ఆల్బర్ట్ బియర్‌స్టాడ్
| ఆల్బర్ట్ బియర్‌స్టాడ్ | |
|---|---|
తన సోదరుడు ఎడ్వర్డ్ తీసిన ముందస్తు కలర్ ఫోటోగ్రాఫ్‌లో బియర్‌స్టాడ్, c. 1895 | |
| జననం | 1830 జనవరి 7 సోలింగెన్, రైన్ ప్రావిన్స్, ప్రష్యా |
| మరణం | 1902 ఫిబ్రవరి 18 (వయసు: 72) న్యూయార్క్ నగరం, అమెరికా |
| రంగం | చిత్రలేఖనం |
| శిక్షణ | డ్యూసెల్డార్ఫ్ స్కూల్ |
| ఉద్యమం | హడ్సన్ రివర్ స్కూల్ |
| చేసిన పనులు | కళాఖండాల జాబితా |
ఆల్బర్ట్ బియర్‌స్టాడ్ (1830 జనవరి 7 - 1902 ఫిబ్రవరి 18) ఒక జర్మన్-అమెరికన్ కళాకారుడు. అమెరికన్ పశ్చిమ ప్రాంతాన్ని కీర్తించే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ఇతను ప్రసిద్ధి చెందాడు.
బియర్‌స్టాడ్ జర్మనీలోని సోలింగెన్‌లో జన్మించాడు, రెండేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి మసాచుసెట్స్‌లోని న్యూ బెడ్‌ఫోర్డ్‌కు వలస వచ్చాడు. 1853లో బియర్‌స్టాడ్ డ్యూసెల్డార్ఫ్‌లో చిత్రలేఖనం అభ్యసించడానికి జర్మనీకి వెళ్ళాడు. తిరిగి వచ్చిన తరువాత న్యూయార్క్‌లోని హడ్సన్ రివర్ స్కూల్‌తో సంబంధం ఉన్న రెండవ తరం ల్యాండ్‌స్కేప్ కళాకారులలో ఒకడిగా మారాడు. 1859లో కొలరాడో, వ్యోమింగ్ ప్రాంతాలకు బియర్‌స్టాడ్ చేసిన ప్రయాణాలు ఇతని కళాత్మక దృష్టిని అమెరికన్ పశ్చిమ ప్రాంతం వైపు మళ్లించాయి. ప్రకృతి దృశ్యాలను నమోదు చేయడానికి భౌగోళిక, భూగర్భ సర్వేలలో చేరాడు. రాకీ పర్వతాలు, సియెర్రా నెవాడా, యోస్మైట్ వ్యాలీలకు సంబంధించి ఇతను వేసిన గొప్ప, నాటకీయ దృశ్యాలు ప్రశంసలు తెచ్చిపెట్టాయి, బియర్‌స్టాడ్ కు ఆర్థిక విజయాన్ని చేకూర్చాయి, అయితే అభిరుచులు, దృక్కోణాలు మారినప్పుడు విమర్శలను కూడా ఆకర్షించాయి.[1][2][3][4]
తొలి జీవితం, విద్య
[మార్చు]బియర్‌స్టాడ్ 1830 జనవరి 7న ప్రష్యాలోని రైన్ ప్రావిన్స్, సోలింగెన్‌లో జన్మించాడు. ఇతను క్రిస్టినా ఎమ్. (టిల్‌మాన్స్), హెన్రీ బీర్‌స్టాడ్ట్ (ఒక పీపాల తయారీదారు) దంపతుల కుమారుడు.[5] ఇతని అన్నలు ఎడ్వర్డ్ బియర్‌స్టాడ్, చార్లెస్ బీర్‌స్టాడ్ట్ ప్రముఖ స్టీరియో వ్యూ ఫోటోగ్రాఫర్లు. 1831లో వీరి కుటుంబం మసాచుసెట్స్‌లోని న్యూ బెడ్‌ఫోర్డ్‌కు వలస వచ్చేనాటికి ఆల్బర్ట్ వయస్సు కేవలం ఏడాది. యవ్వనంలో అద్భుతమైన క్రేయాన్ స్కెచ్‌లు గీశాడు, కళపై ఆసక్తిని పెంచుకున్నాడు.[6]
1851లో బియర్‌స్టాడ్ ఆయిల్ పెయింటింగ్స్ వేయడం ప్రారంభించాడు.[6] 1853లో జర్మనీకి తిరిగి వచ్చి డ్యూసెల్డార్ఫ్‌లోని అనధికారిక పెయింటింగ్ స్కూల్ సభ్యులతో కలసి అనేక సంవత్సరాలు చిత్రలేఖనం అభ్యసించాడు. 1857లో న్యూ బెడ్‌ఫోర్డ్‌కు తిరిగి వచ్చిన తరువాత డ్రాయింగ్, పెయింటింగ్ కొంతకాలం బోధించాడు, ఆపై పూర్తి సమయం చిత్రలేఖనానికే అంకితం అయ్యాడు.[7]
వృత్తి
[మార్చు]

1858లో నేషనల్ అకాడమీ ఆఫ్ డిజైన్‌లో స్విస్ ల్యాండ్‌స్కేప్ పెద్ద పెయింటింగ్‌ను ప్రదర్శించాడు, ఇది ఇతనికి సానుకూల విమర్శకుల ఆదరణను, అకాడమీ గౌరవ సభ్యత్వాన్ని సంపాదించిపెట్టింది.[7] న్యూ ఇంగ్లాండ్, న్యూయార్క్ (హడ్సన్ రివర్ వ్యాలీతో సహా) ప్రాంతాల్లోని దృశ్యాలను చిత్రించడం ప్రారంభించాడు. హడ్సన్ రివర్ స్కూల్ అని పిలువబడే కళాకారుల సమూహంలో ఇతను ఒక భాగం.
