ఆఫ్ఘనిస్తాన్ సామ్రాజ్యం
Emirate of Kabul (1823–1855) امارت کابل (Persian) Emirate of Afghanistan (1855–1926) امارت افغانستان (Persian) | |||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 1823–1926 | |||||||||||||||||||
Map of the Emirate of Afghanistan in 1914 (green) Afghanistan before the 1893 Durand Line Agreement (yellow) | |||||||||||||||||||
| స్థాయి | Independent Emirate (1823–1879, 1919–1926) De facto Independent Emirate; De jure British protected state (1879–1919)[a][1][2] | ||||||||||||||||||
| రాజధాని | Kabul | ||||||||||||||||||
| అధికార భాషలు | Persian | ||||||||||||||||||
| Spoken languages | |||||||||||||||||||
| జాతులు | Pashtun, Tajik, Uzbek, Hazara, Persian, Aimaq, Turkmen, Baloch, Pashai, Nuristani, Gurjar, Arab, Brahui, Qizilbash, Pamiri, Kyrgyz, others | ||||||||||||||||||
| మతం | Majority: Sunni Islam Minorities: Twelver Shia Islam, Ismailism, Hinduism, Sikhism, Judaism, Christianity | ||||||||||||||||||
| పిలుచువిధం | Afghan (from 1923) | ||||||||||||||||||
| Emir | |||||||||||||||||||
• 1823–1826 (first) | Sultan Mohammad Khan | ||||||||||||||||||
• 1919–1926 (last) | Amanullah Khan | ||||||||||||||||||
| శాసనవ్యవస్థ | Loya Jirga | ||||||||||||||||||
| చారిత్రిక కాలం | 19th century | ||||||||||||||||||
• స్థాపన | 1823 | ||||||||||||||||||
| 27 May 1863 | |||||||||||||||||||
| 1 October 1838 | |||||||||||||||||||
| 12 October 1842 | |||||||||||||||||||
| 24 May 1879 | |||||||||||||||||||
• Durand Line Agreement | 12 November 1893 | ||||||||||||||||||
| 8 August 1919 | |||||||||||||||||||
• Transformed into a kingdom | 9 June 1926 | ||||||||||||||||||
| ద్రవ్యం | Afghan rupee (1823–1923) Afghan afghani (from 1923) | ||||||||||||||||||
| |||||||||||||||||||
| Today part of | Afghanistan Pakistan Tajikistan Turkmenistan Iran | ||||||||||||||||||
ఎమిరేటు ఆఫ్ ఆఫ్ఘనిస్తాను [c] దీనిని 'సుబ్లైం స్టేటు ఆఫ్ ఆఫ్ఘనిస్తాను' అని కూడా పిలుస్తారు.[d][3][4] దేవుడు ప్రసాదించిన ఆఫ్ఘనిస్తాను రాజ్యం,[e][5][6] గాడ్-గివెను స్టేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాను, [f]1855 వరకు [7] అంతర్జాతీయంగా కాబూలు ఎమిరేటు అని పిలువబడిన (ఆఫ్ఘనిస్తాను) ఈ ప్రాంతం మధ్య ఆసియాలోని ఒక ఎమిరేటు. ఇది ప్రస్తుత ఆఫ్ఘనిస్తాను, ప్రస్తుత ఇరాన్, పాకిస్తాను, తుర్కుమెనిస్తాను, తజికిస్తాను లోని కొన్ని భాగాలను కలిగి ఉండేది. [8] బారకుజాయి రాజవంశం కాబూలులో ఆధిపత్యం చెలాయించినప్పుడు. ఈ ఎమిరేటు దాని పూర్వపు దుర్రానీ సామ్రాజ్యం నుండి ఉద్భవించింది.
