ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్
కాల విస్తరణ: Pliocene, 3.9–2.9 Ma
The partial skeleton AL 288-1 ("Lucy")
శాస్త్రీయ వర్గీకరణ edit
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Mammalia
Order: Primates
Suborder: Haplorhini
Infraorder: Simiiformes
Family: Hominidae
Subfamily: Homininae
Tribe: Hominini
Genus: Australopithecus
Species:
A. afarensis
Binomial name
Australopithecus afarensis
Synonyms
Synonyms

ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ (లాటిన్: "అఫార్‌కు చెందిన దక్షిణాది వాలిడి") ఆఫ్రికాలో 39, 29 లక్షల సంవత్సరాల క్రితాల [2] మధ్య నివసించి, అంతరించిపోయిన హోమినిన్ . [3] [4] [5] దీని కంటే తరువాతి కాలానికి చెందిన ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ లాగానే ఇది కూడా పీలగా ఉంటుంది. ఎ. అఫారెన్సిస్ హోమో జాతికి (హోమో సేపియన్స్ కూడా ఇందులో భాగమే) ప్రత్యక్ష పూర్వీకుడు గానీ, లేదా పూర్వీకుడికి దగ్గరి బంధువుగానీ అయి ఉంటుంది. ఆ కాలానికి చెందిన ఇతర ప్రైమేట్ల కంటే కూడా అఫారెన్సిస్‌కే హోమో జీనస్‌తో ఎక్కువ సంబంధం ఉందని భావిస్తారు. [6] కొంతమంది పరిశోధకులు ఆస్ట్ర. అఫారెన్సిస్‌ను పారాంత్రోపస్ జీనస్ లోకి చేరుస్తారు. [7]

డొనాల్డ్ జోహన్సన్ కనుగొన్న లూసీ (32 లక్షల సంవత్సరాల నాటిది) అనే పాక్షిక అస్థిపంజరం ఈ జాతి లోని అత్యంత ప్రసిద్ధ శిలాజం.

పరిసరాలు[మార్చు]

ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ శిలాజాలు తూర్పు ఆఫ్రికాలో మాత్రమే కనబడ్డాయి. అవటానికి లేటోలి దీని టైప్ సైట్ (మొదటి అవశేషాలు దొరికిన చోటు) అయినప్పటికీ, అఫార్ ప్రాంతం లోని హదార్ లోనే దీని అవశేషాలు ఎక్కువగా లభించాయి. పైన చెప్పిన "లూసీ" పాక్షిక అస్థిపంజరం, "ప్రథమ కుటుంబా"లు దొరికిన AL 333 స్థలం కూడా ఈ ప్రాంతం లోనిదే. ఎ. అఫారెన్సిస్ అవశేషాలను దొరికిన ఇతర ప్రాంతాలలో ఇథియోపియాలోని ఓమో, మాకా, ఫెజెజ్, బెలోడెలీ, కెన్యాలోని కూబి ఫోరా, లోథాగామ్ ఉన్నాయి.

శరీర నిర్మాణం[మార్చు]

బాడీ మాస్[మార్చు]

సంపూర్ణమైన అస్థిపంజరాలు దొరక్కపోవడం, శరీర ద్రవ్యరాశిని అంచనా వేయడంలో కొంత అడ్డంకిగా మారింది. [8] కానీ బ్రాస్సీ తదితరులు (2017) శిలాజం AL 288-1 ద్రవ్యరాశి 13.5, 30.9 కిలోగ్రాముల మధ్య ఉంటుందని, ఇది 20.4 కిలోగ్రాములు ఉండవచ్చనీ లెక్కగట్టారు. (వాల్పోల్ తదితరులు (2012) 2005 లో సగటు వయోజన ఆధునిక మానవ శరీర ద్రవ్యరాశి 62 కిలోగ్రాములని అంచనా వేసారు). [9]

క్రానియోడెంటల్ లక్షణాలు, మెదడు పరిమాణం[మార్చు]

