ఆర్ జె హాంస్-గిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్.జె.హాన్స్-గిల్
ఆర్.జె.హాన్స్-గిల్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

ఆర్ జె హాంస్-గిల్ 1943 పంజాబు రాష్ట్రంలోని మోహీ (లూధియానా) లో జన్మించింది. ఆమె తండ్రి గర్షర్ సింఘ్ హాంస్. ఆమె తండ్రి గ్రమీణ ప్రాంతాలలో పనిచేయడానికి నియమించబడిన డాక్టర్. అందువలన ఆమె లూధియానా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో బాల్యాన్ని గడిపింది. ఆమె తల్లి గురుదీప్ కౌర్ గృహిణి. ఆమె వివాహం కరస్పాండెంస్ ద్వారా తరువాత చదువును కొనసాగించింది. ఆమె తండ్రికి తరచుగా బదిలీ కావడం స్థిరంగా ఒక ప్రదేశంలో ఉండలేకపోవడం ఆమెకు కొంత అసౌకర్యం కలిగిస్తూ ఉండేది. అయినప్పటికీ వారు తరచుగా మంచిమంచి ప్రదేశాలకే తరలివెళుతూ ఉండేవారు.

స్కూల్

[మార్చు]

సాధారణంగా గ్రామాలలో ఆడపిల్లలకు విద్యావసతులు తక్కువగానే ఉండేవి. గ్రామాలలో ఆడపిల్లలకు ప్రత్యేక పాఠశాలలు ఉండేవి కాదు. అలాగే మగపిల్లలు చదువుకునే పాఠశాలలలో ఆదపిల్లలు చదవడానికి అనుమతి లభించేది కాదు. అందువలన ఆమె ఆరంభవిద్య ఇంటివద్దనే సాగింది. ఆమె తల్లితండ్రులు చదువుకొనడానికి ప్రోత్సాహం చదవడానికి సహకరిస్తూ ఉండేవారు. తరువాత ఆమె తండ్రికి హెడ్‌మాస్టరుతో ఉన్న పరిచయం కారణంగా ఆమెకు పాఠశాలలో చదువుకోవడానికి అవకాశం లభించింది. ఆమె ఆకాలంలో సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు చూసి ఆశ్చర్యపడింది. హాస్పిటల్ సిబ్బంది ఆమె తండ్రితో ఈ విషయమై చర్చించే సమయంలో విని ఈ విషయాలు ఆకళింపు చేసుకుంది. స్త్రీలకు చదువు అందుబాటులో ఎందుకు లేదు ? స్త్రీలకు ఉద్యోగాలు ఎందుకు లేవు ? స్త్రీలు జీవితమంతా పక్షపాతదృష్టితో ఎందుకు చూడబడుతున్నారు ? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ గంటల సమయం వెచ్చిస్తూ నూతన ప్రపంచం కొరకు కలలు కంటూ ఉండేది. ఆమె కలల ప్రపంచంలో స్త్రీపురుష సమాసమాజం విస్తరించి కనిపించేది. ఆమె చిన్నవయసులోనే తన తండ్రిలా డాక్టర్ కావాలని అనుకునేది.

ఇస్రూ పాఠశాల

[మార్చు]

ఆర్ జె హాంస్-గిల్‌కు 6 సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె తండ్రికి ఇస్రూకు బదిలీ అయింది. ఈ గ్రామంలో ఆడపిల్లలకు చదువుకునే అవకాశం కల్పించింది. ఒకపెద్ద గది, దానిని అనుకుని ఉన్న కొంత ఖాళీ ప్రదేశంలో పాఠశాల నడుపబడుతూ ఉండేది. చిన్న తరహా పరీక్ష తరువాత ఆమెకు పాఠశాల ప్రవేశం లభించింది. అన్ని తరగతులను ఒకే టీచర్ నిర్వహిస్తూ ఉండేది. అందువలన చాలా కొంచెం విద్య మాత్రమే నేర్పించబడేది. ఆమె సహ విద్యార్థులు ఆమె కంటే వయసులో పెద్ద వారుగా ఉండేవారు. ఆమెకు పాఠశాల వాతావరణం అయిష్టతను కలుగజేసింది. అయినా వేరే మార్గం లేక చదువు కొనసాగించవలసిన పరిస్థితి కొనసాగింది. అయినప్పటికీ ఒక సంవత్సర కాలం ఆమె ఇంటివద్దనే పంజాబీ, ఆర్ధమెటిక్స్, ఆంగ్లం అభ్యసించింది. ఆమె అంకుల్ నర్షర్ సింఘ్ అయిష్టతతోనే వారి ఇంట ఉంటూ బాలల పాఠశాలలో చదవడానికి అనుమతించాడు. అయినప్పటికీ ఆ పాఠశాలకు ఆమె బాలునిలా దుస్తులు ధరించి వెళ్ళేది. అది వారి కుటుంబం, హెడ్మాస్టర్ మద్య రహస్యంగా ఉండేది. ఆమె అంకుల్‌కు ఆడపిల్లల చదువుకోవడం పూర్తిగా వ్యతిరేకించేవాడు. అయినప్పటికీ ఆర్ జె హాంస్-గిల్ తండ్రి పలుమార్లు అభ్యర్థించడం వలన అంగీకరించాడు. ఆమెకు తలకు టర్బన్ ధరించి తన సోదరునితో కలిసి పాఠశాలకు పోవడం ఉద్వేగభరితమైన ఆనందం కలిగించింది.