ఈ ఎమిరేటు చరిత్ర, మధ్య ఆసియాలో ఆధిపత్యం కోసం రష్యన్ సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం మధ్య జరిగిన 'గ్రేటు గేం' ద్వారా ప్రభావితమైంది. ఈ కాలంలో ఆఫ్ఘనిస్తాను మీద యూరోపియన్ల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆఫ్ఘనిస్తాను ఎమిరేటు సిక్కు సామ్రాజ్యంతో దుర్రానీ సామ్రాజ్యం యుద్ధాన్ని కొనసాగించింది, [9] 1823 మార్చి 14న నౌషేరా యుద్ధంలో పూర్వ ఆఫ్ఘను బలమైన కోట అయిన పెషావరు లోయ మీద నియంత్రణను కోల్పోయింది. దీని తరువాత 1838లో బ్రిటిషు దళాలతో మొదటి ఆంగ్లో-ఆఫ్ఘను యుద్ధం జరిగింది. ఈ యుద్ధం చివరికి ఆఫ్ఘనులకు విజయాన్ని అందించింది. 1842లో బ్రిటిషు వారు వెనక్కి తగ్గారు. దోస్తు మొహమ్మదు తిరిగి సింహాసనం మీద పునఃస్థాపించబడ్డాడు. [9] అయితే రెండవ ఆంగ్లో-ఆఫ్ఘను యుద్ధం (1878–1880) సమయంలో బ్రిటిషు, ఆఫ్ఘనులు గండమకు ఒప్పందం మీద సంతకం చేశాయి. ఇది ఆఫ్ఘనులకు సబ్సిడీ చెల్లించడం బ్రిటిషు సైన్యం పూర్తిగా ఉపసంహరించుకోవడం అనే షరతు మీద. ఆధునిక పాకిస్తానులోని ఆఫ్ఘను భూభాగాల మీద ఆఫ్ఘనిస్తాను విదేశీ వ్యవహారాల మీద నియంత్రణను చేపట్టడానికి బ్రిటిషు వారికి అనుమతి ఇచ్చింది. ఎమిరు అమానుల్లా ఖాన్ మూడవ ఆంగ్లో-ఆఫ్ఘను యుద్ధం తరువాత 1919 ఆంగ్లో-ఆఫ్ఘను ఒప్పందం మీద సంతకం చేసి పూర్తి ఆఫ్ఘను స్వయంప్రతిపత్తిని సాధించాడు. ఆఫ్ఘనిస్తాను చట్టబద్ధంగా బ్రిటిషు సంరక్షిత ప్రాంతంగా ఉన్న హోదాను తొలగించాడు. 1926లో అమానుల్లా ఖాన్ దేశాన్ని ఆఫ్ఘనిస్తాను రాజ్యంగా సంస్కరించి దాని మొదటి రాజుగా అవతరించారు.
చరిత్ర
[మార్చు]ఎమిరేటు స్థాపన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత, ఇరాన్‌కు చెందిన ముహమ్మద్ షా, దోస్తు మొహమ్మదు ఖాన్ మధ్య రష్యా, బ్రిటీషు ప్రయోజనాలు సంఘర్షణకు దారితీశాయి. ఇది 1838, 1842 మధ్య జరిగిన మొదటి ఆంగ్లో-ఆఫ్ఘను యుద్ధానికి దారితీసింది.[10] ఈ యుద్ధ సమయంలో ఆఫ్ఘనిస్తాను రష్యా నియంత్రణలోకి రాకుండా నిరోధించడానికి ఆ ప్రాంతంలో రష్యా విస్తరణను అరికట్టడానికి అలాగే షా షుజా దుర్రానీ అనే కీలుబొమ్మ పాలకుడి కింద ఆఫ్ఘనిస్తానును బ్రిటీషు ఆధీనంలో ఉంచుకోవడానికి బ్రిటను అప్పటి కాబూలు ఎమిరేటు రాజధాని అయిన కాబూలును ఆక్రమించింది. ఈ యుద్ధం దోస్తు మొహమ్మదు తిరిగి సింహాసనాన్ని అధిష్టించడంతో బ్రిటీషు వారు వెనుదిరగడంతో ముగిసింది; దేశాన్ని లొంగదీసుకోలేక వారు దానికి బదులుగా బలమైన సంబంధాలను ఏర్పరచుకున్నారు. తద్వారా తిమూరు షా కుమారుల వల్ల ఏర్పడిన దుర్రానీ అంతర్యుద్ధాల కారణంగా విడిపోయిన ఆఫ్ఘనిస్తాను విచ్ఛిన్న రాజ్యాన్ని ఏకం చేయడానికి దోస్తు మొహమ్మదుకు అవకాశం కల్పించారు. [11]
