1956లో తయారు చేయబడింది. కొందరి దృష్టిలో ఈ చట్టం ఐరిష్ ప్రజల కోసం ఆప్టోమెట్రిస్టులు తమ నైపుణ్యం, శిక్షణ మరియు ఉపకరణాల్ని పూర్తిస్థాయిలో ఉపయోగించడాన్ని నియంత్రిస్తాయి. ఈ చట్టానికి 2003లో జరిగిన సవరణ అత్యంత ప్రధాన నిర్బంధాలలో ఒకదానికి సంబంధించింది - పిల్లలను పరీక్షించడానికి సైక్లోప్లెజిక్ మందుల వాడకం.

యునైటెడ్ కింగ్‌డమ్[మార్చు]

యునైటెడ్ కింగ్‍డంలో, ఆప్టోమెట్రిస్టులు 3 లేదా 4 (స్కాట్లాండ్) ఏళ్ళ అండర్-గ్రాడ్యుయేట్ ఆనర్స్ డిగ్రీ తరువాత కనీసం ఒక-సంవత్సరం "నమోదు-మునుపు వ్యవధి" (శిక్షణ) ముగించాలి, ఇందులో వీరు ఒక అనుభవజ్ఞుడైన అర్హుడైన వైద్యుడి పర్యవేక్షణలో అభ్యాసం పూర్తిచేస్తారు. ఈ సంవత్సరం, నమోదు-మునుపు అభ్యర్థికి ఎన్నో త్రైమాసిక అంచనాలు ఇవ్వబడతాయి, తరచూ ఇందులో ఒక వైద్యశాలలో తాత్కాలిక నియోగం, మరియు ఈ అంచనాలన్నింటిలో విజయం సాధించాక, చివరగా ఒక-రోజు పరీక్షలు ఉంటాయి (2006 నుండి అభ్యర్థులకు పరీక్షల వివరాలు సరిగా ఉన్నాయి). ఈ అంచనాలు విజయవంతంగా పూర్తిచేశాక మరియు ఒక సంవత్సరం పర్యవేక్షణలో అభ్యాసం తరువాత, సదరు అభ్యర్థి జనరల్ ఆప్టికల్ కౌన్సిల్ (GOC)లో ఆప్టోమెట్రిస్టుగా నమోదు కావడానికి, వారు కోరినట్లయితే, ది కాలేజీ అఫ్ ఆప్టోమెట్రిస్ట్స్ సభ్యత్వానికి అర్హులు. UKలో ప్రాక్టీసుకై GOCతో నమోదు తప్పనిసరి. కాలేజీ అఫ్ ఆప్టోమెట్రిస్ట్స్ (ఒక రాచరిక చట్టం ద్వారా ఆరంభమైంది) సభ్యులు MCOptom ఉపశీర్షికను ఉపయోగించవచ్చు. UKలో ఆప్టోమెట్రీ అందించే 9 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, వీటిలో ఆంగ్లియా రస్కిన్, ఆస్టన్, బ్రాడ్ఫోర్డ్, కార్డిఫ్, సిటీ, మరియు మాంచెస్టర్ విశ్వవిద్యాలయాలు సైతం ఉన్నాయి.

ఫిలిప్పీన్స్[మార్చు]

ఫిలిప్పీన్స్‌లో ఆప్టోమెట్రీని అక్కడి ప్రొఫెషనల్ రెగ్యులేషన్ కమిషన్ నియంత్రిస్తుంది. అనుమతి కోరేందుకు అర్హత పొందడానికి, ప్రతి అభ్యర్థి ఒక యోగ్యత పొందిన సంస్థ ద్వారా డాక్టర్ అఫ్ ఆప్టోమెట్రీ కోర్సు సంతృప్తికరంగా పూర్తిచేసి ఉండాలి మరియు మునుపెన్నడూ వృత్తినైపుణ్యంలో దుష్ప్రవర్తన లేని విధంగా మంచి నైతిక ప్రవర్తన కలిగి ఉండాలి. ఫిలిప్పీన్స్‌లోని ఆప్టోమెట్రీ వృత్తినిపుణుల సంస్థలు ఆప్టోమెట్రిక్ అసోసియేషన్ అఫ్ ది ఫిలిప్పీన్స్[15] మరియు ఇంటెగ్రేటెడ్ ఫిలిప్పీన్ అసోసియేషన్ అఫ్ ఆప్టోమెట్రిస్టులు, ఇంక్. (IPAO)[16]