దస్త్రం:Australopithecus afarensis adult male - head model - Smithsonian Museum of Natural History - 2012-05-17.jpg
ఎ. అఫారెన్సిస్, ఫోరెన్సిక్ ముఖ పునర్నిర్మాణం. [10]

ఆధునిక వాలిడులు, అంతరించిపోయిన గొప్ప వాలిడులతో పోలిస్తే ఆస్ట్ర. అఫారెన్సిస్ కోర పళ్ళు, నమిలే దంతాలు చిన్నవిగా ఉన్నాయి. కానీ ఆధునిక మానవుల కంటే పెద్దవే. ఆస్ట్ర. అఫారెన్సిస్ మెదడు కూడా సాపేక్షికంగా చిన్నదే. పరిమాణాన్ని కలిగి ఉంది (సుమారు 380–430   సెం.మీ3 ) (హోల్లోవే, 1983). దీని దవడలు ముందుకు పొడుచుకు వచ్చి ఉంటాయి (ప్రోగ్నాథిక్ ఫేస్)

ఆస్ట్ర. అఫారెన్సిస్ ఎలా చరించేది అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆస్ట్ర. అఫారెన్సిస్ దాదాపుగా పూర్తి ద్విపాది అని కొన్ని అధ్యయనాలు సూచించగా, అవి పాక్షికంగా చెట్లమీద చరించేవని మరి కొన్ని చెప్పాయి..చేతులు, కాళ్ళు, భుజం కీళ్ల నిర్మాణాన్ని చూస్తే ఈ రెండో ప్రతిపాదనే సరైన దనిపిస్తోంది. ముఖ్యంగా, రెక్క ఎముక (స్కాపులా) నిర్మాణం ఆధునిక మానవుల ఎముక కంటే చాలా భిన్నంగా, వాలిడి ఎముక లాగా కనిపిస్తుంది. [11] వేళ్ళ, బొటనవేలి ఎముకల వక్రతలో వీటికి ఆధునిక వాలిడులతో సామ్యం ఉంటుంది. కొమ్మలను సమర్ధవంతంగా పట్టుకుని, ఎక్కే సామర్థ్యాన్ని ఇవి సూచిస్తున్నాయి. అయితే దీనికి విరుద్ధంగా.., కాలి బొటనవేలును పాదం నుండి బయటి వైపుకు కదల్చగలిగే శక్తి లేకపోవడం, అందువల్ల పాదంతో పట్టు బిగించగల సామర్థ్యం లేకపోవడం (ఇది ప్రైమేట్లన్నిటి లక్షణం) ఆస్ట్ర. అఫారెన్సిస్ శరీర నిర్మాణం చెట్లెక్కడానికి అనుకూలంగా లేదని సూచిస్తోంది. [12]

లూసీ అస్థిపంజరం పునర్నిర్మాణం, క్లీవ్‌ల్యాండ్ నేచురల్ హిస్టరీ మ్యూజియం

. అఫారెన్సిస్ అస్థిపంజరంలోని అనేక లక్షణాలు ద్విపాద నడకను బలంగా ప్రతిబింబిస్తున్నాయి. ఎంతలా అంటే, కొంతమంది పరిశోధకులైతే ఎ. అఫారెన్సిస్‌కు చాలా కాలం ముందే ద్విపాద నడక ఉద్భవించిందని సూచించారు. [13] శరీర నిర్మాణం మొత్తమంతటిలో, కటి భాగం వాలిడి కంటే మానవుణ్ణి చాలా ఎక్కువగా పోలి ఉంది. తుంటి ఎముకలు పొట్టిగా, వెడల్పుగా ఉన్నాయి. త్రికాస్థి (వెన్నెముక దిగువన కటి వద్ద త్రికోణాకరంలో ఉండే ఎముక) వెడల్పుగా ఉండి, తుంటి కీలుకు సరిగ్గా వెనుక ఉంది. కటి పూర్తిగా మానవ కటి లాగా లేనప్పటికీ (బాగా వెడల్పుగా ఉంది. తుంటి ఎముకలు పక్కకు తిరిగి ఉన్నాయి), దాని లక్షణాలు మాత్రం ద్విపాద నడకకు అనుకూలంగా ఉండేట్లు బాగా పరిణామం చెందాయని చెప్పవచ్చు

