ఆర్.ఎస్.కృష్ణన్
| ఆర్.ఎస్. కృష్ణన్ | |
|---|---|
| జననం | 1911 సెప్టెంబరు 23 రప్పల్ 10°24′34″N 76°16′07″E / 10.4094515°N 76.2685119°E, త్రిస్సూర్, కొచ్చిన్ రాజ్యం, బ్రిటిష్ రాజ్ (ప్రస్తుతం కేరళ, భారతదేశం) |
| మరణం | 1999 అక్టోబరు 2 (వయసు: 88) బెంగళూరు, కర్ణాటక, భారతదేశం |
| రంగములు | |
| వృత్తిసంస్థలు | |
| చదువుకున్న సంస్థలు | |
| పరిశోధనా సలహాదారుడు(లు) | |
| డాక్టొరల్ విద్యార్థులు | |
| ప్రసిద్ధి | కృష్ణన్ ప్రభావం (Krishnan Effect) |
| ముఖ్యమైన పురస్కారాలు |
|
రప్పల్ సంగమేశ్వరన్ కృష్ణన్[1] (1911 సెప్టెంబరు 23 – 1999 అక్టోబరు 2) భారతీయ ప్రయోగాత్మక భౌతిక శాస్త్రవేత్త. ఇతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భౌతిక శాస్త్ర విభాగాధిపతిగా, కేరళ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశాడు. కొల్లాయిడ్ ఆప్టిక్స్ పై చేసిన మార్గదర్శక పరిశోధనలకు, కృష్ణన్ ప్రభావం (Krishnan Effect) గా పిలువబడే ఆవిష్కరణకు ఇతను ప్రసిద్ధి చెందాడు.[2] ఇతను ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, లండన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ ఫెలోగా ఉన్నాడు. సి.వి. రామన్ బహుమతి గ్రహీత.[3] కృష్ణన్ పర్యవేక్షణలో 25 మంది విద్యార్థులు డాక్టరేట్ పొందారు.
జీవిత విశేషాలు
[మార్చు]
కృష్ణన్ 1911 సెప్టెంబరు 23న అప్పటి కొచ్చిన్ రాజ్యం (ప్రస్తుత కేరళ రాష్ట్రం), త్రిస్సూర్ జిల్లా లోని రప్పల్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు.[1] స్థానిక పాఠశాలల్లో ప్రాథమిక విద్యనభ్యసించి, ఉపకార వేతనం పొంది తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరాడు. అక్కడ 1933లో ఆనర్స్ (BA Hons.) తో బ్యాచిలర్ డిగ్రీని మొదటి ర్యాంకులో పూర్తి చేశాడు.[1] తదనంతరం భౌతిక శాస్త్ర నోబెల్ గ్రహీత సర్ సి.వి. రామన్ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థిగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చేరాడు.[1] తన పరిశోధనలకు గాను 1938లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ (DSc) పొందాడు (అప్పట్లో IISc డాక్టరేట్ డిగ్రీలను ప్రదానం చేసేది కాదు).[1] 1938లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లోని కావెండిష్ లాబొరేటరీలో సర్ జాన్ కాక్‌క్రాఫ్ట్ కింద పరిశోధకుడిగా చేరాడు.[1] కేంబ్రిడ్జ్‌లో ఇతను చేసిన పరిశోధనలు 37' సైక్లోట్రాన్ అభివృద్ధికి, యురేనియం, థోరియంలలో డ్యూటెరాన్-ప్రేరిత అణు విచ్ఛిత్తి పరిశీలనకు సహాయపడ్డాయని చెబుతారు.[3] ఈ పరిశోధనలకు గాను విశ్వవిద్యాలయం 1941లో ఇతనికి పిహెచ్‌డి (PhD) ప్రదానం చేసింది.[1] కాక్‌క్రాఫ్ట్ సహచరుడు, లార్డ్ రూథర్‌ఫర్డ్ విద్యార్థి అయిన నార్మన్ ఫెదర్ పర్యవేక్షణలో ఇతను తన థీసిస్ పరిశోధనను నిర్వహించాడు.[4]
కృష్ణన్ అదే సంవత్సరం భారతదేశానికి తిరిగి వచ్చి, 1942లో బెంగళూరు లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భౌతిక శాస్త్ర విభాగంలో చేరాడు.[5] అక్కడ తిరిగి సి.వి. రామన్ శిక్షణలో పనిచేశాడు. రామన్ పదవీ విరమణ తర్వాత, 1948లో కృష్ణన్ భౌతిక శాస్త్ర విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించాడు. 1972 వరకు ఆ సంస్థకు సేవలందించాడు. పదవీ విరమణ పొందిన తరువాత, 1973లో తిరువనంతపురం లోని కేరళ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులై 1977 వరకు ఆ పదవిలో కొనసాగాడు.[1] బెంగళూరులో తన విశ్రాంత జీవితంలో కూడా రామన్ ఎఫెక్ట్ పై పరిశోధన ప్రచురణలను సంకలనం చేయడం, అనేక వ్యాసాలను ప్రచురించడంలో చురుకుగా ఉన్నాడు. ఈ కాలంలో నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (1987–90) లో విజిటింగ్ సైంటిస్ట్‌గా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఎమిరిటస్ సైంటిస్ట్‌గా పనిచేశాడు.[3] ఇతని భార్య నారాయణి కృష్ణన్. ఇతను 88 ఏళ్ల వయసులో 1999 అక్టోబరు 2న బెంగళూరులో మరణించాడు.[మూలాలు అవసరం]