తన కళాకృతుల కోసం పశ్చిమ అమెరికా ప్రకృతి దృశ్యాలను చూడటానికి 1859లో అమెరికా ప్రభుత్వ భూ సర్వేయర్ ఫ్రెడరిక్ డబ్ల్యూ. లాండర్‌తో కలిసి పశ్చిమ దిశగా ప్రయాణించాడు.[8] అనేక చిత్రాలకు సంబంధించిన స్కెచ్‌లతో న్యూయార్క్‌లోని టెన్త్ స్ట్రీట్ స్టూడియో బిల్డింగ్‌లో తాను తీసుకున్న స్టూడియోకి తిరిగి వచ్చి వాటిని పూర్తి చేశాడు. 1860లో నేషనల్ అకాడమీ ఆఫ్ డిజైన్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు; ఆస్ట్రియా, బవేరియా, బెల్జియం, జర్మనీలలో పతకాలు సాధించాడు.[9][నమ్మదగని మూలం?]
1863లో రచయిత ఫిట్జ్ హ్యూ లుడ్లోతో కలిసి మళ్లీ పశ్చిమ ప్రాంతానికి ప్రయాణించాడు, లుడ్లో భార్యనే ఇతను తరువాత వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ ఏడు వారాల పాటు యోస్మైట్ వ్యాలీలో గడిపారు. 1860ల అంతటా భారీ ప్రదర్శనల కోసం వేసిన చిత్రాలకు ఈ పర్యటన అధ్యయనాలనే మూలంగా ఉపయోగించుకున్నాడు, తన జీవితకాలం అంతా పశ్చిమ అమెరికాను సందర్శించడం కొనసాగించాడు.[10] లాండర్, లుడ్లోలతో పర్యటనల తరువాత ఇతను సృష్టించిన భారీ కాన్వాసులు పశ్చిమ అమెరికా ల్యాండ్‌స్కేప్ చిత్రకారుడిగా ఇతనిని ప్రముఖుడిగా నిలబెట్టాయి.[11] యూరోపియన్ ల్యాండ్‌స్కేప్ అధ్యయనం ద్వారా పొందిన ఇతని సాంకేతిక నైపుణ్యం పశ్చిమ అమెరికా చిత్రకారుడిగా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది, రాకీ పర్వతాలను చూడని వారికి వాటి దృశ్యాలను చూపించడంలో ఇతని ప్రజాదరణకు కారణమైంది.[11]
అమెరికన్ అంతర్యుద్ధం (1861 నుండి 1865) సమయంలో 1863లో ఎంపికయ్యాడు, తన స్థానంలో సేవ చేయడానికి ఒక ప్రత్యామ్నాయ వ్యక్తికి డబ్బు చెల్లించాడు. 1861లో క్యాంప్ కామెరాన్‌లో మోహరించిన సైనికులతో తన స్వల్ప అనుభవాల ఆధారంగా 1862 నాటికి గెరిల్లా వార్‌ఫేర్, సివిల్ వార్ అనే ఒక అంతర్యుద్ధ పెయింటింగ్‌ను పూర్తి చేశాడు.[12] ఆ చిత్రం వర్జీనియాలోని లాంగ్లీస్ టావెర్న్‌లో ఫోటోగ్రఫీ స్టూడియో నడుపుతున్న ఇతని సోదరుడు ఎడ్వర్డ్ బియర్‌స్టాడ్ తీసిన స్టీరియోస్కోపిక్ ఛాయాచిత్రం ఆధారంగా రూపొందించబడింది. డిసెంబర్ 1861లో బ్రూక్లిన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్‌లోని బ్రూక్లిన్ ఆర్ట్ అసోసియేషన్‌లో ప్రదర్శించినప్పుడు ఈ చిత్రం సానుకూల సమీక్షను అందుకుంది. క్యూరేటర్ ఎలియనోర్ జోన్స్ హార్వే ఈ ఛాయాచిత్రాల నుండి సృష్టించిన పెయింటింగ్ "కథలను మాత్రమే తెలిసిన, ప్రత్యక్ష యుద్ధ అనుభవంలోని హింస, క్రూరత్వం అంటని ఒక ప్రేక్షకుడి దృష్టికి అచ్చమైన ఉదాహరణ" అని వ్యాఖ్యానించాడు.[12]

ఆర్థిక గుర్తింపు ఇతని స్థాయిని నిర్ధారించింది: 1863లో పూర్తయిన ది రాకీ మౌంటైన్స్, లాండర్స్ పీక్ అనే చిత్రం 1865లో $25,000కు అమ్ముడైంది,[13] ఇది 2020 నాటికి దాదాపు $400,000తో సమానం.
