ఆర్థిక సంవత్సరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Accounting ఫిస్కల్‌ సంవత్సరం (లేదా ఆర్థిక సంవత్సరం, లేదా కొన్నిసార్లు బడ్జెట్‌ ఏడాది ) అనేది సంస్థ లేదా వ్యాపారం యొక్క వార్షిక (ఏడాది) ఆర్థిక వ్యవహారాలను స్టేట్మెంట్ లెక్కించడానికి ఉపయోగించే కాలం. అనేక పరిధులలో, అకౌంటింగ్‌ మరియు ట్యాక్సేషన్‌ (పన్ను లెక్కింపు) కొరకు ఇలాంటి నివేదికలు 12 నెలలకు ఒకసారి చట్టం ప్రకారం అవసరం. కానీ ఇదే మయంలో కచ్చితంగా ఒక క్యాలెండర్‌ ఏడాది (జనవరి నుంచి డిసెంబరు వరకు)కి ఈ నివేదికలు ఉండాల్సిన అవసరం లేదు. ఆర్థిక (ఫిస్కల్‌) సంవత్సరాలు వ్యాపారాలను, దేశాలను బట్టి మారతూ ఉంటాయి. ఆదాయపు పన్ను నివేదిక కొరకు ఉపయోగించే ఏడాదిని ఫిస్కల్‌ సంవత్సరంగా భావించాలి.

దీనికి అదనంగా, అనేక కంపెనీల భావన ప్రకారం, కచ్చితమైన స్టాక్‌ను లెక్కించడానికి, పోల్చి చూడటానికి స్థానిక శాసనాలు ఆమోదించిన ప్రకారం ఫిస్కల్‌ సంవత్సరంలో ఒకే వారం, ఒకే రోజును ప్రామాణికంగా తీసుకుంటే సరిపోతుంది. కొన్ని ఫిస్కల్‌ సంవత్సరాలు 54 వారాలను కలిగి ఉంటే, మరికొన్ని 53 వారాలను మాత్రమే కలిగి ఉంటాయి. పెద్ద సంస్థలు సిస్కో సిస్టమ్స్‌ [1] లేదా టెస్కో సహా కొన్ని పద్ధతులను అవలంభిస్తున్నాయి.[ఉల్లేఖన అవసరం]

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో, ఒకప్పుడు ప్రభుత్వ సొంతమైన పెద్ద సంస్థలు, బిటి గ్రూప్‌ మరియు నేషనల్‌ గ్రిడ్‌ లాంటివి, ఇప్పటికీ ప్రభుత్వ ఆర్థిక సంవత్సరాన్ని పాటిస్తూ ఉన్నాయి. ఇది మార్చిలో ఆఖరి రోజుతో ముగుస్తుంది. కేవలం ప్రైవేటీకరణ జరిగినంత మాత్రాన ఈ తేదీని మార్చాల్సిన అవసరం లేదని కంపెనీలు భావించాయి.

సందేహం లేకుండా, ఫిస్కల్‌ ఏడాది క్యాలెండర్‌ ఏడాదికి 65 శాతం పబ్లిక్‌ ట్రేడెడ్‌ కంపెనీలకు యునైటెడ్‌ స్టేట్స్‌లో సమాంతరంగానే ఉంది. యుకెలోని అనేక పెద్ద కంపెనీలు మరియు మిగిలిన చోట్ల (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌లలో చెప్పుకోదగ్గ స్థాయిలో మినహాయింపులు ఉన్నాయి) దీనిని పాటిస్తున్నాయి.[ఉల్లేఖన అవసరం]

అనేక విశ్వవిద్యాలయాలకు ఫిస్కల్‌ ఏడాది వేసవితో ముగుస్తుంది. ఫిస్కల్‌ ఏడాదిని పాఠశాలతో ఏడాదితో కలపడానికి దీనిని పాటిస్తారు. మరియు వేసవిలో పాఠశాలలో తక్కువ బిజీ ఉండటం కూడా దీనికి ఒక కారణం. ఉత్తర అర్థగోళంలో ఈ ఏడాది జూలై నుంచి వచ్చే ఏడాది జూన్‌ వరకూ ఒక ఏడాది, దక్షిణ అర్థగోళంలో ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు ఒకే క్యాలెండర్‌ సంవత్సరం ఒక ఫిస్కల్‌ సంవత్సరం.

