ఆలూరు భుజంగరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆలూరు భుజంగ రావు (1928-జూన్ 20, 2013) విరసం సీనియర్‌ సభ్యుడు, రచయిత, అనువాదకుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన 1928లో గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర కొండముది గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి సీతారామమ్మ తండ్రి వెంకటప్పయ్య. ఆయన జీవితం ఎక్కువగా తెనాలి, గుడివాడలలో సాగింది. భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్, సుఖదేవ్, మరెంతమందో దేశభక్తులతో కలసి పనిచేసినటువంటి శ్రీ యశ్ పాల్ గారు రచించిన - అప్పటి సంగతులతో కూడిన స్వాతంత్ర్య పోరాట గాథ 'సింహావలోకన్'నూ, మరెంతో విమర్శనాత్మక విప్లవ సాహిత్యాన్నీ తెనిగించారు. గుడివాడకు చెందిన ఆలూరు భుజంగరావు రాహుల్ సాహిత్య సదనమును స్థాపించి, అనేక రాహుల్ సాంకృత్యాయన్ రచనలను తెనిగించారు. భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్, సుఖదేవ్ వంటి మరెంతమందో దేశభక్తులతో కలసి పనిచేసినటువంటి యశ్ పాల్ రచించిన - అప్పటి సంగతులతో కూడిన స్వాతంత్ర్య పోరాట గాథ 'సింహావలోకన్'నూ, మరెంతో విమర్శనాత్మక విప్లవ సాహిత్యాన్నీ తెనిగించారు. శ్రీ యశ్ పాల్ గారు రాసిన స్వతంత్ర పోరాటంలోని అనుభవాల సంపుటి. వీరు భగత్ సింగ్ అరెస్ట్ కాబడిన తరువాత, ఆజాద్ ను పోలీసులు పార్కులో కాల్చి చంపిన తరువాత, వీరు అరెస్ట్ అయ్యేంతవరకు హి.స.ప్ర.సకు అధ్యక్షులిగా పనిచేసారు.విడుదల అయ్యాక కూడా స్వతంత్ర భారతంలో రాజకీయల్లో ఉన్నారు. పోరాటంలో వీరి అనుభవాల, సిధ్ధాంతాల సంపుటే సింహావలోకన్.

వీరు గాంధీ వాదం - శవపరీక్ష అనే పుస్తకం కూడా రాశారు. ఇది కమ్యూనిస్టు కోణంలో ఇమడని గాంధేయవాదంపై విమర్శనాత్మక పుస్తకంఆయన పారదర్శి, పెద్దన్న, చక్రధర్‌, జనార్దన్‌ కలం పేర్లతో పలు రచనలు చేసారు.20 కి పైగా కథలు రాసారు. ఆయన కథలు అరణ్యపర్వం పేరిట కథా సంకలనంగా వచ్చాయి.కొండవాగు, ప్రజలు అజేయులు, నైనా, గమనాగమనం, దిక్కుమొక్కులేని జనం తదితర నవలలు రాసారు. సాహిత్యబాటసారి పేర శారద జీవిత చరిత్రను రాశారు.

రాహుల్ సాంకృత్యాయన్ ( విస్మృత యాత్రికుడు, ప్రక్పశ్చిమ దర్శనాలు, దర్శన్‌ దిగ్‌ దర్శన్‌, దివోదాసు, వైజ్ఞానిక గతితార్కిక భౌతిక వాదం ), ప్రేమ్‌ చంద్‌ ( రంగ భూమి, గబన్‌ ), కిషన్‌ చందర్‌ (వాయు గుండం, పరాజయం ) రచనలను, సరోజ్‌ దత్తా, యశ్‌ పాల్‌ రచనలను హిందీ నుంచి తెలుగు లోకి అనువదించారు.తెలుగు నుంచి హిందీ లోకి రాగో, అతడు, నేలతల్లి విముక్తి కోసం, బొగ్గు పొరల్లో, దండకారణ్య అమరవీరులు తదితర నవలలు, పుస్తకాలను అనువదించారు. 2006లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం[1] అందుకున్నారు.

ప్రభాత్‌ అనే హిందీ పత్రికను 6 సంవత్సరాలు నిర్వహించారు. జూన్ 20, 2013 న కన్ను మూశారు.

పురస్కారాలు[మార్చు]

  • 2006: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.

ఇతర లింకులు[మార్చు]