Jump to content

ఆర్‌.టి. ఖుంజుజు

వికీపీడియా నుండి
ఆర్‌.టి. ఖుంజుజు

పదవీ కాలం
2004 – 2014
ముందు జపు డేరు
తరువాత జపు డేరు
నియోజకవర్గం బొమ్‌డిలా

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

ఆర్‌.టి. ఖుంజుజు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు బొమ్‌డిలా శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆర్‌.టి. ఖుంజుజు 1995, 1999 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బొమ్‌డిలా శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి 2004 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జపు డేరుపై 538 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి జపు డేరుపై 392 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఆర్‌.టి. ఖుంజుజు 2014 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జపు డేరు చేతిలో 685 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. "Congress faces major setback in Arunachal" (in ఇంగ్లీష్). Mint. 17 May 2014. Retrieved 8 June 2025.
  2. "16 Arunachal ministers, Parliamentary secretaries lose in assembly polls". The Economic Times. 17 May 2014. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.