గుజ్జర్‌వాల్

[మార్చు]

1953లో ఆర్ జె హాంస్-గిల్ తండ్రికి గుజ్జర్‌వాల్‌కు బదిలీ అయిన తరువాత క్రమబద్ధమైన పాఠశాల చదువు కొనసాగింది. ఆ గ్రామంలో ఆడపిల్లలకు ప్రత్యేక పాఠశాల ఉండేది. ఆమెకు అక్కడ ఎనిమిదవ తరగతిలో ప్రవేశం లభించింది. బాలల పాఠశాలలో అధిక వసతులు ఉన్నాయని బాలికల పాఠశాలలో వసతులు తక్కూగా ఉన్నాయని అది చాలా అన్యాయమని ఆమె భావించింది. దురదృష్టకరంగా ఆమె చదువుకున్న పాఠశాలలో సైన్సు, మాథమెటిక్స్ బోధించబడలేదు. ఇంటివద్ద చదువుకున్నప్పటికీ ఆమెకు యూనివర్శిటీ పరీక్షలకు హాజరుకాలేక పోయింది. ప్రయోగాలు చేయడానికి కావలసిన లాబరేటరీలు అందాటులో లేకపోవడమే అందుకు కారణం. ఆమె కలగన్నట్లు డాక్టర్ కావడానికి ద్వారాలు మూసుకుపోయినా మాథమెటిక్స్ చదవడానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ఆమెకు గణితం ఇష్టమైనది కనుక ఆమె అందులో కొనసాగడానికి విచారించలేదు. ఆమె విద్యకు ఆమెతల్లి తండ్రులు, అన్నదమ్ములు భూపేదర్ సింఘ్‌లు సంపూర్ణ సహకారం అందించారు. ఆమెకు విద్య పట్ల ఉన్న ఆరాధన గ్రహించి ఆమె తాత ఆమెను విద్య అనిపిలిచేవాడు. ఆమె తల్లితండ్రుల స్థిరమైన ప్రయత్నం కారణంగా మంచి కాలేజీలో చదువుకోవడానికి అవకాశం లభించింది. లూధియానా, " గవర్నమెంట్ వుమన్ కాలేజ్ " నుండి ఆమె మాథమెట్క్స్ ఆనర్స్ పట్టాపుచ్చుకున్నది.

రీసెర్చ్

[మార్చు]

ఆర్ జె హాంస్-గిల్ ఎం.ఎ మాథమెటిక్స్ చదవడానికి లూథియానా గవర్నమెంట్ కాలేజిలో చేరుంది. అక్కడ టీచర్లందరూ పురుషులే. కొంతమందికి మాథమెటిక్స్ చదవడానికి స్త్రీలు తగరన్న అభిప్రాయం స్థిరంగా ఉండేది. ఆమె ఆ అభిప్రాయాన్ని సవాలుగా తీసుకుంది వారి అభిప్రాయం తప్పని ౠజువు చేయాలని నిశ్చయించుకుంది. కాలేజ్ వైస్ ప్రింసిపల్ కె.ఆర్ చౌదరి ఆమెకు ప్రోత్సాహం అందించి సహకరించాడు. ఆ ప్రోత్సాహంతో మొదటి సంవత్సరం ఫలితాలలో 98% సాధించింది. కె.ఆర్ చౌదరి ఆమెను సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరవమని సలహా ఇచ్చాడు. అయినప్పటికీ ఆమెను మాథమెటిక్స్ అధ్యయనం చేయాలన్న కోరిక విడువలేదు. తరువాత ఆమె ప్రొఫెసర్ ఆర్.పి బాంబాహ్‌ను కలుసుకున్నప్పుడు ఆయన ఆమెను పరిశోధన చేయమని సలహా ఇచాడు. 1962 ఆగస్టులో ఆమె రీసెర్చ్ ఫెలోగా " డిపార్ట్‌మెంటాఫ్ మేథమెటిక్స్"లో చేరింది. డిపార్ట్‌మెంట్ చేపట్టిన కార్యక్రమాలలో బేసిక్ కోర్సెస్ , రీసెర్చ్ సమావేశాలు ప్రధానమైనవి. మొదటి కొన్ని మాసాలు చాలా కఠినంగా గడిచాయి. సంవత్సరాంతర ఫలితాలు కొంత మెరుగనిపించాయి. తరువాత ఆమె రెండు పేపర్లు సమర్పించి " నరసింగరావు గోల్డ్ మెడల్ " అందుకున్నది. ఆమె ఆర్ట్కల్స్ " జర్నలాఫ్ ఇండియన్ మాథమెటిక్స్ సొసైటీ "లో ప్రచురినబడ్డాయి. అదే సమయం ప్రొఫెసర్. బాంబాహ్ కొలంబస్ లో ఉన్న " ఒహియో స్టేట్ యూనివర్శిటీ "కి వెళుతూ ఆయన రీసెర్చ్ విద్యార్ధులందరికీ ఫెలో షిప్ ఏర్పాటు చేసాడు. ఆమె తల్లితండ్రులు ఆమె యు.ఎస్ పోవడానికి ప్రోత్సాహం అందించారు. అయినప్పటికీ కొంతమంది స్నేహితులు వెళ్ళవద్దని సలహా ఇచ్చారు. అవి ఏవీ లక్ష్యపెట్టక ధైర్యంగా ముందుకు పోయి అనుకున్న సమయం కంటే ముందుగా కోర్సులన్నీ " ఎ" గ్రేడులో పూర్తిచేసి 1965లో పిహె.డి పట్టం అందుకున్నది. ఒ.ఎస్.యు నుండి అప్పటివరకు పి.హెచ్.డి పూర్యిచేసినవారిలో ఆమె పన్నవయస్కురాలిగా గుర్తింపు పొందింది.