ముఖ్యంగా, తొడ ఎముక తుంటి నుండి మోకాలి వైపుగా వంగి ఉంది. ఈ లక్షణం కారణంగా, నడిచేటపుడు అడుగు శరీరపు మధ్యరేఖకు దగ్గరగా పడుతుంది. ఇది ద్విపాద నడక బాగా అలవాటైన జీవుల్లో కనిపిస్తుంది. కాలి బొటనవేళ్ళు లోపలి వైపుకు (విడిపోయి బయటి వైపుకు కాకుండా మిగతా వేళ్ళ వైపుకు) ఉన్నాయి. దీని వలన చెట్ల కొమ్మలను పట్టుకుని వేళ్ళాడడం కుదరదు -అసాధ్యం కాదు గానీ, కష్టం. ప్రైమేట్లు రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటే వాటి పిల్లలు సాధారణంగా తల్లులను కావలించుకుని ఉంటాయి. వెనక కాళ్ళతో పట్టు బిగించలేని కారణంగా, చెట్లపై కదిలేటపుడు ఈ పిల్లలు కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. పట్టు బిగించే రెండవ జత అవయవాలు లేకపోతే, శిశువు బలంగా పట్టుకోలేదు. తల్లి దాన్ని పట్టుకోవలసి ఉంటుంది. ఓ వైపు పిల్లను పట్టుకుని తల్లి చెట్లు ఎక్కవలసి వస్తే సమస్య రెట్టింపౌతుంది. పాదాల ఎముకలు కూడా రెండు కాళ్ళ నడకను సూచిస్తాయి. [14] [15]

కంప్యూటర్లను ఉపయోగించి, అస్థిపంజరపు జడత్వ లక్షణాలు, కైనమాటిక్స్ ల డైనమిక్ మోడలింగ్ చేసినపుడు అఫారెన్సిస్ ఆధునిక మానవులు నడిచే విధంగానే, నిటారుగా, వంగిన తుంటి, మోకాళ్ళు వగైరాలతో, నడవగలిగింది. కానీ చింపాంజీల మాదిరిగా నడవలేదు. మోకాళ్ళను, తుంటినీ వంచి నడిచినప్పటి కంటే నిటారుగా ఉన్న నడకే సమర్థవంతంగా ఉండేది. వంచి నడిచే నడక రెండు రెట్లు ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. [16] [17]

ఎ. అఫారెన్సిస్ బహుశా తక్కువ దూరాలు నడిచేటపుడు సమర్థవంతంగా నడిచి ఉండేది. లేటోలి వద్ద లభించిన పాదముద్రల మధ్య ఎడాన్ని గమనిస్తే అవి సెకండుకు 1 మీటరు వేగంతో నడిచినట్లు తెలుస్తోంది. ఇది మానవుడు పట్టణంలో నడిచే వేగంతో సరిపోలుతుంది. అయినప్పటికీ, ఆస్ట్రలోపిథెకస్ పాదాల ఎముకలను పరిశీలిస్తే, లాటోలి పాదముద్రలు ఆస్ట్రలోపిథెకస్ వి కాకపోవచ్చని సూచిస్తున్నాయి. చాలా మంది శాస్త్రవేత్తలు ఆస్ట్రలోపిథెకస్ రెండు కాళ్లపై నడిచిందా అని సందేహపడుతున్నారు. ఒకవేళ నడిచినా, అది మనుషుల మాదిరిగా నడిచి ఉండదని వాదిస్తున్నారు. [18] [19] [20]

