Jump to content

ఆషాగి లామియా

వికీపీడియా నుండి

ఆషాగి లామియా (జననం 1989 మార్చి 6),

ఆషాగి లామియా
జననం (1989-03-06) 1989 మార్చి 6 (వయసు: 37)
తెల్లిచెర్రి, కేరళ, భారతదేశం
వృత్తిస్క్రీన్ రైటర్
నటి
ఫోటోగ్రాఫర్
టెలివిజన్ యాంకర్

ఒక భారతీయ కళాకారిణి, భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత, స్క్రీన్ రైటర్, ఫోటోగ్రాఫర్, నటి. ఆమె దర్శన టీవీ (బిజినెస్ స్టార్) కోసం అనేక ఇంటర్వ్యూలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆమె అనేక అవార్డులను గెలుచుకున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ కూడా.[1][2] ఆమె స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన 'నస్తపేట కనునీర్', 'వెంజెన్స్ డెమన్', 'తెలిచ్చేరి ఫోర్ట్' వంటివి యూట్యూబ్ లో లక్షల్లో వీక్షణలు ఉన్నాయి.[3]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆషాగి లామియా కేరళలో తలస్సేరిలోని మాంబరం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంది. చిన్నతనంలో సంగీతం, నృత్యం, ఫోటోగ్రఫీ, నాటకాలలో ప్రతిభ కనబరిచిన ఆషాగి లామియా, అసన్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ (యుఒఎమ్) నుండి బిఎస్ (విజువల్ కమ్యూనికేషన్), పెరియార్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ (మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం) పూర్తిచేసింది. అసన్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో ఉన్న రోజుల్లోనే ఆమె జాతీయ శిశు అభివృద్ధి మండలి కేరళ ప్రాంతం నిర్వహించిన బాల కార్మికులు, పిల్లల యాచింపులపై జాతీయ ఫోటోగ్రఫీ పోటీ అవార్డును గెలుచుకుంది. 'టుగెదర్ ఫరెవర్' అనే లఘు చిత్రంలో ఆమె సహయ పాత్రలో నటించింది.

కెరీర్

[మార్చు]

నటిగా ఆమె అనేక లఘు చిత్రాలు చేసింది.[4] చాలా తక్కువ వ్యవధిలో, టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం, వార్తాపత్రికలకు ఎడిటింగ్ చేయడం, స్క్రిప్ట్స్, స్క్రీన్ప్లేలకు రచన, దర్శకత్వం చేయడం, వ్యాపార ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం, వారపత్రిక ఒమన్ డైలీ అబ్జర్వర్ సిటీ టాక్ విభాగానికి సహకరించడం వంటి వివిధ పనులలో ఆషాగి లామియా పనిచేసింది.[5] సహజ వనరుల బాధ్యతారహితమైన నిర్వహణ వల్ల తలెత్తే వాతావరణ మార్పులతో సహా ప్రపంచ విషయాలపై జర్నలిజం ద్వారా ఆషాగి లామియా తన ఆందోళనను క్రమం తప్పకుండా పంచుకుంటుంది.[6]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Business Star K.Mohanan Nair, EPI-4, Part-01". YouTube. Retrieved 2014-02-22.
  2. ↑ "Photography prizes". The Hindu. Archived from the original on 2014-03-03. Retrieved 2014-02-22.
  3. ↑ "New Malayalam Movie Biodata 2014". YouTube. Retrieved 2014-09-11.
  4. ↑ "Together Forever Malayalam shortfilm". YouTube. Retrieved 2014-02-22.
  5. ↑ "Is the price of sending kids to school becoming exorbitant?" (PDF). omanobserver. Archived from the original (PDF) on 2014-02-28. Retrieved 2014-02-22.
  6. ↑ "What can we do to prevent taking the environmental resources for granted?" (PDF). omanobserver. Archived from the original (PDF) on 2014-02-28. Retrieved 2014-02-22.