ఆర్.వి. జనకిరామన్
స్వరూపం
ఆర్.వి. జనకిరామన్ | |
|---|---|
| 7వ పుదుచ్చేరి ముఖ్యమంత్రి | |
| In office 26 మే 1996 – 18 మార్చి 2000 | |
| అంతకు ముందు వారు | వి. వైతిలింగం |
| తరువాత వారు | పీ. శణ్ముగం |
| పుదుచ్చేరి శాసనసభ ప్రతిపక్ష నాయకుడు | |
| In office 22 మార్చి 2000 – 11 మే 2006 | |
| నియోజకవర్గం | నెల్లితోప్ |
| పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి | |
| In office 1989–1991 | |
| నియోజకవర్గం | నెల్లితోప్ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1941 జనవరి 8 [మూలాలు అవసరం] విల్లియనూర్, పుదుచ్చేరి, భారతదేశం |
| మరణం | 2019 జూన్ 10 (వయసు: 78)[1] పుదుచ్చేరి, భారతదేశం |
| రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజగం |
ఆర్. వి. జనకిరామన్ (8 జనవరి 1941 – 10 జూన్ 2019) పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిగా పనిచేశారు.
రాజకీయ జీవితం
[మార్చు]
ఆయన నెల్లితోప్ శాసనసభ నియోజకవర్గం నుండి 1985, 1990, 1991, 1996, 2001 సంవత్సరాల్లో వరుసగా ఐదు సార్లు ఎన్నికయ్యారు. 2006లో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం అభ్యర్థి ఓం శక్తి శేఖర్ చేతిలో ఓడిపోయారు. దీనికి ఆయన ఆరోగ్య సమస్యలు (పార్కిన్సన్ వ్యాధి) కారణమయ్యాయి.
ఆయన 26 మే 1996 నుండి 18 మార్చి 2000 వరకు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ కాలంలో ఆయన ద్రవిడ మున్నేట్ర కళగం, తమిళ మాణిల కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.[2]
మరణం
[మార్చు]జనకిరామన్ 78 ఏళ్ల వయస్సులో పుదుచ్చేరిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.
ఎన్నికల చరిత్ర
[మార్చు]| సంవత్సరం | పదవి | నియోజకవర్గం | పార్టీ | ఫలితం |
|---|---|---|---|---|
| 1985 | శాసనసభ సభ్యుడు | నెల్లితోప్ | ద్రవిడ మున్నేట్ర కళగం | విజయం |
| 1990 | శాసనసభ సభ్యుడు | నెల్లితోప్ | ద్రవిడ మున్నేట్ర కళగం | విజయం |
| 1991 | శాసనసభ సభ్యుడు | నెల్లితోప్ | ద్రవిడ మున్నేట్ర కళగం | విజయం |
| 1996 | శాసనసభ సభ్యుడు | నెల్లితోప్ | ద్రవిడ మున్నేట్ర కళగం | విజయం |
| 2001 | శాసనసభ సభ్యుడు | నెల్లితోప్ | ద్రవిడ మున్నేట్ర కళగం | విజయం |
| 2006 | శాసనసభ సభ్యుడు | నెల్లితోప్ | ద్రవిడ మున్నేట్ర కళగం | ఓటమి |
| 2011 | శాసనసభ సభ్యుడు | నెల్లితోప్ | ద్రవిడ మున్నేట్ర కళగం | ఓటమి |
మూలాలు
[మార్చు]- ↑ Bosco Dominique (10 జూన్ 2019). "Former Puducherry chief minister RV Janakiraman dead". ది టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 10 జూన్ 2019.
- ↑ "States of India since 1947 – Puducherry (Pondicherry)".