కొన్ని మీడియా / ప్రసార సంస్థలు, వారి ఫిస్కల్‌ ఏడాది కొరకు బ్రాడ్‌కాస్ట్‌ క్యాలెండర్‌ను అనుసరిస్తాయి.

వివిధ దేశాలలో చర్య[మార్చు]

కొన్ని పరిధులలో, ముఖ్యంగా సమీకృత పన్నును అనుమతించే చోట, ఒక సమూహంగా వ్యాపారం చేసే సంస్థలకు సంబంధించిన కంపెనీలు ఒకే రకమైన ఫిస్కల్‌ ఏడాదిని పాటిస్తాయి (యు.ఎస్‌. మరియు జపాన్‌లాంటి కొన్ని పరిధులలో మూడు నెలల వరకూ తేడా ఉన్నా అంగీకరిస్తారు), ఇక్కడ ఎంట్రీలను ఫిస్కల్‌ ఏడాదిలలో తేడా ఉన్నరోజులకు సంబంధించిన వ్యవహారాలను కూడా కన్సాలిడేట్‌ చేస్తారు. కాబట్టి కొన్ని వనరులు ఒకసారి కంటే ఎక్కువసార్లు లెక్కించలేరు లేదా అసలు లెక్కించరు.

ఆస్ట్రేలియా[మార్చు]

ఆస్ట్రేలియా ప్రభుత్వం యొక్క ఆర్థిక సంవత్సరం జూలై 1న ప్రారంభమవుతుంది. మరియు తర్వాతి ఏడాది జూన్‌ 30కి ముగుస్తుంది. ఇది వ్యక్తుల ఆదాయపు పన్నుకు, ఫెడరల్‌ బడ్జెట్‌కు మరియు అధిక శాతం కంపెనీలకు వర్తిస్తుంది. దీనిని వారి సొంత ఏడాదిగా పరిగణించాలి.

ఆస్ట్రో - హంగెరీ[మార్చు]

1911 నుంచి అమలులో:- ఫిస్కల్‌ ఏడాది ఇక్కడ క్యాలెండర్‌ ఏడాది (రెఫ్‌ హాన్‌సార్డ్‌; హెచ్‌సి డిఇబి 1911 మార్చి 22 వాల్యుమ్‌ 23 సిసి 378-82)

కెనడా, హాంగ్‌కాంగ్‌, భారతదేశం[మార్చు]

కెనడా,[2] హాంగ్‌కాంగ్‌ [3] మరియు భారతదేశంలో[4][5] ప్రభుత్వాల యొక్క ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. (ఉదాహరణకు ఏపిల్ర్‌ 1, 2010 నుంచి 2011 మార్చి 31 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం).

చైనా[మార్చు]

ఇక్కడ అన్ని సంస్థలకు ఫిస్కల్‌ ఏడాది జనవరి 1కి మొదలై, డిసెంబరు 31కి ముగుస్తుంది. దీనిని క్యాలెండర్‌ ఏడాది, ట్యాక్స్‌ ఏడాది, రాజ్యాంగబద్ద సంవత్సరం మరియు ప్రణాళికా సంవత్సరం అని కూడా అంటారు.

ఈజిప్ట్[మార్చు]

అరబ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌లో ఫిస్కల్‌ ఏడాది జూలై 1కి మొదలై జూన్‌ 30కి ముగుస్తుంది.

ఫ్రాన్స్‌[మార్చు]

1911 నుంచి అమలు:- ఫిస్కల్‌ ఏడాది క్యాలెండర్‌ ఏడాది (రెఫ్‌ హాన్‌సార్డ్‌; హెచ్‌సి డిఇబి 1911 మార్చి 22 వాల్యుమ్‌ 23 సిసి 378-82; మెక్‌ కెన్నా)

జర్మనీ[మార్చు]

1911 నుంచి అమలు:- ఫిస్కల్‌ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 (రెఫ్‌ హాన్‌సార్డ్‌; హెచ్‌సి డిఇబి 1911 మార్చి 22 వాల్యుమ్‌ 23 సిసి 378-82; మెక్‌కెన్నా)

ఐర్లాండ్[మార్చు]

