ఆస్టన్ మార్టిన్
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి. |
Aston Martin Lagonda Limited | |
---|---|
Aston Martin Logo | |
తరహా | Private Limited Company |
స్థాపన | 1913 |
స్థాపకులు | Lionel Martin Robert Bamford |
ప్రధానకేంద్రము | Gaydon, Warwickshire, United Kingdom |
కీలక వ్యక్తులు | Dr. Ulrich Bez, CEO Marek Reichman, Director of Design |
పరిశ్రమ | Automotive |
ఉత్పత్తులు | Automobile |
యజమాని | David Richards John Sinders Investment Dar Adeem Investment[1] |
నినాదము | Power, Beauty, Soul |
వెబ్ సైటు | Aston Martin Website for United Kingdom Aston Martin Website for the World |
ఆస్టన్ మార్టిన్ లగొండా లిమిటెడ్ వార్ విక్ షైర్ లోని జేడన్లో నెలకొని ఉన్న విలాసవంతమైన క్రీడా కార్లను తయారుచేసే బ్రిటీష్ సంస్థ. సంస్థ పేరు దాని వ్యవస్థాపకులలో ఒకరైన లయనెల్ మార్టిన్ మరియు బకింగ్హామ్ షైర్లోని ఆస్టన్ క్లింటన్ దగ్గరలోని స్పీడ్ హిల్ క్లైమ్బ్కు చెందిన ఆస్టన్ హిల్ ల పేర్ల నుండి పుట్టినది.[2]
1994 నుండి 2007 వరకు ఆస్టన్ మార్టిన్ ఫోర్డ్ మోటర్ కంపెనీలో భాగంగా ఉండి, 2000 సంవత్సరంలో సంస్థ యొక్క ప్రీమియర్ ఆటోమోటివ్ గ్రూపులో భాగమయింది. 2007 మార్చి 12న, డేవిడ్ రిచర్డ్స్ చే నడపబడుతూ ఇన్వెస్ట్మెంట్ డార్ మరియు కువైట్‌కు చెందిన ఆదీం ఇన్వెస్ట్మెంట్ మరియు ఆంగ్ల వ్యాపారి జాన్ సిన్డర్స్ భాగస్వాములుగా ఉన్న ఒక ఉమ్మడి భాగస్వామ్య సంస్థచే £479 మిలియన్లకు కొనుగోలు చేయబడింది.[3] ఫోర్డ్, ఆస్టన్ మార్టిన్ కంపెనీకి 925 మిలియన్ల అమెరికన్ డాలర్లు విలువకట్టి, అందులో 77 మిలియన్ల అమెరికన్ డాలర్ల వాటాను తన వద్ద ఉంచుకుంది.[4]
విషయ సూచిక
చరిత్ర[మార్చు]
ఆస్టన్ మార్టిన్ 1913లో లయనెల్ మార్టిన్[5] మరియు రాబర్ట్ బామ్ఫోర్డ్ లచే స్థాపించబడింది. దానికి ముందు సంవత్సరం వీరిరువురు బామ్ఫోర్డ్ అండ్ మార్టిన్ అనే పేరుతో లండన్ లోని కాలో స్ట్రీటులో ఉన్న సింగర్ సంస్థ ప్రాంగణంలో దానిచే తయారుచేయబడ్డ కార్లను అమ్మేందుకు జతకట్టారు, ఇక్కడే వీరు GWK మరియు కాల్తార్ప్ వాహనాలకు కుడా సేవలందించేవారు. ఆస్టన్ క్లింటన్ దగ్గరలోని ఆస్టన్ హిల్‌లో మార్టిన్ విశిష్ట పందాలలో పాల్గొన్నారు, మరియు ఈ ద్వయం సొంతంగా వాహనాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆస్టన్ మార్టిన్గా నామకరణం చేయబడ్డ మొదటి కారును 1908కి చెందిన ఇసోట్ట-ఫ్రస్కీని కారు యొక్క చట్రానికి నాలుగు సిలిండర్లు కలిగిన కావెన్ట్రీ-సింప్లెక్స్ ఇంజిన్ను అమర్చడం ద్వారా మార్టిన్ తయారుచేశారు.[6][7]
కెన్సింగ్టన్ లోని హెన్నికర్ ప్లేస్ వద్ద వారు తమ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకొని తమ మొదటి కారును 1915 మార్చిలో ఉత్పత్తిచేశారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలవటంతో ఉత్పత్తిని ప్రారంభించలేకపోయారు, మరియు మార్టిన్ అడ్మిరాలిటీలో మరియు బామ్ఫోర్డ్ రాయల్ అర్మి సర్వీసు కార్ప్స్లో చేరారు. మొత్తం యంత్ర సామగ్రిని సాప్ విత్ ఏవియేషన్ సంస్థకి అమ్మివేశారు.
అంతర్ యుద్ధ సంవత్సరాలు[మార్చు]
యుద్ధం తరువాత కంపెనీ కెన్సింగ్టన్ లోని అబింగ్డన్ రోడ్లో తిరిగి స్థాపించబడింది, మరియు ఆస్టన్-మార్టిన్ పేరుతో ఒక కొత్త కారు రూపకల్పన జరిగింది. 1920లో బామ్ఫోర్డ్ కంపెనీని విడిచివెళ్ళారు మరియు కౌంట్ లూయిస్ జొరోస్కి నుండి వచ్చిన నిధులతో కంపెనీ పునరుజ్జీవింపబడింది. 1922లో, బామ్ఫోర్డ్ అండ్ మార్టిన్ సంస్థ ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్‌లో పోటీపడేందుకు కార్లను తయారుచేసింది, మరియు బ్రూక్లాండ్స్లో ఈ కార్లు వేగం మరియు దమ్ములలో ప్రపంచ రికార్డులను నెలకొల్పాయి. రేసుల కొరకు మరియు రికార్డులను బ్రద్దలుకొట్టేందుకు 16 కవాటాల ట్విన్ కామ్ ఇంజిన్లుతో త్రీ వర్క్ టీమ్ కార్లూ తయారుచేయబడ్డాయి: ఆ తరువాత గ్రీన్ పీగా అభివృద్ధి చేయబడిన చట్రం సంఖ్య 1914; చట్రం సంఖ్య 1915, రేజర్ బ్లేడ్ రికార్డ్ కారు; మరియు ఆ తరువాత హాల్ఫోర్డ్ స్పెషలుగా అభివృద్ధి చేయబడిన చట్రం సంఖ్య 1916. పొడవాటి చట్రం మరియు పొట్టి చట్రం అనే రెండు రకాల అమరికలతో దాదాపు 55 కార్లు అమ్మకానికై తయారుచేయబడ్డాయి. 1924లో కంపెనీ దివాలా తీయగా లేడీ చార్వుడ్
దానిని కొని ఆమె కుమారుని మండలిలో ఉంచింది. 1925లో సంస్థ మరలా విఫలమయ్యింది మరియు 1926లో లయనెల్ మార్టిన్ నిష్క్రమణతో కర్మాగారం మూసివేయబడింది.
అదే సంవత్సరంలో ఆ తరువాత, బిల్ రెన్విక్, ఆగస్టస్ (బెర్ట్) మరియు లేడీ చార్వుడ్ తో సహా ధనవంతులైన అనేక ఇతర పెట్టుబడుదారులు, సంస్థ పై ఆధిపత్యం సంపాదించారు మరియు సంస్థకు ఆస్టిన్ మోటర్సుగా తిరిగి నామకరణం చేసి సంస్థను ఫెల్తంలోని పూర్వం వైట్ హెడ్ ఎయిర్ క్రాఫ్ట్ లిమిటెడ్ అయిన స్థలానికి మార్చారు. కొన్ని సంవత్సరాలపాటు రెన్విక్ మరియు బెర్టెలీ భాగస్వాములుగా ఉంటూ పేటెంటు హక్కును పొందిన రెన్విక్ యొక్క దహన కోష్టిక ఇంజిను రూపకల్పనను ఉపయోగించి ఓవర్ హెడ్ కామ్ 4 సిలిండర్ల ఇంజిన్ను అభివృద్ధి చేశారు. ఇది ఒక్కటే 'రెన్విక్ మరియు బెర్టెలీ'చే తయారు చేయబడిన మోటారు కారు. ఇది బజ్జ్ బాక్స్ గా పిలవబడి నేటికీ వాడుకలో ఉంది.
