Jump to content

ఆర్. కె. షణ్ముఖం చెట్టి

వికీపీడియా నుండి
రామస్వామి శెట్టి కందసామి షణ్ముఖం శెట్టి
1947లో షణ్ముఖం శెట్టి
భారత ఆర్థిక మంత్రి
In office
15 ఆగస్టు 1947 – 17 ఆగస్టు 1948
ప్రధాన మంత్రిజవహర్‌లాల్ నెహ్రూ
అంతకు ముందు వారుకార్యాలయం స్థాపించబడింది
తరువాత వారుజాన్ మథాయ్
కొచ్చిన్ రాజ్యం దివాన్
In office
1935–1941
చక్రవర్తిరామ వర్మ XVII
అంతకు ముందు వారుసి. జి. హెర్బర్ట్
తరువాత వారుఏ. ఎఫ్. డబ్ల్యు. డికిన్సన్
సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అధ్యక్షుడు
In office
సెప్టెంబర్ 1933 – 1935
గవర్నర్ జనరల్ఫ్రీమాన్ ఫ్రీమాన్-థామస్
అంతకు ముందు వారుసర్ ముహమ్మద్ యాకూబ్
తరువాత వారుసర్ అబ్దుర్ రహీమ్
ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు (సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ)
In office
1924–1935
గవర్నర్ జనరల్రూఫస్ ఐజాక్స్,
ఇ. ఎఫ్. ఎల్. వుడ్,
ఫ్రీమాన్ ఫ్రీమాన్-థామస్
వ్యక్తిగత వివరాలు
జననం(1892-10-17)1892 అక్టోబరు 17
కోయంబత్తూరు, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం1953 మే 5(1953-05-05) (వయసు: 60)
కోయంబత్తూరు, మద్రాస్ రాష్ట్రం, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీస్వరాజ్ పార్టీ,
జస్టిస్ పార్టీ
కళాశాలమద్రాసు విశ్వవిద్యాలయం
మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్,
మద్రాస్ లా కాలేజ్
వృత్తిశాసనసభ్యుడు
నైపుణ్యంన్యాయవాది, రాజకీయవేత్త

సర్ రామస్వామి చెట్టియార్ కందసామి షణ్ముఖం చెట్టి (17 అక్టోబర్ 1892 – 5 మే 1953), 1947 నుండి 1948 వరకు స్వతంత్ర భారతదేశ మొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన భారతీయ న్యాయవాది, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు. ఆయన 1933 నుండి 1935 వరకు భారతదేశ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అధ్యక్షుడిగా, 1935 నుండి 1941 వరకు కొచ్చిన్ రాజ్యం దివాన్‌గా కూడా పనిచేశారు.

షణ్ముఖం శెట్టి 1892లో కోయంబత్తూరులో జన్మించారు.[1] మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్, మద్రాస్ లా కాలేజ్ లలో విద్యాభ్యాసం చేశారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక రాజకీయాల్లో చేరి, భారత జాతీయవాద పార్టీలైన స్వరాజ్ పార్టీ, జస్టిస్ పార్టీ రెండింటిలోనూ పనిచేశారు. ఆయన భారతదేశ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికై, 1931 నుండి 1935 వరకు దాని ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1935 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత దక్షిణ భారతదేశానికి తిరిగి వచ్చి, 1935 నుండి 1941 వరకు కొచ్చిన్ రాజ్యంలో దివాన్‌గా పనిచేశారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, అప్పటి మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, శెట్టికి ఉన్న బ్రిటిష్ అనుకూల ధోరణిని పక్కన పెట్టి వివాదాస్పదంగా ఆయన్నే ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. షణ్ముఖం శెట్టి 5 మే 1953న మరణించారు.

తన ప్రజా జీవితంలో శెట్టి అనేక సామాజిక అంశాలతో మమేకమయ్యారు. ఆయన 'తమిళ ఇసై ఉద్యమం' యొక్క బలమైన మద్దతుదారు. 26 నవంబర్ 1947న భారత పార్లమెంటులో దేశపు మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు షణ్ముఖం శెట్టి భారత ఆర్థిక మంత్రిగా ఉన్నారు.

ప్రారంభ జీవితం

[మార్చు]

షణ్ముఖం శెట్టి 17 అక్టోబర్ 1892న కోయంబత్తూరులోని వాణియర్ వీధిలో కందసామి శెట్టికి జన్మించారు. ఆయన తాత రామస్వామి శెట్టి 19వ శతాబ్దం మధ్యలో కోయంబత్తూరుకు వలస వచ్చారు. వారి కుటుంబం వ్యాపార రంగంలో ఉండి కోయంబత్తూరు నగరంలో అనేక మిల్లులను కలిగి ఉండేది.

శెట్టి పాఠశాల విద్య కోయంబత్తూరులో సాగింది. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఆర్థికశాస్త్రం చదివి, మద్రాస్ లా కాలేజీ నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆయన బార్‌లో చేరకుండా కుటుంబ వ్యాపారాలను చూసుకున్నారు, కొంతకాలం తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు.

ప్రారంభ రాజకీయ జీవితం

[మార్చు]
1924లో ఆర్. కె. షణ్ముఖం శెట్టి

షణ్ముఖం శెట్టి జస్టిస్ పార్టీలో చేరి 1917లో కోయంబత్తూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్ అయ్యారు. [2] ఆ వెంటనే కోయంబత్తూరు మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మున్సిపల్ పరిపాలనలో కొన్ని సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత ఆయనకు దక్కుతుంది.