ఐర్లాండ్‌ కూడా 2001 వరకు ఏప్రిల్‌ 5ను ఏడాది ముగింపుగా లెక్కించేది. ఆర్థిక మంత్రి చార్లీ మెక్‌ క్రీవీ కోరిక మేరకు దీనిని మార్చారు. ఇది ఇపుపడు క్యాలెండర్‌ ఇయర్‌ను పోలి ఉంది. (2001లో ట్యాక్స్‌ ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 9 నెలలు మాత్రమే ఉంది)

ఇటలీ[మార్చు]

1911 నుంచి అమలు:- ఫిస్కల్‌ ఏడాది జూలై 1 నుంచి జూన్‌ 30 (రెఫ్‌ హాన్‌సార్డ్‌; హెచ్‌సి డిఇబి 1911 మార్చి 22 వాల్యుమ్‌ 23 సిసి 378-82; మెక్‌కెన్నా)

జపాన్[మార్చు]

జపాన్‌లో[6] ప్రభుత్వ ఆర్థిక ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు నడుస్తుంది. ఫిస్కల్‌ ఏడాది క్యాలెండర్‌ ఏడాదిలో పేర్కొంటారు. ఈ కాలాన్ని నెన్‌డో (年度) అనే పదంతో ప్రారంభిస్తారు. ఉదాహరణకు ఫిస్కల్‌ ఏడాది ఏప్రిల్‌ 1, 2010 నుంచి 2011 మార్చి 31 వరకు ఉంటే దీనిని 2010-నెన్‌డో అంటారు.

జపాన్‌లో ఆదాయపు పన్ను ఏడాది జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు ఉంటుంది. కానీ కార్పొరేట్‌ పన్ను మాత్రం కార్పొరేషన్ల సొంత ఏడాదిని అనుసరించి ఏడాది కాలానికి ఒకసారి వసూలు చేస్తారు.

న్యూజిలాండ్[మార్చు]

న్యూజిలాండ్‌ ప్రభుత్వం యొక్క ఫిస్కల్‌ ఏడాది,[7] ఆర్థిక రిపోర్టింగ్‌ ఏడాది[8] జూలై 1న మొదలై, తర్వాతి ఏడాది జూన్‌ 30తో ముగుస్తుంది. ఇది బడ్జెట్‌కు కూడా వర్తిస్తుంది. కంపెనీ మరియు వ్యక్తిగత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1న మొదలై తర్వాతి ఏడాది మార్చి 31తో ముగుస్తుంది. ఇది కంపెనీల మరియు వ్యక్తుల ఆదాయపు పన్నుకు వర్తిస్తుంది.[9]

పాకిస్థాన్‌[మార్చు]

పాకిస్థాన్‌ ప్రభుత్వం యొక్క ఫిస్కల్‌ సంవత్సరం జూలై 1న ప్రారంభమవుతుంది. జూన్‌ 30కి ముగుస్తుంది. ప్రైవేటు కంపెనీలు వారికి ఇష్టమొచ్చిన అకౌంటింగ్‌ సంవత్సరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది పాకిస్థాన్‌ ప్రభుత్వం యొక్క ఫిస్కల్‌ ఏడాదిలా ఉండకూడదు.

రష్యా[మార్చు]

1911 నుంచి అమలు:- ఫిస్కల్‌ ఏడాది క్యాలెండర్‌ ఏడాది ఒకటే (రెఫ్‌ హాన్‌సార్డ్‌; హెచ్‌సి డిఇబి 1911 మార్చి 22 వాల్యుమ్‌ 23 సిసి 378-82; మెక్‌కెన్నా)

స్వీడన్[మార్చు]

వ్యక్తులకు ఫిస్కల్‌ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు ఉంటుంది.