భారతదేశం తిరిగి రాక

[మార్చు]

ఆర్ జె హాంస్-గిల్ ఒ.ఎస్.యు, " యూనివర్శిటీ ఆఫ్ విస్‌కాన్‌సిన్ "లో కొంతకాలం టీచింగ్ బాధ్యతలు చేపట్టిన తరువాత భారతదేశం తిరిగిరావాలని నిర్ణయించుకుంది. అమెరికాలో జీవితం చాలా సౌకర్యవనంతంగా ఉన్నాప్పటికీ, పలు అవకాశాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆమె భారతదేశానికి తిరిగిరావడానికే ప్రాధాన్యత ఇచ్చింది.

వివాహం

[మార్చు]

1968లో ఆమె జగజిత్ సింఘ్‌ను వివాహం చేసుకుంది. ఆయన ఢిల్లీలో " ఐ.ఎ.ఆర్.ఐ " గా పనిచేస్తూ ఉండేవాడు. భార్యాభర్తలు ఇరువురికి ఒకే ప్రదేశంలో ఉద్యోగాలు రాకపోవడం వారికి ప్రధాన సమస్యగా మారింది. అయినప్పటికీ వారు వారి కేరీర్ నిర్మాణంలో స్థిరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే వారికి రామ్నీక్ , హర్దీపక్ జన్మించారు. కుమారులను పెంచడానికి ఆమెకు తాల్లితండ్రులు , అత్తమామలు సహకారం అందించారు. పిల్లల పెంపకానికి పెద్దల సహకారం మానిసింకంగా , భౌతికంగా అవసరమని అది ఎంతో అవసరమైనదని ఆమె భావించింది.

ఉద్యోగం

[మార్చు]

ఆర్ జె హాంస్-గిల్ పనిచేస్తున్న కాలేజీలో వారి డిపార్ట్మెంటులో పలు సంవత్సరాల వరకు ఆమె ఒక్కటే మహిళా ఉపాధ్యాయురాలుగా ఉంటూవచ్చింది. ఆమె అత్యుత్తమంగా పనిచేసి ఆడవారి టీచింగ్ తక్కువకాదని నిరూపించింది. ఆమె సహాఉద్యోగులు ఆమెకు ఎంతో సహకరించారు. ఆమె లాబరేటరీలో ఆర్.పి. బాబాహ్, వి.సి. డూమర్, పి.యులోమధు రకా , ఒ.సి.యు.లో ఎ.సి. వుడ్స్ కలిసి పనిచేసింది. మూడు ప్రధాన " సైన్సు అకాడమీస్ ఆఫ్ ఇండియా " ఆమె ఎలెక్టెడ్ ఫెలోగా పనిచేసింది. అలాగే " టి.డబ్ల్యూ.ఎ.ఎస్. ఫెలోగా ఉంది. మాథమెటిక్స్ చాలా మందిని భయపెడతాయి. మహిళా మాథమెటీషియన్‌ను కలుసుకున్నప్పుడు పలువురు ఆశ్చర్యచకితులౌతారు. అందరూ తాము పాఠశాలలో మాథమెటిక్స్ అంటే ఎంత భయపడ్డారో వ్రాస్తూ ఉంటారు. ఆమె పిల్లలకు కూడా మాథమెటిక్స్ అంటే భయం ఏర్పడడం ఆమె గ్రహించింది. పరిస్థితులు ఆమెను మాథమెటీషియన్‌ను చేసాయి. ఆమెకు అద్భుతమైన కొలాబరేటర్లు, తెలివైన ఉద్యోగులూ, పంజాబు యూనివర్శిటీలో మనఃపూర్వకంగా పనిచేయడానికి అవసరమైన వాతావరణం లభించాయని ఆమె తెలిపింది. ఆమెకు పూర్తి సహకారం అందించే కుటుంబం లభించడం ఆమె ఎదుగుదలకు సహకరించింది. అతిక్లిష్టమైనవని భావించే మాథమెటికల్ సమసూల గురించి చర్చించడంలో ఆమె వర్ణించరాని ఆనందం అనుభవించింది.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.