ఆర్మేనియాలో హిందూమతం
హిందూమతం, రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియాలో ఒక మైనారిటీ మతం. ఆర్మేనియా తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియాల నడుమ ఉన్న దేశం. దీని సరిహద్దులలో పశ్చిమాన టర్కీ, ఉత్తరాన జార్జియా, తూర్పున అజర్‌బైజాన్, దక్షిణాన ఇరాన్, అజర్‌బైజాన్ కు చెందిన నక్షివాన్ ఎన్‌క్లేవ్లు మొదలైనవి ఉన్నాయి. అక్కడ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, భారతీయ విద్యార్థులు, ప్రవాసుల సమూహాలు హిందూమతాన్ని ఆచరిస్తున్నారు. అర్మేనియా సంస్కృతిలో స్వస్తిక్ వంటి కొన్ని చిహ్నాల ఉపయోగం చాలా పురాతనమైనది.[1]
భారతీయ విద్యార్థులు ఆర్మేనియాలో విద్యాభ్యాసం చేయడానికి ప్రధాన కారణం, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మెడికల్ విద్యాసంస్థ ఇక్కడ ఉండడమే. 1957లో డిపార్ట్‌మెంట్ ఫర్ ఆర్మేనియన్ డయాస్పోరా స్థాపించబడి తరువాత విస్తరించబడింది. ఇది అంతర్జాతీయ వైద్య విద్యార్ధులకు గమ్యస్థానం అయింది. దీంతో మెడికల్ సిబ్బందిని ఆర్మేనియాకు మాత్రమే కాక పొరుగున ఉన్న ఇరాన్, సిరియా, లెబనాన్, జార్జియా, ఇతరదేశాల వైద్య సంస్థలకు అందిస్తోంది. మన దేశంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటు పొందాలంటే డొనేషన్లు పెద్ద మొత్తంలో ఉంటున్నాయి. దీంతో, విదేశాల్లో చదవడమే ఉచితంగా తోస్తోంది. ఇక్కడ భారతదేశం నుండి వెళ్ళే విద్యార్ధులతో పాటు నేపాల్, శ్రీలంక, అమెరికా, రష్యా వంటి దేశాల నుంచి వచ్చి వైద్యశాస్త్రం అధ్యయనం చేస్తున్నారు. దీంతో, ఈ మెడికల్ విద్యాసంస్థ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ప్రచురణలలో గౌరవనీయమైన స్థానం దక్కించుకుంది.[2]
చరిత్ర
[మార్చు]అనేక అంశాలలో ఉమ్మడి ఆసక్తులతో, భారతీయులు, అర్మేనియన్లు దాదాపు 4 వేల సంవత్సరాల క్రితం ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను ఏర్పరచుకున్నారు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో భారతదేశం నుండి అర్మేనియాకు వలస వచ్చిన హిందూ వలసదారులకు సంబంధిచిన కాలనీలు ఎగువ యూఫ్రేట్స్ లో ఉండేవని చరిత్ర చెబుతోంది.[3][4] జెనోబియస్ గ్లాక్ రచనల ప్రకారం, క్రీస్తుపూర్వం 149లో ఇద్దరు భారతీయ యువరాజులు, వారి కుటుంబాలు ఉజ్జయిని నుండి ఆర్మేనియాకు వెళ్ళారు. వారికి ఘన స్వాగతం పలికి అక్కడ వసతి కల్పించారు. వారు అష్టిశత్ లో హిందూ దేవతల కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. చివరికి, వారి సమాజం 20 గ్రామాలకు పెరిగింది. భారతదేశానికి అర్మేనియన్ పేరు అయిన హింద్కస్తాన్ అని పిలువబడింది. ఒకప్పుడు అర్మేనియాలో 15 వేల మందికి పైగా హిందువులు నివసించారు.[5] క్రీ. శ. 301లో అర్మేనియాలో క్రైస్తవ మతం ప్రారంభమయ్యే వరకు హిందూ గ్రామాలు అభివృద్ధి చెందాయి.[6]
మతపరమైన సంస్థలు
[మార్చు]ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్), ట్రాన్‌సెండెంటల్ మెడిటేషన్ సంస్థలు రెండూ ఆర్మేనియాలో చురుకుగా ఉన్నాయి.[7] 1990లో ఇస్కాన్ మొదటిసారిగా ఆర్మేనియాలో అధికారికంగా మత సంస్థగా నమోదైంది. ఈ సంస్థకు అర్మేనియాలో 250 మంది సభ్యులు ఉన్నారు. ఇస్కాన్, గ్యుంరీ, వనడ్జోర్, యెఘెగ్నడ్జోర్, కపాన్, అష్టరాక్ పట్టణాల్లో సమ్మేళనాలు నిర్వహిస్తుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "For the Ashes of their fathers and the temples of their Gods: The Hindus of Armenia". hindupost.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-12-01.
- ↑ "వైద్య విద్య కఠినతరం .. 'ఎగ్జిట్' దాటితేనే ఎంట్రీ". Sakshi. Retrieved 2025-12-03.
- ↑ Priyatosh Banerjee (1992). New Light on Central Asian Art and Iconography. Abha Prakashan. p. 82. ISBN 9788185704210.
- ↑ Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ Mkrtchyan, Naira (July 2005). "Indian Settlement in Armenia and Armenian Settlements in India and South Asia".
- ↑ Memoir of a Hindu Colony in Ancient Armenia, by Johannes Avdall, Esq., M. A. S., Journal of the Asiatic Society of Bengal, Volume V, Issue 54, 1836, II.
- ↑ Government Report (PDF) Archived 2007-06-29 at the Wayback Machine