మణికట్టు-లాకింగ్ అయిన విధానం అవి పిడికిళ్లపై నడిచి ఉంటాయని సూచిస్తోంది. [21] (అయితే, పిడికిలి-నడకను జాగ్రత్తగా విశ్లేషిస్తే, వివిధ జాతుల ప్రైమేట్లలో మణికట్టు ఎముకలను పోలిస్తే, ఈ సూచనలు సరి కాదని తెలుస్తోంది). [22] భుజం కీలు ఆధునిక మానవులలో కంటే భిన్నంగా, ప్రస్తుత కాలం లోని వాలిడులకు (ఏప్) ఉన్నట్లుగా పుర్రె వైపు తిరిగి ఉంది. [11] అఫారెన్సిస్ వి సాపేక్షికంగా పొడవైన చేతులు. చెట్లు ఎక్కేందుకు అనువుగా చేతులను బాగ పైకెత్తగలిగే సామర్థ్యానికి ఇది సూచన. పుర్రెల స్కాన్లను పరిశీలిస్తే, ఇది సరైన ద్విపాది అనే దానికి సమర్ధన వాటిలో కనబడలేదు. [23]

ప్రవర్తన[మార్చు]

అంతరించిపోయిన శిలాజ జాతులలో సామాజిక ప్రవర్తన ఎలా ఉండేదో తెలుసుకోవడానికి ఉత్తమమైన సూచిక, మగ, ఆడల మధ్య పరిమాణం లోని తేడాలు (లైంగిక డైమోర్ఫిజం). ఆస్ట్ర. అఫారెన్సిస్‌ ను ఆధునిక వాలిడులు, ఇతర జంతువులతో పోల్చినపుడు, ఆస్ట్ర. అఫారెన్సిస్‌లోని పునరుత్పత్తి ప్రవర్తనలను, సామాజిక నిర్మాణాన్నీ ఊహించవచ్చు. మగ, ఆడ ఆస్ట్ర. అఫారెన్సిస్ ల మధ్య శరీర పరిమాణంలో సగటు వ్యత్యాసం ఎంత అనేది చర్చనీయాంశమైంది. గొరిల్లాలు, ఒరంగుటాన్ల మాదిరిగానే ఆడవాటి కంటే మగవి చాలా పెద్దవని కొందరు ప్రతిపాదించారు. ఆధునిక గొరిల్లాల లైంగిక డైమోర్ఫిజం, సామాజిక సమూహ నిర్మాణం మధ్య ఉన్న సంబంధాలపై చేసిన పరిశీలనలను ఆస్ట్ర. అఫారెన్సిస్‌కు వర్తింపజేసి చూస్తే, ఈ జీవులు ఒకే పురుషుడి ఆధిపత్యంలో, అనేక సంతానోత్పత్తి దశలో ఉన్న ఆడవారు ఉన్న చిన్న సమూహాల్లో జీవించి ఉండవచ్చు. [24] ఆధునిక మానవులలో ఉన్నంత స్థాయిలో మగ, ఆడల పరిమాణాల్లో గణనీయమైన అతివ్యాప్తి ఉండేదని ఇతర అధ్యయనాలు చూపించాయి. [25] దీనితో పాటు, చిన్న కోరపళ్ళను కలిగి ఉండడాన్ని గమనిస్తే, ఎ. అఫారెన్సిస్ మగ, ఆడ రెండూ కూడా ఏకపతి/ఏకపత్నీ పద్ధతిని పాటించేవారని భావించారు. [26] మగవారు సమూహాన్ని పోషించే పనిలో నిమగ్నమై ఉండవచ్చు. దీనివల మోసుకు పోవాల్సిన అవసరం ఉండేది. ఈ అవసరమే రెండు కాళ్ళపై నడిచే పరిణామానికి దారితీసి ఉండవచ్చు.

చాలా కాలం పాటు, ఎ. అఫారెన్సిస్‌తో సంబంధం ఉన్న రాతి పనిముట్లేవీ దొరకలేదు. అందుచేత, పాలియోఆంత్రోపాలజిస్టులు రాతి హస్తకృతులు కేవలం 25 లక్షల సంవత్సరాల క్రతం నాటివే నని భావించారు. అయితే, 2010 లో చేసిన అధ్యయనంలో, హోమినిన్ జాతులు జంతువుల మృతదేహాలను రాతి పనిముట్లతో చీల్చి మాంసాన్ని తిన్నాయని తేలింది. దీంతో హోమినిన్లలో రాతి పనిముట్ల వాడకం సుమారు 34 లక్షల సంవత్సరాల క్రితమే మొదలైందని తెలిసింది. [27]