1867లో మళ్లీ ఐరోపాకు తిరిగి వెళ్ళి లండన్ చేరుకున్నాడు, అక్కడ విక్టోరియా మహారాణితో జరిగిన ప్రైవేట్ రిసెప్షన్‌లో రెండు ల్యాండ్‌స్కేప్ పెయింటింగ్స్‌ను ప్రదర్శించాడు.[11] తరువాతి రెండేళ్లు ఐరోపా అంతటా పర్యటించి కొత్త చిత్రాలను వేశాడు, ఖండంలో తన కళకు మార్కెట్‌ను నిలబెట్టుకోవడానికి సామాజిక, వ్యాపార సంబంధాలను కూడా పెంపొందించుకున్నాడు.[11] ఉదాహరణకు రోమ్ స్టూడియోలో ఎమాంగ్ ది సియెర్రా నెవాడా, కాలిఫోర్నియాను చిత్రించాడు, దానిని అమెరికాకు పంపే ముందు బెర్లిన్, లండన్‌లలో ప్రదర్శించాడు.[14] ఐరోపా నుండి అమెరికాకు వలసలు పెరుగుతున్న కాలంలో ఇతని ప్రదర్శనలు యూరోపియన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి, పశ్చిమ అమెరికా ఒక ఆశాజనక ప్రాంతమనే భావనను మరింత పెంచాయి. బియర్‌స్టాడ్ ఎంచుకున్న గొప్ప అంశాలు ఇతని వ్యాపార నైపుణ్యానికి సరిపోయాయి. ఇతని వ్యక్తిగత చిత్రాల ప్రదర్శనలకు ప్రచారం, టిక్కెట్ అమ్మకాలు కూడా తోడయ్యాయి. ఒక విమర్శకుడి మాటల్లో చెప్పాలంటే "ప్రకటనలు, గొప్పలు చెప్పుకునే పెద్ద యంత్రాంగం" పని చేసింది.[14]
ఐరోపా పర్యటన సమయంలో అమెరికాలో బియర్‌స్టాడ్ ప్రజాదరణ బలంగానే ఉంది. 1868లో ఇతని యోస్మైట్ వ్యాలీ చిత్రాల ద్వారా వచ్చిన ప్రచారం వల్ల, పశ్చిమ దిశగా సాగే అన్వేషణలలో ఇతని ఉనికి ఉండాలని చాలామంది అన్వేషకులు కోరారు. గ్రాండ్ కాన్యన్, చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించి చిత్రించడానికి అట్చిసన్, టోపెకా, శాంటా ఫే రైల్‌రోడ్ ఇతనిని నియమించింది.[15]

విపరీతమైన ప్రజాదరణ ఉన్నప్పటికీ ఇతను ఎంచుకున్న అంశాలలో కనిపించే కాల్పనికత, కాంతిని ఎక్కువగా ఉపయోగించడం పట్ల కొంతమంది సమకాలీనుల నుండి విమర్శలు ఎదుర్కొన్నాడు. అమెరికాలోని స్థానిక అమెరికన్లను బీర్‌స్టాడ్ట్ చిత్రించడం పట్ల కొంతమంది విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేశారు, మూలవాసులను చేర్చడం "ఏకాంతమైన గొప్పదనం అనే భావనను పాడుచేసిందని" వారు విశ్వసించారు.[10]
1876లో ఇతని భార్య రోసాలీకి క్షయవ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది, 1893లో ఆమె మరణించే వరకు బహామాస్‌లోని నస్సావు వెచ్చని వాతావరణంలో ఆమెతో ఎక్కువ సమయం గడిపాడు. పశ్చిమ అమెరికా, కెనడా, న్యూయార్క్‌లోని తన స్టూడియో మధ్య ప్రయాణాలను కూడా కొనసాగించాడు.[11]
ఇతని పెయింటింగ్ కెరీర్ జీవితాంతం కొనసాగినప్పటికీ, బీర్‌స్టాడ్ట్ వేసిన చిత్రాలు క్రమంగా విమర్శకుల ఆదరణను కోల్పోయాయి, వాటిలోని నాటకీయ ధోరణి పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి.[11] 1882లో న్యూయార్క్‌లోని ఇర్వింగ్టన్‌లో బీర్‌స్టాడ్ట్ స్టూడియోలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇతని పెయింటింగ్స్ చాలావరకు కాలిపోయాయి.[6]
బీర్‌స్టాడ్ట్ ఒక గొప్ప కళాకారుడు, తన జీవితకాలంలో 500కి పైగా చిత్రాలను పూర్తి చేశాడు.[16] అయినప్పటికీ 1902 ఫిబ్రవరి 18న ఇతను మరణించే సమయానికి ఇతిహాస ప్రకృతి దృశ్యాల చిత్రలేఖనం పట్ల అభిరుచి చాలా కాలం క్రితమే తగ్గిపోయింది.[17] మసాచుసెట్స్‌లోని న్యూ బెడ్‌ఫోర్డ్‌లో ఉన్న రూరల్ స్మశానవాటికలో బీర్‌స్టాడ్ట్ అంత్యక్రియలు జరిగాయి, దాదాపు 60 సంవత్సరాల పాటు ఇతనిని చాలామంది మర్చిపోయారు.[5][11]
మరణానంతర స్పందన