1863లో దోస్తు మొహమ్మదు మరణానంతరం ఆయన కుమారుడు షేర్ అలీ ఖాన్ సింహాసనాన్ని అధిష్టించాడు. అయితే మూడు సంవత్సరాల తరువాత ఆయన అన్నయ్య మొహమ్మదు అఫ్జలు ఖాన్ ఆయన పదవీచ్యుతుడిని చేశాడు. 1867లో కలరా వ్యాధి కారణంగా మొహమ్మదు అఫ్జలు ఖాన్ మరణించడంతో ఆయన సోదరుడు మొహమ్మదు ఆజం ఖాన్ సింహాసనాన్ని చేపట్టాడు. అయితే షేర్ అలీ ఖాన్‌కు ప్రజల మద్దతు ఉండటంతో 1868లో మొహమ్మదు ఆజం ఖాన్ పదవీచ్యుతుడయ్యాడు. ఆయన స్థానంలో షేర్ అలీ ఆఫ్ఘనిస్తాను ఎమీరుగా తిరిగి వచ్చాడు. [12] రష్యాలో కొన్ని సంవత్సరాలు ప్రవాసంలో గడిపిన తర్వాత ఆయన తిరిగి సింహాసనాన్ని అధిష్టించాడు. ఎమీరుగా ఆయన పునరాగమనం బ్రిటనుతో కొత్త వివాదాలకు దారితీసింది. తదనంతరం బ్రిటిషు వారు 1878 నవంబరు 21న ఆఫ్ఘనిస్తాను లోకి ప్రవేశించారు. ఎమిరు షేరు అలీ మళ్ళీ రష్యాకు పారిపోవలసి వచ్చింది. కానీ ఆయన 1879లో మజారు-ఇ-షరీఫులో మరణించాడు. ఆయన వారసుడు, మహమ్మదు యాకూబు ఖాన్, రష్యాతో శాంతి పరిష్కారాల కోసం ప్రయత్నించి, ఆఫ్ఘనిస్తాను విదేశాంగ విధానంలో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇంతలో ఆయన 1879 మే 26న బ్రిటిషు వారితో గండమకు ఒప్పందం మీద సంతకం చేసి, ఆఫ్ఘనిస్తాను విదేశీ వ్యవహారాల నియంత్రణను పూర్తిగా బ్రిటిషు సామ్రాజ్యానికి అప్పగించాడు. అయితే 1879 సెప్టెంబరు 3న కాబూలులో బ్రిటిషు రాయబారి సర్ లూయిసు కావాగ్నారీ హత్యకు గురైనప్పుడు, బ్రిటిషు వారు అబ్దురు రెహమాను ఖాన్‌ను ఎమీరుగా అంగీకరించడానికి ముందుకొచ్చారు. బ్రిటిషు వారు 1880లో ఆఫ్ఘనులతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని 1881లో మళ్ళీ ఆఫ్ఘనిస్తాను నుండి వైదొలిగారు. 1893లో బ్రిటిషు వారు ఆఫ్ఘనిస్తానును డ్యూరాండు రేఖ అని పిలువబడే ఒక కొత్త సరిహద్దుకు అంగీకరించమని బలవంతం చేశారు. ఇది చారిత్రాత్మక పష్తూన్ల నివాస ప్రాంతం గుండా వెళుతుంది. [13]
