ఆరోగ్యవరం(శానిటోరియం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆరోగ్యవరం దేశప్రసిధ్ధి చెందిన క్షయవ్యాధిగ్రస్థుల ఆరోగ్యకేంద్రము. చిత్తూరు జిల్లా, మదనపల్లె పట్టణానికి 5 కి.మీ. దూరంలో ప్రశాంతమైన స్వచ్ఛమైన వాతావరణంలో, విశాలమైన ప్రాంతములో గలదు. పూర్వము అన్ని ప్రదేశాలలో క్షయవ్యాధికి వైద్యసదుపాయాలు లేనప్పుడు, దేశం నలుమూలలనుండి సామాన్యులూ, ప్రముఖులెందరో ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకున్నారు. ప్రస్తుతం ఇది జనరల్ (సాధారణ) వైద్యశాలగాకూడా తన సేవలందిస్తోంది.