Jump to content

ఆర్. శంకర్ (రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
ఆర్. శంకర్

ఉద్యానవన & పట్టు పురుగుల పెంపక శాఖ మంత్రి [1]
పదవీ కాలం
2021 జనవరి 21 – 2021 జూలై 26
ముందు కె.సి. నారాయణ గౌడ

పదవీ కాలం
17 May 2018 – July 2019
నియోజకవర్గం రాణిబెన్నూరు

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
(2023–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
(2019-2023) కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ
(2019 వరకు)
వృత్తి రాజకీయ నాయకుడు

రామచంద్రప్ప శంకర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో రాణిబెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆర్. శంకర్ స్వతంత్ర అభ్యర్థిగా ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 శాసనసభ ఎన్నికలలో రాణిబెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కె.బి. కోలివాడ్ చేతిలో 6788 ఓట్ల తేడాతో ఓడిపోయి అనంతరం కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీలో చేరి 2018 శాసనసభ ఎన్నికలలో కెపిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కె.బి. కోలివాడ్ పై 4,338 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన ఆ తరువాత కెపిజెపిని కాంగ్రెస్ లో విలీనం చేసి కుమారస్వామి మంత్రివర్గంలో 2019 జూన్ 14 నుండి 2019 జూలై 8 వరకు పర్యావరణ & అటవీ శాఖ మంత్రిగా పని చేసి,[5] ఆ తరువాత యడ్యూరప్ప మంత్రివర్గంలో 2021 జనవరి 21 నుండి 2021 జూలై 28 వరకు ఉద్యానవన & పట్టు పురుగుల పెంపక శాఖ మంత్రిగా పని చేశాడు. సంకీర్ణ ప్రభుత్వం పతనానికి దారితీసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ఉండటంతో కాంగ్రెస్ పిటిషన్ పై ఆయనను అనర్హుడిగా ప్రకటించారు.

ఆర్. శంకర్ పై అనర్హత వేటు పడిన అనంతరం ఆయన బిజెపిలో చేరాడు.[6] కానీ డిసెంబర్ 2019 ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వలేదు. ఆ తరువాత ఆయనను ఎమ్మెల్యే కోటా నుండి 2020 జులై 1న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[7]

ఆర్. శంకర్ 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ ఆశించగా టికెట్ దక్కకపోవడంతో ఆయన శాసనమండలికి రాజీనామా చేశాడు.[8] ఆయన ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్‌సీపీ నుండి పోటీ చేసి 37,559 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు.[9]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Munirathna – Minister of Horticulture & Sericulture". Delhivaarthe (in అమెరికన్ ఇంగ్లీష్). 6 March 2020. Archived from the original on 2021-10-24. Retrieved 2021-10-12.
  2. ↑ "MLA Shankar's happy ending: Flip to BJP, flop to Congress-JDS, become Karnataka minister" (in ఇంగ్లీష్). India Today. 6 June 2018. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.
  3. ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. ↑ "When caste equations come into play, disqualified MLA gets ignored" (in Indian English). The Hindu. 21 November 2019. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.
  5. ↑ "Karnataka crisis: 'Pendulum' Shankar resigns as Minister, govt on brink of collapse" (in ఇంగ్లీష్). The News Minute. 8 July 2019. Retrieved 28 April 2025.
  6. ↑ "K'taka: 16 of 17 disqualified Congress and JD(S) MLAs join BJP" (in ఇంగ్లీష్). ETV Bharat News. 14 November 2019. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.
  7. ↑ "Karnataka BJP Rewards Former Rebel MLAs With Legislative Council Tickets" (in ఇంగ్లీష్). NDTV. 18 June 2020. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.
  8. ↑ "Denied Ticket, BJP MLC Resigns From Karnataka Council" (in ఇంగ్లీష్). NDTV. 12 April 2024. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.
  9. ↑ "Karnataka Assembly Elections 2023: Ranibennur". Election Commission of India. 13 May 2023. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.