ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే
ఆళ్ళ గోపాలకృష్ణ గోకలే A. G. K. Gokhale | |
---|---|
జననం | |
విద్య | గుంటూరు వైద్య కళాశాల, Christian Medical College, Vellore |
వృత్తి | Physician, Surgeon |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | First successful human-to-human heart transplant and first successful lung transplant in Andhra Pradesh, first implantation of Left Ventricular Assist Device (LVAD) in Andhra Pradesh, Minimal Access Cardiac Surgery in India. |
డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే కార్డియో థొరాసిక్ వైద్య చికిత్స నిపుణుడు. తెలుగు రాష్ట్రాలలో తొలి గుండె మార్పిడి చేసిన వైద్యుడు.ప్రజా వైద్యులు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు గ్రహీత
బాల్యము
[మార్చు]గోఖలే కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరిశ గ్రామంలో 1959 అక్టోబరు 2 న జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఆళ్ల వెంకటేశ్వర రావు, ఝాన్సీబాయ్.
విద్యాభ్యాసము
[మార్చు]వీరు గుంటూరు వైద్య కళాశాలలో ఎం.బి.బీ.ఎస్,, ఎం.ఎస్. చదివారు. తర్వాత [vellore]vక్రిస్టియన్ వైద్య కళాశాలలో కార్డియో ధోరాసిక్ విభాగములో చదివారు.
ఉద్యోగము
[మార్చు]వీరు చదువు అయిన తర్వాత నిమ్స్ లో సహాయక అధ్యాపకుడుగా ఉద్యోగ జీవితము ప్రారంబించారు. ఆయన ఆధునిక వైద్యం మీద వివిధ సదస్సులలో పాల్గొని అనేక పత్రాలు సమర్పించారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరికి ఇద్దరు కుమార్తెలు. వారు కూడా వైద్యులే.
ప్రజా సేవ
[మార్చు]పేదలకు మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతో సహృదయ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషనల్ ట్రస్టుని స్థాపించారు.
పురస్కారాలు
[మార్చు]వీరి సేవలకు గాను కేంద్ర ప్రభుత్వము 2016 లో పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది.
మూలం
[మార్చు]- తెలుగు వెలుగు మార్చి, 2016. పు.97.