[మార్చు]ఇతని చిన్న ఆయిల్ చిత్రాల ప్రదర్శనతో 1960లలో బియర్‌స్టాడ్ కళాఖండాలపై ఆసక్తి తిరిగి పెరిగింది.[11] బియర్‌స్టాడ్ గురించి ఆధునిక అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కొందరు విమర్శకులు ఇతని చిత్రాలను మ్యానిఫెస్ట్ డెస్టినీకి అట్టహాసమైన, అతిపెద్ద, విపరీతమైన ప్రతిరూపాలుగా పరిగణించారు. ప్రకృతి దృశ్యాలు పరిరక్షణ ఉద్యమానికి, ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ స్థాపనకు మద్దతునిచ్చేలా చేశాయని మరికొందరు గుర్తించారు.[10] ఇతని పనితీరు 1987లో పేర్కొన్నట్లుగా సానుకూల కోణంలో ఉంచబడింది:
(ఇతనిని విమర్శించాలనే) ప్రలోభాన్ని గట్టిగా నిరోధించాలి. బీర్‌స్టాడ్ట్ నాటకీయ కళ, సామాజికత, అంతర్జాతీయ దృక్పథం, తీరని వ్యక్తిగత శక్తి పంతొమ్మిదవ శతాబ్దపు ద్వితీయార్థంలో పాశ్చాత్య నాగరికతలోని ప్రతి కోణంలో పురాణ విస్తరణను ప్రతిబింబించాయి.[18]
మరోవైపు, ఇతని చిత్రాలు ఎక్కువగా ప్రకృతి ఊహాత్మక వర్ణన అని, సృష్టిపరంగా "ఆత్మ లేనివి" అని కూడా విమర్శించబడ్డాయి.[19]
ఉన్న కళాఖండాలు
[మార్చు]- 1853 – మెజెస్టి ఆఫ్ ది మౌంటైన్స్
- 1855 – ది ఓల్డ్ మిల్
- 1855 – ది పోర్టికో ఆఫ్ ఆక్టేవియా
- 1855 – వెస్ట్‌ఫాలియా
- 1858 – లేక్ లూసర్న్, 1853 ప్రాంతంలో, కాన్వాస్‌పై నూనె రంగులు, నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్, వాషింగ్టన్, డి.సి.
- 1859 – ది వోల్ఫ్ రివర్, కాన్సాస్,[20] 1859 ప్రాంతంలో, కాన్వాస్‌పై నూనె రంగులు, డెట్రాయిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్, డెట్రాయిట్, మిచిగాన్
- 1861 – ఎకో లేక్, ఫ్రాంకోనియా మౌంటైన్స్, న్యూ హాంప్‌షైర్,[21] స్మిత్ కాలేజ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్,[22] స్మిత్ కాలేజ్, నార్తాంప్టన్, మసాచుసెట్స్
- 1863 – ది రాకీ మౌంటైన్స్, లాండర్స్ పీక్, కాన్వాస్‌పై నూనె రంగులు, మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, న్యూయార్క్ నగరం
- 1864 – చో-లూకే, ది యోస్మైట్ ఫాల్, కాన్వాస్‌పై నూనె రంగులు, టిమ్కెన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, శాన్ డియాగో, కాలిఫోర్నియా[23]
- 1864 – వ్యాలీ ఆఫ్ ది యోస్మైట్,[24] కాగితంపై నూనె రంగులు, మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బోస్టన్, మసాచుసెట్స్
- 1865 – లుకింగ్ డౌన్ యోస్మైట్ వ్యాలీ, బర్మింగ్‌హామ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, అలబామా[25]
- 1866 – యోస్మైట్ వ్యాలీ,[26] కాన్వాస్‌పై నూనె రంగులు, క్లీవ్‌ల్యాండ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, క్లీవ్‌ల్యాండ్, ఒహియో
- 1866 – ఆన్ ది హడ్సన్ రివర్ నియర్ ఇర్వింగ్టన్, 1866–70, కాగితంపై నూనె రంగులు, బెర్క్‌షైర్ మ్యూజియం, పిట్స్‌ఫీల్డ్, మసాచుసెట్స్
- 1866 – ఎ స్టోర్మ్ ఇన్ ది రాకీ మౌంటైన్స్, మౌంట్ రోసాలీ, కాన్వాస్‌పై నూనె రంగులు, బ్రూక్లిన్ మ్యూజియం, న్యూయార్క్ నగరం
- 1868 – కనెక్టికట్ రివర్ వ్యాలీ, క్లేర్‌మోంట్, న్యూ హాంప్‌షైర్, 1868, కాన్వాస్‌పై నూనె రంగులు, బెర్క్‌షైర్ మ్యూజియం, పిట్స్‌ఫీల్డ్, మసాచుసెట్స్
- 1868 – ఇన్ ది సియెర్రాస్,[27] ఫాగ్ మ్యూజియం, హార్వర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్
- 1868 – ఎమాంగ్ ది సియెర్రా నెవాడా, కాలిఫోర్నియా,[28] స్మిత్సోనియన్ అమెరికన్ ఆర్ట్ మ్యూజియం, వాషింగ్టన్, డి.సి.