ఎ. అఫారెన్సిస్ స్పెసిమెన్లు[మార్చు]

సెలాం పుర్రె (DIK 1-1)
ఎ. అఫారెన్సిస్ పుర్రె పునర్నిర్మాణం , కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలోని మ్యూజియం ఆఫ్ మ్యాన్ లో.
 • LH 4
టాంజానియాలోని లాటోలి లో లభించిన దవడ. ఇది ఎ. అఫారెన్సిస్ యొక్క టైప్ స్పెసిమెన్. [28]
 • AL 129-1
ఇథియోపియాలో అఫార్ డిప్రెషన్ లోని మిడిల్ ఆవాష్‌లో మొదటి ఎ. అఫారెన్సిస్ మోకాలి కీలును 1973 నవంబరులో కనుగొన్నారు. మారిస్ తైబ్, వైవ్స్ కాపెన్స్, టిమ్ వైట్ పాల్గొన్న బృందంలో భాగంగా డోనాల్డ్ జోహన్సన్ దీన్ని కనుగొన్నారు.
 • AL 200-1
1974 అక్టోబరులో దంతాలతో సహా పై అంగిలిని కనుగొన్నారు.
 • AL 288-1 (లూసీ)
మొట్టమొదటి ఎ. అఫారెన్సిస్ అస్థిపంజరం 1974 నవంబరు 24 న ఇథియోపియాలోని హదర్ సమీపంలో డోనాల్డ్ జోహన్సన్ బృందం లోని టామ్ గ్రే కనుక్కున్నాడు.మారిస్ తైబ్, వైవ్స్ కాపెన్స్, టిమ్ వైట్ లు ఈ బృందం లోని ఇతర సభ్యులు.
 • AL 333
1975 లో, లూసీని కనుగొన్న ఒక సంవత్సరం తరువాత, డోనాల్డ్ జోహన్సన్ బృందం హదర్లో మరొక స్థలాన్ని కనుగొంది. ఇందులో పెద్దలవి, పిల్లలవీ అన్నీ కలిపి కనీసం 13 మంది వ్యక్తులకు చెందిన 200 కి పైగా శిలాజాలు ఇక్కడ దొరికాయి. AL 333 అనే ఈ స్థలాన్ని "ప్రథమ కుటుంబం" (ఫస్ట్ ఫ్యామిలీ) అని పిలుస్తారు. అవశేషాలన్నీ దగ్గరదగ్గరగా ఉండడం ఆ వ్యక్తులందరూ ఒకే సమయంలో మరణించినట్లు సూచిస్తుంది. ఇది ఒక విశిష్టమైన కనుగోలు.
 • AL 333-160
ఫిబ్రవరి 2011 లో, ఇథియోపియాలోని హదర్లో AL 333 సైట్ వద్ద AL 333-160 ను కనుగొన్నట్లు ప్రకటించారు. [29] పాదం ఎముకను బట్టి, ఈ జాతి పాదాలలో వంపు ఉందని తెలుస్తోంది. దీన్నిబట్టి, ఇవి ఎక్కువ సమయం నిటారుగా నడిచాయని వార్డ్ తదితరులు ధృవీకరించారు. [30] కనుగొన్న 49 కొత్త ఎముకలలో పాదం ఎముక ఒకటి. ఎ. అఫారెన్సిస్ లో "మనం ఇంతకుముందు అనుకున్నదానికంటే చాలా ఎక్కువ మానవుడితో పోలికలున్నాయి" అని ఈ అధ్యయన బృందం లోని ప్రధాన శాస్త్రవేత్త చెప్పారు. [31] తరువాతి కాలంలో మిచెల్ తదితరులు, వార్డ్ తది. కన్నా మరింత సమగ్రమైన నమూనాలను అధ్యయనం చేసారు. వీరు తమ పరిశోధనలో గమనించిన అంశాలేవి కూడా వార్డ్ తది. చేసిన వ్యాఖ్యానాలకు సమర్ధనగా లేవని తేల్చారు. [32] "మొత్తంమీద, AL 333-160, తూర్పు గొరిల్లా యొక్క 4 వ MT కి చాలా పోలికలున్నాయి. ఇవి నాలుగు కాళ్ళపై చరిస్తూండే నెమ్మదిగా కదిలే జీవులు. చెట్లపై నుండి దిగి భూమిపై ఎక్కువగా జీవించేవి" అని కూడా వాళ్ళు చెప్పారు.
 • AL 444-2
1992 లో హదర్ వద్ద దొరికిన పురుషుడి కపాలం ఇది. [33] ఇది కనుగొన్న సమయానికి, ఇదే ఆస్ట్ర. అఫారెన్సిస్ యొక్క మొదటి సంపూర్ణమైన పుర్రె. [34] AL 444-2 ఆవిష్కరణకు ముందు ఆస్ట్ర. అఫారెన్సిస్ స్పెసిమెన్లలో పూర్తి కపాలపు అవశేషాలు లేనందువలన సరైన విశ్లేషణ చెయ్యలేకపోయారు.
 • కాడనూమూ

