ఆలమ్నీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమెరికా హెరిటేజ్ డిక్షనరీ ప్రకారం ఆలమ్నస్ (బహువచనం ఆలమ్నీ అంటే "గ్రాడుయేట్ (JC), లేదా స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ మాజీ విద్యార్థి".[1] అంతే కాదు, అలామ్నా (బహువచనం ఆలమ్నీ ) అంటే "గ్రాడ్యుయేట్ విద్యార్థిని, లేదా స్కూలు, కాలేజ్, యూనివర్సిటీ మాజీ విద్యార్థిని".[2] ఒకవేళ సమూహంలో ఆడా, మగా కలిసి ఉంటే, అందులో ఒకే పురుషుడున్నా ఆలమ్నీ అనే బహువచనాన్నే వాడతారు.

శబ్ద ఉత్పత్తి శాస్త్రం[మార్చు]

లాటిన్ నామవాచకం ఆలమ్నస్ అంటే 'పెంపుడు కొడుకు, విద్యార్థి' అని అర్థం.'పెంచడం' అనే అర్థాన్నిచ్చే అలేరే అనే క్రియ నుంచి అలామ్నాస్ వచ్చింది.[3]

వాడకం[మార్చు]

ఆలమ్నస్, ఆలమ్నా అంటే సంబంధిత విద్యా సంస్థ (పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం) మాజీ విద్యార్థి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గ్రాద్యుయేట్.[1][2] యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వచనం ప్రకారం ఆలమ్నీ పదాన్ని మహిళా కళాశాలల[4] తో గానీ, విద్యార్థినుల సమూహంతో గానీ కలిపి వాడతారు. ఇక ఆలమ్నీ పదాన్ని పురుషుల కళాశాలతో గానీ, విద్యార్థుల సమూహంతో గానీ, మిశ్రమ సమూహంతో గానీ కలిపి వాడతారు.

రొమాన్సు భాషల నామవాచకాల వ్యాకరణ నియమ నిబంధనల ప్రకారం స్త్రీ పురుషుల కలయికతో కూడిన సమూహాలకు కూడా పురుష బహువచనమైన ఆలమ్నీనే వాడతారు.(ఉదాహరణకు ది అలామ్నీ ఆఫ్ టెక్సాస్ టెక్ యూనివర్సిటీ ). కొన్నిసార్లు మాత్రం లింగపరమైన అయోమయాన్ని తొలగించేందుకు ఇలాంటి మిశ్రమ సమూహాలకు రెండు లింగాల బహువచనాలనూ వాడతారు. (ఉదాహరణకు ది ఆలమ్నీ\ఆలమ్నే ఆఫ్ టెక్సాస్ యూనివర్సిటీ). కో ఎడ్యుకేషన్ కళాశాలలు మహిళా, పురుష గ్రాద్యుఏట్లందరికీ సాధారనంగా ఆలమ్నీ పదాన్నే వాడతాయి. కొన్ని మాత్రం 'ఆలమ్నీ అండ్ ఆలమ్నే' అనే పదబంధాన్ని గానీ, ఆలమ్నే\ఈ అని గానీ వాడేందుకు ఇష్టపడతాయి. ముఖ్యంగా పురుష విద్యార్థులను కూడా చేర్చుకోవడం మొదలు పెట్టిన పలు మహిళా కళాశాలలు వేటిని విరివిగా వాడుతున్నాయి.[5]

కొన్నిసార్లు ఈ పదాన్ని 'అలం' అని పొట్టిగా కూడా పిలుస్తారు.'ఆలమ్నా, లేదా ఆలమ్నాస్' అని దానికి అర్థం.[6]

ఆలమ్నీ (బహువచన రూపం)ని తరచూ స్త్రీ పురుష లింగాలు రెండింటిలొనూ పొరపాటుగా ఏకవచనానికి వాడుతుంటారు. ఉదాహరణకు "అయాం ఆన్ ఆలమ్నీ ఆఫ్ డ్యూక్ యూనివర్సిటీ". కానీ "అయాం ఆన్ ఆలమ్నాస్\ఆలమ్నా ఆఫ్ డ్యూక్ యూనివర్సిటీ" అనేది సరైన రూపం. అధికారిక, చారిత్రిక వాడకంలో ఇలా వాడటాన్ని తప్పుగా పరిగనిస్తారు. లాటిన్ వ్యాకరణం పట్ల అవగాహన లేమితో పాటు యూనివర్సిటీ ముద్రిత డాక్యుమెంట్లలో దాదాపుగా నిత్యం ఈ పదాన్ని బహువచన రూపంతోనే వాడటం ఈ పొరపాటుకు ప్రధాన కారణాలు.

చాలా సంస్థల్లో ఆలమ్నీ కలయికలు బాగా వేడుకగా జరుగుతాయి. సాధారనంగా ఆలమ్నీ అసోసియేషన్లు నిర్వహించే ఈ వేడుకలు నిధుల సమీకరణకు వేదికలుగా మారుతుంటాయి.

