ఆల్ ది కింగ్స్ మెన్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆల్ ది కింగ్స్ మెన్
సినిమా పోస్టర్
దర్శకత్వంరాబర్ట్ రోజెన్
స్క్రీన్ ప్లేరాబర్ట్ రోజెన్
దీనిపై ఆధారితంఆల్ ది కింగ్స్ మెన్ 
by రాబర్ట్ పెన్ వారెన్
నిర్మాతరాబర్ట్ రోజెన్
తారాగణంబ్రోడెరిక్ క్రాఫర్డ్
జాన్ ఐర్లాండ్
మెర్సిడెజ్మెక్ కేంబ్రిడ్జ్
జొవానే డ్రూ
జాన్ డెరిక్
షెపర్డ్ స్టడ్విక్
ఛాయాగ్రహణంబర్నెట్ గుఫే
కూర్పుఅల్ క్లార్క్
రాబర్ట్ పారిష్
సంగీతంలూయిస్ గ్రుయెన్‌బెర్గ్
కలర్ ప్రాసెస్నలుపు తెలుపు
నిర్మాణ
సంస్థ
కొలంబియా పిక్చర్స్
పంపిణీదార్లుకొలంబియా పిక్చర్స్
విడుదల తేదీ
1949 నవంబరు 8 (1949-11-08)
సినిమా నిడివి
110 నిముషాలు
దేశంఅమెరికా
భాషఇంగ్లీషు
బడ్జెట్$2 మిలియన్లు[1]
బాక్సాఫీసు$4.2 మిలియన్లు[1]

ఆల్ ది కింగ్స్ మెన్ 1949 నవంబర్ 8న విడుదలైన అమెరికన్ సినిమా.[2] అదే పేరుతో 1946లో వచ్చిన రాబర్ట్ పెన్ వారెన్ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. రాబర్ట్ రోజెన్ స్వీయదర్శకత్వంలో నిర్మించబడిన ఈ సినిమాలో బ్రోడెరిక్ క్రాఫర్డ్, జొవానే డ్రూ, జాన్ ఐర్లాండ్, జాన్ డెరిక్, మెర్సిడెజ్మెక్ కేంబ్రిడ్జ్, షెపర్డ్ స్టడ్విక్, యానే సైమూర్ తదితరులు నటించారు. లూసియానా రాష్ట్ర గవర్నరుగా ఉన్న హ్యూ పియర్స్ లాంగ్‌ను పోలిన విల్లీ స్టార్క్ పాత్ర ఉత్థానపతనాలు ఈ సినిమా కథాంశం.

కథ[మార్చు]

'ఆల్ ది కింగ్స్ మెన్' చిత్రం కథంతా జాక్ బర్డెన్ అనే ఒక విలేఖరి చూస్తున్న కథనంలాగా సాగుతుంది. రాజకీయ నాయకులు ఎలాంటి దారుణాలకు ఒడిగడతారో చెప్పే నిజాయితీ న్యాయవాదిగా స్టార్క్ పాత్రను ప్రవేశపెడతారు. లంచాలు తీసుకుని ఒక స్కూల్ భవన నిర్మాణానికి తోడ్పడిన ఒక రాజకీయ నాయకుడిపై స్టార్క్ ఆరోపణలు చేస్తాడు. కానీ ఆ ఆరోపణలు ప్రజలు పట్టించుకోరు. చివరికి ఆ స్కూల్ భవనం కూలి ఎందరో విద్యార్థులు మరణించటంతో నగర ప్రజలకు కనువిప్పు కలుగుతుంది. అప్పుడు రాజకీయ నాయకులు కుట్ర పన్ని, స్టార్క్ చేతే గవర్నర్ పదవికి పోటీ చేయిస్తారు. రాజకీయాలు క్రమంగా నేర్చుకున్న స్టార్క్ ప్రజలకు చేరువవుతాడు. కానీ ఈలోగానే అధికారం అతన్ని వశం చేసుకుని, అతనిలోని మనిషిని చంపేస్తుంది. అధికారం కోసం ఏం చేసినా పర్వాలేదన్న అభిప్రాయానికి స్టార్క్ వచ్చేస్తాడు. అన్నిచోట్లా లంచాలు తీసుకుని పేద ప్రజలకు సంక్షేమాలకు ఖర్చు పెడుతుంటాడు. క్రమంగా ఆయన ఆశలు జాతీయస్థాయికి ఎదుగుతాయి. నేరాలూ అలాగే స్థాయి పెంచుకుంటాయి. చివరకు ఆయన లూసియానా శాసనసభ మెట్లమీద తుపాకీ గుళ్ళకు బలి అవుతాడు.

