ఆర్కిటిక్ టెర్న్ పక్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2009 07 02 - Arctic tern on Farne Islands - The blue rope demarcates the visitors' path.JPG

యూకేలోని ఫర్న్ దీవుల్లో ఈ పక్షులు ఉంటాయి. ఇవి చాలా దూరం వలస వెళ్ళే పక్షులు. ఐరోపా, ఆసియా ,ఉత్తర అమెరికా ఆర్కిటిక్ వలస వెళ్ళాతాయి. ఇవి గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. సగటున రోజుకు 250 నుండి 400 కిలోమీటర్ల ప్రయాణం చేస్తాయి.ఆర్కిటిక్ టెర్న్ పక్షి పోడవు సుమారు 14 అంగుళాలు, రెక్కలు సుమారు 34 అంగుళాలు ఉంటాయి.వీటి ముక్కు చిన్నదిగా సూదిగా, ఎరుపు రంగులో ఉంటుంది. తలపైన నల్లగానూ మిగతా శరీరమంతా తెల్లగానూ ఉంటుంది. పాదాలు బాతు పాదాల్లా వలె ఉంటాయి.ఇవి గుడ్లు మే, ఆగస్టు మాసాల్లో గుడ్లుపెడతాయి. వీటి ఆహారం చేపలు , కీటకాలను తింటాయి. వీటి జీవిత కాలం మూడు, నాలుగు సంవత్సరాలు బతుకుతాయి.

వలసలు[మార్చు]

ఈ జాతి పక్షులు ఫర్న్‌ దీవుల నుండి అంటార్కిటికా వలస వెళ్లబోయే ముందు శాస్త్రవేత్తలు 29 ఆర్కిటిక్‌ టెర్న్‌ పక్షుల్ని తీసుకుని వాటికి తేలికపాటి జియోలొకేటర్లు అమర్చి పరీక్షించారు.ఈ పక్షులు ఫర్న్‌ దీవుల నుంచి చలికాలంలో పొదగడానికి అంటార్కిటికా బయలుదేరి వెళ్లి తిరిగి రావడం గురించి శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఇవి అత్యధిక దూరం వలస వెళ్ళే పక్షులు. ఈ పక్షులు జీవిత కాలంలో సుమారు 30లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయి.

మూలాలు[మార్చు]