ఆర్.కే. చౌదరి
| ఆర్.కే. చౌదరి आर. के. चौधरी | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 జూన్ 4 | |||
| ముందు | కౌశల్ కిషోర్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | మోహన్‌లాల్‌గంజ్ | ||
మాజీ మంత్రి, ఉత్తరప్రదేశ్ | |||
| నియోజకవర్గం | మోహన్‌లాల్‌గంజ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1958 డిసెంబరు 6 తోనియా, ఉత్తర ప్రదేశ్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | సమాజ్ వాదీ పార్టీ | ||
| పూర్వ విద్యార్థి | అవధ్ విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | |||
ఆర్.కే. చౌదరి (జననం 6 డిసెంబర్ 1958) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మోహన్‌లాల్‌గంజ్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]ఆర్.కే. చౌదరి కాన్షీరామ్‌తో కలిసి బీఎస్‌పీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మూడుసార్లు ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో రవాణా, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణం, చిన్న పరిశ్రమలు, సహకారం, అంబేద్కర్ గ్రామీణాభివృద్ధి, క్రీడలు & యువజన సంక్షేమ శాఖల మంత్రిగా పని చేశాడు. ఆయన 2016లో బిఎస్‌పి అధినేత్రి మాయావతితో విభేదాలు కారణంగా బీఎస్‌పీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3][4]
ఆర్.కే. చౌదరి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని రోజుల తర్వాత సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌ను విడి సమాజ్‌వాదీ పార్టీలో చేరాడు. ఆయన 2014, 2019 ఎన్నికలలో మోహన్‌లాల్‌గంజ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మోహన్‌లాల్‌గంజ్ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కౌశల్ కిషోర్ పై 70,292 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ "Dalits | Voices from the margins" (in ఇంగ్లీష్). India Today. 13 July 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ "Fresh jolt to BSP as veteran leader RK Chaudhary quits" (in Indian English). The Hindu. 30 June 2016. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "उत्तर प्रदेश R K Chaudhary Mohanlalganj लोकसभा चुनाव 2024 परिणाम". TV9 Bharatvarsh. 4 June 2024. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "SP's RK Chaudhary Defeats BJP's Kaushal Kishore In Mohanlalganj Constituency" (in ఇంగ్లీష్). TimelineDaily. 5 June 2024. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Mohanlalganj" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "Mohanlalganj Constituency Lok Sabha Election Result" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.