- 1869 – గ్లెన్ ఎల్లిస్ ఫాల్స్, కాన్వాస్‌పై నూనె రంగులు, జిమ్మెర్లీ ఆర్ట్ మ్యూజియం, న్యూ బ్రున్స్‌విక్, న్యూజెర్సీ
- 1870 – సియెర్రా నెవాడా మార్నింగ్, కాన్వాస్‌పై నూనె రంగులు, గిల్‌క్రీజ్ మ్యూజియం, తుల్సా, ఓక్లహోమా
- 1870 – పుగెట్ సౌండ్ ఆన్ ది పసిఫిక్ కోస్ట్,[29] కాన్వాస్‌పై నూనె రంగులు, సియాటెల్ ఆర్ట్ మ్యూజియం, సియాటెల్, వాషింగ్టన్
- 1870 – లారామీ పీక్, కాన్వాస్‌పై నూనె రంగులు, బఫెలో ఏకేజీ ఆర్ట్ మ్యూజియం, బఫెలో, న్యూయార్క్
- 1871 – డోమ్స్ ఆఫ్ యోస్మైట్,[30] 1871 ప్రాంతంలో, సెయింట్ జాన్స్‌బరీ ఎథీనియమ్, సెయింట్ జాన్స్‌బరీ, వెర్మోంట్
- 1874 – జాయింట్ రెడ్‌వుడ్ ట్రీస్ ఆఫ్ కాలిఫోర్నియా, 1874 ప్రాంతంలో, కాన్వాస్‌పై నూనె రంగులు, బెర్క్‌షైర్ మ్యూజియం, పిట్స్‌ఫీల్డ్, మసాచుసెట్స్
- 1875 – మౌంట్ ఆడమ్స్, వాషింగ్టన్, 1875, కాన్వాస్‌పై నూనె రంగులు, ప్రిన్స్టన్ యూనివర్శిటీ ఆర్ట్ మ్యూజియం, ప్రిన్స్టన్, న్యూజెర్సీ
- 1876 – మౌంట్ కోర్కోరన్,[31] 1876–77 ప్రాంతంలో, కాన్వాస్‌పై నూనె రంగులు, కోర్కోరన్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్, వాషింగ్టన్, డి.సి.
- 1888 – ది లాస్ట్ ఆఫ్ ది బఫెలో,[32] కాన్వాస్‌పై నూనె రంగులు, కోర్కోరన్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్, వాషింగ్టన్, డి.సి.
- 1889 – అలాస్కాన్ కోస్ట్ రేంజ్,[33] 1889 ప్రాంతంలో, స్మిత్సోనియన్ అమెరికన్ ఆర్ట్ మ్యూజియం, వాషింగ్టన్, డి.సి.
- 1891 – ది లాస్ట్ ఆఫ్ ది బఫెలో,[34] 1891 ప్రాంతంలో, వింటేజ్ ఫోటోగ్రావూర్, వ్యాలీ ఫైన్ ఆర్ట్ గ్యాలరీ, ఆస్పెన్, కొలరాడో
- 1895 – ది మోర్టెరాష్ గ్లేసియర్ అప్పర్ ఎంగడైన్ వ్యాలీ - పోంట్రెసినా
ఎంచుకున్న పెయింటింగ్‌లు
[మార్చు]- రోమన్ ఫిష్ మార్కెట్, ఆర్చ్ ఆఫ్ ఆక్టేవియస్, 1858, డి యంగ్ మ్యూజియం, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా
- గోస్నాల్డ్ ఎట్ కట్టీహంక్, 1858 ప్రాంతంలో, న్యూ బెడ్ఫోర్డ్ వేలింగ్ మ్యూజియం, న్యూ బెడ్ఫోర్డ్, మసాచుసెట్స్
- ది మెరీనా పిక్కోలా, కాప్రి, 1859, ఆల్బ్రైట్-నాక్స్ ఆర్ట్ గ్యాలరీ, బఫెలో, న్యూయార్క్
- ఇండియన్స్ స్పియర్ ఫిషింగ్, 1862, మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, హ్యూస్టన్, టెక్సాస్
- గెరిల్లా వార్‌ఫేర్, సివిల్ వార్, 1862, సెంచరీ అసోసియేషన్, న్యూయార్క్ నగరం
- సన్‌లైట్ అండ్ షాడో, 1862, డి యంగ్ మ్యూజియం, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా
- ఓరెగాన్ ట్రైల్ (క్యాంప్‌ఫైర్), 1863
- ది రాకీ మౌంటైన్స్, లాండర్స్ పీక్, 1863, మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, న్యూయార్క్ నగరం
- వ్యాలీ ఆఫ్ ది యోస్మైట్, 1864, మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బోస్టన్, మసాచుసెట్స్
- లుకింగ్ డౌన్ యోస్మైట్ వ్యాలీ, కాలిఫోర్నియా, 1865, బర్మింగ్‌హామ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, అలబామా
