ఆర్యదేవుడు
సా.శ. 3 వ శతాబ్దానికి చెందిన ఆర్యదేవుడు ఆచార్య నాగార్జునుని శిష్యులలో ప్రముఖుడు. గొప్ప దార్శనికుడు. తత్వవేత్త. గురువు అడుగుజాడలలో నడిచి మాధ్యమిక (శూన్యవాద) శాఖా సంప్రదాయాన్ని పరిపిష్టం చేసాడు. వైదిక కర్మకాండను నిరసిస్తూ సాంఖ్య, వైశేషిక, జైన, లోకాయుత దర్శనాలను ఖండించాడు. బౌద్ధధర్మంలో ఆరు ఆభరణాలుగా (Six Ornaments) ఖ్యాతి పొందిన ఆరుగురు గొప్ప వ్యాఖ్యాతలలో (Six Great Commentators) ఆర్యదేవుడు ఒకడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆర్యదేవుని జీవిత విశేషాలపై రకరకాల కథనాలు ఉన్నాయి. చైనాకు చెందిన బౌద్ధ పండితుడు కుమారజీవుని (సా.శ. 5 వ శతాబ్దం) రచనల ద్వారా ఆర్యదేవుడు దక్షిణ భారతదేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడని తెలిపాడు. కాని ప్రసిద్ధ చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్, ఆర్యదేవుడు సింహళ దేశపు రాజకుమారుడని తెలిపాడు. ఆచార్య నాగార్జునుని శిష్యుడిగా జీవిత చరమాంకంలో గుంటూరు సమీపంలో గడిపినందువల్ల ఆర్యదేవుని ఆంధ్రుడిగా కొందరు అభిప్రాయపడతారు.[2] అయితే అన్ని సంప్రదాయాలు ఇతనిని ఆచార్య నాగార్జునుని శిష్యుడిగానే గుర్తించాయి. కనుక ఆర్యదేవుని కాలం సుమారుగా సా.శ. 3 వ శతాబ్దపు తొలికాలంగా నిర్ణయించవచ్చు. మరో చినా యాత్రికుడు ఇత్సింగ్ ఆర్యదేవుని గురించి రాస్తూ, ఇతని బుగ్గ మీద కణితలున్నాయని, ఇతని ఒక కన్ను నీలిరంగులో మారడంతో నీలనేత్ర అనే వారని తెలిపాడు.
ఆచార్య నాగార్జునుని కలవడానికి తొలిసారిగా వచ్చిన ఆర్యదేవుడు తన ప్రజ్ఞను గురువుకి సూచించిన విధం ఒక ఐతిహ్యంగా ప్రసిద్ధి పొందింది. ఆర్యదేవుని రాకను విన్న నాగార్జునుడు ఒక పాత్రలో నిండుగా నీరు నింపి పంపగా, దానిని చూసిన ఆర్యదేవుడు ఆ నీళ్ళపాత్రలో ఒక సూదిని జారవిడిచి త్రిప్పి పంపాడు. ఆ విధంగా నీళ్ళపాత్రను జ్ఞానానికి పోలికగా చూస్తే, అపారమైన ఆ జ్ఞానపులోతులకు తొణకకుండా తాను సూదిమోనలా చొచ్చుకుపోగల ప్రజ్ఞ తనకున్నదని సూచించడం జరిగింది. అవగతమైన నాగార్జునాచార్యుడు, ఆర్యదేవుని తన మాధ్యమిక ధర్మాన్ని వ్యాప్తి చేయవలసినదిగా కోరాడు అని ఈ వృత్తాంతం తెలుపుతుంది.[3]
ఇతని జీవిత చరిత్రను సా.శ. వ శతాబ్దం నాటికి చైనా భాషలో అనువదించడం జరిగింది. దాని ప్రకారం అరణ్యంలో ఆర్యదేవుడు ధ్యానంలో వుండగా, ఇతనిచే ఓడింపబడిన ఒకానొక పండితశిష్యుడు ఇతనిని చంపివేశాడని తెలుస్తుంది.[4][5][6]
ఆర్యదేవుని తాత్వికత
[మార్చు]ఆచార్య నాగార్జునుని తరువాత మాధ్యమిక బౌద్ధధర్మాన్ని వ్యాప్తి చేసిన వారిలో ఆచార్య ఆర్యదేవుడు ముఖ్యుడు. నాగార్జునుని మూలమాధ్యమిక శాస్త్రంపై వ్యాఖ్య రాస్తూ ఇలా ఉదహరిస్తాడు.