సంస్థలకు ఫిస్కల్‌ ఏడాది కింది వాటిలో ఏదైనా ఒకటి ఉండొచ్చు. (సిఎఫ్‌. స్వీడిష్‌ వికీపీడియా):

 • జనవరి 1 నుంచి డిసెంబరు 31
 • మే 1 నుంచి ఏప్రిల్‌ 30
 • జూలై 1 నుంచి జూన్‌ 30
 • సెప్టెంబరు 1 నుంచి ఆగస్టు 31

ఒక సంస్థ వేరే ఏదైనా కాలాన్ని అనుసరించాలిని భావిస్తే, అలాంటి సంస్థ అనుమతి కోసం పన్ను సంస్థల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

తైవాన్[మార్చు]

తైవాన్‌ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఫిస్కల్‌ ఏడాది ప్రతి క్యాలెండర్‌ ఏడాదిలో జనవరి 1న మొదలై డిసెంబరు 31తో ముగుస్తుంది. ఏదేమైనా సంస్థలు ఒక స్వతంత్ర ఫిస్కల్‌ ఏడాదిని ఎంచుకోవచ్చు. వాటిని స్థాపించిన సమయంలోనే దీనిని నిర్ణయించుకోవాలి. పన్ను సంస్థల నుంచి అనుమతి తీసుకుని దీనిని మార్చుకోవచ్చు.[10]

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్[మార్చు]

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌లో, ఫిస్కల్‌ ఏడాది జనవరి 1తో మొదలై డిసెంబరు 31తో ముగుస్తుంది.

యునైటెడ్ కింగ్‌డమ్[మార్చు]

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో[11], ఫిస్కల్‌ ఏడాది అనేది వ్యక్తిగత పన్ను లెక్కింపు మరియు రాష్ట్ర లాభాలను చెల్లించడానికి ఏప్రిల్‌ 6 నుంచి ఏప్రిల్‌ 5 వరకు ఉంటుంది. అయితే ఏడాది మాత్రం ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు కార్పొరేషన్‌ పన్ను[12] మరియు ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల [13] కొరకు ఉంటుంది.

అయితే యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో కార్పొరేషన్‌ పన్ను ప్రభుత్వం యొక్క ఆర్థిక ఏడాదిని బట్టి వసూలు చేస్తారు. కంపెనీలు మాత్రం తమకు నచ్చిన అకౌంటింగ్‌ ఏడాదిని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ పన్ను రేటులో ఏవైనా మార్పులు ఉంటే, ఆర్థిక సంవత్సరంలోని పన్ను చెల్లించాల్సిన ఆదాయంలో నుంచి కాలం ఆధారంగా తగ్గిస్తారు.

వ్యక్తిగత పన్నుకు ఏప్రిల్‌ 5 ఏడాది ముగింపు అనేది పాత ఎక్లిసియాస్టికల్‌ క్యాలెండర్‌ను పోలి ఉంటుంది. ఇందులో కొత్త సంవత్సరం మార్చి 25 (లేడీ డే )రోజున పడుతుంది. తేడా 11 తప్పిపోయిన రోజులను గ్రేట్‌ బ్రిటన్‌ జులియన్‌ క్యాలెండర్‌ నుంచి జార్జియన్‌ క్యాలెండర్‌లోకి 1752లో మార్చినప్పుడు మార్చింది. (బ్రిటిష్‌ పన్ను వర్గాలు, భూస్వాములు 11 రోజుల పన్నును మరియు అద్దె ఆదాయాలను కోల్పోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి క్యాలెండర్‌ చట్టం (కొత్త విధానం) 1750లోని ప్రొవిజన్‌ 6 ప్రకారం (టైమ్స్‌ ఆఫ్‌ పేమెంట్‌ ఆఫ్‌ రెంట్స్‌, అన్యూటీస్‌ అండ్‌ సి.) 1752-3 ట్యాక్స్‌ ఏడాదిని 11 రోజుల పాటు పెంచారు). 1753 నుంచి 1799 దాకా, గ్రేట్‌ బ్రిటన్‌లో పన్ను సంవత్సరం ఏప్రిల్‌ 15న ప్రారంభమయింది. ఇది పాత స్టైల్‌లో మార్చి 25న కొత్త ఏడాదిగా ఉండేది. 1800లో జులియన్‌ లీప్‌ రోజు ఎగిరిపోయిన 12వ రోజు అయింది. ఇది ఏప్రిల్‌ 6న మొదలయింది. 1900వ సంవత్సరంలో 13వ జులియన్‌ లీప్‌ రోజు ఎగిరిపోయినప్పటికీ దీనిలో మార్పులు చేయలేదు. కాబట్టి వ్యక్తిగత పన్ను ఏడాది యునైటెడ్‌కింగ్‌డమ్‌లో ఏప్రిల్‌6న మొదలవుతుంది.[14][15]