యుద్ధం తర్వాత దేశాన్ని ఏకీకృతం చేసిన ఎమీరు అబ్దురు రెహమాను ఖాన్ అనేక తిరుగుబాట్లను అణచివేసి సంస్కరణలు చేపట్టారు. 1901లో ఆయన మరణానంతరం ఆయన కుమారుడు హబీబుల్లా ఖాన్ ఎమీరుగా బాధ్యతలు స్వీకరించి సంస్కరణలను కొనసాగించాడు. హబీబుల్లా ఖాన్ బ్రిటనుతో సయోధ్య కోరాడు. 1905లో రష్యాతో ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రష్యా-జపాన్ యుద్ధంలో ఓటమి పాలైన రష్యా, ఆఫ్ఘనిస్తాను నుండి వైదొలగవలసి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ, ఒట్టోమను ప్రయత్నాలు (నీడరుమేయరు-హెంటిగు యాత్ర) ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాను తటస్థంగా ఉంది. 1919లో హబీబుల్లా ఖాన్ రాజకీయ ప్రత్యర్థులచే హత్య చేయబడ్డాడు. [14]
1919లో హబీబుల్లా ఖాన్ కుమారుడు అమానుల్లా ఖాన్, అప్పటి ఆఫ్ఘనిస్తాను ఎమీరుగా చట్టబద్ధమైన వారసుడైన నస్రుల్లా ఖాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కొద్దికాలానికే మరో యుద్ధం మొదలైంది. అది మూడు నెలల పాటు కొనసాగింది. [15][16][17][18]ఈ యుద్ధం 1919 నాటి ఆంగ్లో-ఆఫ్ఘను ఒప్పందంతో ముగిసింది. ఆ తర్వాత ఆఫ్ఘన్లు పూర్తి స్వతంత్ర రాజ్యంగా తమ సొంత విదేశీ వ్యవహారాలను నిర్వహించుకునే హక్కును తిరిగి పొందగలిగారు. అమానుల్లా ఖాన్ దేశ సంస్కరణలను ప్రారంభించి 1926లో పాద్షాగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఆయన ఆఫ్ఘనిస్తాను రాజుగా మారి, ఆఫ్ఘనిస్తాను రాజ్యాన్ని స్థాపించాడు. [19]
జెండాలు
[మార్చు]పరిపాలనా సంస్కరణల కారణంగా ఆఫ్ఘను ఎమీరులుగా ఏకవర్ణ పతాకాల నుండి ఇస్లామికు మూలాంశాలు, రాజ చిహ్నాలు, ఆధునిక రాజ్య చిహ్నాలను పొందుపరిచిన సంక్లిష్టమైన డిజైనుల వరకు అనేక విభిన్న పతాకాలను ప్రవేశపెట్టడంతో, ఆఫ్ఘనిస్తాను ఎమిరేటు ఉపయోగించిన జెండాలు అనేక మార్పులకు లోనయ్యాయి. ఒక జెండా మీద రాజ చిహ్నంను మొదటిసారిగా ఉపయోగించడం ఎమీరుగా అబ్దురు రెహమాను ఖాన్ పాలనలో జరిగింది. అది మధ్యలో తెల్లటి చిహ్నంతో కూడిన పూర్తిగా నల్లటి పతాకం. దీని నుండే తర్వాతి ఆఫ్ఘను చిహ్నాలు తమ మూలాలను కలిగి ఉన్నాయి.[20] [21]
ఆఫ్ఘనిస్తాను ఎమిరేటు జెండాకు సంబంధించిన తొలి రికార్డులు దోస్తు మొహమ్మదు ఖాన్ పాలన కాలం నాటివిగా ఉన్నాయి: [22]
"అమీరు దోస్తు మొహమ్మదు, షేర్ అలీ ఖాన్ పాలనలో, త్రిభుజాకారంలో, ఎరుపు, ఆకుపచ్చ రంగులలో సైనిక జెండాలు ఉండేవి. వాటి మీద ఇస్లామికు విశ్వాస ప్రకటన (షహాదా) పదాలు, అలాగే నలుగురు ఖలీఫాల పేర్లు, జిహాదు "పవిత్ర యుద్ధం"కు సంబంధించిన ఖురాను వచనాలు అన్నీ తెలుపు రంగులో ఉండేవి."
