ఆమంచర్ల గోపాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆమంచర్ల గోపాలరావు
జననంఆమంచర్ల గోపాలరావు
1907 సెప్టెంబరు 26
కావలి
మరణం7 February 1969(1969-02-07) (aged 61)
వృత్తిఆకాశవాణి విజయవాడ కేంద్రంలో కార్యక్రమ సహ నిర్మాత
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధులు,
చరిత్రకారులు
చలనచిత్ర దర్శకులు.

ఆమంచర్ల గోపాలరావు (1907 - 1969) స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు, చలనచిత్ర దర్శకులు.

వీరు సెప్టెంబరు 26 తేదీన కావలిలో జన్మించారు. బి.ఎ., బి.ఎల్. పట్టాలను పొందారు. వీరు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఖద్దరు విక్రయించి కార్యకర్తగా పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1952లో ఆంధ్రోద్యమంలో స్వామి సీతారాంలో కలిసి తీవ్రంగా కృషిచేశారు.

వీరు మాట పట్టింపు, మల్లమ్మ ఉసురు, అపరాధి మొదలైన నాటికలను, హిరణ్య కశిపుడు, విశ్వంతర మొదలైన నాటకాలను రచించారు. కొన్ని హిందీ చలనచిత్రాలకు సహాయ దర్శకులుగా పనిచేశారు. తెలుగులో కాలచక్రం (1940), ఒక రోజు రాజు (1944) అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు కళా దర్శకులుగా పనిచేశారు.

చిత్రకళలో ప్రత్యేకంగా ప్రకృతి దృశ్య చిత్రణ అంటే వీరికి ప్రత్యేకమైన అభిమానం అజంతా, ఎల్లోరా శిల్పాల గురించి అనేక వ్యాసాలు రాశారు. లేపాక్షి దేవాలయ కుడ్య చిత్ర సంపదను గూర్చి ఆంగ్లంలో ఒక గ్రంథాన్ని రచించారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా కొంతకాలం పనిచేశారు.

మరణం[మార్చు]

వీరు 1969 ఫిబ్రవరి 7 తేదీన పరమపదించారు.

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]