యునైటెడ్‌ స్టేట్స్‌[మార్చు]

యు.ఎస్‌.ప్రభుత్వం యొక్క ఫిస్కల్‌ ఏడాది గత క్యాలెండర్‌ ఏడాదిలో అక్టోబరు 1న మొదలై ఈ ఏడాది సెప్టెంబరు 30తో ముగుస్తుంది. 1976కు ముందు, ఫిస్కల్‌ ఏడాది జూలై 1న మొదలై తర్వాతి ఏడాది జూన్‌ 30తో ముగిసేది. కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ మరియు ఇంపోండ్‌మెంట్‌ కంట్రోల్‌ చట్టం 1974, కాంగ్రెస్‌కు ప్రతి ఏడాది బడ్జెట్‌ కొరకు ఎక్కువ సమయాన్ని ఇచ్చింది. మరియు దీనికి ట్రానిషనల్‌క్వార్టర్‌ను ఏర్పాటు చేసింది. ఇది 1976 జూలై 1 నుంచి 1976 సెప్టెంబరు 30 వరకు ఉంది. పైన పేర్కొన్న దాని ప్రకారం, పన్ను సంవత్సరం ఒక వ్యాపారానికి అది ఎంచుకునే ఫిస్కల్‌ ఏడాదిని బట్టి ఉంటుంది.

ఉదాహరణకు యునైటెడ్‌ స్టేట్స్‌ ప్రభుత్వం 2011కు ఫిస్కల్‌ ఏడాదిని (ఎఫ్‌వై 2011 లేదా ఎఫ్‌వై 11)ను ఇలా విభజించింది:

 • మొదటి క్వార్టర్‌: 2010 అక్టోబరు 1 - 2010 డిసెంబరు 31
 • రెండో క్వార్టర్‌: 2011 జనవరి 1 - 2011 మార్చి 31
 • మూడో క్వార్టర్‌: 2011 ఏప్రిల్‌ 1 - 2011 జూన్‌ 30
 • నాలుగో క్వార్టర్‌: 2011 జూలై 1 - 2011 సెప్టెంబరు 30

వివిధ ఫిస్కల్‌ సంవత్సరాల జాబితా[మార్చు]

దేశాల వారీగా
దేశం ప్రయోజనం J F M A M J A S O N D J F M A M J J A S O N D
ఆస్ట్రేలియా
కెనడా
హాంగ్‌కాంగ్
భారతదేశం
చైనా
పోర్చుగల్
తైవాన్
ఈజిప్ట్
ఐర్లాండ్
జపాన్ ప్రభుత్వ
కార్పొ. మరియు ప్రెస్.
న్యూజిలాండ్ ప్రభుత్వ
కార్పో. మరియు పెర్స్.
పాకిస్తాన్
స్వీడన్ పెర్స్.
కార్పొ.  
 
 
 
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
యునైటెడ్ కింగ్‌డమ్ పెర్స్. 6 ఏప్రిల్‌
కార్పొ మరియు ప్రభుత్వ
సంయుక్త రాష్ట్రాలు ప్రభుత్వ
దేశం ప్రయోజనం J F M A M J J A S O N D J F M A M J J A S O N D

పన్ను ఏడాది[మార్చు]

వ్యక్తులు మరియు సంస్థలు నివేదిక ఇచ్చి ఆదాయపు పన్ను చెల్లించేందుకు వినియోగించే ఫిస్కల్‌ ఏడాదిని తరచుగా పన్ను చెల్లింపుదారుల పన్ను ఏడాది లేదా పన్ను చెల్లింపు ఏడాది అని పిలుస్తారు. అనేక పరిధులలో పన్ను చెల్లింపుదారులు వారి పన్ను ఏడాదిని ఎంచుకుంటారు.[16] ఫెడరల్‌ దేశాలలో (ఉదాహరణకు యునైటెడ్‌ స్టేట్స్‌, కెనడా, స్విట్జర్లాండ్‌), స్టేట్స్‌ / ప్రొవిన్షియల్‌/కాన్‌టనల్‌ పన్ను ఏడాది కచ్చితంగా ఫెడరల్‌ ఏడాది మాదిరిగానే ఉంటుంది. దాదాపు అన్ని పరిధుల్లోనూ టాక్స్‌ ఏడాది 12 నెలలు లేదా 52/53 వారాలు ఉంటుంది.[17] అయితే, చిన్న సంవత్సరాలను మొదటి సంవత్సరాలుగా లేదా మార్చుకున్న పన్ను సంవత్సరాలుగా అనుమతించబడతాయి.[18]