1839 జూలై 23న గజనీ యుద్ధం సమయంలో గులాం హైదరు ఖాన్ పట్టుబడిన తర్వాత, జాన్ స్మితు రెండు పతాకాలను స్వాధీనం చేసుకున్నాడు. గులాం హైదరు గదిలో ఒక త్రిభుజాకార ముదురు ఎరుపు జెండా కనిపించింది. దాని మధ్యలో ఆకుపచ్చ వృత్తం మీద నలుగురు ఇస్లామికు ఖలీఫాల పేర్లు ఉన్నాయి. అలాగే ఎరుపు తెలుపు రంగులలో డిజైన్లు, ఎరుపు రంగులో పదాలు ఉన్న మరొక నీలిరంగు పతాకం కూడా లభించింది. ఈ పదాలు ప్రధానంగా ఇస్లామికు విశ్వాస ప్రకటన మొదటి భాగాన్ని 15 సార్లు పునరావృతం చేస్తూ దేవుని ఏకత్వం మీద విశ్వాసాన్ని ప్రకటించాయి.
మొహమ్మదు అక్బరు ఖాన్ అనుచరులు ఎగురవేసిన మరో పతాకాన్ని 1842 ఏప్రిలు 7న జలాలాబాదు యుద్ధం సమయంలో ఒక ఆఫ్ఘను పతాకధారి యుద్ధంలో మరణించిన తర్వాత, ఆర్మరరు సార్జెంటు హెన్రీ ఉలియెటు స్వాధీనం చేసుకున్నాడు. అది ముదురు ఆకుపచ్చ రంగు అంచులు కలిగిన ఎర్రటి త్రిభుజాకార జెండా దాని మధ్యలో లేత నీలి రంగులో సాంప్రదాయ ఇస్లామికు ప్రార్థనా గూడు ఉండేది. దాని మీద ముదురు పసుపు రంగులో బస్మల అస్-సఫ్ అధ్యాయంలోని ఖురాను ఆయతులు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి:
"అత్యంత దయగల, కరుణామయుడైన అల్లాహు పేరుతో, అల్లాహు నుండి సహాయం, సమీపంలోనే విజయం ఉంది"
ఈ జెండా రెండవ ఆంగ్లో-ఆఫ్ఘను యుద్ధం సమయంలో అస్మాయి హైట్సు యుద్ధంలో ఆఫ్ఘను గిరిజనులచే ప్రదర్శించబడినట్లు కూడా చూపబడింది. ఇది షేర్ అలీ ఖాన్ పాలనలో ఉన్న జాతీయ పతాకాన్ని నమోదు చేసిన చారిత్రక రికార్డులతో సరిపోలవచ్చు: [23]
"అమీరు షేరు అలీ పతాకం త్రిభుజాకారంలో, ఎరుపు, ఆకుపచ్చ రంగులలో, ఖురాను శాసనాలతో ఉండేది."
పూర్వపు జెండాలు
[మార్చు]-
ఆఫ్ఘనిస్తాను జెండా (1826–1840)
-
ఆఫ్ఘనిస్తాను జెండా (1841–1879)
-
ఆఫ్ఘనిస్తాను పూర్వపు యుద్ధ జెండా
-
ఆఫ్ఘనిస్తాను పూర్వపు యుద్ధ జెండా (విభిన్న రూపం)
-
ఆఫ్ఘనిస్తాను జెండా (1879–1880)
-
ఆఫ్ఘనిస్తాను జెండా (1880–1892)
-
ఆఫ్ఘనిస్తాను జెండా (1895–1909)
మూలాలు
[మార్చు]
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు
- ↑ Lee 2019, p. 395-397.
- ↑ "The Raj Reconsidered: British India's Informal Empire and Spheres of Influence in Asia and Africa" (PDF). Archived from the original (PDF) on 9 August 2021. Retrieved 13 May 2023.
- ↑ Schinasi, May. "SERĀJ AL-AḴBĀR-E AFḠĀNIYA". www.iranicaonline.org. Encyclopedia Iranica. Retrieved 12 November 2014.