- స్టాబ్బాచ్ ఫాల్స్, నియర్ లాటర్‌బ్రున్నెన్, స్విట్జర్లాండ్, 1865
- ఎ స్టోర్మ్ ఇన్ ది రాకీ మౌంటైన్స్, మౌంట్ రోసాలీ, 1866, బ్రూక్లిన్ మ్యూజియం, న్యూయార్క్ నగరం
- యోస్మైట్ వ్యాలీ, యోస్మైట్ పార్క్, 1868 ప్రాంతంలో, ఓక్లాండ్ మ్యూజియం, కాలిఫోర్నియా
- లేక్ తాహో, 1868, ఫాగ్ ఆర్ట్ మ్యూజియం, కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్
- స్టోర్మ్ ఇన్ ది మౌంటైన్స్, 1870 ప్రాంతంలో, మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్, బోస్టన్, మసాచుసెట్స్
- సియెర్రా నెవాడా, 1871–1873 ప్రాంతంలో, రేనాల్డా హౌస్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ ఆర్ట్, విన్స్టన్-సేలం, నార్త్ కరోలినా
- జాయింట్ రెడ్‌వుడ్ ట్రీస్ ఆఫ్ కాలిఫోర్నియా, 1874, బెర్క్‌షైర్ మ్యూజియం, మసాచుసెట్స్
- కాలిఫోర్నియా స్ప్రింగ్, 1875, డి యంగ్ మ్యూజియం, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా
- మౌంట్ ఆడమ్స్, వాషింగ్టన్, 1875, ప్రిన్స్టన్ యూనివర్శిటీ ఆర్ట్ మ్యూజియం, న్యూజెర్సీ
- సన్‌రైజ్ ఆన్ ది మేటర్‌హార్న్, 1875 తర్వాత, మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, న్యూయార్క్ నగరం
- ఎస్టెస్ పార్క్, లాంగ్స్ పీక్, 1876-1877 ప్రాంతంలో, డెన్వర్ ఆర్ట్ మ్యూజియం, కొలరాడో
- మౌంట్ కోర్కోరన్, 1876–1877 ప్రాంతంలో, కోర్కోరన్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్, వాషింగ్టన్, డి.సి.
- ఎమరాల్డ్ సీ (లేదా ది షోర్ ఆఫ్ ది టర్కోయిస్ సీ), 1878, మనూగియన్ కలెక్షన్, డెట్రాయిట్, మిచిగాన్
- లైట్ ఇన్ ది ఫారెస్ట్, తెలియని తేదీ
వారసత్వం, సత్కారాలు
[మార్చు]
- పర్వత ప్రకృతి దృశ్యాలపై బీర్‌స్టాడ్ట్‌కు ఉన్న ఆసక్తి కారణంగా కొలరాడోలోని మౌంట్ బీర్‌స్టాడ్ట్, బీర్‌స్టాడ్ట్ లేక్‌లకు ఇతని పేరు పెట్టారు. మౌంట్ బీర్‌స్టాడ్ట్‌కు 1.5 మైళ్ల దూరంలో ఉన్న మౌంట్ బ్లూ స్కై శిఖరాన్ని 1863లో సందర్శించిన మొదటి యూరోపియన్ బీర్‌స్టాడ్ట్ కావచ్చు.[35] బీర్‌స్టాడ్ట్ దానికి మౌంట్ రోసా అని పేరు పెట్టాడు, ఇది జెర్మాట్ పైన ఉన్న మోంటే రోసాకు, తన కాబోయే భార్య రోసాలీ లుడ్లోకు సూచన, అయితే ఈ పేరును 1895లో కొలరాడో గవర్నర్ జాన్ ఎవాన్స్ గౌరవార్థం రోసాలీ నుండి ఎవాన్స్‌గా మార్చారు, 2023లో మళ్లీ బ్లూ స్కైగా మార్చారు.
- 1998లో యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ "ఫోర్ సెంచరీస్ ఆఫ్ అమెరికన్ ఆర్ట్" పేరుతో 20 స్మారక తపాలా బిళ్ళలను విడుదల చేసింది, వాటిలో ఒక దానిపై ఆల్బర్ట్ బీర్‌స్టాడ్ట్ చిత్రం ది లాస్ట్ ఆఫ్ ది బఫెలో ఉంది.[36] 2008లో USPS తన "అమెరికన్ ట్రెజర్స్" సిరీస్‌లో బీర్‌స్టాడ్ట్ 1864 పెయింటింగ్ వ్యాలీ ఆఫ్ ది యోస్మైట్‌తో ఒక స్మారక స్టాంపును విడుదల చేసింది.[37]
- మరో ల్యాండ్‌స్కేప్ కళాకారుడు విలియం బ్లిస్ బేకర్ బీర్‌స్టాడ్ట్ వద్ద చదువుకున్నాడు.