అనేక దేశాలలో, వ్యక్తులంతా ఆదాయపు పన్నును క్యాలెండర్‌ ఏడాది ఆధారంగానే చెల్లిస్తారు. చెప్పుకోదగ్గ మినహాయింపులు:

 • యునైటెడ్‌ కింగ్‌డమ్‌: వ్యక్తులు పన్నును ఏప్రిల్‌ 5తో అంతమయ్యే సంవత్సరానికి చెల్లిస్తారు.
 • యునైటెడ్‌ స్టేట్స్: వ్యక్తులు ఏదైనా పన్ను సంవత్సరాన్ని (చాలా అరుదుగా జరుగుతుంది) ఎన్నుకోవచ్చు. అయితే దీనికి ఐఆర్‌ఎస్‌ అనుమతి ఉండాలి.[19]

అనేక పరిధుల్లో పన్ను ఏడాది పన్ను చెల్లింపు దారులు నివేదించే ఫిష్కల్‌ ఏడాదితో సరిపోవాలి. యునైటెడ్‌ స్టేట్స్‌లో దీనికి చెప్పుకోదగ్గ మినహాయింపు: పన్ను చెల్లించేవారు ఏదైనా పన్ను ఏడాదిని ఎనునకోవచ్చు. కానీ కచ్చితంగా ఆ ఏడాదికి పుస్తకాలను, రికార్డులను తయారుచేయాలి.[20]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • 4-4-5 క్యాలెండర్‌

సూచనలు[మార్చు]

 1. http://www.nytimes.com/2004/05/12/business/cisco-profit-for-quarter-slightly-beats-estimates.html సిస్కో లాభం మూడో క్వార్టర్‌కు 2004లో అంచనాను మించింది.
 2. ఫెడరల్‌-ప్రొవిన్షియల్‌ ఫిస్కల్‌ అరేంజ్‌మెంట్స్‌ చట్టం
 3. CIA - The World Factbook - Hong Kong
 4. CIA - The World Factbook - India
 5. "Why financial year & calendar year differ in India?". Reuters. November 10, 2008.
 6. CIA - The World Factbook - Japan
 7. న్యూజిలాండ్‌ ట్రెజరీ యొక్క వార్షిక నివేదిక
 8. న్యూజిలాండ్‌ అంతర్జాతీయ ఆర్థిక రిపోర్టింగ్‌ ప్రమాణాలు
 9. న్యూజిలాండ్‌ ఇన్‌లాండ్‌ రెవెన్యూ ట్యాక్స్‌ కాలెండర్‌
 10. "Investing in Taiwan". Taiwan Investment Guide. 2008. Cite web requires |website= (help)
 11. CIA - The World Factbook - United Kingdom
 12. హెచ్‌ఎమ్‌ రెవెన్యూ మరియు కస్టమ్స్‌ ఇంట్రడక్షన్‌ టు కార్పొరేషన్‌ ట్యాక్స్‌
 13. హెచ్‌ఎమ్‌ ట్రెజరీ అకౌంట్స్‌ డైరెక్షన్‌ 2008-09
 14. Joseph, Pat (2008). Tax Answers at A Glance 08 09 (illustrated సంపాదకులు.). Lawpack Publishing Ltd. p. 5. ISBN 1905261810.
 15. Steel, Duncan (2000). Marking time: the epic quest to invent the perfect calendar (illustrated సంపాదకులు.). John Wiley and Sons. p. 5. ISBN 0471298271.
 16. చూడండి, ఉదాహరణ . యు.ఎస్‌.ఐఆర్‌ఎస్‌ ప్రచురణ 538.
 17. 26 యుఎస్‌సి 441
 18. 26 యుఎస్‌సి 443
 19. సూచనలు చూడండి నుంచి ఐఆర్‌ఎస్‌ ఫామ్‌ 1128 మరియు 26యుఎస్‌సి 441- 444
 20. 26 యుఎస్‌సి 441.