వారసత్వం
[మార్చు]రామన్ ప్రభావం పై మరింత కృషి చేస్తూ, కృష్ణన్ క్షితిజ సమాంతర ధ్రువణ కాంతి (horizontally polarised incident light) తీవ్రతకు, కొల్లాయిడ్ కణాలతో సంబంధం లేకుండా క్షితిజ సమాంతర ధ్రువణంతో పరిక్షేపణం చెందడానికి (scattering) మధ్య ఉన్న అన్యోన్య సంబంధాలను (reciprocity relations) కనుగొన్నాడు.[6] దీనిని కృష్ణన్ (రెసిప్రోసిటీ) ఎఫెక్ట్ అని పిలుస్తారు.[7] సి.వి. రామన్ సిఫార్సుపై 1936లో ఈ వ్యాసం IISc జర్నల్‌లో ప్రచురితమైంది.[8] వజ్రం, క్షార హాలైడ్ (alkali halide) స్ఫటికాలలో సెకండ్ ఆర్డర్ రామన్ స్పెక్ట్రాపై చేసిన పరిశోధనలకు ఇతనికి గుర్తింపు ఉంది. రామన్ స్పెక్ట్రోస్కోపీ కోసం అతినీలలోహిత (మెర్క్యురీ 2536 Å) ఉత్తేజిత సాంకేతికతను (technique of excitation) ఉపయోగించి మొదటిసారిగా ఈ దృగ్విషయాన్ని విజయవంతంగా నమోదు చేసినట్లు నివేదించబడింది. ఈ సాంకేతికతను ఇతనే అభివృద్ధి చేశాడు. దీనిపై పీర్-రివ్యూడ్ జర్నల్స్‌లో అనేక వ్యాసాలను ప్రచురించాడు.[9][10] ఇది బోర్న్ లాటిస్ డైనమిక్ థియరీ కి నిర్ధారణను అందించిందని అంటారు.[3] వజ్రం, స్పటికాకార, ఫ్యూజ్డ్ క్వార్ట్జ్, అల్యూమినా, క్షార హాలైడ్లలో బ్రిలౌయిన్ పరిక్షేపణ (Brillouin scattering) ప్రయోగాలను నిర్వహించిన మొదటి శాస్త్రవేత్త ఇతను. తన విద్యార్థి చంద్రశేఖర్‌తో కలిసి క్యూబిక్, బైర్‌ఫ్రింజెంట్ స్ఫటికాలలో బ్రిలౌయిన్ పరిక్షేపణ పై ఒక సిద్ధాంతాన్ని రచించాడు.[3] స్ఫటికాల ఉష్ణ వ్యాకోచం, సాగే గుణకాలు (elastic constants), ఫోటోఎలాస్టిక్ స్థిరాంకాలపై పరిశోధనలను నమోదు చేశాడు. న్యూక్లియర్ జియోక్రోనోలాజికల్ పద్ధతులను ఉపయోగించి భారతీయ శిలా నిక్షేపాల డేటింగ్ (కాల నిర్ణయం) పై ప్రయత్నాలను ప్రారంభించాడు.[3] ఇతను ఒక మోనోగ్రాఫ్, 'సోర్స్ బుక్ ఆన్ రామన్ ఎఫెక్ట్' రెండు సంపుటాలకు రచయిత. అనేక శాస్త్రీయ గ్రంథాలకు అధ్యాయాలను అందించాడు.[3]
ఫెర్రో-ఎలక్ట్రిసిటీపై అంతర్జాతీయ కమిటీ సభ్యుడిగా, రామన్ స్పెక్ట్రోస్కోపీపై సమావేశాల అంతర్జాతీయ సలహా కమిటీలో సభ్యుడిగా పనిచేశాడు.[3] 1951లో స్టాక్‌హోమ్ లో జరిగిన 2వ అంతర్జాతీయ క్రిస్టల్లోగ్రఫీ కాన్ఫరెన్స్, ఎడిన్‌బర్గ్ లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ కాన్ఫరెన్స్, 5వ ఆస్ట్రేలియన్ స్పెక్ట్రోస్కోపిక్ కాన్ఫరెన్స్, 1965లో పారిస్ లో జరిగిన 1వ అంతర్జాతీయ రామన్ స్పెక్ట్రా ఆన్ క్రిస్టల్స్ కాన్ఫరెన్స్ వంటి అనేక అంతర్జాతీయ సమావేశాలు, సెమినార్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.[మూలాలు అవసరం] ఇతని పరిశోధనలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించబడిన 500కి పైగా వ్యాసాల ద్వారా నమోదు చేయబడ్డాయి. 60 మందికి పైగా పరిశోధక విద్యార్థులకు వారి డాక్టరల్ అధ్యయనాలలో మార్గనిర్దేశం చేశాడు.[మూలాలు అవసరం] కృష్ణన్ 1949 నుండి 1955 వరకు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కౌన్సిల్ సభ్యుడిగా, 1955లో కొంతకాలం దాని కోశాధికారిగా ఉన్నాడు.[11] ఇతను లండన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, అమెరికన్ ఫిజికల్ సొసైటీ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఐరోపా, అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సంబంధం కలిగి ఉన్నాడు.[మూలాలు అవసరం]
అవార్డులు, గౌరవాలు
