ఆప్రికాట్ నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆఫ్రికాట్ చెట్టు (టర్కీ)
ఆఫ్రికాట్ పువ్వు, (బెన్‍హమ, కాశ్మీరు)
ఆఫ్రికాట్ పండు మధ్యచ్చేదము

అప్రికాట్ చెట్టు/ఛుల్లు(chullu)[మార్చు]

ఆప్రికాట్ చెట్టును భారతదేశంలో ఖుబాని (khubani, జార్డల్ (Zardalu, ఛొల (chola, గర్డులు (Gurdlu) అనికుడా అంటారు. తెలుగులో సీమబాదం అంటారు. ఈచెట్టు రోసేసి కుంటుంబానికి చెందినది. వృక్షశాస్త్ర నామం: ప్రునస్ అర్మెనియక (Prunus armeniaca). ఈ చెట్టు మూల ఆవిర్భస్దానం చీని దేశం (Chaina,, మధ్య ఆసియా ఖండప్రాంతం[1]. అక్కడ నుండి భారతదేశంలోని శీతల ఉష్ణ ప్రాంతాలైన జమ్ము&కాశ్మీరు, హిమచలప్రదేశ్, ఉత్తర ప్రదేశానికి వ్యాప్తిచెందినది. సముద్రమట్టంనుండి 1200-2500మీటర్ల ఎత్తు ప్రాంతాల వరకు ఆవరించి పెరుగుతుంది. నైనితాల్ (Nainital), అల్మొర (Almora, పిథరగర్ (pitharagad) జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగులో నున్నది. హిమచలప్రదేశ్, జమ్ము&కాశ్మీరు,, ఉత్తరఖండ్ ప్రాంతాలు మిక్కిలి అనువైన ప్రాంతాలు. చెట్టు 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. చెట్టు కాండం ఎర్రటి బెరడు కల్గివుండును.పళ్ళు మే-ఆగస్టు నెలలో పక్వానికొస్తాయి. పండుగుండ్రంగా 5సెం.మీ పరిమా ణంలో వుండి నూగు కల్గి వుండును. పండిన ఫలం పసుపు లేదా ఎరుపుతోకూడిన పసుపు రంగులో వుండును. రుచి తీపి, పులుపుల కలయికగా నుండును. గింజ (seed) పరిమాణం 1.3-2.3సెం.మీx0.8-1 .2సెం.మీ వుండును. గింజ వెలుపల మెత్తటిగుజ్జు (pulp) కలిగి వుండును.ఆకులు ముదురు పచ్చగా వుండి 6సెం.మీ, పొడవుండును. పూలు అండాకారంగా లేత పింక్‍రంగులోవుండును.చెట్టు 4-5 సంవత్సరాలకు పూతకొచ్చును. దిగుబడి 30-35 సంవత్సరాల వరకిచ్చును. ఒక చెట్టునుండి ఏడాదికి 80-120కిలో లుండును. సరాసరి దిగుబడి 25కే.జి.లు [2].

ఆప్రికాట్ విత్తనంలోని (kernel) పదార్ధాలు [3]

పదార్ధము శాతం
తేమ 4.0-5.0
నూనె 52.0%
మాంసకృత్తులు 20.6%
పీచు పదార్థం 4.0-5.0
చక్కెర 8.10 (నేరుగా)
డెక్ష్డొస్ (dextrose) 11.60 (after conversion)

నూనె[మార్చు]

ఆప్రికాట్ గింజలో నూనె 16-18% వుండును.గింజలో విత్తనం/బీజం (kernel)30% వరకుండును. విత్తనంలో నూనె 40-50% వరకుండును[4].ము డినూనె పాలిపోయిన పసుపు రంగులో వుండును.రిపైండ్ చేసిన తరువాత వర్ణ రహితంగా వుండును. ముడినూనెలో సైయనొజెనెటిచక్ గ్లుకొసైడ్ (cyanogenetic glucoside) లు వుంటాయి. నూనెను రిఫైండ్ చేసినప్పుడు డిఒడరైజెసన్ (Deodorisation) దశలో ఇవి తొలగింపబడును. ఈవిధంగా సైనొజెనెటిక్ గ్లుకొసైడ్ లు తొలగింపబడిన నూనెను ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో మిశ్రితం చేసి వంటనూనెగా వినియోగించవచ్చును. నూనెలో అసంతృప్త కొవ్వుఆమ్లా 90% వర కుంటాయి. ఒలిక్ ఆమ్లం53.0-71.0% వరకు, లినోలిక్ ఆమ్లం 21.4-35.6% వరకుండును.పెరాక్సైడు విలువ బారీవ్యత్యాసంగా 0.8-8.3 వరకుండును[5]. ఛుల్లు (chullu) /ఆప్రికాట్ నూనె భౌతికలక్షణాల పట్టిక[2][6]

భౌతిక లక్షణాలు మితి
వక్రీభవన సూచిక 400Cవద్ద 1.4726
ఐయోడిన్ విలువ 100.3
సపనిఫికెసను విలువ 190.0
అన్‍సఫొనిపియబుల్ పదార్థం 1.3%
ఆమ్ల విలువ 3.6
విశిష్ట గురుత్వం 250Cవద్ద 0.914

ఆప్రికాట్ నూనెలోని కొవ్వు ఆమ్లాలు[మార్చు]

ఆప్రికాట్ నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు తక్కువశాతంలో ఉనాయి.నూనెలో మిరిస్టిక్, పామిటిక్,, స్టియరిక్ కొవ్వు ఆమ్లాలు ఉన్నప్పటికి, మూడింటి మొత్తం శాతం 6-8% లోపు మాత్రమే.నూనెలో ఏకద్విబంధ, ద్విదిబంధ కొవ్వు ఆమ్లాలు రెండు కలసి మొత్తం కొవ్వుఆమ్లాలలో 90% వరకు ఉంటాయి. ఆప్రికాట్/ఛుల్లు నూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం[2][5]

కొవ్వు ఆమ్లాలు పరిమితి సగటు
మిరిస్టిక్ ఆమ్లం (C14:0) 1.1
పామిటిక్ ఆమ్లం (C16:0) 3.5
స్టియరిక్ ఆమ్లం (C18:0) 2.0
ఒలిక్ ఆమ్లం (C18:1) 53.0-71.0 73.4
లినొలిక్ ఆమ్లం (C18:2) 21.4-35.6 20.0

నూనె ఉపయోగాలు[మార్చు]

  • ఆప్రికాట్ నూనెను చర్మ సంరక్షణి నూనె గా, అలాగే కేశనూనెగా పనిచేస్తుంది., కళ్ళ క్రింద చారలను తొలగించు క్రీముల తయారిలో ఉపయోగిస్తారు[7]
  • ఆప్రికాట్ నూనె మలబద్ధకం, అజీర్తి, పాండురోగం, చర్మవ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది[8].
  • రిఫైండ్ చేసిన నూనెను ఔషదమందుల (Medicinal) మందులతయారిలో నుపయోగిస్తారు.
  • కాస్మెటిక్సు తయారిలో ఉపయోగిస్తారు.
  • మిఠాయి (confectionery) ప్రరిశ్రమలలో వాడెదరు
  • ఆవనూనె, నువ్వుల నూనెలతో కలిపి 'మిశ్రిత వంటనూనె (mixed vegetable oil) గా వాడవచ్చును.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]