ఆర్. సుగతన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్. సుగతన్
ఆర్. సుగతన్


ట్రావెన్కోర్-కొచ్చిన్ అసెంబ్లీ సభ్యుడు
పదవీ కాలం
1952 – 1954
నియోజకవర్గం అల్లెప్పేయ్
పదవీ కాలం
1954 – 1956
నియోజకవర్గం మరారికులం

కేరళ శాసనసభ
పదవీ కాలం
1957 – 1959
పదవీ కాలం
1960 – 1964
నియోజకవర్గం కార్తీకపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం 1901
కేరళ
మరణం 14 ఫిబ్రవరి 1970
కేరళ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ
వృత్తి స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్ట్ నాయకుడు, ట్రేడ్ యూనియన్ నాయకుడు.

ఆర్. సుగతన్, (23 డిసెంబరు 1901 - 14 ఫిబ్రవరి 1970), కేరళ రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్ట్ నాయకుడు, కేరళ ప్రారంభ ట్రేడ్ యూనియన్ నాయకుడు.[1] 1952లో ట్రావెన్కోర్-కొచ్చిన్ అసెంబ్లీకి (అల్లెప్పేయ్), 1954లో మరారికులం 1957లో కార్తీకపల్లిల నుండి సిపిఐ సభ్యుడిగా గెలుపొందాడు. సుగాథాన్‌సిర్‌గా పేరొందాడు.

జననం, విద్య

[మార్చు]

సుగతన్ 1901 డిసెంబరు 23న కేరళలో జన్మించాడు. మలయాళ మిడిల్ స్కూలులో ఉత్తీర్ణత సాధించిన తరువాత, బౌద్ధ సిద్ధాంతం ప్రభావంతో తన పేరును ఆర్. సుగతన్ గా మార్చుకున్నాడు.

కెరీర్

[మార్చు]

బ్రదర్‌హుడ్ మూవ్‌మెంట్ లో చురుకుగా పాల్గొన్నాడు. తరువాత ఒక ప్రైవేట్ పాఠశాలలో తన టీచింగ్ ఉద్యోగాన్ని వదిలి ఎస్.ఎన్.డి.పి. యోగంలో చేరాడు. ఈజవ పొలిటికల్ లీగ్, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిలోకి వచ్చినప్పుడు అందులో భాగమయ్యాడు. 1938లో కాయిర్ ఫ్యాక్టరీ కార్మికులను యూనియన్‌గా ఏర్పాటు చేశాడు. ఆందోళన చేసినందుకు అరెస్టు చేయబడి, రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవించాడు.

ట్రావెన్‌కోర్ లేబర్ అసోసియేషన్‌తో పాల్గొని, చివరకు కాంగ్రెస్‌ను విడిచిపెట్టి, 1942లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. ఆ తరువాత కూడా రెండుసార్లు జైలు శిక్ష అనుభవించాడు.[2]

మరణం

[మార్చు]

సుగతన్ 1970, ఫిబ్రవరి 14న మరణించాడు.

గుర్తింపు

[మార్చు]

2008లో సుగతన్ వర్ధంతిరోజు ఫిబ్రవరి 14న తిరువనంతపురంలో జరిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశంలో ప్లాగ్ డేగా జరుపబడింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "R. Sugathan". veethi.com. Retrieved 2021-09-26.
  2. Sadasivan, S. N. (2000). A Social History of India. APH Publishing. p. 668. ISBN 81-7648-170-X.
  3. "CPI to mark 'flag day'". The Hindu. 12 February 2008. Archived from the original on 2 March 2008.

ఇతర మూలాలు

[మార్చు]
  • అమర వీరులు: కమ్యూనిస్ట్ నాయకుల జీవితాలు, భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా. పబ్. భారత కమ్యూనిస్ట్ పార్టీ, 1975. p. 156 .
  • సఖవు ఆర్. సుగాథన్ (కామ్రేడ్ ఆర్. సుగాథన్) రాఘవన్ పుతుపల్లి ద్వారా. కొట్టాయం: కరెంట్ బుక్స్, 1999.

బయటి లింకులు

[మార్చు]