[మార్చు]ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 1944లో కృష్ణన్‌ను ఫెలోగా ఎన్నుకుంది.[11] 1950లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ కూడా ఫెలోగా గుర్తించింది.[3] ఇతను లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ ఫెలోగా కూడా ఉన్నాడు. 1949లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ భౌతిక శాస్త్ర విభాగం అధ్యక్షుడిగా పనిచేశాడు.[3] ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 1984లో ప్లాటినం జూబ్లీ డిస్టింగ్విష్డ్ అలుమ్ని అవార్డును ప్రదానం చేసిన నాలుగు సంవత్సరాల తర్వాత, 1988లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నుండి సి.వి. రామన్ బహుమతిని అందుకున్నాడు.[3]
ఎంపిక చేసిన గ్రంథ పట్టిక
[మార్చు]- S. P. S. Porto, R. S. Krishnan (1957). "Raman Effect of Conundrum". J. Chem. Phys. 47 (3): 1009–1012. Bibcode:1967JChPh..47.1009P. doi:10.1063/1.1711980.
- R. S. Krishnan (February 1936). "Scattering of light in optical glasses". Proc. Indian Acad. Sci. 3 (211): 211–220. doi:10.1007/BF03046252. S2CID 198139008.
- R. S. Krishnan (August 1947). "Second-Order Raman Spectra of Crystals". Nature. 160 (4059): 230–231. Bibcode:1947Natur.160..230K. doi:10.1038/160230a0. PMID 20256209. S2CID 4126866.
- R. S. Krishnan (July 1946). "The Second Order Raman Spectrum on Diamond". Proc. Indian Acad. Sci. 24 (1): 25–32. doi:10.1007/BF03170737. S2CID 91228159.
మూలాలు
[మార్చు]- 1 2 3 4 5 6 7 8 "R. S. Krishnan: an obituary" (PDF). Current Science. 1999. Retrieved 25 December 2016.[permanent dead link]
- ↑ Dudley Williams, ed. (2013). Molecular Physics: Methods of Experimental Physics. Academic Press. pp. 420 of 500. ISBN 9781483191775.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 "Deceased Fellow". Indian National Science Academy. 2015. Archived from the original on 12 August 2016. Retrieved 5 December 2015.
- ↑ "Norman Feather - Session II". American Institute of Physics. 26 January 2015. Retrieved 9 June 2016.
- ↑ "Great Teachers V.-R.S.Krishnan". Sulekha. 2015. Archived from the original on 8 డిసెంబర్ 2015. Retrieved 5 December 2015.
{{cite web}}: Check date values in:|archive-date=(help) - ↑ Hans Mueller (June 1938). "On the Theory of Scattering of Light". Proceedings of the Royal Society of London. Series A, Mathematical and Physical Sciences. 166 (926): 425–449. Bibcode:1938RSPSA.166..425M. doi:10.1098/rspa.1938.0102. JSTOR 97009.
- ↑ Debi Prasad Chattopadhyaya (1999). History of Science, Philosophy and Culture in Indian Civilization: pt. 1. Science, technology, imperialism and war. Pearson Education India. p. 923. ISBN 9788131728185.
- ↑ R. S. Krishnan (February 1936). "Scattering of light in optical glasses" (PDF). Proc. Indian Acad. Sci. 3 (211): 211–220. doi:10.1007/BF03046252. S2CID 198139008.[permanent dead link]
- ↑ R. S. Krishnan (August 1947). "Second-Order Raman Spectra of Crystals". Nature. 160 (4059): 230–231. Bibcode:1947Natur.160..230K. doi:10.1038/160230a0. PMID 20256209. S2CID 4126866.
- ↑ R. S. Krishnan (July 1946). "The Second Order Raman Spectrum on Diamond". Proc. Indian Acad. Sci. 24 (1): 25–32. doi:10.1007/BF03170737. S2CID 91228159.
- 1 2 "IAS Fellow". Indian Academy of Sciences. 2015. Retrieved 5 December 2015.