paragraph

బిగ్ మ్యాన్ అని కూడా పిలుస్తారు,
బిగ్ మ్యాన్ అని కూడా పిలుస్తారు, ఇది పురుషుడిది అని భావిస్తున్నపాక్షిక అస్థిపంజరం.
 • సెలామ్
2000 లో, లూసీ దొరికిన ప్రదేశానికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న డికికాలో దాదాపు మొత్తం పుర్రె, మొండెం, అవయవాలు చాలా వరకూ కలిగి ఉన్న 3 సంవత్సరాల ఆస్ట్ర. అఫారెన్సిస్ ఆడపిల్ల అస్థిపంజరం కనుబడింది. అస్థిపంజరం లక్షణాలను బట్టి, ఇది నిటారుగా నడిచేందుకు, అలాగే చెట్లు ఎక్కేందుకూ అనువుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లక్షణాలు లూసీ లక్షణాలతో సరిపోతున్నాయి. మానవ, హోమినిడ్ వాలిడి శరీర నిర్మాణాలకు మధ్యస్థంగా ఉన్నాయి. "బేబీ లూసీ" కి అధికారికంగా సెలామ్ (అమ్హారిక్ / ఇథియోపియన్ భాషలో "శాంతి" అని అర్ధం) అని పేరు పెట్టారు. [35]

మూలాలు[మార్చు]