వారు ఈ ఇంజన్ను మోటారు తయారీదార్లకు అమ్మడానికి యోచించారు కాని, అప్పటికే ఆస్టన్ మార్టిన్ కారు యొక్క ఉత్పత్తి లేదని విని ఆస్టన్ మార్టిన్ పేరుకు (ప్రస్తుతం బ్రాండు పేరుగా చెప్పబడేది) ఉన్న ఖ్యాతి పూర్తిగా ఒక కొత్త కారు ఉత్పత్తి చేసేందుకు తమకు ప్రయోజనం చేకూర్చుతుందని గ్రహించారు.
1926 మరియు 1937 సంవత్సరాల మధ్య బెర్టిలీ ఆస్టన్ మార్టినుకు సాంకేతిక నిర్దేశకునిగా ఉన్నారు, మరియు ఈ సమయంలో ఉత్పత్తి చేయబడిన అన్ని ఆస్టన్ మార్టిన్ కార్లకు ఆయనే రూపకర్తగా ఉన్నారు, మరియు ఇవి 'బెర్టిలీ కార్లు'గా చెప్పబడుతున్నాయి. వీటిలో 1½ లీటర్ల 'T-టైప్', 'ఇంటర్నేషనల్, 'లే మాన్స్, 'MKII' మరియు దాని నిష్పాదక రేసు కారు 'అల్స్టర్', మరియు 2 లీటర్ల 15/98 మరియు దాని నిష్పాదక రేసు కారు 'స్పీడ్ మోడల్' వంటివి ఉన్నాయి.
ఎక్కువగా తెరిచిఉన్న రెండు సీట్ల క్రీడా కార్లు మరియు వీటిలో అధిక శాతం బెర్ట్ బెర్టిలీ యొక్క సోదరుడు అయినటువంటి ఎన్రికో (హారీ)చే తయారుచేయబడినప్పటికీ కొన్ని చిన్న చట్రపు నాలుగు సీట్ల పర్యాటక కార్లు, డ్రాప్ హెడ్లు మరియు సలూన్లు కుడా ఉత్పత్తి చేయబడ్డాయి.
బెర్టిలీ తన కార్లను రేసుల్లో నడిపేందుకు చాలా ఆసక్తి చూపించేవారు మరియు ఆయనకు చాలా యోగ్యడైన (పోటీతత్వం ఉన్న) డ్రైవరు ఉండేవాడు. తాము రూపకల్పన మరియు నిర్మాణం చేసిన కార్లలో ప్రత్యక్షంగా కూర్చుని మరియు వాటిని రేసులలో నడిపే చాలా కొద్ది మంది మోటారు వాహన తయారీదార్లలో ఆయన ఒకరు, ఈ పోటీ ఈ 'జాతి అభివృద్ధి'కి తోడ్పడిందనే దానిలో సంశయం లేదు మరియు 'LM' జట్టు కార్లు జాతీయ మరియు అంతర్జాతీయ మోటారు రేసులతోపాటుగా లే మాన్స్ మరియు మిల్లె మిల్యా వద్ద కుడా విజయవంతమయ్యాయి.
1932లో మరల ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తాయి మరియు ఆ తరువాతి సంవత్సరం సర్ ఆర్థర్ సథర్లాండ్ కు సంస్థను అప్పగించక మునుపు ఎల్.ప్రిడిక్స్ బ్రూనేచే ఇవ్వబడిన నిధులతో సంస్థ రక్షింపబడింది. 1936లో రోడ్లమీద నడిపే కార్ల ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించేందుకు సంస్థ నిర్ణయిచింది. కార్ల ఉత్పత్తి ఎప్పుడూ చిన్న తరహాగానే ఉంది మరియు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యి పని ఆగిపోయేవరకు వరకు దాదాపు 700 మాత్రమే తయారు చేయబడ్డాయి. యుద్ధం జరుగుతున్న సంవత్సరాలలో విమాన భాగాలు ఉత్పత్తి చేయబడ్డాయి.
డేవిడ్ బ్రౌన్ శకం[మార్చు]
1947లో, సంస్థ "యుద్ధానంతర రక్షకుడు" అయినటువంటి నిర్వాహక నిర్దేశకుడు డేవిడ్ బ్రౌన్ యొక్క నాయకత్వంలో డేవిడ్ బ్రౌన్ లిమిటెడ్ సంస్థను కొనుగోలు చేసింది. అదే సంవత్సరం డేవిడ్ బ్రౌన్ లగొండాను కూడా ఆర్జించారు మరియు రెండు సంస్థలు వనురులను మరియు కార్ఖానాలను పంచుకునేవి. 1995లో, డేవిడ్ బ్రౌన్ శకటాల తయారీ కంపెనీ అయిన టిక్ ఫోర్డ్ మరియు న్యు పోర్ట్ పాగ్నల్లో ఉన్న టిక్ ఫోర్డ్ స్ట్రీట్ లోని దాని యొక్క స్థలాన్ని కొనుగోలు చేయడంతో "DB" అనే ఆద్యక్షరాలు ఉండే ప్రశస్తమైన కార్ల శ్రేణికి అది ఆరంభం అయింది. 1950లో సంస్థ DB2ను ప్రకటించింది, 1953లో DB2/4, 1955లో DB2/4 Mk11, 1957లో DB Mark III మరియు 1958లో ఇటాలియన్ శైలి కలిగిన 3.7 L DB4 దాన్ని అనుసరించాయి. అన్ని కార్లూ సంస్థకు ఒక మంచి పందెపు వంశ పారంపర్యాన్ని నెలకొల్పాయి, కానీ సంస్థ యొక్క పరపతిని స్థాపించడంలో DB4 కీలకమైంది, ఇది 1963లో విడుదలైన ప్రసిద్ధిచెందిన DB5తో మరింత దృఢమైంది. DB6 (1965–70), DBSలతో సంస్థ "గొప్ప పర్యాటక" శైలిని అభివృద్ధి చేయటం కొనసాగించింది.
=== 1970లలో—మరుతూ ఉన్న యాజమాన్యం
===
కారు విలువపరంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ, సంస్థ తరచుగా ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కుంటూ ఉండేది. 1972లో, సంస్థ బర్మింఘం ఆధారిత వ్యాపార సంఘం యొక్క ఆధారం కలిగినటువంటి మరియు చార్టర్డ్ అకౌంటంట్ మరియు సంస్థ నిర్దేశకుడు అయినటువంటి విలియం విల్సన్, MBE అధ్యక్షుడుగా ఉన్నటువంటి కంపెనీ డెవలప్మెంట్స్ లిమిటెడ్ అనే ఇంకొక సంస్థకు అమ్మివేయబడింది.[8]
గ్రాహకుని ఇంకొక దివాలా ఘటనతో, 1975లో సంస్థ £1.05 మిలియనుకు ఉత్తర అమెరికాకు చెందిన వ్యాపారులు పీటర్ స్ప్రేగ్ మరియు జార్జ్ మిండెనులకు మరలా అమ్మివేయబడింది.[9] ఒక ఫలవంతమైన విశేషమైన మార్పును సాధించుట అనే వ్యూహం 360 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకునేందుకు మరియు, 1977 నాటికి £750,000 వ్యాపార లాభాన్ని ఆర్జించేందుకు దారితీసింది.[9] కొత్త యజమానులు సంస్థను దాని రంగంలో ఆధునికత్వంలోకి నెడుతూ, 1977లో V8 వాన్టేజ్, 1978లో మార్చుకోగలిగే వొలంటే, మరియు 1980లో విలియం టౌన్స్-శైలిలో ఉండే బుల్ డాగ్ వంటి వాటిని ఉత్పత్తిచేశారు. V8 నమూనా ఆధారంగా టౌన్స్ రాబోయే కాలానికి అనుగుణంగా కొత్త లగొండా సలూనుకు శైలికల్పన చేశాడు.
1980లో ఆస్టిన్ మార్టినుకు MGను కొనుగోలు చేసి చిన్న కార్ల నిర్మాణం కొరకు సోదరి వ్యాపార గుర్తుగా ఉపయోగించాలని యోచన ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఒక కొత్త నమూనాకు రూపకల్పన చేయాలనే ఆలోచన చేశారు మరియు పత్రికలవారికి "ఆధునీకరించబడిన" "1981" MGBకు వారు దగ్గరగా వెళ్లడాన్ని బయటపెట్టారు.
