ఆమనగల్ పురపాలకసంఘం
| ఆమనగల్ పురపాలకసంఘం | |
| — పురపాలకసంఘం — | |
| అక్షాంశరేఖాంశాలు: 16°51′07″N 78°35′20″E / 16.8520532°N 78.5887951°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | రంగారెడ్డి |
| మండలం | ఆమనగల్ |
| ప్రభుత్వం | |
| - చైర్‌పర్సన్ | |
| - వైస్ చైర్‌పర్సన్ | |
| పిన్ కోడ్ - 509321 | |
| ఎస్.టి.డి కోడ్ - 08543 | |
| వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ | |
ఆమనగల్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] ఆమనగల్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలోని, కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న ఆమనగల్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
[మార్చు]ఇది 16°51′00″N 78°31′59″E / 16.850°N 78.533°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 62 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 15 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[4]
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- సబావత్ కృష్ణ
- విక్రంరెడ్డి
- రాంపాల్ నాయక్
- కృష్ణయాదవ్
- గోరెటి జ్యోతి
- దివ్య శ్రీకాంత్ సింగ్
- విజయ్ కృష్ణ
- రాధమ్మ
- సోని జయరాం
- సుజాత
- యాదమ్మ
- ఝాన్సీరాణి
- దుర్గయ్య
- చెన్నకేశవులు
- లక్ష్మణ్
మూలాలు
[మార్చు]- ↑ "Amangal Municipality". amangalmunicipality.telangana.gov.in. the original నుండి 15 ఆగస్టు 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 March 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. the original నుండి 4 December 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 March 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." the original నుండి 13 September 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 March 2021.
- ↑ skannegari. "Amangal Municipality Ranga Reddy District - Telangana NavaNirmana Sena". tgnns.com. the original నుండి 11 ఏప్రిల్ 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 April 2021.
వెలుపలి లంకెలు
[మార్చు]- ఆమనగల్ పురపాలక సంఘ అధికారిక వెబ్‌సైటు Archived 2020-08-15 at the Wayback Machine