రష్యా[మార్చు]

రష్యాలో ఆప్టోమెట్రీ విద్యకు ఫెడరల్ ఏజెన్సీ అఫ్ హెల్త్ అండ్ సోషల్ డెవలప్మెంట్ నుండి యోగ్యత పొందింది.[ఉల్లేఖన అవసరం] రష్యాలో ఆప్టోమెట్రీ నేర్పించే విద్యాసంస్థలు రెండు: మునుపు సెయింట్ పీటర్స్‌బర్గ్ కాలేజీ అఫ్ మెడికల్ ఎలేక్ట్రోనిచ్స్ అండ్ ఆప్టిక్స్ అని పిలువబడిన సెయింట్ పీటర్స్‌బర్గ్ మెడికల్ టెక్నికల్ కాలేజీ, మరియు ది హెల్మ్‌హోల్జ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐ డిసీజెస్. ఈ రెండూ ఆరోగ్య మంత్రిత్వశాఖ పరిధిలో ఉండి, దాని నియంత్రణలో ఉంటాయి. ఆప్టోమెట్రీ విద్య 4 ఏళ్ళ వ్యవధి కలిగి ఉంటుంది. ఇందులో 1–2 వైజ్ఞానిక ఆధారం సంవత్సరాలు ఉంటాయి, ఇందులో 1 సంవత్సరం వైద్య మరియు నైపుణ్యం నేర్పులపై కేంద్రీకరిస్తే, 1 సంవత్సరం వైద్యశాలలలో వైద్యానికి సంబంధించి అభ్యాసం ఉంటుంది. పట్టభద్రులు కళాశాల/రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలు వ్రాసి, ఒక ప్రత్యేకత డిప్లొమా పొందుతారు. ఈ డిప్లొమా 5 ఏళ్ళపాటు చెల్లుతుంది, మరియు రాష్ట్రస్థాయి యోగ్యతా కార్యక్రమాలు పొందుతూ వీటిని ప్రతి 5 ఏళ్ళలో పునరుద్దరిస్తూ ఉండాలి.

సంయుక్త రాష్ట్రాలు[మార్చు]

ది అమెరికన్ ఆప్టోమెట్రిక్ అసోసియేషన్ (AOA) మరియు ది అమెరికన్ ఆప్టోమెట్రిక్ సొసైటీ (AOS) అనేవి USAలో దేశవ్యాప్తంగా ఆప్టోమెట్రిస్టులకు ప్రతినిధిత్వం వహిస్తాయి. ఆప్టోమెట్రీ పాఠశాలలో ప్రవేశానికి మునుపు, ఆప్టోమెట్రిస్టులు సాధారణంగా నాలుగేళ్ల అండర్-గ్రాడ్యుయేట్ విద్యను పొంది, చివరికి బ్యాచిలర్ డిగ్రీ సాధించాలి. ఆప్టోమెట్రీ-పూర్వ విద్యార్థులకు అవసరమైన అండర్-గ్రాడ్యుయేట్ కోర్సులో విభిన్న ఆరోగ్య, వైజ్ఞానిక మరియు గణిత సంబంధ కోర్సులు ఉంటాయి. ఈ కోర్సులలో: 4 సెమిస్టర్లు కర్బనసంబంధి మరియు జీవరసాయనశాస్త్రం కలిసిన రసాయనశాస్త్రం, 2 సెమిస్టర్లు భౌతిక శాస్త్రం మరియు జీవశాస్త్రం, అంతేకాక 1 సెమిస్టర్ కలనగణితం, గణాంకశాస్త్రం, జీవధర్మశాస్త్రం, శరీరశాస్త్రం, సూక్ష్మజీవశాస్త్రం, మరియు మనస్తత్వ శాస్త్రం ఉంటాయి. నిర్దిష్ట సంస్థలలో అదనపు అవసరాలు కావలసిఉంటాయి. ఆప్టోమెట్రీ డాక్టరేట్ కార్యక్రమంలో ప్రవేశానికి ఈ కోర్సులు ముగించిన పిదప, అభ్యర్థి O.A.T., ఆప్టోమెట్రీ ప్రవేశ పరీక్షలలో మంచి స్కోరు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సంయుక్త రాష్ట్రాలలో 20 ఆప్టోమెట్రీ పాఠశాలలు ఉన్నాయి, మరియు ఈ పాఠశాలలలో ప్రవేశం తీవ్రమైన పోటీతో కూడుకున్నదిగా పరిగణిస్తారు.

