ఆయేషా టాకియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అయేషా టకియా
आयेषा टाकिय़ा
2018 లో ఆయేషా టకియా
జననం (1986-04-10) 1986 ఏప్రిల్ 10 (వయసు 38)[1]
వృత్తిసినిమా నటి, డబ్బింగ్ ఆర్టిస్టు, మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు2004–2011
జీవిత భాగస్వామి
ఫరాన్ ఆజ్మీ
(m. 2009)
పిల్లలు1

ఆయేషా టాకియా (జ.1986 ఏప్రిల్ 10) సూపర్ చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఉత్తరాది నటి. ఈమెను దర్శకుడు కృష్ణవంశీ పరిచయం చేసాడు. ఈమె మొట్టమొదటి హిందీ సినిమా టార్జాన్:ద వండర్ కార్. ఈ చిత్రం ద్వారా 2004లో ఆమెకు ఫిలిం ఫేర్ ఉత్తమ డిబట్ పురస్కారం వచ్చింది. తెలుగు దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమా డోర్ సినిమా ద్వారా ఈమె నటనకు అత్యంత ఆదరణ లభించింది. ఆమె నటించిన ముఖ్యమైన సినిమాలలో సోచా నా థా (2005), డోర్ (2006) ఉన్నాయి. వాటికి ఉత్తమ నటిగా స్క్రీన్ పురస్కారాలు వచ్చాయి. ఆమె 2009లో వాంటెడ్ సినిమాలో నటించింది.[2]

బాల్య జీవితం

[మార్చు]

అయేషా టాకియా భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలో 1986 ఏప్రిల్ 10న జన్మించింది. ఆమె తండ్రి హిందువు, తల్లి ముస్లిం మతాలకు చెందినవారు.[3] ఆమె చెంబూర్ లోని సెయింట్ ఆంథోనీ బాలికల ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి.[4] ఆమె 2009 మార్చి 1 న సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మిని వివాహం చేసుకుంది.[5] ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు.[6][7]

వృత్తి జీవితం

[మార్చు]

టాకియా తన 15 ఏళ్ళ వయసులో మోడల్‌గా తన వృత్తిని ప్రారంభించింది. ఆమె "ఐ యామ్ ఎ కాంప్లాన్ బాయ్! ఐ యామ్ ఎ కాంప్లాన్ గర్ల్!" ప్రకటనలో షాహిద్ కపూర్‌తో పాటు నటించింది[8][9] ఆమె ఫాల్గునీ పాథక్ "మేరీ చునార్ ఉద్ ఉద్ జయే" మ్యూజిక్ వీడియోలో కూడా నటించింది.[10] తరువాత ఆమె నహీన్ నహీన్ అభి నహిన్ పాట "షేక్ ఇట్ డాడీ" రీమిక్స్ మ్యూజిక్ వీడియోలో నటుడు కీత్ సీక్వేరాతో పాటు నటించింది. ఈ రెండు పాటలను వినయ్ సప్రూ, రాధికారావు దర్శకత్వం వహించారు. ఇవి ఆమెను బాలీవుడ్ ప్రవేశించే అవకాశం ఇచ్చాయి. ఆమె సోచా అన థా, టార్జాన్:ద వండర్ సినిమాలలో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. సోచానా థా మొదటి చిత్రమైనా ముందుగా టార్జాన్ విడుదలైంది. అందువల్ల టార్జాన్ ఆమె తొలిచిత్రమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు 2004 లో ఫిలింఫేర్ ఉత్తమ తొలి అవార్డును గెలుచుకుంది.

టాకియా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం అయిన పలు చిత్రాల్లో నటించింది. ఏది ఏమయినప్పటికీ 2006 డోర్ అనే చిన్న బడ్జెట్ చిత్రంలో ఆమె చేసిన కృషికి ఆమె ప్రశంసలు అందుకుంది. ఇందులో సాంప్రదాయ ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్న యువ వితంతువు రాజస్థానీ మహిళ పాత్రను పోషిస్తుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ నటిగా జీ సినీ క్రిటిక్స్ అవార్డుతో సహా పలు అవార్డులను గెలుచుకుంది.[11] బాలీవుడ్ తో పాటు, టాకియా 2005 తెలుగు చిత్రం సూపర్ లో టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జునతో కలిసి నటించింది. దీని కోసం ఆమె ఉత్తమ నటి - తెలుగుకు ఫిలింఫేర్ అవార్డుకు ఎంపికైంది. సల్మాన్ ఖాన్తో కలిసి నటించిన ప్రభుదేవా నిర్మించిన వాంటెడ్ ఆమె 2009 లో అతిపెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ చిత్రం. ఆమె పాత్ర అనుకూల సమీక్షలను అందుకుంది.[12]

2011 లో ఆమె మోడ్‌లో నటించింది, దీనికి మంచి స్పందన లభించింది.[13] 2012 లో ఆమె సంగీత-రియాలిటీ షో సుర్ క్షేత్ర ఏకైక సీజన్‌ను నిర్వహించింది.

నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు]

హిందీ సినిమాలు

[మార్చు]
  1. టార్జాన్
  2. డోర్

మూలాలు

[మార్చు]
  1. [1][permanent dead link] Taarzan Girl Ayesha Takia Celebrates Her Birthday Today!. businessofcinema.com (10 April 2014) Retrieved 17 September 2015
  2. Wanted Creates History On Eid. Box Office India. 22 September 2009
  3. Darshan, Khullar (25 February 2014). "Part II: Hindu Husbands and Muslim Wives". Pakistan: Our Difficult Neighbour and India's Islamic Dimensions. Vij Books India Pvt Ltd, 30 September 2014. p. 106. ISBN 9789382652823.
  4. Guhal, Kunal (28 January 2017). "Small talk with Ayesha Takia - Green Dame". The Times of India. Retrieved 25 January 2018.
  5. "When Ayesha Takia was called insane for marrying Farhan Azmi at 23". India Today (in ఇంగ్లీష్). Ist. Retrieved 19 June 2019.
  6. "Ayesha Takia delivers a baby boy named Michael Azmi". Hindustan Times. Archived from the original on 12 అక్టోబరు 2020. Retrieved 29 June 2015.
  7. Press, Alive Caravan, Delhi. "Ayesha Takia's son is the cutest thing you'll see today". The Caravan. Archived from the original on 14 April 2017. Retrieved 21 April 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
  8. "Complan Commerical [sic] (OLD) - shahid kapoor and ayesha takia on doordarshan". www.youtube.com. ckeds. Retrieved 4 May 2020.
  9. "Taarzan Girl Ayesha Takia Celebrates Her Birthday Today". Business of Cinema. Retrieved 29 June 2015.
  10. FalguniPathakVEVO. "Falguni Pathak – Meri Chunar Udd Udd Jaye". youtube.com. Universal Music India Pvt. Ltd. Retrieved 30 June 2015.
  11. "Zee Cine Awards 2007, Zee TV's Bollywood awards: Vote online on Sify Max". web.archive.org. 12 February 2008. Archived from the original on 12 ఫిబ్రవరి 2008. Retrieved 19 June 2019.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  12. "More jingoism, less singing in Sur Kshetra". Rediff. Retrieved 19 June 2019.
  13. Krishnan, Aishwarya. "Top 5 Ayesha Takia movies on her 28th birthday". Times Internet. Retrieved 29 June 2015.

బాహ్య లంకెలు

[మార్చు]