- రిచర్డ్ పవర్స్ 2018 నవల ది ఓవర్‌స్టోరీ, బీర్‌స్టాడ్ట్ పెయింటింగ్ "కాథెడ్రల్ ఫారెస్ట్"ను కవర్ ఆర్ట్‌గా కలిగి ఉంది, దీనిని ఎవాన్ గాఫ్నీ మరింత డిజైన్ చేశాడు. ఈ పుస్తకం 2018 AIGA 50 కవర్స్ అవార్డును గెలుచుకుంది. ఈ పుస్తకానికి గాను రచయిత 2019 పులిట్జర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ కూడా అందుకున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ N.Y.), Metropolitan Museum of Art (New York (1987). American Paradise: The World of the Hudson River School (in ఇంగ్లీష్). Metropolitan Museum of Art. p. 284. ISBN 978-0-87099-497-5.
- ↑ "Picturing America's Natural Cathedrals". Tfaoi.com. Retrieved May 20, 2012.
- ↑ Martinez, Katharine; Talbott, Page; Johns, Elizabeth (2000). Philadelphia's Cultural Landscape: The Sartain Family Legacy (in ఇంగ్లీష్). Temple University Press. ISBN 978-1-56639-791-9.
- ↑ Palmquist, Peter E.; Kailbourn, Thomas R. (2000). Pioneer Photographers of the Far West: A Biographical Dictionary, 1840-1865 (in ఇంగ్లీష్). Stanford University Press. pp. 109–112. ISBN 978-0-8047-3883-5.
- 1 2 Garraty, John Arthur; Carnes, Mark Christopher; Societies, American Council of Learned (March 29, 1999). American National Biography: Baker-Blatch. Oxford University Press. ISBN 9780195127812 – via Google Books.
- 1 2 3 మూస:Cite Appletons'
- 1 2 "Albert Bierstadt". www.nga.gov via www.ngabiographies.org. Retrieved 2025-12-23.
- ↑ Mount Corcoran National Gallery of Art, retrieved September 14, 2018
- ↑ Reynolds, Francis J., ed. (1921). . Collier's New Encyclopedia. New York: P. F. Collier & Son Company.
- 1 2 3 Hassrick, Peter H. (Spring 2018). "Art, Agency, and Conservation: A Fresh Look at Albert Bierstadt's Vision of the West". Montana The Magazine of Western History. 68 (1).
- 1 2 3 4 5 6 7 8 "Bierstadt, Albert", National Gallery of Art.
- 1 2 Harvey, Eleanor Jones (2012). The Civil War and American Art. Smithsonian American Art Museum; Metropolitan Museum of Art. Yale University Press. ISBN 978-0-300-18733-5.
- ↑ "Albert Bierstadt: The Rocky Mountains, Lander's Peak (07.123) – Heilbrunn Timeline of Art History – The Metropolitan Museum of Art". metmuseum.org. 1863.
- 1 2 "Among the Sierra Nevada, California by Albert Bierstadt / Exhibition Label". Smithsonian American Art Museum. 2006.
- ↑ Barringer and Wilton, 250
- ↑ Glenda Moore (September 9, 2004). "xmission.com". xmission.com. Retrieved December 19, 2012.
- ↑ Chisholm, Hugh, ed. (1911). . ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 3 (11th ed.). Cambridge University Press.
- ↑ Howat, John K., editor. American Paradise: The World of the Hudson River School, 284. Metropolitan Museum of Art, New York, 1987. ISBN 9780870994975
- ↑ Brenson, Michael (1991-02-08). "Reviews/Art; He Painted the West That America Wanted". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2022-08-01.
- ↑ "Albert Bierstadt: The Wolf River, Kansas (61.28) — The Detroit Institute of Arts". Dia.org. Archived from the original on February 23, 2009. Retrieved July 5, 2013.
- ↑ "Echo Lake, Franconia Mountains, New Hampshire / North American / Art of the Americas / Highlights By Category / Collection Highlights / Collections / Smith College Museum of Art – Smith College Museum of Art". Scma.smith.edu. Archived from the original on March 22, 2012. Retrieved July 5, 2013.
- ↑ "Home / Smith College Museum of Art – Smith College Museum of Art". Smith.edu. Retrieved July 5, 2013.
- ↑ "Cho-looke, the Yosemite Fall, 1864". Timken Museum of Art. Archived from the original on February 21, 2009.
- ↑ "Valley of the Yosemite". Retrieved May 31, 2014.
- ↑ "Looking Down Yosemite Valley, California | Birmingham Museum of Art" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-06-16. Retrieved 2023-06-18.
- ↑ Anonymous (October 31, 2018). "Yosemite Valley". Cleveland Museum of Art. Archived from the original on 2020-07-26. Retrieved 2026-10-06.
- ↑ "In the Sierras". Harvard Art Museums. Retrieved July 5, 2013.
- ↑ "Among the Sierra Nevada, California". Smithsonian American Art Museum. Archived from the original on June 1, 2014. Retrieved May 31, 2014.
- ↑ "Puget Sound on the Pacific Coast". Seattle Art Museum. Archived from the original on August 1, 2017. Retrieved July 31, 2017.