ఆప్టోమెట్రిస్టులు తమ డాక్టర్ అఫ్ ఆప్టోమెట్రీ (O.D.) టైటిల్ పొందడానికి నాలుగేళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ కార్యక్రమం ముగించాల్సి ఉంటుంది. ఈ నాలుగేళ్ల కార్యక్రమంలో జ్యామితి, భౌతిక, జీవధర్మ మరియు దృష్టిసంబంధ నేత్రజ్ఞానశాస్త్రం, నేత్రనిర్మాణశాస్త్రం, నేత్ర వ్యాధి, నేత్ర ఔషధశాస్త్రం, నాడీనిర్మాణశాస్త్రం, మరియు దృష్టి వ్యవస్థ యొక్క నాడీశరీరధర్మ శాస్త్రం, ద్వినేత్ర దృష్టి, రంగు, రూపం, స్థలం, కదలిక మరియు దృష్టి గ్రాహ్యత, దృష్టిసంబంధ వాతావరణం యొక్క రూపకల్పన మరియు మార్పు, మరియు దృష్టి నిర్వహణ మరియు దృష్టి పరిశీలనకు సంబంధించిన తరగతి మరియు వైద్య శిక్షణ ఉంటుంది. అదనంగా, ఆప్టోమెట్రిక్ విద్యలో మనిషి శరీరనిర్మాణశాస్త్రం, సాధారణ ఔషధశాస్త్రం, సాధారణ వ్యాధివిజ్ఞానశాస్త్రం, ఇంద్రియ మరియు గ్రాహ్య మనస్తత్వశాస్త్రం, జీవరసాయన శాస్త్రం, గణాంకశాస్త్రం మరియు సాంక్రామికవ్యాధిశాస్త్రం సైతం ఉంటాయి. ఇంకా అక్రెడిటేషన్ కౌన్సిల్ ఆన్ ఆప్టోమెట్రిక్ ఎడ్యుకేషన్ (ACOE) నుండి ప్రాథమిక సమ్మతి యొక్క గుర్తింపు-పూర్వ హోదా పొందిన క్రొత్త ఆప్టోమెట్రీ కళాశాలలు మూడు (మిడ్‍వెస్టర్న్ యూనివర్సిటీ అరిజోనా కాలేజీ అఫ్ ఆప్టోమెట్రీ, యూనివర్సిటీ అఫ్ ది ఇన్‍కార్నేట్ వరల్డ్ స్కూల్ అఫ్ ఆప్టోమెట్రీ, వెస్ట్రన్ యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్సెస్ కాలేజీ అఫ్ ఆప్టోమెట్రీ) ఉన్నాయి. “ప్రాథమిక సమ్మతి" పొందిన కార్యక్రమాలు ACOE యొక్క ప్రమాణాల ప్రకారం అభివృద్ధి చెందుతున్నట్టూ తెలిపాయి. ఈ కార్యక్రమాలకు విద్యార్థులను స్వీకరించడం మరియు ప్రవేశాన్ని అందించడం, మరియు ఈ కార్యక్రమం అందించడం ప్రారంభించేందుకు అనుమతి ఉంది.[17]

