ఆళ్లపల్లి మండలం
ఆళ్లపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, ఆళ్లపల్లి స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | భద్రాద్రి జిల్లా |
మండల కేంద్రం | ఆళ్లపల్లి |
గ్రామాలు | 6 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 505 km² (195 sq mi) |
జనాభా (2016) | |
- మొత్తం | 11,853 |
- పురుషులు | 5,581 |
- స్త్రీలు | 6,272 |
పిన్కోడ్ | {{{pincode}}} |
అళ్లపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 6 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం ఆళ్లపల్లి.
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.
[మార్చు]లోగడ అళ్లపల్లి గ్రామం ఖమ్మం జిల్లా,కొత్తగూడెం రెవెన్యూడివిజను పరిధిలోని గుండాల మండలానికి చెందిన గ్రామం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఆళ్లపల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం రెవెన్యూ డివిజను పరిధి క్రింద, గుండాల మండలంలోని 1+7 (ఎనిమిది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[3]
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 505 చ.కి.మీ. కాగా, జనాభా 11,853. జనాభాలో పురుషులు 5,581 కాగా, స్త్రీల సంఖ్య 6,272. మండలంలో 2,789 గృహాలున్నాయి.[4]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ 2.0 2.1 "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-04.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.