1980వ దశకంలోని ఆర్థిక సంకోచం తాకిడికి సంస్థ బాగా దెబ్బతినడంతో ఆస్టిన్ మార్టిన్ యొక్క ప్రపంచవ్యాప్త అమ్మకాలు వారానికి మూడుగా కుంచించుకు పోయాయి మరియు అధ్యక్షుడు అలన్ కర్టిస్ తన తోటి భాగస్వాములు అయినటువంటి అమెరికా జాతీయుడు పీటర్ స్ప్రేగ్ మరియు కెనడా జాతీయుడైన జార్జ్ మిన్డేన్ లతో కలసి సేవ మరియు పునస్థాపనపై దృష్టి కేంద్రీకరించేందుకు, వ్యాపారం యొక్క ఉత్పత్తి దిశ మూసివేతకు దగ్గరగా వచ్చారు. ఈ సమయంలో కర్టిస్ 1980లో పేస్ జవాబుదారీగా ఉన్న బ్రాండ్స్ హాచ్ వద్ద జరిగిన స్టిర్లింగ్ మాస్ బెనిఫిట్ డేకు హాజరయారు, మరియు సహచర ఫార్న్హం నివాసి అయిన విక్టర్ గాంట్లెట్ను కలిశారు.
1980ల—విక్టర్ గాంట్లెట్[మార్చు]
1980లో పేస్ పెట్రోలియుం ద్వారా గాంట్లెట్ ఆస్టన్ మార్టినులో 12.5% వాటాను కొనుగోలుచేశారు, CH ఇండస్ట్రియల్స్ యొక్క టిమ్ హెర్లీ కుడా అదే శాతం వాటాను తీసుకున్నారు. 1981 ప్రారంభంలో గాంట్లెట్ ముఖ్యాధికారాలు కలిగిన అధ్యక్షుడుగా పేస్ మరియు CHIలు సంయుక్త 50/50 యజమానులుగా సంస్థను అధీనంలోకి తీసుకున్నారు. గాంట్లెట్ అమ్మకాల జట్టును కూడా ముందుకు నడిపించారు, మరియు కొద్ది అభివృద్ధి మరియు చాలా ప్రచారం తరువాత సంస్థ ప్రపంచంలోకే అతి వేగవంతమైన 4-సీట్ల కార్ల ఉత్పత్తిదారునిగా అయ్యాక, ఆస్టన్ మార్టిన్ లగొండా కారును పెర్షియన్ గల్ఫ్ రాష్ట్రాలలో ముఖ్యంగా ఒమన్, కువైట్ మరియు కతార్లలో విజయవంతంగా అమ్మగలిగింది.[10]
కొత్త ఆస్టన్ మార్టిన్ ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు కొంత సమయం పడుతుందని గ్రహించి, వారు ఇతర సంస్థలకు మోటారు వాహనాలకు సంబంధించిన ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు టిక్ ఫోర్డును కొనుగోలు చేశారు. టిక్ ఫోర్డ్ ఆస్టిన్ మార్టిన్ మెట్రో, టిక్ ఫోర్డ్ కాప్రి మరియు టిక్ ఫోర్డ్ రైలు లోపలి భాగాలు ముఖ్యంగా జాగర్ XJS పై ఉన్నవి ఈ ఉత్పత్తులలో ఉన్నాయి.[10] పేస్ రేసులకు జవాబుదారిగా ఉండటం కొనసాగించారు, మరియు ఈ సమయంలో 1982 మరియు 1983 రెండు సంవత్సరాలకు ఉత్పత్తిదారుల పోటీలలో మూడవ స్థానంలో నిలిచిన AMOC అధ్యక్షుడు అయినటువంటి విస్కౌంట్ డౌన్ యొక్క టిక్ ఫోర్డ్ ఇంజిను కలిగినటువంటి నిమ్రాడ్ గ్రూపు సి కారును తీసుకుని ఆస్టన్ మార్టిన్ క్లబ్బు యొక్క అన్ని ఘట్టాలకు జవాబుదారీగా ఉన్నారు. ఇది 1982లో జరిగిన 24 గంటల లే మాన్స్ రేసులో కూడా ఏడవ స్థానంలో నిలిచింది. ఏమైనప్పటికీ, 1982లో ఉత్పత్తి చేయబడిన కార్లలో కేవలం 30 కార్ల అమ్మకంతో అమ్మకాలు ఎప్పట్టికంటే చాలా తక్కువగా ఉన్నాయి.[10]
పెట్రోలియుం మార్కెట్లో వ్యాపారం చేయటం చాలా కష్టతరంగా ఉండటం, మరియు ఆస్టన్ మార్టినుకు అధిక సమయం మరియు ధనం అవసరమవడంతో, 1983 సెప్టెంబరులో గాంట్లెట్ హేస్/పేస్ లను కువైట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసుకు అమ్మేందుకు అంగీకరించారు. ఆస్టన్ మార్టినుకు చాలా ఎక్కువ పెట్టుబడి అవసరమవడంతో, అమెరికన్ దిగుమతిదారుడు మరియు ఓడల ద్వారా రవాణా వ్యాపారంలో గ్రీకులో అగ్రగణ్యుడు మరియు తన ఉమ్మడి భాగస్వామ్య సంస్థ ALL ఇన్కార్పొరేటేడ్ లో నిక్ మరియు జాన్ పాపనికొలౌల పెట్టుబడులు కలిగినటువంటి పీటర్ లివనోస్కు తన వాటాను అమ్మేందుకు కూడా గాంట్లెట్ అంగీకరించారు. గాంట్లెట్ AML సంస్థకు అధ్యక్షుడుగా ఉండగా 55% వాటాను ALL కలిగుండగా, టిక్ ఫోర్డులో ALL మరియు CHIల మధ్య 50/50 భాగస్వామ్యం ఉండేది. ALL ఆస్టిన్ మార్టినులో మరింత ఎక్కువ వాటాను పొందేందుకుగల అవకాశాలపై కసరత్తు చేయడంతో ఈ ఇబ్బందికర భాగస్వామ్యం ముగిసింది; మిగిలిన CHI షేర్లు టిక్ ఫోర్డుపై పూర్తి హక్కుకై CHIకి మార్పిడి చేయబడ్డాయి, దీనితో ఆస్టిన్ మార్టిన్ యొక్క పధకాల అభివృద్ధి నిలుపుకున్నట్టు అయింది. 1984లో, పాపినికొలౌ యొక్క ప్రధాన షిప్పింగ్ సంస్థ అయినటువంటి టైటన్ సమస్యలో చిక్కుకుంది, అందువలన లివనోస్ తండ్రి జార్జ్ ALLలో పాపినికొలౌ యొక్క వాటాను కొనుగోలు చేశారు, అదే సమయంలో 25% వాటాతో గాంట్లెట్ మరలా AMLలో వాటాదారుడు అయ్యారు. తన 10,000వ కారును తయారుచేసిన సంవత్సరంలోనే, ఈ లావాదేవీ ఆస్టన్ మార్టిన్/AMLకు £2 మిలియన్ వెల కట్టింది.[10]
ఆస్టిన్ మార్టినులో 60 మంది పనివారిని అనావశ్యంగా ఉంచవలసినప్పటికీ, గాంట్లెట్ ఇటాలియన్ శైలికార గృహం జగాటోను కొనుగోలుచేశారు, మరియు ఆస్టిన్ మార్టినుతో దాని సహకారాన్ని పునరుజ్జీవింప చేశారు.
1986లో, గాంట్లెట్ కాల్పనిక బ్రిటిష్ రహస్య ఏజెంటు పాత్ర అయిన జేమ్స్ బాండ్ పాత్రను తిరిగి ఆస్టన్ మార్టినుకు తీసుకువచ్చేందుకు సంప్రదింపులు జరిపారు. షాన్ కానెరీ-వంటి అనుభూతిని బాండ్-బ్రాండుకు తిరిగి వేళ్ళూనేటట్లు చేసే ప్రయత్నంలో భాగంగా నటుడు టిమోతి డాల్టన్‌ను ఎంచుకుని ఆ పాత్రను తిరిగి చూపించాలని కబ్బి బ్రొకోలి భావించారు. ది లివింగ్ డేలైట్స్ చిత్రీకరణలో ఉపయోగించేందుకు గాంట్లెట్ ఉత్పాదనకు ముందే తన వ్యక్తిగత వాన్టేజ్ కారును సరఫరా చేశారు, మరియు అమెరికాలో అతని ఇంటివద్ద ఉపయోగించేందుకు బ్రోకోలీకు ఒక కారును అమ్మారు. చిత్రంలోని KGB కల్నల్ పాత్రను గాంట్లెట్ తిరస్కరించారు, ఏమైనప్పటికీ: "నేను ఈ పాత్రను పోషించటానికి ఇష్టపడ్డాను కానీ నిజంగా తగినంత సమయం కేటాయించ లేకపోయాను."[11]
సంస్థ బాగా నడుస్తున్నప్పటికీ, దీర్ఘ కాలం మనగలగాలంటే మరిన్ని ఎక్కువ నిధులు అవసరమని గాంట్లెట్ కు తెలుసు. 1987 మేలో, ఒక ఘట్టం యొక్క పునః పరిశీలనార్థం అసలైన మిల్లె మిల్యా యొక్క వ్యవస్థాపకుని భార్య అయిన కాంటెస్సా మాగీ యొక్క గృహంలో గాంట్లెట్ మరియు కెంట్ యువరాజు మైక్హెల్ బస చేశారు. ఇంటిలో ఇంకొక అతిథిగా ఫోర్డ్ అఫ్ యూరోప్ యొక్క ఉపాధ్యక్షుడు వాల్టర్ హేస్ ఉన్నారు. ముందరి AC కార్ల ఆర్జనలో సమస్యలు ఉన్నప్పటికీ, హేస్ సంస్థ యొక్క సామర్థ్యాన్ని చూశారు మరియు చర్చల ఫలితంగా 1987 సెప్టెంబరులో ఫోర్డ్ వాటాను తీసుకుంది.[12] 20 సంవత్సరాలలో 5000 కార్లు ఉత్పత్తి చేయగా, పునః పరిశీలింపబడిన ఆర్థిక వ్యవస్థ మరియు ఒక్కొక్కటి £86,000కు అమ్మబడిన పరిమిత కూర్పు వాన్టేజ్, మరియు 52 వోలంటే జగాటో కూప్స్ యొక్క ఫలవంతమైన అమ్మకాలు; 1988లో సంస్థ ఎట్టకేలకు పురాతన V8 కారు ఉత్పత్తిని విరమించుకుని విరాజ్ శ్రేణిని ప్రవేశపెట్టింది—20 సంవత్సరాలలో ప్రవేశపెట్టబడిన మొదటి కొత్త ఆస్టన్ మార్టిన్ కారు.