- ↑ "Niẓāmnāmah-ʼi asāsī-ʼi dawlat-i ʻalīyah-ʼi Afghānistān". Library of Congress, Washington, D.C. 20540 USA. Retrieved 2025-12-25.
- ↑ "Afghanistan" (PDF). Postiljonen.
- ↑ "BBCPersian.com". www.bbc.com. Retrieved 2025-12-30.
- ↑ Lee 2019, p. 317.
- ↑ Lee, Jonathan (2019). Afghanistan: A History from 1260 to the Present (in ఇంగ్లీష్). Reaktion Books. p. 188. ISBN 9781789140101.
- ↑ 9.0 9.1 Kohn, George Childs (2013). Dictionary of Wars. Revised Edition. London/New York: Routledge. p. 5. ISBN 9781135954949. Archived from the original on 27 July 2020. Retrieved 25 August 2020.
- ↑ Shultz, Richard H.; Dew, Andrea J. (22 August 2006). Insurgents, Terrorists, and Militias: The Warriors of Contemporary Combat. Columbia University Press. ISBN 9780231503426.
- ↑ Baxter, Craig (2001). "The First Anglo–Afghan War". In Federal Research Division, Library of Congress (ed.). Afghanistan: A Country Study. Baton Rouge, LA: Claitor's Pub. Division. ISBN 1-57980-744-5. Archived from the original on 25 January 2020. Retrieved 23 September 2011.
- ↑ Dupree: Amir Sher Ali Khan Archived 30 ఆగస్టు 2010 at the Wayback Machine
- ↑ Smith, Cynthia (August 2004). "A Selection of Historical Maps of Afghanistan – The Durand Line". United States: Library of Congress. Archived from the original on 9 January 2019. Retrieved 11 February 2011.
- ↑ Islam and Politics in Afghanistan, Olesen, page 101
- ↑ Dijk, Ruud van; Gray, William Glenn; Savranskaya, Svetlana; Suri, Jeremi; Zhai, Qiang (13 May 2013). Encyclopedia of the Cold War. Routledge. ISBN 9781135923105. Archived from the original on 19 May 2016. Retrieved 6 May 2016.
- ↑ Adamec, Ludwig W. (1 January 2012). Historical Dictionary of Afghanistan. Scarecrow Press. ISBN 9780810878150. Archived from the original on 17 June 2016. Retrieved 6 May 2016.
- ↑ Pazhvāk, ʻabd al-Raḥmān (1959). Aryana, ancient Afghanistan. Archived from the original on 1 January 2022. Retrieved 6 May 2016.
- ↑ Jawed, Mohammed Nasir (1 January 1996). Year Book of the Muslim World. Medialine. ISBN 9788186420003. Archived from the original on 1 January 2022. Retrieved 6 May 2016.
- ↑ "Afghanistan" (in ఇంగ్లీష్). World Statesmen. Archived from the original on 14 January 2012. Retrieved 9 November 2015.
- ↑ Wahab, Shaista (2010). A Brief History of Afghanistan. New York: Facts on File. p. 139.
In the late 19th century, Emir Abdur Rahman flew a black flag (a traditional Muslim military banner) with the royal arms in the center in white, a mosque surmounting crossed arms and surrounded by the Durrani symbol of wheat sheaves. This flag continued in use under Abdur Rahman's successors until 1919, but only over the palace and at military bases and customs offices.
{{cite book}}: CS1 maint: publisher location (link) - ↑ Adamec, Ludwig W. (1997). Historical Dictionary of Afghanistan. Lanham, Md.: Scarecrow Press. p. 147.
Abdul Rahman preferred a black banner (Abu Muslim's Abbasid standard) on which was drawn in white a mihrab (prayer niche), minbar (pulpit), sword, and gun. Amir Habibullah's "national flag" (bayraq-i daulati) was similar, except that it omitted the sword and gun.
- ↑ "FLAGS ii. Of Afghanistan". Encyclopedia Iranica.
- ↑ Adamec, Ludwig W. (1997). Historical Dictionary of Afghanistan. Lanham, Md.: Scarecrow Press. p. 147.