ఆలపాటి ధర్మారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలపాటి ధర్మారావు
ఆలపాటి ధర్మారావు
జననం1933
అన్నవరపు లంక
మరణం2003
ఇతర పేర్లుఆలపాటి ధర్మారావు
వృత్తిరాష్ట్ర మంత్రి.
1985 :దుగ్గిరాల శాసన సభ్యులు
1989:వేమూరు శాసన సభ్యులు
శాసనసభ ఉప సభాపతి
న్యాయ, ఉన్నతవిద్య,రవాణా,హోం మంత్రి
ప్రసిద్ధిప్రముఖ న్యాయవాది,
రాజకీయ నాయకుడు
భార్య / భర్తనిర్మలానంద కుమారి
తండ్రిఆలపాటి వెంకయ్య
తల్లిశేషమ్మ

ఆలపాటి ధర్మారావు (1933 - 2003) ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు, రాష్ట్ర మంత్రి..

వీరు అన్నవరపు లంకలో ఆలపాటి వెంకయ్య, శేషమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో పట్టభద్రులై ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.

వీరు దుగ్గిరాల శాసనసభ నియోజకవర్గం నుండి 1985 లో మొదటిసారి ఎన్నికయ్యారు. 1989లో వేమూరు నియోజకవర్గం నుండి భారతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. శాసనసభ ఉప సభాపతిగా రవాణా, న్యాయ, ఉన్నతవిద్య, హోం శాఖల మంత్రిగా పదవుల్ని నిర్వహించారు. వీరు నన్నపనేని వెంకట్రావు గారిని తన రాజకీయ గురువుగా భావించారు.[1][2]

వీరు నిర్మలానంద కుమారిని వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు.

వీరు 2003 సంవత్సరంలో పరమపదించారు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (26 March 2019). "అమాత్య... అన్న పిలుపేదీ?". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
  2. Sakshi (2019). "Vemuru Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.