1920లో జరిగిన మద్రాస్ ప్రెసిడెన్సీ శాసనమండలి ఎన్నికలలో పాల్గొని మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. [3] 1920 నుండి 1922 వరకు సభ్యుడిగా కొనసాగి రాజీనామా చేశారు. అనంతరం స్వరాజ్ పార్టీలో చేరి 1924లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్తగా ప్రారంభించిన దిగువ సభ అయిన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. [4] శెట్టి 1928, 1929, 1932లలో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారతీయ యజమానులకు ప్రాతినిధ్యం వహించారు. 1932లో ఒట్టావాలో జరిగిన ఇంపీరియల్ ఎకనామిక్ కాన్ఫరెన్స్‌లో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు.

1932లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉపాధ్యక్షుడిగా, 1934లో సర్ ఇబ్రహీం రహీమ్తూలా తర్వాత అధ్యక్షుడిగా నియమితులయ్యారు. [5] 1935 ఎన్నికలలో ఓడిపోయే వరకు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు.

తదుపరి రాజకీయ జీవితం

[మార్చు]

శెట్టి 1935 నుండి 1941 వరకు కొచ్చిన్ రాజ్యం దివాన్‌గా పనిచేశారు. ఆయన పదవీకాలంలో సంస్థాన పరిపాలనలో కొత్త సంస్కరణలు వచ్చాయి. కొచ్చిన్ ఓడరేవు అభివృద్ధికి ఆయన పథకాలను ప్రవేశపెట్టారు. హిందూ మతపరమైన మూఢనమ్మకాలను తొలగించడానికి, పెరియార్ ఇ. వి. రామస్వామి పథకాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారు.[6]

1938లో లీగ్ ఆఫ్ నేషన్స్ కు భారత ప్రతినిధిగా జెనీవాను సందర్శించారు. 1944లో బ్రెట్టన్ వుడ్స్‌లో జరిగిన ప్రపంచ ద్రవ్య సదస్సుకు కూడా భారత ప్రతినిధిగా వెళ్లారు. ఈ కాలంలో బలహీనపడుతున్న జస్టిస్ పార్టీని పునరుద్ధరించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కొంతకాలం భోపాల్ నవాబుకు రాజ్యాంగ సలహాదారుగా పనిచేశారు. ఇండియన్ టారిఫ్ బోర్డ్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. బ్రిటిష్ అనుకూల అభిప్రాయాల కారణంగా ఆయన రాజ్యాంగ పరిషత్తులో చేర్చబడలేదు.

15 ఆగస్టు 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆయన ఇలా అన్నారు:

...ప్రపంచ సంఘటనల ప్రభావం వల్ల, పాత పాలకుల అపూర్వమైన స్వయం త్యాగం వల్ల మనకు విదేశీ బానిసత్వం నుండి స్ముక్తి లభించింది....

ఆర్థిక రంగంలో ఆయనకున్న నైపుణ్యం కారణంగా, జవహర్‌లాల్ నెహ్రూ అయిష్టత ఉన్నప్పటికీ మహాత్మా గాంధీ సూచన మేరకు స్వతంత్ర భారత మొదటి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఎంపికయ్యారు. [7] అయితే నెహ్రూతో ఉన్న విభేదాల వల్ల స్వల్ప కాలంలోనే రాజీనామా చేశారు. 26 నవంబర్ 1947న స్వతంత్ర భారతదేశ మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా షణ్ముఖం శెట్టి నేటికీ గుర్తుండిపోతారు. [8]

మరణం

[మార్చు]

షణ్ముఖం శెట్టి 3 మే 1953న తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. 5 మే 1953 సాయంత్రం రెండోసారి గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు.

గౌరవ పురస్కారాలు

[మార్చు]

3 జూన్ 1933న శెట్టికి 'నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్' గౌరవం లభించింది. అన్నామలై విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని ప్రదానం చేసింది. 6 జూలై 2014న కోయంబత్తూరులోని ఆర్. కె. శ్రీరంగమ్మాళ్ కల్వి నిలయం హైస్కూల్ ప్రాంగణంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొచ్చిలోని షణ్ముగం రోడ్డుకు ఆయన పేరు పెట్టారు.[9]

వరుస క్రమం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • P. Rajeswar Rao (1991). "R. K. Shanmukham Chetty". The Great Indian Patriots, Volume 2. Mittal Publications. pp. 122–125. ISBN 8170992885.
  • Nilkan Perumal (1953). Economic ambassador: the life and work of Dr. Sir R. K. Shanmukham Chetty. Popular Hindusthan Publications.
  1. ↑ Ramaswamy, Vijaya (2017-08-25). Historical Dictionary of the Tamils (in ఇంగ్లీష్). Bloomsbury Publishing PLC. ISBN 978-1-5381-0686-0.
  2. ↑ G. Satyamurty (7 January 2009). "A visionary economist, great lawyer, great orator". The Hindu. Archived from the original on 6 July 2009.
  3. ↑ The collected works of Lala Lajpat Rai, Volume 13. Manohar. 2010. p. 42.
  4. ↑ Sir Raymond Streat (1987). Lancashire and Whitehall: 1931–39. v. 2. 1939–57. Manchester University Press ND. ISBN 0719023904. ISBN 978-0-7190-2390-3.
  5. ↑ Ramananda Chatterjee (1975). The Modern review, Volume 137. Modern Review Office. p. 213.
  6. ↑ "List of diwans of Kochin". worldstatesmen.org.
  7. ↑ S. Muthiah (29 March 2004). "When the postman knocked". The Hindu. Archived from the original on 30 September 2004.
  8. ↑ Bharadwaj. Study Package For Clat. Tata McGraw-Hill Education. p. 248. ISBN 0070699372. ISBN 978-0-07-069937-3.
  9. ↑ "Statistical report on General Election 1951 to the Legislative Assembly of Madras" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 17 ఫిబ్రవరి 2007.