ఆమె అతడైతే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆమె అతడైతే
దర్శకత్వంకె.సూర్యనారాయణ
రచనకె.సూర్యనారాయణ
నిర్మాతఎం.మారుతిప్రసాద్
ఎన్.రాధాకృష్ణ
తారాగణంహనీష్
చిరాశ్రీ అంచన్
భానుచందర్
తనికెళ్ళ భరణి
ఆలీ
ఛాయాగ్రహణంహను కాక
సంగీతంయశోకృష్ణ
నిర్మాణ
సంస్థ
శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
2016 నవంబరు 12 (2016-11-12)(తెలుగు)
దేశం భారతదేశం
భాషతెలుగు

ఆమె అతడైతే 2016లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు కె.సూర్యనారాయణ దర్శకత్వం వహించాడు.[1] హనీష్, చిరాశ్రీ అంచన్, భానుచందర్, తనికెళ్ళ భరణి, ఆలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 12న విడుదలైంది.[2]

కథ[మార్చు]

సుధాకర్ (హనీష్) తన తండ్రి కోరిక మేరకు పల్లెటూరి నుండి కలెక్టరవుదామనుకుని హైదరాబాద్ వస్తాడు. కానీ అతడు హైదెరాబాలో ఇమడలేక ఇబ్బందిపడుతుంటాడు. ఈ సమయంలో అనుకోకుండా అతని తండ్రి మరణిస్తాడు. దాంతో చదువుకోడానికి సహాయం చేయమని తెలిసిన వాళ్లందరినీ అడుగుతాడు. కానీ ఎవరూ సహాయం చేయకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో భాధపడుతుంటాడు. అలా కష్టాల్లో ఉన్న అతనికి ఒక ఆలోచన వచ్చి వెంటనే అమ్మాయిగా మారిపోతాడు. సుధాకర్ అలా అమ్మాయిగా ఎందుకు మారాడు ? మారి ఏం చేశాడు ? చివరికి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా ? అన్నదే మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.సూర్యనారాయణ
  • సంగీతం: యశోకృష్ణ
  • సినిమాటోగ్రఫీ: హను కాక
  • ఆర్ట్: అరె వెంకటేష్
  • పాటల రచయిత: సుద్దాల అశోక్ తేజ[3]

మూలాలు[మార్చు]

  1. Andhra Bhoomi (3 September 2016). "పోస్ట్ ప్రొడక్షన్‌లో ఆమే.. అతడైతే?". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
  2. The Times of India (2 May 2022). "Aame Athadaithe Movie". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
  3. Andhra Bhoomi. "విజువల్ వండర్‌గా ఆమె అతడైతే? సుద్దాల అశోక్‌తేజ". Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.