ఒప్పందం ప్రకారం రెండు సంవత్సరాలపాటు గాంట్లెట్ సంస్థ అధ్యక్షునిగా ఉండవలసి ఉన్నప్పటికీ, ఆయనకు రేసులపై ఉన్న మక్కువ 1989లో యూరోపులో పరిమిత విజయంతో ఆస్టన్ను తిరిగి క్రీడా కార్ల రేసులలోకి తీసుకువెళ్ళింది. ఏమయినప్పటికీ, 1990 కాలానికి ఇంజిను నియమాల మార్పులు మరియు కొత్త ఆస్టన్ మార్టిన్ వోలంటే మోడల యొక్క ప్రవేశంతో, జాగర్ కార్ల రేసు జట్టుకు కాస్వర్త్ ఇంజినులను ఫోర్డ్ పరిమిత సంఖ్యలో సరఫరా చేసింది. "చిన్న ఆస్టన్ మార్టిన్" DB7కు చాల ఇంజనీరింగ్ శక్తి అవసరమవడంతో, ఆస్టన్ మార్టిను యొక్క పూర్తి నియంత్రణను తీసుకునేందుకు ఫోర్డ్ అంగీకరించడంతో 1991 గాంట్లెట్ సంస్థ అధ్యక్షతను హేస్ కు అప్పగించారు.[13] 1992లో, వాన్టేజ్ శ్రేణి ప్రకటింపబడింది, మరియు ఆ తరువాతి సంవత్సరం సంస్థ DB7 ప్రకటనతో DB శ్రేణికి నూతన సృష్టి చేసింది.
ఫోర్డ్ శకం[మార్చు]
ఆస్టన్ను ఫోర్డ్ ప్రీమియర్ ఆటోమోటివ్ గ్రూపులో ఉంచి, కొత్త తయారీలో చాలా అధికంగా పెట్టుబడి పెట్టింది మరియు త్వరగా ఉత్పత్తిని పెంచింది. 1994లో, ఫోర్డ్ బ్లాక్సంలోని బాన్బరీ రోడ్డులో ఒక కొత్త కర్మాగారాన్ని తెరిచింది. 1995లో, సంస్థ రికార్డు స్థాయిలో 700 వాహనాలను ఉత్పత్తి చేసింది. ఫోర్డ్ శకానికి ముందువరకు కార్లు ఇంగ్లీష్ వీల్ మాదిరిగా చేతితో శకటాలను నిర్మించే చేతిపని పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేయబడేవి. 1998లో 2000వ DB7 నిర్మింపబడింది, మరియు ముందటి అన్ని DB నమూనాల ఉత్పత్తిని తలదన్నుతూ 2002లో 6000వ కారు ఉత్పత్తి చేయబడింది. 1999లో V12 వాన్టేజ్ నమూనాల యొక్క చేరికతో DB7 శ్రేణి ఎగదోయబడింది, మరియు 2002లో సంస్థ V12-ఇంజిను కలిగినటువంటి వాన్క్విష్ కారును ప్రవేశపెట్టింది.
2003లో మిషిగన్ లోని డెట్రాయిటులో జరిగిన ఉత్తర అమెరికా అంతర్జాతీయ ఆటో ప్రదర్శనలో, ఆస్టన్ మార్టిన్ AMV8 వాన్టేజ్ భావన కారును ప్రవేశపెట్టింది. 2005లో దాని ప్రవేశానికి ముందు కొన్ని మార్పులు ఆశించగా, సంస్థ అతి పెద్ద విపణిలో పోటీపడేందుకు వీలుగా ఆధిక ప్రాశస్త్యం కలిగిన V8 ఇంజినును వాన్టేజ్ ద్వారా తిరిగి తీసుకువచ్చింది. 2003 గేడన్ కర్మాగారం యొక్క ప్రారంభాన్ని కూడా చూసింది, ఇది ఆస్టన్ మార్టిన్ చరిత్రలో ఒక ప్రయోజనం కొరకు నిర్మింపబడిన మొట్టమొదటి కర్మాగారం. 2003లో DB9 కూప్ ప్రవేశపెట్టబడింది, ఇది పదేళ్ళనాటి DB7కు బదులుగా వచ్చింది. DB9 యొక్క మార్చుకోగలిగే రకం DB9 వొలంటే, 2004 డెట్రాయిట్ ఆటో ప్రదర్శనలో ప్రవేశపెట్టబడింది. 2009లో, V8 వాన్టేజ్ క్రీడా కారు గేడన్ కర్మాగారంలో ఉత్పాదనలోకి ప్రవేశించింది, DB9 మరియు DB9 వొలంటేలతో జతకూడింది.
డిసెంబరు 2003లో అది తిరిగి 2005లో మోటారు రేసులలోకి రానుందని ఆస్టన్ మార్టిన్ ప్రకటించింది. ఆస్టన్ మార్టిన్ రేసింగ్, అని పిలవబడే ఒక కొత్త విభాగం సృష్టించబడింది, ఇది ప్రోడ్రైవ్ తోపాటు, రుపకల్పన, అభివృద్ధి, మరియు DBR9 కార్యక్రమం యొక్క నిర్వహణలలకు బాధ్యత వహించింది. DBR9 క్రీడా కార్ల రేసుల్లో ప్రపంచ ప్రఖ్యాత లే మాన్స్ యొక్క 24 గంటలుతోపాటు GT తరగతితో పోటీపడుతుంది.
ఫోర్డ్ చే అమ్మకం[మార్చు]
2006లో, ఖర్చులు మరియు పెట్టుబడిపై గ్రహించగలిగే విలువ అనే ఒక అంతర్గత పునః పరిశీలన తన ప్రీమియర్ ఆటోమోటివ్ గ్రూప్ భాగాలనుండి తనను తాను తప్పించాలనే ఫోర్డ్ ఆలోచనకు దారితీసింది. జాగర్ కార్స్, ల్యాండ్ రోవర్ లేదా వోల్వో కార్స్‌ను అమ్మాలనే సూచనల తరువాత, మొత్తం ఆస్టన్ మార్టిన్ను లేదా కొంత భాగాన్ని వేలం ద్వారా అమ్మేందుకు ఫోర్డ్ UBS AGను నియమించింది మరియు ఈ వాస్తవాన్ని 2006 ఆగస్టులో ప్రకటించింది.[14]
2007—ఒక కొత్త శకం ప్రారంభం[మార్చు]
2007 మార్చి 12న ప్రోడ్రైవ్ అధ్యక్షుడు డేవిడ్ రిచర్డ్సుచే నడపబడుతున్న ఒక వ్యాపార సంఘం ఆస్టన్ మార్టిన్ను £475మిలియన్/$848మిలియన్ కు కొనుగోలుచేసింది.[15] ఈ ఒప్పందంలో ప్రోడ్రైవుకు ఎటువంటి ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేదు.[16] సంస్థలో ఫోర్డ్ తన వాటాను ఉంచుకుంటుంది (40 మిలియన్ £లు / 70 మిలియన్ $ల విలువైన) ఈ వ్యాపార సంఘంలో ఆస్టన్ మార్టిన్ సేకర్త జాన్ సిన్దర్స్; మరియు కువైటుకు చెందిన రెండు పెట్టుబడి సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ దార్ మరియు అదీం ఇన్వెస్ట్మెంట్ కార్పోరేషన్లు కుడా ఉన్నాయి.
