ఆర్థిక మంత్రిత్వ శాఖ (భారతదేశం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ అతి ముఖ్యమైన మంత్రిత్వ శాఖ.

ఇది పన్నువిధింపు ఆర్థిక శాసన నిర్మాణం, ఆర్థిక సంస్థలు, కేపిటల్ మార్కెట్లు, కేంద్రం మరియు రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు మరియు కేంద్ర బడ్జెట్‌ వంటివాటితో వ్యవహరిస్తుంటుంది.

సంస్థాగత నిర్మాణం[మార్చు]

భారత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అయిదు విభాగాలను కలిగి ఉంది:

 • ఆర్థిక వ్యవహారాల శాఖ
 • వ్యయ శాఖ
 • రాబడి శాఖ
 • పెట్టుబడుల ఉపసంహరణ శాఖ
 • ఆర్ధిక సేవలు

ఆర్థిక వ్యవహారాల శాఖ[మార్చు]

DEA ప్రధానంగా భారత ప్రభుత్వ ఆర్థిక విధానాలకు బాధ్యత వహిస్తుంది. ఈ విభాగం అంతర్గతంగా ప్రస్తుత ఆర్థిక ధోరణులను పర్యవేక్షిస్తుంది. ధరలు, రుణం, కోశ మరియు ద్రవ్య విధానాలు మరియు మదుపుల క్రమబద్దీకరణలకు సంబంధించిన అన్ని విషయాలపై ప్రభుత్వానికి తగు సూచనలు అందజేస్తుంది. ఈ విభాగం జాతీయ బ్యాంకులు, జీవిత, సాధారణ బీమాతో పాటుగా భారత ప్రభుత్వ మంత్రిత్వశాఖలకు, కరెన్సీ, సెక్యూరిటీ ప్రచురణ సంస్థలకు, సెక్యూరిటీ పేపర్ మిల్లులకు సంబంధించిన విధానాలను తనిఖీ చేస్తుంది. FAO, ILO,UNIDO వంటి ప్రత్యేక అంతర్జాతీయ సంస్థలనుండి వచ్చిన సహకారం, సైన్స్ మరియు టెక్నాలజీ, సంస్కృతి మరియు విద్య వంటి రంగాల్లో అంతర్జాతీయ/ద్వైపాక్షిక సహకారం మినహా భారత్‌కు అందిన అన్ని విదేశీ ఆర్థిక, సాంకేతిక సహకారాలను కూడా ఈ విభాగం పర్యవేక్షిస్తుంది.కేంద్ర బడ్జెట్ మరియు రాష్ట్రపతి పాలనలోని రాష్ట్రప్రభుత్వాల బడ్జెట్లు మరియు కేంద్రపాలిత ప్రాంతాల బడ్జెట్లను రూపొందించి పార్లమెంటుకు సమర్పించడానికి కూడా DEA బాధ్యత వహిస్తుంది.

ఆర్థిక వ్యవహారాల శాఖ ప్రధాన విభాగాలు కింది విధంగా ఉంటాయి.

 • ఆర్థిక విభాగం
 • బడ్జెట్ విభాగం
 • బ్యాంకింగ్ మరియు బీమా విభాగం
 • కేపిటల్ మార్కెట్
 • ద్వైపాక్షిక సహకారం
 • విదేశీ వాణిజ్యం
 • ఫండ్ బ్యాంక్ విభాగం
 • కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ (FRBM) మరియు పరిపాలన
 • ఆర్థిక సహాయం, అకౌంట్లు మరియు అడిట్ కంట్రోలర్

వ్యయ శాఖ[మార్చు]

రాబడి శాఖ[మార్చు]

ఈ శాఖ, యజమాని ఆజమాయిషీలోని ఆస్తిపై పన్ను విధింపుతో వ్యవహరిస్తుంది. ఒక వ్యక్తి ఆస్తిని కలిగి ఉన్నట్లయితే, అతడు చెల్లించే పన్ను ఆస్తి పన్ను, ఇది రాబడి శాఖ కిందికి వస్తుంది.

పెట్టుబడుల ఉపసంహరణ శాఖ[మార్చు]

ప్రారంభంలో 1999 డిసెంబరులో స్వతంత్ర మంత్రిత్వ శాఖ (పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖ)గా ఏర్పడినప్పటికీ, ఆర్థిక మంత్రిత్వ శాఖగా మార్చబడిన తర్వాత 2004లో పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖ ఉనికిలోకి వచ్చింది. ఈ శాఖ పూర్వ మంత్రిత్వ శాఖ నిర్వహించిన అన్ని విధులనూ చేపట్టింది, ఇది విస్తృతార్థంలో ప్రభుత్వ రంగ విభాగాల (PSU లు) పెట్టుబడుల ఉపసంహరణ మరియు ప్రైవేటీకరణ పట్ల వ్యవస్థీకృత విధాన వైఖరికి బాధ్యత వహించేది.

బాహ్య లింకులు[మార్చు]

అధికార వెబ్‌సైట్‌లు