ఆల్బర్ట్ టంగోరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1922లో టంగోరా

ఆల్బర్ట్ టంగోరా (1903 జూలై 2 - 1978 ఏప్రిల్ 7) 1923 అక్టోబరు 22 న, మాన్యువల్ కీబోర్డు ఉన్న టైపు మిషనుపై ఒక గంట పాటు చేసిన టైపింగులో సగటున నిమిషానికి 147 పదాలు టైపు చేసి ప్రపంచ వేగ రికార్డును నెలకొల్పాడు. కొంత సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత, ఒక నిమిషం పాటు చేసిన "స్ప్రింట్"లో 159 పదాలను టైప్ చేశాడు. ఈ యంత్రం, క్వెర్టీ కీబోర్డ్‌తో ఉన్న అండర్‌వుడ్ స్టాండర్డ్. మాన్యువల్ టైప్‌రైటర్‌పై అతని రికార్డును ఎవరూ అందుకోలేదు.

వివిధ స్కోరింగ్ నియమాల కారణంగా న్యూయార్క్‌లో ఇంటర్నేషనల్ కమర్షియల్ స్కూల్స్ అసోసియేషన్ స్పాన్సర్ చేసిన తదుపరి టైపింగ్ పోటీలలో టంగోరా వేగం కొద్దిగా నెమ్మదించింది, అయితే అతను 1937లో రాయల్ టైప్‌రైటర్‌పై నిమిషానికి 141 పదాల రికార్డు సాధించాడు.[1] మొత్తం మీద అతను టైపింగు పోటీలో ఏడుసార్లు గెలిచాడు. చివరకు ఎలక్ట్రిక్ మెషీన్‌ని ఉపయోగించిన టైపిస్టు చేతిలో ఓడిపోయాడు.

టంగోరా, 1923 లో రికార్డు నెలకొల్పిన సమయంలో న్యూజెర్సీలోని ప్యాటర్సన్‌లో నివసించేవాడు. ఆ తరువాత 1937లో ఇల్లినాయిస్‌లోని ఇవాన్‌స్టన్‌కు మారాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • కీబోర్డ్‌

మూలాలు

[మార్చు]
  1. Blivens
  • "Big Crowd Drawn By Business Show," New York Times, October 23, 1923, page 5.
  • "Deaths Last Week" (includes Albert Tangora obituary), Chicago Tribune, April 16, 1978, page 47.
  • Bliven, Jr., Bruce (1954). The Wonderful Writing Machine. p. 128. Random House, New York