2007 జూన్ మరియు ఆగస్టు మధ్య కాలంలో, పూర్తిగా కొత్తదైన ఆసియన్ రహదారి యొక్క తూర్పు-పడమర సందస్థలాన్ని V8 వాన్టేజ్ కారు నడుపుతూ బ్రిటన్స్ రిచర్డ్ మెరిడిత్ మరియు ఫిల్ కొలీలు సాధించారు. 0}AH1 మరియు AH5లను అనుసరిస్తూ టోక్యో (రహదారి యొక్క తూర్పు చివర)నుండి పడమటి చివరన ఉన్న ఇస్తాంబుల్ వరకు, లండనుకు తీసుకువెళ్ళే మోటారుదారి వలయాన్ని కలిసేముందు లండనుకు ఇంకొక 3259 కిమీ (2025 మైళ్ళు) కాక వారు మొత్తం 12089 కిమీ (7512 మైళ్ళు) నడిపారు. అపాయకరమైన ప్రదేశాలలో V8 వాన్టేజ్ యొక్క మన్నికను ప్రత్యక్షముగా చూపించటం మరియు కారుకు చైనాలో ప్రాచుర్యం కలిగించడం కూడా ఈ ఘట్టం యొక్క ఉద్దేశం. ఈ కసరత్తు ఎంత ఫలవంతమైనదంటే మూడు నెలల కాలంలోనే సంస్థ షాంగై మరియు బీజింగ్ లలో వ్యాపార శాఖలను తెరిచింది.[17]
2007 జూలై 19న, న్యూపోర్ట్ పాగ్నెల్ కర్మాగారం తన చివరి కారు వాన్క్విష్ Sను బయటికి పంపించింది.1995 నాటి నుండి ఇక్కడ దగ్గరగా 13,000 కార్లు తయారుచేయబడ్డాయి. టిక్ ఫోర్డ్ స్ట్రీట్ కర్మాగారం పునస్థాపన మరియు సేవా విభాగంగా ఆస్టన్ మార్టిన్ యాజమాన్యం వద్దనే మిగిలి ఉంటుంది.[18] అటుపిమ్మట సంయుక్త రాజ్యంలోని ఉత్పత్తి పూర్వం RAF V- బాంబర్ వాయు ప్రదేశంగా ఉన్న గేడన్ వద్ద కేంద్రీకరించబడింది. 2008 మార్చి 4న ఆస్ట్రియాలోని గ్రాజ్ వద్ద సంవత్సరానికి 2000కు పై చిలుకు కార్ల తయారీని బయటకు అప్పగించటంలో భాగంగా మాగ్నా స్టేర్తో ఏర్పరుచుకున్న భాగస్వామ్యం గూర్చి ప్రకటించే సమయంలో సంస్థ చెప్పిందేమిటంటే
సంస్థ యొక్క కొనసాగుతున్న ఎదుగుదల మరియు విజయం కేంద్ర బిందువు మరియు వ్యాపారం యొక్క గుండెవంటి గేడన్ పైన ఆధారపడుంది, ఇక్కడే ఆస్టన్ మార్టిన్ యొక్క ఆని ఉత్పత్తుల రూపకల్పన మరియు ఇంజినీరింగ్ పనుల నిర్వహణ కొనసాగుతుంది.[19]
యూరోపులో మరిన్ని డీలర్లను తెరవడంతో పాటుగా తన 93 ఏళ్ళ చరిత్రలో మొదటి సారిగా చైనాలోని బీజింగ్ మరియు షాంగైలలో శాఖలను తెరవడం ద్వారా ఆస్టన్ మార్టిన్ తనకున్న ప్రపంచవ్యాప్త ఆకర్షణను గొప్పగా ప్రదర్శించింది. ఇది వారి డీలఋషిప్ కార్యక్రమాన్ని 28 దేశాలలో 120 డీలర్లకు చేర్చింది.[20]
2008 సెప్టెంబరు 1న, ఆస్టన్ మార్టిన్ లగొండా బ్రాండు యొక్క పునఃపరిశీలన గూర్చి ప్రకటించింది. 2009లో సంస్థ యొక్క వందవ వార్షికోత్సవంతో సంపాతంచెందేవిధంగా, ఒక ఉహనం చూపించబడుతుంది. మొదటి ఉత్పత్తి కార్లు 2012 నాటికి బయటకు రావాల్సి ఉన్నాయి.[21]
ఆస్టన్ మార్టిన్ తన పనివారి సంఖ్యను 1850 నుండి 600కు కుదించనున్నట్టు 2008 డిసెంబరులో ప్రకటించింది.[22]
2009—లే మాన్స్ వద్దకు తిరిగివచ్చుట[మార్చు]
2009 జనవరిలో, ప్రతిష్ఠాత్మక LMP1 విభాగంలో కర్మాగారం జట్టుగా 2009 లే మాన్స్ 24 గంటల రేసులోకి ప్రవేశించనున్నట్లు సంస్థ ప్రకటించింది. చరోజ్ రేసింగ్ బానరు క్రింద 2008 కాలం పొడుగునా లోలా B08/60 LMP1 కూప్ తో పోటీపడిన తరువాత, ఆస్టన్ మార్టిన్ తమ కార్యక్రమాలకు కొద్దిగా మార్పుచేయబడిన లోలా LMP1 రూపకల్పనను ఉపయోగించనుంది. 2009 లే మాన్స్ 24 గంటలలోకి ఆస్టన్ మార్టిన్ యొక్క మూడు లోలా-ఆస్టన్ మార్టినులు ప్రవేశపెట్టబడినప్పటికీ కేవలం రెండిటికి మాత్రమే జవాబుదారీ ధ్రువీకరించబడింది. ఏప్రిల్లో బార్సిలోనాలో ప్రారంభమయ్యి, ఆస్టన్ మార్టిన్ పూర్తి లే మాన్స్ క్రమంలో లోలా-ఆస్టన్ మార్టిన్ LMP కార్లతో కుడా పోటీపడనుంది. మార్చి 8న జరిగిన కాలానికి ముందరి పాల్ రికార్డ్ పరీక్షలో ఒక ప్రమాదంలో తోమస్ ఎంగ 007 కారును ధ్వంసం చేయటంతో ఈ కార్యక్రమం ఒక దురదృష్టకర ప్రారంభంతో మొదలయింది. ఆస్టన్ మార్టిన్ రేసింగ్ అటుపిమ్మట చట్రం యొక్క రచన స్థానంలో ఒక కొత్త లోలాను తీసుకోవడం జరిగింది.[23]
2010 బయటకు పంపించబడిన రాపిడే (ఖర్చు తగ్గించేందుకు బయటి తయారీదార్లకు ఇచ్చుట)[మార్చు]
3}ఆస్ట్రియా లోని గ్రాజ్లో ఉన్న మాగ్నా స్టేర్ కర్మాగారం నుండి మొదటి 4 ద్వారాల ఆస్టన్ మార్టిన్ రాపిడే క్రీడా కారు బయటకివచ్చింది.[24] ఆస్టన్ మార్టిన్ మరియు మెర్సిడెస్ బెంజ్ మరియు ప్యుజుట్ వంటివి మరియు ఇతర బ్రాండులకు ఉన్న అచ్చమైన ప్రమాణాలకు తగినట్టుగా కాంట్రాక్టు తయారీదారుడు తానూ ఉన్నాననే నమ్మకం కలిగించేందుకు అంకిత భావంతో సౌకర్యాలను అందిస్తాడు.[25]
చలన చిత్రాలు మరియు సంస్కృతిలో ఆస్టన్ మార్టినులు[మార్చు]
- 1963లోని ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ యొక్క ది బార్డ్స్ చిత్రంలో టిప్పి హెడ్రన్ యొక్క పాత్ర ఒక వెండి వర్ణపు ఆస్టన్ మార్టిన్ DB2/4 డ్రాప్ హెడ్ కూపును నడిపింది (మార్చుకోగలిగేటువంటి).[26]
- రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ యొక్క ఏడవ నవల గోల్డ్ ఫింగర్ లో, ఆయన తన కథానాయుకుడు జేమ్స్ బాండుకు ఒక DB IIIను ఇచ్చారు. తెరపై ఈ బ్రాండు మరియు 007 మధ్యగల దీర్ఘకాల అనుబంధం గోల్డ్ ఫింగర్ (1964) మరియు థండర్ బాల్ (1965) చిత్రాలలో వెండి వర్ణపు DB5 కనిపించడంతో ప్రారంభమయింది. ఇది జేమ్స్ బాండ్ యొక్క సంస్థ కారుగా ఉండేది, మరియు గోల్డెన్‌ఐ (1995) మరియు టుమారో నెవెర్ డైస్ (1997) చిత్రాలలో ఇది జేమ్స్ బాండ్ యొక్క సొంత కారుగా కనిపించింది. ఆన్ హెర్ మజెస్టీ'స్ సీక్రెట్ సర్వీస్ (1969) చిత్ర ప్రారంభం మరియు చివరలో ఒక లోహపు ఆకుపచ్చ DBS కనిపిస్తుంది. లోటస్‌తో ఒక విరామం తరువాత, ఆస్టన్ మార్టినులు మరలా ఉపయోగించబడ్డాయి: ది లివింగ్ డేలైట్స్ (1987) చిత్రంలో బొగ్గు-ఉదారంగు గల V8 వొలంటే మరియు వాన్టేజ్ కార్లు ఉపయోగించబడ్డాయి. చాలా చిత్రాలకు BMWకు మారిన తరువాత, డై అనదర్ డే (2002)లో వాన్క్విష్ కనిపించింది. 0}కాసినో రోయాల్ (2006) చిత్రంలో ఒక పోకర్ ఆటను గెలిచాక అతని సొంత వాహనం అయినటువంటి శ్రేష్ఠమైన DB5 కారు మరియు క్వాంటం అఫ్ సోలేస్ (అక్టోబరు 31న థియేటర్లలో విడుదలైన చిత్రం)లో అతని సంస్థ కొత్త కారుగా బయటపెట్టబడ్డ కొత్త DBS రెండింటినీ జేమ్స్ బాండ్ పాత్ర నడపడం చూడవచ్చు.
