Jump to content

ఆసిఫాబాద్ సబ్ జైలు

వికీపీడియా నుండి
ఆసిఫాబాద్ స్పెషల్ సబ్ జైలు
ఆసిఫాబాద్ స్పెషల్ సబ్ జైలు
పటం
ఆసిఫాబాద్ స్పెషల్ సబ్ జైలు ప్రాంతపు చైతన్యపూర్వక (ఇంటరాక్టివు) మ్యాపు
ఇతర పేర్లుఆసిఫాబాద్ స్పెషల్ సబ్ జైలు
సాధారణ సమాచారం
రకంతెలంగాణ రైతాంగ పోరాట యోధులు, మావోయిస్టులు, ఖైదీలు, రిమాండ్ నేరస్తుల కోసం
వాస్తు శైలిడంగుసున్నంతో ధిర్ఘచతురస్ర ఆకారంలోఉన్న నిర్మాణం
స్థానంజన్కాపూర్, ఆసిఫాబాద్ మండలం, ఆసిఫాబాద్,ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ, ఇండియా, తెలంగాణ భారతదేశం
నిర్దేశాంకాలు19°16′30″N 79°32′53″E / 19.275°N 79.548°E / 19.275; 79.548
క్లయంటునిజం ప్రభుత్వ
యజమానితెలంగాణ, భారత ప్రభుత్వం


ఆసిఫాబాద్ సబ్ జైలు, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్ మండలం లోని జన్కాపూర్ గ్రామంలో ఈ సబ్ జైలు ఉంది. దీనిని నిజాం పాలనా కాలంలో 1916లో జన్కాపూర్ శివారులో ఐదు ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. జిల్లా జైలుగా కొనసాగుతున్న ఆసిఫాబాద్ జైలును 2008లో ఆదిలాబాద్ కు తరలించి దీనిని స్పెషల్ సబ్ జైలు గా‌ మార్చారు[1][2][3].

పూర్వ చరిత్ర

[మార్చు]

1916 సంవత్సరంలో జన్కాపూర్ శివారులో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ జైలును నిర్మించారు. నిజాం ప్రభుత్వం హయాంలో దీనిని పూర్తిగా డంగుసున్నంతో నిర్మించారు. ఇందులో మూడు బారకలు ఉన్నాయి. సుమారు రెండు వందల మంది ఖైదీలు ఉండేలా జైలు భవనాన్ని నిర్మించారు. కొన్ని సంవత్సరాల వరకు అధికారులు దీనిని ముసి ఉంచి మళ్ళీ మరమ్మతులు చేసి 15 మార్చి 1991‌లో అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఎంజీ గోపాల్ ఆధ్వర్యంలో పునః ప్రారంభించారు. దాదాపు 17 సంవత్సరాలు జిల్లా జైలుగా కొనసాగగా అనంతరం ఈ జైలును 2008లో ఆదిలాబాద్ కు తరలించి సబ్ జైలు గా‌ మార్చారు.

భద్రత

[మార్చు]

ఈ ఆసిఫాబాద్ స్పెషల్ సబ్ జైల్లోని కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి 24 గంటల పాటు సిబ్బంది నిఘా ఉంటుంది.అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పేరొందిన జైలు కావడంతో కమాండ్‌ కంట్రోల్‌ రూం, హైసెక్యూరిటీ బ్యారక్స్, నిరంతర పర్యవేక్షణతో హైసెక్యూరిటీ బ్యారక్స్‌లో సెల్స్‌ కూడా ఉన్నాయి. వీటికి ప్రత్యేక లాకింగ్‌ సిస్టం, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. ఈ జైల్లోని కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి 24 గంటల పాటు సిబ్బంది నిఘా ఉంటుంది. భద్రతా చర్యల్లో భాగంగా శక్తివంతమైన హైరిజల్యూషన్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ నక్సల్స్‌ కోసం ప్రత్యేకంగా నక్సల్స్‌ బ్యారెక్‌ (ఎన్‌ఎక్స్‌ఎల్‌) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జైలులో అనేక మంది ఖైదీలు, నేరస్తులు ఉన్నారు[4][5].

జైలు తరలింపు

[మార్చు]

ఆదిలాబాద్ జిల్లా జైలుగా కొనసాగుతున్న ఆసిఫాబాద్ జైలును 2008లో ఆదిలాబాద్ కు తరలించారు. అనంతరం ఈ జైలును స్పెషల్ సబ్ జైలు గా‌ మార్చారు.

మూలాలు

[మార్చు]
  1. ↑ "జైళ్లు సరిపోతలేవు.. ! | - | Sakshi". www.sakshi.com. Retrieved 2026-01-16.
  2. ↑ "నిజాం నాటి ఆసిఫాబాద్‌ జైలు | - | Sakshi". www.sakshi.com. Retrieved 2026-01-16.
  3. ↑ ABN (2023-11-04). "Kumaram Bheem Asifabad: జైలు జీవితంతో ఖైదీల్లో పరివర్తన రావాలి". Andhrajyothy Telugu News. Retrieved 2026-01-16.
  4. ↑ "MSN". www.msn.com. Retrieved 2026-01-16.
  5. ↑ "Asifabad: కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 16 మంది మావోయిస్టుల అరెస్ట్‌". EENADU. Retrieved 2026-01-16.