ఆవ నూనె
ఆవాల నూనె ఆవాల నుంచి తయారు చేసే నూనె. ఇది కొన్ని సంస్కృతుల్లో వంట నూనెగా, సుగంధ నూనెగా కూడా వాడతారు. ఇది ప్రధానంగా ఆవాలను గానుగ ఆడించడం ద్వారా తయారు చేస్తారు. ఆవ నూనెలో యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం వలన కొన్ని దేశాల్లో దీని అమ్మకంపై నిషేధం ఉంది. అందుకని యూరిక్ ఆమ్లం తక్కువగా ఉండే ఆవనూనె తయారు చేయడం ప్రారంభమైంది.
చరిత్ర
[మార్చు]ఆవ నూనెను మొదటగా ప్రస్తుతం ఇజ్రాయిల్ లో ఉన్న ప్రాచీన హుకాక్ పట్టణంలో మొదటగా తయారు చేశారు. జెరూసలేం టాల్ముడ్ అనే గ్రంథంలో దీని గురించి రాశారు.[1][2]
గానుగ నూనె
[మార్చు]ఆవాలలో సుమారు 30% దాకా నూనె ఉంటుంది. ఇది నల్ల ఆవాలు, ముదురు గోదుమ రంగు ఆవాలు, తెల్ల ఆవాల నుంచి ఉత్పత్తి చేస్తారు. ఒక విశిష్టమైన ఘాటైన వాసన కలిగి ఉండే ఈ నూనెను అస్సామీ, బెంగాలీ, ఒడియా, నేపాలీ[3] ఇంకా ఇతర ఉత్తరభారత వంటకాలలో,[4][5] బంగ్లాదేశీ వంటలలో ఉపయోగిస్తారు.[6] ఒక్కోసారి దీనిని నెయ్యికి ప్రత్యామ్నాయంగా వాడతారు.[7]
మూలాలు
[మార్చు]- ↑ Weingarten, Susan (2018). "Mustard in the Talmudic Literature". In McWilliams, Mark (ed.). Seeds: Proceedings of the Oxford Symposium on Food and Cookery 2018. Prospect Books. ISBN 9781909248656.
- ↑ Grey, M. J., & Magness, J. (2013). Finding Samson in Byzantine Galilee: The 2011-2012 Archaeological Excavations at Huqoq. Studies in the Bible and Antiquity, 5(1), pp. 6–9
- ↑ "The heritage of mustard oil in Nepali cuisine". The Annapurna Express (in Nepali). Retrieved 2025-02-09.
{{cite web}}: CS1 maint: unrecognized language (link) - ↑ Krishnendu Ray, The Migrant's Table: Meals and Memories in Bengali-American Households (Temple University Press, 2004), p. 27: "Wide use of mustard brings Bengali food close to the North Indian paradigm"
- ↑ Pete Wells, Masalawala & Sons, Where the Food Is Bengali and the Mustard Oil Flow Archived 27 జనవరి 2023 at the Wayback Machine, New York Times (January 24, 2023): "The volatile, sinus-awakening aroma of mustard oil is one of the signatures of Bengali cooking. ... Many Bengali dishes are unthinkable without it."
- ↑ Indrani Sen, American Chefs Discover Mustard Oil Archived 8 మే 2021 at the Wayback Machine, New York Times (November 2, 2011): "It is also used as a massage oil, the only use for which it is legally approved in the United States."
- ↑ The Cook's Book of Ingredients (DK Publishing: 1st American ed., 2010), p. 513.