"బుద్ధత్వాన్ని పొందినవారు, తమ సర్వజ్ఞం చేత సమస్త జీవుల స్వభావాన్ని గుర్తించి వారి వారి యోగ్యతలను బట్టి జీవులకు బహువిధాలుగా బౌద్ధధర్మాన్ని బోధిస్తారు. ఒకప్పుడు ఆత్మ లేదని, మరొకప్పుడు ఆత్మ వున్నదని భోధిస్తారు. మానవుని బుద్ధి అనగా ప్రజ్ఞ పూర్తిగా వికాసం చెందనంతవరకూ ఎవరూ నిర్వాణం పొందలేరు."
"The Buddhas, in their omniscience, watch the natures of all living beings and preach to them the Good Law in different ways, sometimes affirming the existence of the Atman and at other times denying it. Without an adequate development of ones intellectual powers, no one can attain Nirvana nor can one know why evil should be eschewed. It is for people who have not reached this stage that the Buddhas preach the existence of Atman." [7]
తన జీవిత చరమాంకం వరకూ ఆర్యదేవుడు మాధ్యమిక ధర్మాన్ని సమర్ధిస్తూ, సాంఖ్య, వైశేషిక, జైన, లోకాయుత దర్శనాలను ఖండించాడు. ముఖ్యంగా బ్రాహ్మణ కర్మకాండ పట్ల నిరసన ఇతని దర్శనంలో కనిపిస్తుంది.[8]
ప్రధాన రచనలు
[మార్చు]ఆచార్య ఆర్యదేవుని గ్రంథాలు మూల సంస్కృతమున లభించలేదు. ప్రధానంగా చైనా, టిబెట్ అనువాదాలలో మాత్రమే నేటికి మిగిలివున్నాయి. ఇతని రచనలుగా పేర్కొనబడిన పెక్కు గ్రంథాలు, తరువాయి కాలానికి చెందినవిగా భావించబడినప్పటికీ, సాంప్రదాయికంగా మాత్రం ఆర్యదేవునికి ఆపాదించబడ్డాయి.
- చతుశ్శతకం (400 verses) : ఆర్యదేవుని కృతులలో అతి ముఖ్యమైనది
- ద్వాదశనికాయ శాస్త్రం
ఇవే కాకుండా క్రింద పేర్కొన్న కొన్ని గ్రంథాలు కూడా ఆర్యదేవునికి ఆపాదించబడ్డాయి.
- చిత్తవిశుద్ధిప్రకరణం: దీనిలో బ్రాహ్మణ కర్మకాండను ఖండించడం కనిపిస్తుంది. అయితే ఆ గ్రంథంలో తాంత్రిక భాష, వార-రాశుల పేర్లు కనిపించడంతో ఈ గ్రంథం యొక్క ప్రాచీనత, ఆర్యదేవునికి ఆపాదించడంపైన సందేహాలున్నాయి.[9]
- చర్యామేలాయనప్రదీపం (Lamp that Integrates the Practices) : ఇది గుహ్యసమాజ తంత్రం మీద రాసిన వ్యాఖ్యానం.[10] ఆర్యదేవునికి ఆపాదించబడింది. అయితే పరిశోధకులు దీనిని సా.శ. 9 లేదా 10 వ శతాబ్దానికి చెందిన రచనగా పేర్కొన్న్నప్పటికీ, సాంప్రదాయికంగా ఆర్యదేవుని కృతిగానే వ్యవహారంలో ఉంది.
- శతకశాస్త్ర: ఇది 100 శాస్త్ర మీద రాసిన వ్యాఖ్యానం. సా.శ. 5 వ శతాబ్దికి చెందిన కుమారజీవుని చైనా అనువాదంలోనే నేటికి మిగిలివుంది.
- అక్షరశతక (One Hundred Syllables) : ఇది ఆచార్య నాగార్జునునికి కూడా ఆపాదించబడింది.
