ఆర్. ఆర్. పాటిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్.ఆర్. పాటిల్
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి
In office
2004 నవంబర్ 1 – 2008 డిసెంబర్ 4
మినిస్టర్మహారాష్ట్ర హోంశాఖ మంత్రి
గవర్నర్
మహారాష్ట్ర ముఖ్యమంత్రివిలాస్ రావ్ దేశ్ ముఖ్
అంతకు ముందు వారువిజయ్ సింగ్ పాటిల్
తరువాత వారుజయంత్ పాటిల్
మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రి
In office
2010 నవంబర్ 10 – 2014 జనవరి 26
మినిస్టర్మహారాష్ట్ర హోం శాఖ మంత్రి
గవర్నర్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిపృథ్వీరాజ్ చౌహాన్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిఅజిత్ పవార్
మహారాష్ట్ర శాసనసభ నాయకుడు
In office
2012 సెప్టెంబర్ 29 – 2014 సెప్టెంబర్ 26
అంతకు ముందు వారుఅజిత్ పవార్
వ్యక్తిగత వివరాలు
జననం1956 ఆగస్టు 16
ముంబై, మహారాష్ట్ర , భారతదేశం
మరణం2015 ఫిబ్రవరి 16(2015-02-16) (వయసు 58)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
పౌరసత్వంభారతీయుడు
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీనేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిసుమన్ పాటిల్
సంతానం3
వృత్తిరాజకీయ నాయకుడు

రావుసాహెబ్ రాంరావ్ పాటిల్, RR పాటిల్ (16 ఆగష్టు 1957 – 16 ఫిబ్రవరి 2015) అని పిలుస్తారు, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1991 నుండి 2015 వరకు తాస్గావ్ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశాడు. అతను ఆధునిక మహారాష్ట్ర ముఖ్యమైన రాజకీయ నాయకుడు. ఆర్.ఆర్. పాటిల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన రాజకీయ నాయకుడు. 2009 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమి విజయం సాధించిన తర్వాత ఆయన రెండోసారి మహారాష్ట్ర ప్రభుత్వంలో హోం మంత్రి పదవిని నిర్వహించాడు. ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా కూడా పనిచేశాడు.[1]

బాల్యం విద్యాభ్యాసం

[మార్చు]

"ఆబా"గా ప్రసిద్ధి చెందిన ఆర్ఆర్ పాటిల్, ( మరాఠీ :आबा) 1957 ఆగస్టు 16న మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా తాస్గావ్ తాలూకాలోని అంజని గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి గ్రామ పెద్దగా ఉండేవాడు. కానీ వారి ఆర్థిక పరిస్థితి బాగా ఉండేది కాదు. అతను "ఎర్న్ & లెర్న్" అనే ప్రభుత్వ పథకం కింద తన విద్యను పూర్తి చేశాడు. అతను బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఎల్.ఎల్.బి.పట్టా పొందారు.సాంగ్లీలోని శాంతినికేతన్ కళాశాల నుండి అతను బికాం పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఆయన సవ్లాజ్ నియోజకవర్గం నుండి 1979 నుండి 1990 వరకు ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచాడు, ఆ తర్వాత 1990, 1995, 1999, 2004, 2009 2014లో సాంగ్లీ జిల్లాలోని తాస్గావ్‌ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈ నియోజకవర్గం నుండి ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.

1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల తరువాత, అతను అక్టోబర్ 1999లో కాంగ్రెస్-ఎన్‌సిపి సంకీర్ణ ప్రభుత్వంలో మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాడు. అతను 2003 డిసెంబర్ 25న మహారాష్ట్ర హోం మంత్రిగా నియమితుడయ్యాడు. అతను 2004 నుండి 2008 వరకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పని చేశాడు. అతను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర మహారాష్ట్రలోని నేషనల్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ నాయకుడుగా పనిచేశాడు.

వివాదం

[మార్చు]

నవంబర్ 2008 ముంబై దాడుల అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. "వారు (ఉగ్రవాదులు) 5,000 మందిని చంపడానికి వచ్చారు, అని ఆయన చెప్పాడు. దీంతో ఆయన మాటలు వివాదాస్పదమయ్యాయి.

ముంబాయి దాడులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంతో 2008 డిసెంబర్ 1 ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. అతను టెలివిజన్‌లో ఇలా చెప్పడం లేదా దాని గురించి విలేఖరులు చెప్పడం చూసిన ముంబై వాసులు అధిక భద్రత కల్పించిన తర్వాత రాజకీయ నాయకులు ఇలాంటి ప్రకటనలు చేయడం వ్యంగ్యాన్ని ఎత్తి చూపారు. [2] [3] [4] [5]

మరణం

[మార్చు]

ఆయన నోటి క్యాన్సర్‌తో సుదీర్ఘకాలం బాధపడ్డాడు. పరిస్థితి విషమించడంతో ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. అతను కొంతకాలం చికిత్స తీసుకున్న తర్వాత కోలుకో సాగాడు. కానీ ఒక రోజున ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించింది. 2015 ఫిబ్రవరి 16న అతను మరణించాడు. [6] [7] 17 ఫిబ్రవరి 2015న మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని తాస్‌గావ్ ప్రాంతంలోని అంజని గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి [8] ఆర్.ఆర్.పాటిల్ అంత్యక్రియలు రాష్ట్ర గౌరవాలతో జరిగాయి, ఇందులో మహారాష్ట్ర ప్రభుత్వం 21 తుపాకీల వందనం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అన్నా హజారే, శరద్ పవార్ వివిధ పార్టీలకు చెందిన ఇతర రాజకీయ నాయకులు పాల్గొన్నారు. [9]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్ ఆర్ పాటిల్ మృతి". Sakshi. 2015-02-17. Retrieved 2024-04-16.
  2. "Deshmukh quits, no decision on successor yet". Merinews. 1 December 2008. Archived from the original on 21 ఆగస్టు 2016. Retrieved 18 July 2018.
  3. "RR Patil has a language problem, calls attack small". News18 India. 29 November 2008. Retrieved 18 July 2018.
  4. Damini Berry (2 December 2008). "Minister paid dearly for the 'small incident' remark". Merinews. Archived from the original on 21 ఆగస్టు 2016. Retrieved 18 July 2018.
  5. "A year after 26/11,R R Patil is back as Home Minister". The Indian Express. 9 November 2009. Retrieved 18 July 2018.
  6. "Senior NCP leader R R Patil is no more". Yahoo India. 6 February 2015. Retrieved 18 July 2018.
  7. "Maharashtra's former home minister and NCP leader RR Patil dies in Mumbai". IBN Live. News18 India. CNN. 16 February 2015. Retrieved 18 July 2018.
  8. "RR Patil's last rites to be performed in his village Anjani at 1pm today". ABP News. 17 February 2015. Retrieved 18 July 2018.
  9. "Tearful farewell to R.R. Patil". Deccan Herald. Sangli, Maharashtra. 17 February 2015. Retrieved 18 July 2018.