ఆప్టోమెట్రీలో గుర్తింపు పొందిన కార్యక్రమం ముగించిన తరువాత, పట్టభద్రులు డాక్టర్ అఫ్ ఆప్టోమెట్రీ (O.D. - ఆక్యులిస్ డాక్టర్) డిగ్రీ పొందుతారు. తరువాత ఆప్టోమెట్రిస్టులు నేషనల్ బోర్డ్ అఫ్ ఎగ్జామినర్స్ ఇన్ ఆప్టోమెట్రీ (NBEO) నిర్వహించే జాతీయ పరీక్షలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది.[18] ఈ మూడు-భాగాల పరీక్షలో ప్రాథమిక విజ్ఞానం, వైద్య విజ్ఞానం, మరియు రోగి పరిరక్షణ ఉంటాయి. (NBEO పరీక్షల స్వభావం మరియు స్వరూపం 2008 నుండి మారే అవకాశం ఉంది.) కొందరు ఆప్టోమెట్రిస్టులు నిర్దిష్ట ఉప-ప్రత్యేకతలైన శిశుసంబంధ నేత్ర పరిరక్షణ, వృద్ధుల నేత్ర పరిరక్షణ, ప్రత్యేకమైన కాంటాక్ట్ లెన్స్, నేత్ర వ్యాధి లేదా న్యూరో-ఆప్టోమెట్రీలలో శిక్షణతో పాటుగా 1–2 ఏళ్ళ రెసిడెన్సీలనూ పూర్తిచేయవచ్చు. అందరు ఆప్టోమెట్రిస్టులు నిరంతర విద్య అవసరాలను పూర్తిచేస్తూ పరిరక్షణ యొక్క అత్యాధునిక ప్రమాణాల గురించి తెలుసుకుంటూ ఉండాలి.

ఆరోగ్యపరిరక్షణ వ్యవస్థలో, ఆప్టోమెట్రిస్టులు కాంటాక్ట్ లెన్సులు మరియు అద్దాల సిఫారసు చేసే ప్రాథమిక నేత్ర పరిరక్షణ అందించేవారిగా వ్యవహరిస్తారు. ఆప్టోమెట్రిస్టులకు వైద్యపరిరక్షణలో వైద్యులుగా పేరుంది. ఆప్టోమెట్రిస్టులు తమ పరిధి కేవలం కంటికే పరిమితం అయినా, విషయసంబంధ, మౌఖిక మరియు ఇంజెక్ట్ చేయదగ్గ ఔషధాలతో (స్థితిని బట్టి) ఎన్నో రకాల కంటి వ్యాధులను నయం చేసే సామర్థ్యం సైతం కలిగి ఉంటారు. ఆప్టోమెట్రిస్టులు అన్య పదార్థం తొలగింపు, కార్నియల్ గాయం, కంటిరెప్ప మరియు అశ్రు గ్రంథుల వ్యాధి మరియు ఇతరాలతో పాటుగా కొన్ని శస్త్రచికిత్స పద్ధతులలో శిక్షణ పొంది ఉండవచ్చు. ఒక్లహోమాలో, రాష్ట్ర ఆప్టోమెట్రీ బోర్డ్ అనేది కంటి యొక్క బాహ్య విభాగంలో లేజర్ శస్త్రచికిత్సలు చేసే అవకాశాన్ని రాష్ట్ర-యోగ్యతాపత్రం పొందిన ఆప్టోమెట్రిస్టులకు అందిస్తుంది. అదనంగా, డిపార్టుమెంటు అఫ్ వెటరన్స్ అఫైర్స్ (VA), ఈ లేజర్ పద్ధతులలో శిక్షణ పొంది, ఓక్లహోమా అనుమతి పొందిన ఆప్టోమెట్రిస్టులకు, కేవలం ఓక్లహోమా VA వైద్యశాలలోనే కాక దేశంలోని ఎలాంటి VA సౌకర్యం వద్దనైనా లేజర్ శస్త్రచికిత్సలు నిర్వహించే అనుమతి కల్పిస్తుంది.[19]