- ది ఇటాలియన్ జాబ్ యొక్క 1969లోని అసలు శ్రేణి చిత్రంలో మైక్హెల్ కైన్ యొక్క పాత్ర వెండి/ఉదారంగు మార్చుకోగాలిగేటువంటి DB4ను నడపటం జరిగింది.
- ది పెర్సుయేడర్స్! అనే టీవీ ధారావాహికలో సర్ రోగర్ మూర్ ఒక పసుపు బహామా ఆస్టన్ మార్టిన్ DBSను నడిపారు. DBS V8 కారును ఈ ధారావాహికలో ఉపయోగించవలసి ఉంది, ఏమైనప్పటికీ ఏ ఒక్క V8 కారు సిద్ధంగా లేకపోవడంతో, V8లా కనిపించే విధంగా ఒక ఆరు సిలిండర్ల DBSను సవరించటం జరిగింది.
నమూనాలు[మార్చు]
అభ్యాసం లేనివారికి ఆస్టిన్ మార్టిన్ యొక్క నమూనాల పేర్లు గందరగోళంగా ఉండవచ్చు. సాధారణంగా, అధిక ప్రదర్శనా నమూనాలు వాన్టేజ్ పేరును ఉపయోగిస్తాయి, అదే సమయంలో మార్చుకోగలిగేవి వోలంటే అని పిలవబడతాయి. ఏమైనప్పటికీ ప్రస్తుత V8 మరియు V12 వాన్టేజ్ శ్రేణులు దీనికి మినహాయింపు, మిగతా అధిక ప్రదర్శనా కార్లకంటే వీటికి వాటి సొంత స్థాయి ఉంది.
యుద్ధానికి ముందరి కార్లు[మార్చు]
- 1921–1925 ఆస్టన్ మార్టిన్ స్టాండర్డ్ స్పోర్ట్స్
- 1927–1932 ఆస్టన్ మార్టిన్ ఫస్ట్ సిరీస్
- 1929–1932 ఆస్టన్ మార్టిన్ ఇంటర్నేష్నల్
- 1932–1932 ఆస్టన్ మార్టిన్ ఇంటర్నేష్నల్ లే మాన్స్
- 1932–1934 ఆస్టన్ మార్టిన్ లే మాన్స్
- 1933–1934 ఆస్టన్ మార్టిన్ 12/50 స్టాండర్డ్
- 1934–1936 ఆస్టన్ మార్టిన్ Mk II
- 1934–1936 ఆస్టన్ మార్టిన్ అల్స్టర్
- 1936–1940 ఆస్టన్ మార్టిన్ 2 లీటర్ల స్పీడ్ మోడళ్ళు ( నిర్మింపబడిన 23) ఆఖరి 8 C-టైపు దేహపనితనంతో బిగించబడ్డాయి.
- 1937–1939 ఆస్టన్ మార్టిన్ 15/98
యుద్ధాననంతర క్రీడా మరియు GT కార్లు[మార్చు]
- 1948–1950 ఆస్టన్ మార్టిన్ 2-లీటర్ స్పోర్ట్స్ (DB1)
- 1950–1953 ఆస్టన్ మార్టిన్ DB2
- 1953–1957 ఆస్టన్ మార్టిన్ DB2/4
- 1957–1959 ఆస్టన్ మార్టిన్ DB మార్క్ III
- 1958–1963 ఆస్టన్ మార్టిన్ DB4
- 1961–1963 ఆస్టన్ మార్టిన్ DB4 GT జగాటో
- 1963–1965 ఆస్టన్ మార్టిన్ DB5
- 1965–1966 ఆస్టన్ మార్టిన్ చిన్న చట్రపు వొలంటే
- 1965–1969 ఆస్టన్ మార్టిన్ DB6
- 1967–1972 ఆస్టన్ మార్టిన్ DBS
- 1969–1989 ఆస్టన్ మార్టిన్ V8
- 1977–1989 ఆస్టన్ మార్టిన్ V8 వాన్టేజ్
- 1986–1990 ఆస్టన్ మార్టిన్ V8 జగాటో
- 1989–1996 ఆస్టన్ మార్టిన్ విరాజ్/విరాజ్ వొలంటే
- 1989–2000 ఆస్టన్ మార్టిన్ విరాజ్
- 1993–2000 ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్
- 1996–2000 ఆస్టన్ మార్టిన్ V8 కూప్/V8 వొలంటే
- 1993–2003 ఆస్టన్ మార్టిన్ DB7/DB7 వాన్టేజ్
- 2002–2003 ఆస్టన్ మార్టిన్ DB7 జగాటో
- 2002–2004 ఆస్టన్ మార్టిన్ DB AR1
- 2001–2007 ఆస్టన్ మార్టిన్ V12 వాన్క్విష్
- 2004–2007 ఆస్టన్ మార్టిన్ V12 వాన్క్విష్ S
- 2004– ఆస్టన్ మార్టిన్ DB9
- 2005– ఆస్టన్ మార్టిన్ V8 మరియు V12 వాన్టేజ్
- 2007– ఆస్టన్ మార్టిన్ DBS V12
- 2009– ఆస్టన్ మార్టిన్ వన్-77[27]
- 2010– ఆస్టన్ మార్టిన్ రాపిడే
ఇతర రకాలు[మార్చు]
- 1944 ఆస్టన్ మార్టిన్ ఆటం (కాన్సెప్ట్)
- 1961–1964 లగొండా రాపిడే
- 1976–1989 ఆస్టన్ మార్టిన్ లగొండా
- 1980 ఆస్టన్ మార్టిన్ బుల్ డాగ్ (కాన్సెప్ట్)
- 1993 లగొండా విగ్నేల్ (concept)
- 2007 ఆస్టన్ మార్టిన్ V12 వాన్టేజ్ RS (కాన్సెప్ట్)
- 2008 ఆస్టన్ మార్టిన్ వాన్క్విష్ S
- 2009 ఆస్టన్ మార్టిన్ లగొండా SUV (కాన్సెప్ట్)[28]
- 2010 ఆస్టన్ మార్టిన్ V12 వాన్టేజ్ కార్బన్ బ్లాక్ ఎడిషన్[29]
- 2010 ఆస్టన్ మార్టిన్ DBS కార్బన్ బ్లాక్ ఎడిషన్[29]
ప్రస్తుత నమూనాలు[మార్చు]
- V8 వాన్టేజ్, V8 వాన్టేజ్ రోడ్ స్టర్ & V12 వాన్టేజ్
- ఆస్టన్ మార్టిన్ DB9 & DB9 వొలంటే
- ఆస్టన్ మార్టిన్ DBS V12 & DBS వొలంటే
- రాపిడే
భవిష్యత్ నమూనాలు[మార్చు]
రేసు కార్లు[మార్చు]
- ఇవి కూడా చూడండి: లిస్ట్ అఫ్ ఫార్ములా వన్ కన్స్ట్రక్టర్స్, ఆస్టన్ మార్టిన్ రేసింగ్
మొత్తంగా రేసు కార్లు (యుద్దాననంతరం)[మార్చు]
- ఆస్టన్ మార్టిన్ DB3 (1950–1953)
- ఆస్టన్ మార్టిన్ DB3S (1953–1956)
- ఆస్టన్ మార్టిన్ DBR1 (1956–1959)
- ఆస్టన్ మార్టిన్ DBR2 (1957–1958)
- ఆస్టన్ మార్టిన్ DBR3 (1958)
- ఆస్టన్ మార్టిన్ DBR4 (1959)
- ఆస్టన్ మార్టిన్ DBR5 (1960)
- ఆస్టన్ మార్టిన్ DP212 (1962)
- ఆస్టన్ మార్టిన్ DP214 (1963)
- ఆస్టన్ మార్టిన్ DP215 (1963)
- ఆస్టన్ మార్టిన్ RHAM/1 (1976–1979)
- ఆస్టన్ మార్టిన్ DPLM (1980–1982)
- ఆస్టన్ మార్టిన్ AMR1 (1989)
- ఆస్టన్ మార్టిన్ AMR2 (ఎన్నడూ రేసులకు వాడనిది)
- ఆస్టన్ మార్టిన్ DBR9 (2005-)
- ఆస్టన్ మార్టిన్ DBRS9 (2005-)
- ఆస్టన్ మార్టిన్ V8 వాన్టేజ్ N24 (2006-)
- ఆస్టన్ మార్టిన్ V8 వాన్టేజ్ రాలీ GT (2006-)
- ఆస్టన్ మార్టిన్ V8 వాన్టేజ్ GT2 (2008-)
- ఆస్టన్ మార్టిన్ DBR1-2 (2009-)
ఇంజిను సరఫరా మాత్రమే[మార్చు]
- కూపర్-ఆస్టన్ మార్టిన్ (1963)
- లోలా T70-ఆస్టన్ మార్టిన్ (1967)
- నిమ్రాడ్ NRA/C2-ఆస్టన్ మార్టిన్ (1982–1984)
- EMKA C84/1-ఆస్టన్ మార్టిన్ (1984–1985)
- చీతాః G604-ఆస్టన్ మార్టిన్
- లోలా B08/60-ఆస్టన్ మార్టిన్ (2008-)
మొత్తం ఫార్ములా వన్ ప్రపంచ పోటీల ఫలితాలు[మార్చు]
కీ
సంవత్సరం | చట్రం | ఇంజను | టైర్లు | డ్రైవర్లు | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | పాయింట్లు | WCC |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1959 | ఆస్టన్ మార్టిన్ DBR4 | ఆస్టన్ మార్టిన్ L6 | ? | MON | 500 | NED | FRA | GBR | GER | POR | ITA | యు.ఎస్.ఎ | 0 | 5వ | ||
![]() |
రెట్ | 6 | 6 | రెట్ | ||||||||||||
![]() |
రెట్ | రెట్ | 8 | 10 | ||||||||||||
1960 | ఆస్టన్ మార్టిన్ DBR4 ఆస్టన్ మార్టిన్ DBR5 |
ఆస్టన్ మార్టిన్ L6 | ? | ARG | MON | 500 | NED | BEL | FRA | GBR | POR | ITA | యు.ఎస్.ఎ | 0 | 8th | |
![]() |
DNP | |||||||||||||||
రెట్ | ||||||||||||||||
![]() |
11 |
లే మాన్ యొక్క మొత్తం 24 గంటలను ముగించినవి[మార్చు]
సంవత్సరం | Pos | తరగతి | సంఖ్య | జట్టు | డ్రైవర్లు | చట్రం | ఇంజను | లాపులు |
---|---|---|---|---|---|---|---|---|