సంబంధిత పదాలు[మార్చు]

యూకే స్వతంత్ర పాఠశాలలు, న్యూజిలాండ్ పాఠశాలలు, శ్రీలంక పాఠశాలలలో అత్యధికం, కొంతవరకు ఆస్ట్రేలియా, కెనడాలలో కూడా పాఠశాల మాజీ విద్యార్థులకు ఓల్డ్ బాయ్ , ఓల్డ్ గాళ్ అనే పదాలను వాడటం సంప్రదాయంగా వస్తోంది. ఇక విశ్వవిద్యాలయ మాజీ విద్యార్థులకు ఓల్డ్ మెంబర్ , లేదా మెంబర్ (న్యూజిలాండ్లో మాత్రం ఆలమ్నస్) పదాలు వాడతారు. కెనడాలోని రాయల్ మిలిటరీ కళాశాలలో ఫార్మర్ క్యాడెట్ , ఓల్డ్ బ్రిగేడ్ మెంబర్ అనే పదబంధాలను కళాశాల సభ్యులు అనే అర్థంలో వాడతారు. ఆలమ్నీకి మారుగా వర్జీనియా మిలిటరీ ఇన్స్టిట్యుట్లో వాడే ఓల్డ్ కార్ప్స్ అనే పదం మరో ఉదాహరణ. ఇలా కొన్ని పాఠశాలలకే పరిమితమయిన కారణంగా ఈ పదాన్ని సాధారనంగా UKలోని కులీన వర్గాలకు సూచికగా కుడా దీన్ని ప్రయోగిస్తారు.

మరికొన్ని స్కూళ్ళు తమ స్కూల్ పేరుతొ కలిసిన పదాలను కూడా వాడతాయి. ఉదాహరణకు "ఓల్డ్ ఎతోనియన్", "ఓల్డ్ చర్చేరియన్", "ఓల్డ్ నాక్స్ గ్రమరేరియన్", "ఓల్డ్ రేప్తోనియన్", (అంటే ఎతోన్ కాలేజ్, చర్చర్స్ కాలేజ్, నాక్స్ గ్రామర్ స్కూల్, రెప్టన్ స్కూల్ పాత విద్యార్తులని అర్థం); లేదంటే ది సిటీ అఫ్ లండన్ స్కూల్ "ఓల్డ్ సిటిజెన్" అని, డౌన్సైడ్ స్కూల్ కు "ఓల్డ్ గ్రెగోరియన్" అని సంబంధం లేని పదబందాలనూ వాడుతుంటారు. UKకు సంబంధించిన మరి కొన్ని ఉదాహరనలుగా "ఓల్డ్ బ్లూ" (క్రిస్ట్ హాస్పిటల్), "ఓల్డ్ దునుమియన్" (డవున్ ఉన్నత పాఠశాల), "ఓల్డ్ నోవోకస్త్రియన్" (రాయల్ గ్రామర్ స్కూల్, న్యూ క్యాజిల్ అపాన్ టైం), "ఓల్డ్ మిడ్" (ట్రినిటీ స్కూల్ ఆఫ్ జాన్ విత్గిఫ్ట్)లను చెప్పుకోవచ్చు.

స్కాట్లాండ్ లో ఫార్మర్ ప్యూపీల్ (ఎఫ్ఫ్పీ) అనే పదాన్ని కుడా వాడతారు. ప్రత్యేకించి ఆయా పారశాలల క్రీడా జట్లను ప్రస్తావించినప్పుడు వీటిని తరచూ వాడుతుంటారు. టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ వంటి కొన్ని యూఎస్ పాఠశాలలు అయితే ఫార్మర్ స్టూడెంట్ అనే పదాన్నే ఇష్టపడతాయి.

ది వరల్డ్ స్టూడెంట్స్ క్రిస్టియన్ ఫెడరేషన్ తన ఆలమ్నీకి "సీనియర్ ఫ్రెండ్స్" అనే పదం వాడుతుంది.

ఫుట్ నోట్స్[మార్చు]

  1. 1.0 1.1 అలామ్నాస్ది అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, నాలుగవ కూర్పు. Archived 2009-01-24 at the Wayback Machine.2000. Archived 2009-01-24 at the Wayback Machine. ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "bartleby-alumnus" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. 2.0 2.1 అలామ్నాది అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, నాలుగవ కూర్పు. Archived 2009-01-24 at the Wayback Machine.2000. Archived 2009-01-24 at the Wayback Machine.
  3. మెరియం వెబ్స్టర్ అలామ్నాస్
  4. ఆర్కైవ్ద్ విమెన్స్ కాలేజెస్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ హిస్టరీ, ఇషుస్, అండ్ చాలేన్జేస్
  5. ఆలామ్నీ - డిఫినిషన్స్ ఫ్రం డిక్షనరీ డాట్కాం
  6. అలూం డిక్షనరీ డాట్కాం అన్ అబ్రిడిద్జేడ్ బేస్డ్ ఆన్ రాండం హౌస్ అబ్రిడిద్జేడ్ డిక్షనరీ డిసెంబరు 15, 2002 డిక్షనరీ డాట్కాం

ఎగ్జాంపుల్: ఆన్ అలామ్నీ అసోసియేషన్ ఆఫ్ టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కొల్లం, ఇండియా.

"https://te.wikipedia.org/w/index.php?title=ఆలమ్నీ&oldid=2797617" నుండి వెలికితీశారు