ఆలా గోపాలస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆలా గోపాలస్వామి ప్రముఖ రంగస్థల నటులు.

జననం[మార్చు]

గోపాలస్వామి 1940లో చక్రాయపాలెం లో జన్మించారు.

జీవిత విశేషాలు[మార్చు]

కన్నెగంటి రాధ దగ్గర కళారంగంలో శిక్షణ తీసుకున్నారు. గోపాలస్వామిపై కమ్యూనిష్టు పార్టీ నాయకులు, రచయిత బొల్లిముంత శివరామకృష్ణగారి ప్రభావం ఎక్కువగా ఉండేది. కమ్యూనిష్టు పార్టీ రెండుగా చీలకముందు ప్రజలను చైతన్యవంతులను చేయాలన్న ఆశయంతో గోపాలస్వామి ఊరురా తిరుగుతూ, బుర్రకథలు చెప్పడం, పాటలు పాడడం, నాటకాల్లో నటించడం చేసేవారు.

నటించిన నాటకాలు - పాత్రలు[మార్చు]

 • పల్లెపడుచు - సూరయ్య
 • పెత్తందారు - బసవయ్య
 • వెంకన్న కాపురం - వెంకన్న పంతులు
 • భయం - కాషియర్
 • ముట్టడి - వీరయ్య
 • విశ్వనాథవిజయం - అప్పాజీ
 • పాదుకా పట్టాభిషేకం - మందర

వాటితోపాటు నవయుగం, పేదపడుచు, అన్నాచెల్లెలు, కులంలేని పిల్ల, సీతారామరాజ, చాణక్యశపధం, మహావీర పురుషోత్తం, హరిశ్చంద్ర, చింతామణి, బాలనాగమ్మ మొదలగు పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక నాటకాలలో నటించారు.

నటించిన ధారావాహికలు[మార్చు]

 • శిలువ విజయం
 • లాటరీ
 • అమ్మకానికో అబ్బాయి
 • నాకీ పెల్లోద్దు బాబో
 • పెళ్లికానుక

వంటి దూరదర్శన్ ధారావాహికలో నటించారు.

నటించిన సినిమాలు[మార్చు]

 • యమగోల
 • ప్రజారాజ్యం
 • కరుణామయుడు
 • హిమ్మత్ వాలా
 • ముఠామేస్త్రి

నాలుగు దశాబ్దాలుగా నాటకరంగంలో కృషిచేస్తున్న గోపాలస్వామి కేంద్రప్రభుత్వ సాంగ్ అండ్ డ్రామా డివిజన్ వారి ఇందిరమ్మ రూపవాణి రూపకంలో, రాష్ట ప్రభుత్వం వారు నిర్వహించిన సారా నిషేధ కార్యక్రమాలలోనూ, అక్షరదీప్తి కార్యక్రమాలలోనూ పాల్గొన్నారు. అక్షర దీప్తి కళాజాతలో దర్శకత్వం వహించారు. 1986 నుండి రేడియో ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు.

మూలాలు[మార్చు]

 • ఆలా గోపాలస్వామి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 173.