ఆర్‌.సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్‌.సత్యనారాయణ

మాజీ ఎమ్మెల్సీ - 2007 నుండి 2008
నియోజకవర్గం కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) సభ్యుడు
పదవీ కాలం
19 మే 2021 – 11 డిసెంబర్ 2023

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

ఆర్‌.సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్. ఆయన 2021, మే 19న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఈ పదవిలో ఆయన ఆరేళ్లపాటు కొనసాగనున్నాడు.[1][2]

తెలంగాణ రాష్ట్రంలో 2023లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వంలో నియమితులైన టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, మిగతా ముగ్గురు సభ్యులు తమ పదువులకు రాజీనామా చేశారు.[3]

ఆర్‌. సత్యనారాయణ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సిద్దిపేటలో మే 2న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[4][5]

జననం

[మార్చు]

సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, కుల్చారం మండలం, వరిగంటం గ్రామంలో జన్మించాడు.

వృత్తి జీవితం

[మార్చు]

సత్యనారాయణ 1985లో జర్నలిస్టుగా తన ప్రస్థానం ప్రారంభించాడు. ఆయన ఈనాడు, ఉదయం, వార్త దినపత్రికల్లో చాలాకాలం జిల్లా రిపోర్టర్‌గా.. కర్నూలు, కడప, ఆదిలాబాద్, హైదరాబాద్‌, సంగారెడ్డిలో సీనియర్‌ జర్నలిస్టుగా పనిచేశాడు. ఆయన కొంతకాలం మంజీరా, సలామ్‌ హైదరాబాద్‌ అనే పత్రికలను సొంతంగా నడిపాడు.[6][7]

రాజకీయ జీవితం

[మార్చు]

సత్యనారాయణ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన 2007లో కరీంనగర్‌ పట్టభద్రుల స్థానం నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా అధినేత కేసీఆర్ పిలుపు మేరకు 2008లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు. సత్యనారాయణ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశాడు. ఆయన టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా, సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా పలు పదవులను నిర్వహించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్‌ మెదక్‌ ఎంపీగా పోటీచేసిన సమయంలో సత్యనారాయణ ఎలక్షన్‌ ఏజెంట్‌గా పనిచేశాడు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డికి కూడా ఆయన ఎన్నికల ఏజెంట్‌గా బాధ్యతలు నిర్వహించాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (20 May 2021). "టీఎస్‌పీఎస్సీకి కొత్త కళ". Sakshi. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
  2. The Indian Express (19 May 2021). "Dr. B Janardhan Reddy appointed TSPSC Chairman". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
  3. Eenadu (11 January 2024). "టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం". Archived from the original on 11 January 2024. Retrieved 11 January 2024.
  4. Telangana Today (2 May 2024). "Former MLC Satyanarayana joins Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
  5. "కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ". 2 May 2024. Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
  6. Andhrajyothy, హోం > తెలంగాణ > మెదక్ (20 May 2021). "టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా ఆర్‌.సత్యనారాయణ". www.andhrajyothy.com. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
  7. The New Indian Express (20 May 2021). "Telangana government appoints Janardhan Reddy as TSPSC chief". The New Indian Express. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
  8. Namasthe Telangana, సంగారెడ్డి (19 May 2021). "ఉద్యమకారులకు గుర్తింపు". Namasthe Telangana. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.