ఆలే మొహమ్మద్ ఇక్బాల్
| ఆలే మొహమ్మద్ ఇక్బాల్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2025 ఫిబ్రవరి 8 | |||
| ముందు | షోయబ్ ఇక్బాల్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | మాటియా మహల్ | ||
ఢిల్లీ డిప్యూటీ మేయర్ | |||
| పదవీ కాలం 2023 ఫిబ్రవరి 22 – 2024 నవంబర్ 14 | |||
| ముందు | స్థాపించబడిన స్థానం | ||
| తరువాత | రవీందర్ భరద్వాజ్ | ||
| నియోజకవర్గం | వార్డు నెం. 76 | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1990 మార్చి 14 ఢిల్లీ, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | రాష్ట్రీయ లోక్‌దళ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఆలే మొహమ్మద్ ఇక్బాల్ (జననం 14 మార్చి 1990) ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో మాటియా మహల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]ఆలే మొహమ్మద్ ఇక్బాల్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 2012లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తుర్క్‌మాన్ గేట్ నుండి ఆర్ఎల్డీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికైన అతి పిన్న వయస్కుడైన కౌన్సిలర్‌గా రికార్డు సృష్టించాడు. ఆయన ఆ తరువాత సిటీ సదర్ పహార్గంజ్ జోన్ చైర్మన్‌గా పని చేశాడు. ఆలే మొహమ్మద్ ఇక్బాల్ 2017లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు 2వ సారి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు.
ఆలే మొహమ్మద్ ఇక్బాల్ తన తండ్రి ఆప్ ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ తో కలిసి 2020లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి 2022లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి 2023 ఫిబ్రవరి 22[3][4] నుండి 2024 నవంబర్ 14 వరకు ఢిల్లీ డిప్యూటీ మేయర్‌గా పని చేసి 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో మాటియా మహల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దీప్తి ఇండోరాపై 42,724 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 58,120 ఓట్లతో విజేతగా నిలవగా, దీప్తి ఇండోరా 79,289 ఓట్లుతో రెండోస్థానంలో నిలిచింది.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "In Delhi Assembly polls, AAP's Aaley Iqbal records highest margin — from Matia Mahal seat" (in ఇంగ్లీష్). The Indian Express. 9 February 2025. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.
- ↑ "Delhi Assembly Election Results 2025: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). The Indian Express. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
- ↑ "Aaley Mohd, Delhi's new deputy mayor, is first Muslim to hold post since 1977" (in ఇంగ్లీష్). The Indian Express. 22 February 2023. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.
- ↑ "AAP's Aaley Mohammad Iqbal becomes new deputy mayor of Delhi" (in ఇంగ్లీష్). India Today. 22 February 2023. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Matia Mahal". Election Commission of India. 8 February 2025. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.
- ↑ "Matia Mahal Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.