1931 | 5 | 1.5 | 25 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 1½ ఇంటర్నేష్నల్ | ఆస్టన్ మార్టిన్ 1.5L I4 | 139 |
1932 | 5 | 1.5 | 20 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 1½ లే మాన్స్ | ఆస్టన్ మార్టిన్ 1.5L I4 | 174 |
5 | 1.5 | 21 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 1½ లే మాన్స్ | ఆస్టన్ మార్టిన్ 1.5L I4 | 168 | |
1933 | 5 | 1.5 | 25 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 1½ లే మాన్స్ | ఆస్టన్ మార్టిన్ 1.5L I4 | 1885 |
5 | 1.5 | 24 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 1½ లే మాన్స్ | ఆస్టన్ మార్టిన్ 1.5L I4 | 174 | |
1934 | 10 | 1.5 | 20 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 1½ లే మాన్స్ | ఆస్టన్ మార్టిన్ 1.5L I4 | 188 |
11 | 1.5 | 24 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 1½ లే మాన్స్ | ఆస్టన్ మార్టిన్ 1.5L I4 | 180 | |
1935 | 3 | 1.5 | 29 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 1½ అల్స్టర్ | ఆస్టన్ మార్టిన్ 1.5L I4 | 215 |
8 | 1.5 | 33 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 1½ అల్స్టర్ | ఆస్టన్ మార్టిన్ 1.5L I4 | 202 | |
10 | 1.5 | 32 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 1½ అల్స్టర్ | ఆస్టన్ మార్టిన్ 1.5L I4 | 199 | |
11 | 1.5 | 31 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 1½ అల్స్టర్ | ఆస్టన్ మార్టిన్ 1.5L I4 | 199 | |
12 | 1.5 | 2 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 1½ | ఆస్టన్ మార్టిన్ 1.5L I4 | 196 | |
15 | 1.5 | 30 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 1½ అల్స్టర్ | ఆస్టన్ మార్టిన్ 1.5L I4 | 190 | |
1937 | 5 | 1.5 | 37 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 1½ అల్స్టర్ | ఆస్టన్ మార్టిన్ 1.5L I4 | 205 |
11 | 2.0 | 31 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ స్పీడ్ మోడల్ | ఆస్టన్ మార్టిన్ 2.0L I4 | 193 | |
1939 | 12 | 2.0 | 29 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ స్పీడ్ మోడల్ | ఆస్టన్ మార్టిన్ 2.0L I4 | 199 |
1949 | 7 | ఎస్ 2.0 |
2 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 2-లీటర్ స్పోర్ట్స్ (DB1) | ఆస్టన్ మార్టిన్ 2.0L I4 | 207 |
11 | ఎస్ 2.0 |
29 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ 2-లీటర్ స్పోర్ట్స్ (DB1) | ఆస్టన్ మార్టిన్ 2.0L I4 | ? | |
1950 | 5 | ఎస్ 3.0 |
19 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DB2 | ఆస్టన్ మార్టిన్ 2.6L I6 | 249 |
6 | ఎస్ 3.0 |
21 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DB2 | ఆస్టన్ మార్టిన్ 2.6L I6 | 244 | |
1951 | 3 | ఎస్ 3.0 |
26 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DB2 | ఆస్టన్ మార్టిన్ 2.6L I6 | 257 |
5 | ఎస్ 3.0 |
25 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DB2 | ఆస్టన్ మార్టిన్ 2.6L I6 | 255 | |
7 | ఎస్ 3.0 |
24 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DB2 | ఆస్టన్ మార్టిన్ 2.6L I6 | 252 | |
10 | ఎస్ 3.0 |
28 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DB2 | ఆస్టన్ మార్టిన్ 2.6L I6 | 236 | |
13 | ఎస్ 3.0 |
2 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DB2 | ఆస్టన్ మార్టిన్ 2.6L I6 | 233 | |
1952 | 7 | ఎస్ 3.0 |
32 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DB2 | ఆస్టన్ మార్టిన్ 2.6L I6 | 248 |
1955 | 2 | ఎస్ 3.0 |
23 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DB3S | ఆస్టన్ మార్టిన్ 2.9L I6 | 302 |
1956 | 2 | ఎస్ 3.0 |
8 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DB3S | ఆస్టన్ మార్టిన్ 2.9L I6 | 299 |
1957 | 11 | ఎస్ 3000 |
21 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DB3S | ఆస్టన్ మార్టిన్ 3.0L I6 | 272 |
1958 | 2 | ఎస్ 3000 |
5 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DB3S | ఆస్టన్ మార్టిన్ 3.0L I6 | 293 |
1959 | 1 | ఎస్ 3.0 |
5 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DBR1/300 | ఆస్టన్ మార్టిన్ 3.0L I6 | 323 |
2 | ఎస్ 3.0 |
6 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DBR1/300 | ఆస్టన్ మార్టిన్ 3.0L I6 | 322 | |
1960 | 3 | ఎస్ 3.0 |
7 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DBR1/300 | ఆస్టన్ మార్టిన్ 3.0L I6 | 306 |
9 | ఎస్ 3.0 |
8 | ![]() |
![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DBR1/300 | ఆస్టన్ మార్టిన్ 3.0L I6 | 281 | |
1977 | 17 | జిటిపి | 83 | ![]() |
![]() ![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DBS V8 RHAM/1 | ఆస్టన్ మార్టిన్ 5.3L V8 | 260 |
1982 | 7 | సి | 32 | ![]() |
![]() ![]() ![]() |
నిమ్రాడ్ NRA/C2 | ఆస్టన్ మార్టిన్-టిక్ ఫోర్డ్ DP1229 5.3L V8 | 317 |
1983 | 17 | సి | 41 | ![]() |
![]() ![]() ![]() |
EMKA C83/1 | ఆస్టన్ మార్టిన్-టిక్ ఫోర్డ్ 5.3L V8 | 275 |
1985 | 11 | సి1 | 66 | ![]() |
![]() ![]() ![]() |
EMKA C84/1 | ఆస్టన్ మార్టిన్-టిక్ ఫోర్డ్ 5.3L V8 | 338 |
1989 | 11 | సి1 | 18 | ![]() ![]() |
![]() ![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ AMR1 | ఆస్టన్ మార్టిన్ (కాల్లవే) RDP87 6.0L V8 | 340 |
2005 | 9 | జిటిఐ | 59 | ![]() |
![]() ![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DBR9 | ఆస్టన్ మార్టిన్ 6.0L V12 | 333 |
2006 | 6 | జిటిఐ | 007 | ![]() |
![]() ![]() ![]() |
ఆస్టన్ మార్టిన్ DBR9 | ఆస్టన్ మార్టిన్ 6.0L V12 | 350 |
9
| జిటిఐ
| 62
| రష్యన్ కాలపు రేసింగ్
మోడెనా జట్టు
|
అంటోనియో గర్సియా
డేవిడ్ బ్రభం
నెల్సన్ పికెట్ జూనియర్.
