ఆర్.కె. సింగ్ పటేల్
| ఆర్.కె. సింగ్ పటేల్ | |||
| పదవీ కాలం 2019 మే 23 – 2024 జూన్ 4 | |||
| ముందు | భైరాన్ ప్రసాద్ మిశ్రా | ||
|---|---|---|---|
| తరువాత | కృష్ణ దేవి శివశంకర్ | ||
| నియోజకవర్గం | బందా | ||
| పదవీ కాలం 2009 – 2014 | |||
| ముందు | శ్యామా చరణ్ గుప్తా | ||
| తరువాత | భైరోన్ ప్రసాద్ మిశ్రా | ||
| నియోజకవర్గం | బందా | ||
శాసనసభ సభ్యుడు
| |||
| పదవీ కాలం మార్చి 2017 – మే 2019 | |||
| ముందు | చంద్ర భాన్ | ||
| నియోజకవర్గం | మాణిక్‌పూర్ | ||
| పదవీ కాలం 1996 – 2002 | |||
| ముందు | భైరోన్ ప్రసాద్ మిశ్రా | ||
| తరువాత | దినేష్ ప్రసాద్ | ||
| నియోజకవర్గం | కార్వి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1959 July 3[1] బాలాపూర్, ఖల్సా, చిత్రకూట్ , ఉత్తరప్రదేశ్ , భారతదేశం[1] | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ[1] | ||
| తల్లిదండ్రులు | భగవాన్ దీన్ సింగ్, రామ్ సఖీ దేవి | ||
| జీవిత భాగస్వామి | శాంతి దేవి పటేల్[1] | ||
| సంతానం | 3 కుమారులు & 1 కుమార్తె | ||
| నివాసం | చిత్రకూట్ , ఉత్తర ప్రదేశ్ & న్యూఢిల్లీ[1] | ||
| పూర్వ విద్యార్థి | అలహాబాద్ విశ్వవిద్యాలయం , ఉత్తరప్రదేశ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
రామ్‌కృపాల్ సింగ్ పటేల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉత్తరప్రదేశ్ శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి, రెండుసార్లు బందా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]రామ్‌కృపాల్ సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1993 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కార్వి శాసనసభ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భైరాన్ ప్రసాద్ మిశ్రా చేతిలో 198 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన 1996 శాసనసభ ఎన్నికలలో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్ ప్రకాష్ పై 24340 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై సహాయ మంత్రిగా పని చేశాడు.
రామ్‌కృపాల్ సింగ్ 2002 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కార్వి శాసనసభ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భైరాన్ ప్రసాద్ మిశ్రాపై 15,515 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత సమాజ్‌వాదీ పార్టీలో చేరి 1996 శాసనసభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి దినేష్ ప్రసాద్ చేతిలో 1356 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.
రామ్‌కృపాల్ సింగ్ 2009 లోక్‌సభ ఎన్నికలలో బందా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి భైరాన్ ప్రసాద్ మిశ్రాపై 34593 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజెపీ అభ్యర్థి భైరాన్ ప్రసాద్ మిశ్రా చేతిలో 115788 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]
రామ్‌కృపాల్ సింగ్ 2017 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి మాణిక్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజెపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సంపత్ పాల్‌పై 44,464 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] ఆ తరువాత 2019 లోక్‌సభ ఎన్నికలలో బందా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజెపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి శ్యామ చరణ్ గుప్తాపై 58,938 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5] ఆయన 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజెపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ కృష్ణ దేవి శివశంకర్ చేతిలో 71,210 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Lok Sabha Profile". Govt of India. 2009.
- ↑ "Lok Sabha Elections 2019: Former friends with Samajwadi past now foes in Banda poll arena". Hindustan Times. 1 May 2019. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "RK Singh Patel: Vying For Power; Eyeing Banda Seat" (in ఇంగ్లీష్). TimelineDaily. 11 March 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ "Banda Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Banda". Election Commission of India. 4 June 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.