- హస్తవాలప్రకరణం లేదా ముష్టి ప్రకరణం (Hair in the Hand) : ఇది దిజ్ఞాగునికి కూడా ఆపాదించబడింది. కేవలం 6 కారికలతో వున్న ఇది చాలా చిన్న గ్రంథం. మూల సంస్కృత ప్రతి అలభ్యం అయినప్పటికీ, దీనిని టామ్స్ - చైనా, టిబెట్ అనువాదాల ఆధారంగా పునః సంస్కృతీకరించాడు.లో రాయబడింది.[11]
టిబెటియన్ చరిత్రకారుడు బుస్తోన్ (Buston) పండితుని అభిప్రాయం ప్రకారం మరో 7 గ్రంథాలు ఆర్యదేవునకు ఆపాదించబద్దాయి.అవి శ్శిఖిత ప్రభధనయుక్తి హేతుసిద్ధి, జ్ఞానసారసముచ్చయం, చిత్తావరణ విశోధన, చతుఃపీఠతంత్రరాజం, చతుఃపీఠసాధన, జ్ఞానడాకినీసాధన, ఏకద్రుమపంజికా.[12] వీటిలో చివరి 5 గ్రంథాలు తంత్రశాస్త్ర ప్రతిపాదనలతో వుండటం వల్ల వాటిని ఆర్యదేవుని తదనంతర కాలానికి చెందినవిగా భావించవచ్చు.
రిఫరెన్సులు
[మార్చు]- David Seyfort Ruegg, The Literature of the Madhyamaka School of Philosophy in India, Wiesbaden: Harrassowitz, 1981
- Lobsang N. Tsonawa, Indian Buddhist Pandits from The Jewel Garland of Buddhist History, Dharamsala: Library of Tibetan Works and Archives, 1985.
- Lang, Karen (1986). Aryadeva's Catuhsataka: On the Bodhisattva's Cultivation of Merit and Knowledge. Narayana Press, Copenhagen.
- Wedemeyer, Christian K. (2007). Aryadeva's Lamp that Integrates the Practices: The Gradual Path of Vajrayana Buddhism according to the Esoteric Community Noble Tradition. New York: AIBS/Columbia University Press. ISBN 978-0-9753734-5-3
- Wedemeyer, Christian K. (2005). 25117/http://www.lib.uchicago.edu/e-reserves/regenstein/timp/557-5114pt1.pdf Aryadeva's Lamp that Integrates the Practices: The Gradual Path of Vajrayana Buddhism according to the Esoteric Community Noble Tradition, part II: annotated English translation, University of Chicago
- Young, Stuart H. (2015). Conceiving the Indian Buddhist Patriarchs in China, Honolulu : University of Hawaiʻi Press, pp. 265–282
- Rin-Chen-Gru Buston. History of Buddhism in India and Tibet
- G. Sundararamaiah, Bhaarateeya Tatwashaastram – Samgra Parisheelana (Telugu), Telugu Academy, Hyderabad, 1988
మూలాలు
[మార్చు]- ↑ "Six_Ornaments". Rigpa Shedra. Retrieved 29 June 2017.
- ↑ G. Sundararamaiah. Bhaarateeya Tatwashaastram – Samgra Parisheelana (1988 ed.). Telugu Academy. p. 232.
- ↑ G. Sundararamaiah. Bhaarateeya Tatwashaastram – Samgra Parisheelana (1988 ed.). Telugu Academy. p. 233.
- ↑ Sogen Yamakami (1912). Systems of Buddhistic thought (1912 ed.). University of Calcutta. p. 176-194.
- ↑ Rin-Chen-Gru, Buston. History of Buddhism in India and Tibet (Vol-2 ed.). p. 130-132.
- ↑ M. Winternitz. A history of Indian literature ((Vol. 2) 1933 ed.). University of Calcutta. p. 349-352.
- ↑ Sogen Yamakami (1912). Systems of Buddhistic thought (1912 ed.). University of Calcutta. p. 20.
- ↑ G. Sundararamaiah. Bhaarateeya Tatwashaastram – Samgra Parisheelana (1988 ed.). Telugun Academy. p. 233.
- ↑ Pandita Baladevopadyaya. బౌద్ధ వాజ్మయ సర్వస్వం (తెలుగు అనువాదం) (2006 ed.). Hyderabad: భోదిశ్రీ నాగార్జునాచార్య విజ్ఞాన కేంద్రం. p. 244.
- ↑ "Aryadeva". Rigpa Shedra. Retrieved 29 June 2017.
- ↑ Pandita Baladevopadyaya. బౌద్ధ వాజ్మయ సర్వస్వం (తెలుగు అనువాదం) (2006 ed.). Hyderabad: భోదిశ్రీ నాగార్జునాచార్య విజ్ఞాన కేంద్రం. p. 245.
- ↑ Pandita Baladevopadyaya. బౌద్ధ వాజ్మయ సర్వస్వం (తెలుగు అనువాదం) (2006 ed.). Hyderabad: భోదిశ్రీ నాగార్జునాచార్య విజ్ఞాన కేంద్రం. p. 243.