నేత్రవైద్యనిపుణులు మరియు ఆప్టోమెట్రిస్టుల మధ్య తేడా ఏమిటంటే, నేత్రవైద్యనిపుణులు అన్ని కంటి శస్త్రచికిత్సలు నిర్వహించే అనుమతి పొంది ఉంటారు, దైహిక వ్యాధుల చికిత్స చేయగలరు, మరియు 4 ఏళ్ళ వైద్య పాఠశాల కోర్సు మరియు నేత్రవిజ్ఞానశాస్త్రంలో రెసిడెన్సీ పూర్తిచేసి ఉంటారు. చాలా సందర్భాలలో వివిధ కంటి పరిస్థితులు కలిగిన రోగుల చికిత్స మరియు నిర్వహణలో ఆప్టోమెట్రిస్టులు మరియు నేత్రవైద్యనిపుణులు కలిసి పనిచేస్తూ ఉంటారు. నేత్రచికిత్సకులు సాధారణంగా కంటి రుగ్మతను సరిచేస్తారు, మరియు కొన్ని సందర్భాలలో కంటి రుగ్మతను సరిచేయడాన్ని నిర్మిస్తారు. ప్రతి రాష్ట్రంలో నియంత్రణల ఆధారంగా ఆప్టోమెట్రీ యొక్క అభ్యాస పరిధి మారుతూ ఉంటుంది.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ప్రవర్తనాత్మక ఆప్టోమెట్రీ
 • ఆర్థాప్టిక్స్
 • దృష్టి చికిత్స
 • నేత్ర చికిత్సా నిపుణుడు
 • నేత్ర పరీక్ష
 • కళ్ళజోడు ఔషధపత్రం
 • నేత్రవిజ్ఞాన శాస్త్రం
 • దృశ్య గ్రాహ్యత
 • స్పష్ట దృష్టి యొక్క తక్కువ అంతరం
 • బేట్స్ పద్ధతి

సూచనలు[మార్చు]

 1. Hedger, Brian (April 13, 2009). "Several states face battles over optometry scope of practice". amednews.com. American Medical Association.
 2. http://www.thefreelibrary.com/American+Osteopathic+Association+Shocked+by+Oklahoma+Governor's...-a0123941215
 3. 3.0 3.1 3.2 "History of Optometry" (PDF). Retrieved 08/03/2010. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)
 4. డేవిడ్ A. గాస్స్ చే ఇండియానా యునివర్సిటీ స్కూల్ అఫ్ ఆప్టోమెట్రి లో ఆప్టోమెట్రి చరిత్రకు సంబంధించి ప్రసంగం .
 5. "Thomas Young". Retrieved 08/03/2010. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)
 6. "Just the Facts". Retrieved 08/03/2010. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)
 7. [175] ^ "చరిత్ర "
 8. "History of the College of Optometry at The Ohio State University". Retrieved 08/03/2010. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)
 9. "Seeing Eye Care". Retrieved 08/03/2010. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)
 10. http://www.prc.gov.ph/portal.asp?pid=65
 11. కాంటెస్ట్ నేషనల్ డి అక్రడిటేషన్
 12. యూరో టైమ్స్ కు స్వాగతం
 13. Hamakiotes DS, Thal LS (1991). "The unification of European optometry: how the profession will change after 1992". J Am Optom Assoc. 62 (12): 904–13. PMID 1814983. Unknown parameter |month= ignored (help)
 14. అగర్వాల్, R. (1998), ఆప్టోమెట్రి లో యురోపియన్ డిప్లోమ , బ్రిటిష్ జోర్నాల్ అఫ్ ఆప్టోమెట్రి అండ్ డిస్పెంసింగ్, 6(3), 84.
 15. http://philippineoptometry.net/
 16. http://en.wikipilipinas.org/index.php?title=Integreted_Philippine_Association_of_Optometrists%2C_Inc.
 17. http://www.aoa.org/x5130.xml
 18. http://www.optometry.org/passfail.cfm
 19. కాంగ్రెషనల్ రికార్డ్ - సెనేట్, జూలై 22, 2004 పే 17119

బాహ్య లింకులు[మార్చు]

Media related to ఆప్టోమెట్రీ at Wikimedia Commons

డచ్ ఆప్టోమెట్రి కోసం: నెదర్లండ్స్ ఆప్టోమెట్రి

బాహ్య లింకులు[మార్చు]

మూస:Academic degrees మూస:Allied health professions