నటీనటులు[మార్చు]

విల్లీ స్టార్క్ పాత్రలో బ్రోడెరిక్ క్రాఫర్డ్
  • బ్రోడెరిక్ క్రాఫర్డ్ - విల్లీ స్టార్క్
  • జాన్ ఐర్లాండ్ - జాక్ బర్డన్
  • జొవానే డ్రూ - అన్నే స్టాంటన్
  • జాన్ డెరిక్ - టామ్‌ స్టార్క్
  • మెర్సిడెజ్మెక్ కేంబ్రిడ్జ్ - శాడీ బర్కే
  • షెపర్డ్ స్టడ్విక్ - ఆడమ్‌ స్టాంటన్
  • రాల్ఫ్ డంకె -టినీ డఫీ
  • అన్నే సెమూర్ - మిసెస్ లూసీ స్టార్క్
  • కేథరిన్ వారెన్ - మిసెస్ బర్డన్
  • రేమండ్ గ్రీన్‌లీఫ్ - జడ్జి మాంటే స్టాంటన్
  • వాల్టర్ బుర్క్
  • విల్ వ్రైట్ - డాల్ఫ్ పిల్స్‌బరీ
  • గ్రాండన్ రోడ్స్ - ఫ్లాయిడ్ మెక్ ఎవోయ్
  • లారీ స్టీర్స్
  • హౌస్లీ స్టీవెన్‌సన్ - మాడిసన్ న్యూస్ పేపర్ [3]
  • పాల్ ఫోర్డ్ - సెనేటర్, నేరారోపణను విచారణచేసే వ్యక్తి

పురస్కారాలు[మార్చు]

ఈ సినిమా ఏడు విభాగాలలో నామినేట్ కాగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి కేటగిరీలలో ఆస్కార్ అవార్డులు లభించాయి.[2]

అకాడమీ అవార్డు ఫలితం విజేత
ఉత్తమచిత్రం గెలుపు రాబర్ట్ రోజెన్ ప్రొడక్షన్స్, కొలంబియా పిక్చర్స్
ఉత్తమ దర్శకుడు ప్రతిపాదన రాబర్ట్ రోజెన్
ఉత్తమ నటుడు గెలుపు బ్రోడెరిక్ క్రాఫర్డ్
ఉత్తమ సహాయనటుడు ప్రతిపాదన జాన్ ఐర్లాండ్
ఉత్తమ సహాయనటి గెలుపు మెర్సిడెస్ మెక్ కేంబ్రిడ్జ్
ఉత్తమ రచన, స్క్రీన్ ప్లే ప్రతిపాదన రాబర్ట్ రోజెన్
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ ప్రతిపాదన అల్ క్లార్క్, రాబర్ట్ పారిష్

2001లో యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో ఈ చిత్రాన్ని "సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా లేదా కళాసౌందర్యాత్మకంగా ముఖ్యమైన చిత్రం"గా ఎంపిక చేసి భద్రపరచింది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "వాల్‌స్ట్రీట్ రీసర్చర్స్ చీరీ టోన్". వెరైటీ. November 7, 1962. p. 7.
  2. 2.0 2.1 పాలకోడేటి, సత్యనారాయణరావు (1 April 2007). హాలీవుడ్ క్లాసిక్స్ - 1 (1 ed.). హైదరాబాదు: అనుపమ సాహితి. pp. 58–59.
  3. "ఆల్ ద కింగ్స్ మెన్". AFIకేటలాగ్. అమెరికన్ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్. Retrieved July 18, 2020.

బయటి లింకులు[మార్చు]

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.