| ఆస్టన్ మార్టిన్ DBR9
| ఆస్టన్ మార్టిన్ 6.0L V12
| 343
|-
!
| 10
| జిటిఐ
| 009
|
ఆస్టన్ మార్టిన్ రేసింగ్
|
పెడ్రో లామి
స్టిఫానే సరాజిన్
స్టిఫానే ఆర్టేల్లి
| ఆస్టన్ మార్టిన్ DBR9
| ఆస్టన్ మార్టిన్ 6.0L V12
| 342
|-
|}
వీటిని కూడా చూడండి[మార్చు]
గమనికలు[మార్చు]
- ↑ "Aston Martin - The Company - History Timeline". Retrieved 2008-05-07.
- ↑ BBC న్యూస్ ఆర్టికల్
- ↑ ఫోర్డ్ సెల్స్ ఆస్టన్ మార్టిన్ ఫర్ $925 మిలియన్ ఇజిఎమ్ కార్ టెక్ వద్ద, 12 మార్చ్ 2007
- ↑ లయనెల్ వాకర్ బిర్చ్ మార్టిన్ (1878 – 14 అక్టోబర్ 1945) ఈయన కార్నిష్ జాతీయుడు
- ↑ "Aston Martin: Car Manufacturer: Great British Design Quest". Design Museum.
- ↑ "Aston martin 1914–2005". Retrieved 2009-02-15.
- ↑ "News and Comment: Aston Martin changes hands". Autocar. 136 (nbr 3960): 2. date 9 March 1972. Check date values in:
|date=
(help) - ↑ 9.0 9.1 "The Aston Miracle". Car Magazine: pages 35–362. date September 1978. Check date values in:
|date=
(help)CS1 maint: Extra text (link) - ↑ 10.0 10.1 10.2 10.3 "Obituary: Victor Gauntlett". Independent, The (London). Retrieved 2008-02-03.
- ↑ TLD - ప్రెస్ (ఆలీస్/MI6) - thegoldengun.co.uk
- ↑ క్లాసిక్ఇన్సైడ్ - ది క్లాసిక్ డ్రైవర్ న్యూస్ లెటర్
- ↑ కీపింగ్ ది బెస్ట్ అఫ్ బ్రిటిష్ రన్నింగ్ - smh.com.au
- ↑ మర్టినెజ్ J మోటర్అథారిటీ.కామ్ ఫోర్డ్ కన్ఫర్మ్స్ ఆస్టన్ మార్టిన్ ఈస్ ఫర్ సేల్ 2006 ఆగష్టు 31న
- ↑ 00-హెవెన్! బాండ్'స్ కార్ బ్రిటిష్ అగైన్ |స్కై న్యూస్|హోం
- ↑ "David Richards heads consortium to buy Aston Martin" (Press release). Prodrive. 2007-03-12.
- ↑ "New Aston Martin race series for Asia in 2008" (Press release). Aston Martin. 2007-11-28.
- ↑ Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
- ↑ స్టేట్మెంట్ బై ఆస్టన్ మార్టిన్'స్ CEO, Dr అల్రిచ్ బెజ్ అధికారిక సైట్, 4 మార్చ్ 208
- ↑ "Aston Martin News - Aston Martin arrives in China".
- ↑ "Aston Martin News - Aston Martin CEO confirms the revival of the Lagonda Marque".
- ↑ "England | Third of jobs go at Aston Martin". BBC News. 2008-12-01. Retrieved 2009-04-29.
- ↑ "What economic downturn? Aston Martin unveils new supercar". PopSci.com.au. 2009-01-30. Retrieved 2009-01-30.
- ↑ మీడియా అన్నౌన్స్మెంట్ అధికారిక వెబ్ సైట్ పై, 7 మే 2010
- ↑ పాల్ టాన్ఫస్ట్ ఆస్టన్ మార్టిన్ రాపిడే రోల్ల్స్ అవుట్ ఫ్రమ్ ఆస్ట్రియన్ ఫ్యాక్టరీ పాల్ టాన్.ఆర్గ్ వద్ద, 10 మే 2010
- ↑ http://www.imdb.com/title/tt0056869/trivia
- ↑ ఇమేజెస్ అఫ్ వన్-77 ఆస్టన్ మార్టిన్ లగొండా గ్రూపు యొక్క సైట్
- ↑ "Aston Martin Fan Club: Aston Martin Lagonda". Astonmartinfanclub.blogspot.com. 2009-07-21. Retrieved 2010-05-15.
- ↑ 29.0 29.1 Posted by Websoft (2009-12-21). "Aston Martin Fan Club: Aston Martin Carbon Black Edition V12 Vantage And DBS Announced". Astonmartinfanclub.blogspot.com. Retrieved 2010-05-15.
- ↑ "Ten-Foot Aston Martin Cygnet Gets 50 MPG, Plays Sidecar to Your DBS". PopSci.com.au. 2009-07-01. Retrieved 2009-07-01.
- ↑ Posted by Websoft (2010-01-16). "Aston Martin Fan Club: 2012 Aston Martin Cygnet". Astonmartinfanclub.blogspot.com. Retrieved 2010-05-15.
బాహ్య లింకులు[మార్చు]
- ఆస్టన్ మార్టిన్— ఆస్టన్ మార్టిన్ అధికారిక సైట్
- ఆస్టన్ మార్టిన్ రేసింగ్—కంపెనీ అధికారిక సైట్
- ఆస్టన్ మార్టిన్ ఓనర్స్ క్లబ్-ఆస్టన్ మార్టిన్ యజమానుల అధికారిక క్లబ్
మూస:British Car Industry మూస:Aston Martin మూస:Aston Martin Sportscar Racers మూస:Formula One constructors మూస:British Royal Warrant holders
- CS1: long volume value
- గూగుల్ అనువాద వ్యాసాలు
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- ఆస్టన్ మార్టిన్
- క్రీడా కార్ల ఉత్పత్తిదారులు
- సంయుక్త రాజ్యం యొక్క మోటారు వాహన తయారీదారులు.
- బ్రిటిష్ బ్రాండులు
- ఫార్ములా వన్ నిర్మాణదారులు
- ఫార్ములా వన్ ప్రవేశకులు
- 24 అవర్స్ అఫ్ లే మాన్స్ ప్రవేశకులు
- ప్రపంచ క్రీడా కార్ల పోటీ ప్రవేశకులు
- బ్రిటిష్ ఆటో రేసింగ్ జట్లు
- బ్రిటిష్ రేస్ కార్ నిర్మాణదారులు
- కారు ఉత్పత్తిదారులు
- వెస్ట్ మిడ్ లాండ్స్ (కౌంటీ) ఆధారిత సంస్థలు
- రాయల్ వారంట్ కలిగినవారు