- ↑ "St. Johnsbury Athenaeum>>This Week from the Gallery Archives". Stjathenaeum.org. Archived from the original on September 27, 2013. Retrieved July 5, 2013.
- ↑ "Mount Corcoran | Corcoran". Collection.corcoran.org. Archived from the original on May 18, 2013. Retrieved July 5, 2013.
- ↑ "The Last of the Buffalo | Corcoran". Collection.corcoran.org. Archived from the original on May 18, 2013. Retrieved July 5, 2013.
- ↑ "Alaskan Coast Range". Smithsonian American Art Museum. Archived from the original on May 2, 2014. Retrieved May 31, 2014.
- ↑ "Valley Fine Art". Valley Fine Art Gallery. Retrieved March 2, 2015.
- ↑ William Newton Byers, Bierstadt's Visit to Colorado: Sketching for the famous painting, "Storm in the Rocky Mountains", Magazine of Western History, Vol. 11, No. 3, Jan. 1890; page 237-240.
- ↑ "ArtOnStamps.org". ArtOnStamps.org. July 9, 2010. Retrieved May 20, 2012.
- ↑ "The Postal Store @ USPS.com". Shop.usps.com. March 28, 2011. Retrieved May 20, 2012.
మరింత చదవడానికి
[మార్చు]- Anderson, Nancy K. et al. Albert Bierstadt, Art & Enterprise, New York: Hudson Hills Press, 1990.
- Barringer, Tim and Wilton, Andrew. American Sublime: Landscape Painting in the United States 1820–1880, Princeton University Press, 2002. ISBN 0-691-09670-8.
- Hendricks, Gordon. Albert Bierstadt, Painter of the American West, New York: Harrison House/Harry N. Abrams, Inc., 1988.
- American Paradise: The World of the Hudson River School. New York: The Metropolitan Museum of Art. 1987. ISBN 9780870994968.
- Miller, Angela. "Albert Bierstadt, Landscape Aesthetics, and the Meanings of the West in the Civil War Era". Art Institute of Chicago Museum Studies 27, no. 1 (Terrain of Freedom: American Art and the Civil War) (2001): 40–59 and 101–102. doi:10.2307/4102838. JSTOR 4102838.
బయటి లింకులు
[మార్చు]- Works by or about ఆల్బర్ట్ బియర్‌స్టాడ్ at Internet Archive
- ఆల్బర్ట్ బీర్‌స్టాడ్ట్ Archived ఫిబ్రవరి 14, 2020 at the Wayback Machine (albertbierstadt.org)
- ఆల్బర్ట్ బీర్‌స్టాడ్ట్ పెయింటింగ్స్ fineartamerica.com వద్ద
- వైట్ మౌంటైన్ పెయింటింగ్స్, ఆల్బర్ట్ బీర్‌స్టాడ్ట్
- ఆర్కైవ్స్ ఆఫ్ అమెరికన్ ఆర్ట్, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్లో ఆల్బర్ట్ బీర్‌స్టాడ్ట్ లెటర్ కలెక్షన్, 1880–1893కి ఫైండింగ్ ఎయిడ్
- "ఎగైనెస్ట్ హిజ్ గ్రైన్: ఆల్బర్ట్ బీర్స్టాడ్ట్స్ 'క్లౌడ్స్ ఓవర్ ది ప్రైరీమూస:'"" మోనా మూమెంట్, మ్యూజియం ఆఫ్ నెబ్రాస్కా ఆర్ట్
- బీర్‌స్టాడ్ట్ పెయింటింగ్స్ గ్యాలరీ Archived జనవరి 26, 2021 at the Wayback Machine
- ది వింటర్తూర్ లైబ్రరీ—ఆల్బర్ట్ బీర్‌స్టాడ్ట్ ఆర్కైవల్ కలెక్షన్ అవలోకనం.
- ఆల్బర్ట్ బీర్‌స్టాడ్ట్ పెయింటింగ్స్ గ్యాలరీ—345 ఆన్లైన్ చిత్రాలు
- ఆల్బర్ట్ బీర్‌స్టాడ్ట్ జీవిత చరిత్ర, ది ఆర్.డబ్ల్యూ. నార్టన్ ఆర్ట్ గ్యాలరీ వద్ద
- , ది బెర్క్‌షైర్ ఈగిల్, జూన్ 30, 2018
- ఆల్బర్ట్ బీర్‌స్టాడ్ట్, వికీఆర్ట్
- ఆల్బర్ట్ బియర్‌స్టాడ్ at Find a Grave
మూస:Albert Bierstadt మూస:Hudson River School మూస:Romanticism
- Wikipedia articles incorporating a citation from Collier's Encyclopedia
- Articles with Internet Archive links
- AC with 17 elements
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with ULAN identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with RKDartists identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- Wikipedia articles with PIC identifiers
- 1830 జననాలు
- 1902 మరణాలు
- అమెరికన్ చిత్రకారులు
- ప్రపంచ ప్రసిద్ధులు
- కళా ఉద్యమాలు
- 19వ శతాబ్దపు అమెరికన్ చిత్రకారులు