ఆసిఫ్ షేక్ (క్రికెట్ ఆటగాడు)
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పుట్టిన తేదీ | 2001 జూన్ 22 బీర్‌గంజ్, నేపాల్ | |||||||||||||||||||||||||||||||||||
| ఎత్తు | 5 ft 10 in (178 cm) | |||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | వికెట్ కీపరు బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||
| బంధువులు | ఆరిఫ్ షేక్ (సోదరుడు) | |||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 24) | 2021 సెప్టెంబరు 7 - PNG తో | |||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2025 జూన్ 8 - స్కాట్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 32) | 2021 ఏప్రిల్ 17 - నెదర్లాండ్స్ తో | |||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2025 సెప్టెంబరు 19 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||
| T20Iల్లో చొక్కా సంఖ్య. | 9 | |||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||
| 2024–ప్రస్తుతం | జనక్‌పూర్ బోల్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESNPcricinfo, 2025 అక్టోబరు 1 | ||||||||||||||||||||||||||||||||||||
ఆసిఫ్ షేక్ (జననం 2001 జూన్ 22) నేపాల్ క్రికెట్ ఆటగాడు. కుడిచేతి వాటం వికెట్-కీపర్ - బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్నాడు.[1] అతను 2021 ఏప్రిల్లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో నేపాల్ తరపున ట్వంటీ20 అంతర్జాతీయ పోటీల్లో ప్రవేశించాడు.[2] అతను తన క్లాసికల్ బ్యాటింగ్ శైలికి ప్రసిద్ధి చెందాడు. నేపాల్ తరపున అత్యధికంగా, 13 వన్డే క్రికెట్ హాఫ్ సెంచరీలు అతను సాధించాడు.[3]
అతను ప్రధానమంత్రి దేశీయ కప్ యొక్క ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ క్లబ్, పోఖారా ప్రీమియర్ లీగ్ లోని పోఖారా పల్టన్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు.[4]
దేశీయ కెరీర్, U-19
[మార్చు]షేక్, ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్‌లో పంచకన్య తేజ్ తరపున ఆడాడు. 2016 ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో అజేయంగా 111 పరుగులు చేసి,[5] తన జట్టు తొలి EPL టైటిల్‌ను గెలుచుకోవడంలో సహాయపడ్డాడు. [6] అతను టోర్నమెంటులో ఆరు మ్యాచ్‌లలో 44.00 సగటుతో 202 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.[7]
భారతదేశంలో జరిగిన 2018 క్వాడ్రాంగులర్ క్రికెట్ టోర్నమెంటులో అతను నేపాల్ అండర్-19 జట్టుకు నాయకత్వం వహించాడు.[8] తరువాత, అతను 2018 ACC అండర్-19 ఆసియా కప్ కోసం నేపాల్ జాతీయ అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[9] అతను 2019 ACC అండర్-19 ఆసియా కప్‌లో అండర్-19 జట్టు తరపున కూడా ఆడాడు.[10]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]2021 ప్రైమ్ మినిస్టర్ కప్‌లో టోర్నమెంటులో రెండవ అత్యధిక స్కోరర్‌గా నిలిచిన తర్వాత, ఐదు ఇన్నింగ్స్‌లలో 41.20 సగటుతో 206 పరుగులు చేసిన తర్వాత, ఖతార్‌తో జరిగిన T20I సిరీస్ కోసం క్లోజ్డ్ క్యాంప్‌లకు 18 మంది సభ్యుల జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. [11] [12] అయితే, ఖతార్‌లో పెరుగుతున్న COVID-19 కేసుల కారణంగా పర్యటన చివరికి వాయిదా పడింది. [13]
తరువాత షేక్ 2020–21 నేపాల్ ట్రై-నేషన్ సిరీస్ [14] కోసం 15 మంది సభ్యుల జాతీయ జట్టులో ఎంపిkai, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో టి20ఐల్లో అడుగు పెట్టాడు. [15] ఆ మ్యాచ్‌లో అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. T20Iలలో నేపాల్ తరపున 116 పరుగుల రికార్డు తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు [16] తన జట్టును 9 వికెట్ల విజయానికి నడిపించాడు. [17] మలేషియాతో జరిగిన సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో అతను 42 పరుగులు చేశాడు. తోటి ఓపెనర్ కుశాల్ భూర్టెల్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. [18] [19] అతను సిరీస్‌లో 38.50 సగటుతో 138.73 స్ట్రైక్-రేట్‌తో 154 పరుగులు చేశాడు.[20]
2021 ఆగస్టులో, షేక్ ఒమన్‌లో పాపువా న్యూ గినియాతో జరిగిన సిరీస్ కోసం నేపాల్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో, ఒమన్‌లో జరిగిన 2019–2023 ICC క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 టోర్నమెంటు ఆరో రౌండ్ కోసం వారి జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. [21] 2021 సెప్టెంబరు 7 న నేపాల్ తరపున పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో వన్డే రంగప్రవేశం చేశాడు.[22]
2023 మార్చిలో, పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో షేక్, వన్డేల్లో తన తొలి సెంచరీ సాధించాడు.[23]
2024 మేలో 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంటు కోసం నేపాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. [24]
రికార్డులు, మైలురాళ్ళు
[మార్చు]వన్డే
- ఒక సిరీస్‌లో 200 పరుగులు చేసి, 10 వికెట్ కీపింగ్ అవుట్‌లను చేసాడు [25]
- ఒక సిరీస్‌లో వికెట్ కీపర్ చేసిన 8వ అత్యధిక పరుగులు - 685 పరుగులు [26]
గౌరవాలు
[మార్చు]2022 ఫిబ్రవరిలో ఒమన్‌లో జరిగిన చతుర్భుజ సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్, నేపాల్ ల మధ్య జరిగిన T20I మ్యాచ్‌లో ఐరిష్ ఆటగాడు ఆండీ మెక్‌బ్రైన్‌ను రనౌట్ చేయకూడదనే అతని నిర్ణయానికి గుర్తింపుగా 2022 ICC అవార్డులలో 2022 ICC స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుకు అతను ఎంపికయ్యాడు.[27] [28] మెక్‌బ్రైన్, పిచ్ మధ్యలో బౌలర్‌ను ఢీకొట్టి పడిపోయాడు. షేక్, మెక్‌బ్రైన్ పరుగును పూర్తి చేయడానికి అనుమతించాడు. ICC స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్న మొదటి నేపాల్ ఆటగాడతను.[29]
మూలాలు
[మార్చు]- ↑ "Aasif Sheikh". Cricinfo. Retrieved 17 April 2021.
- ↑ "Nepal Tri-Nation T20I Series: Nepal v Netherlands at Kirtipur, Apr 17, 2021 - Cricket Scorecard - ESPN Cricinfo". Cricinfo. Retrieved 17 April 2021.
- ↑ Staff, cricnepal (2023-09-04). "Aasif Sheikh becomes the first Nepalese batter to score a half-century in Asia Cup". cricnepal.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-06-22.
- ↑ "Aasif Sheikh". Cricinfo. Retrieved 17 April 2021.

- ↑ "Nepal T20I Record: Highest partnerships by wicket". Cricinfo. Retrieved 17 April 2021.
- ↑ "Aasif Sheikh". Cricinfo. Retrieved 17 April 2021.
- ↑ "Nepal Tri-Nation T20I Series: Nepal v Malaysia at Kirtipur, Apr 19, 2021 - Cricket Scorecard - ESPN Cricinfo". Cricinfo. Retrieved 19 April 2021.