 1. Johanson, Donald C.; White, Tim D.; Coppens, Yves (1978). "A New Species of the Genus Australopithecus (Primates: Hominidae) from the Pliocene of Eastern Africa". Kirtlandia. 28: 1–14.
 2. Prins, Harald E. L; Walrath, Dana; McBride, Bunny (2007). Evolution And Prehistory: The Human Challenge, by William A. Haviland, Harald E. L. Prins, Dana Walrath, Bunny McBride. ISBN 9780495381907.
 3. Greshko, Michael (20 October 2017). "Ancient Teeth Found in Europe Belonged to Mystery Primate". National Geographic. Retrieved 20 October 2017.
 4. Wehner, Mike (20 October 2017). "Shocking discovery of ancient teeth could rewrite human history". BGR Media. Retrieved 20 October 2017.
 5. Staff (20 October 2017). "9.7 million-year-old teeth fossils discovered in Germany". Daily Sabah. Retrieved 20 October 2017.
 6. Cartmill, Matt; Fred H. Smith; Kaye B. Brown (2009). The Human Lineage. Wiley-Blackwell. p. 151. ISBN 978-0-471-21491-5.
 7. Cela-Conde, C. J.; Ayala, F. J. (2003). "Genera of the human lineage". Proceedings of the National Academy of Sciences. 100 (13): 7684–7689. Bibcode:2003PNAS..100.7684C. doi:10.1073/pnas.0832372100. PMC 164648. PMID 12794185.
 8. Brassey, C. A.; O'Mahoney, T. G.; Chamberlain, A. T.; Sellers, W. I. (2017). "A volumetric technique for fossil body mass estimation applied to Australopithecus afarensis". Journal of Human Evolution. 115: 47–64.
 9. Walpole, Sarah C; Prieto-Merino, David; Edwards, Phil; Cleland, John; Stevens, Gretchen; Roberts, Ian; et al. (18 June 2012). "The weight of nations: an estimation of adult human biomass". BMC Public Health. BMC Public Health 2012, 12:439. 12 (1): 439. doi:10.1186/1471-2458-12-439. PMC 3408371. PMID 22709383. Retrieved 12 July 2012.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
 10. Reconstruction by John Gurche (2010), Smithsonian Museum of Natural History. Abigail Tucker, "A Closer Look at Evolutionary Faces Archived 2013-12-05 at the Wayback Machine", Smithsonian.com, February 25, 2010.
 11. 11.0 11.1 Green, D. J.; Alemseged, Z. (2012). "Australopithecus afarensis Scapular Ontogeny, Function, and the Role of Climbing in Human Evolution". Science. 338 (6106): 514–517. Bibcode:2012Sci...338..514G. doi:10.1126/science.1227123. PMID 23112331.
 12. Latimer, Bruce; C. Owen Lovejoy (1990). "Hallucal tarsometatarsal joint in Australopithecus afarensis". American Journal of Physical Anthropology. 82 (2): 125–33. doi:10.1002/ajpa.1330820202. PMID 2360609.
 13. Lovejoy, C. Owen (1988). "Evolution of Human walking" (PDF). Scientific American. 259 (5): 82–89. Bibcode:1988SciAm.259e.118L. doi:10.1038/scientificamerican1188-118. PMID 3212438.
 14. Weiss, M. L.; Mann, A. E. (1985). Human Biology and Behaviour: An anthropological perspective (4th ed.). Boston: Little Brown. ISBN 978-0-673-39013-4.
 15. Latimer, B.; Lovejoy, C. O. (1989). "The calcaneus of Australopithecus afarensis and its implications for the evolution of bipedality". American Journal of Physical Anthropology. 78 (3): 369–386. doi:10.1002/ajpa.1330780306. PMID 2929741.
 16. "BBC – Science & Nature – The evolution of man". Mother of man – 3.2 million years ago. Retrieved 2007-11-01.
 17. "PREMOG – Research". How Lucy walked. Archived from the original on 2007-10-25. Retrieved 2007-11-01.
 18. Shipman, P. (1994). "Those Ears Were Made For Walking". New Scientist. 143: 26–29.
 19. Susman, R. L; Susman, J. T (1983). "The Locomotor Anatomy of Australopithecus Afarensis". American Journal of Physical Anthropology. 60 (3): 279–317. doi:10.1002/ajpa.1330600302. PMID 6405621.
 20. Beardsley, T. (1995). "These Feet Were Made for Walking – and?". Scientific American. 273 (6): 19–20. Bibcode:1995SciAm.273f..19B. doi:10.1038/scientificamerican1295-19a.
 21. Richmond, B. G.; Begun, D. R.; Strait, D. S. (2001). "Origin of human bipedalism: The knuckle-walking hypothesis revisited". Am. J. Phys. Anthropol. Suppl. 33: 70–105. doi:10.1002/ajpa.10019. PMID 11786992.
 22. Kivell, T. L.; Schmitt, D. (2009). "Independent evolution of knuckle-walking in African apes shows that humans did not evolve from a knuckle-walking ancestor". Proc. Natl. Acad. Sci. U.S.A. 106 (34): 14241–6. Bibcode:2009PNAS..10614241K. doi:10.1073/pnas.0901280106. PMC 2732797. PMID 19667206.
 23. Zonneveld, F.; Wood, F.; Zonneveld, B. (1994). "Implications of early hominid morphology for evolution of human bipedal locomotion". Nature. 369 (6482): 645–648. Bibcode:1994Natur.369..645S. doi:10.1038/369645a0. PMID 8208290.
 24. Wood 1994, p. 239. sfn error: multiple targets (9×): CITEREFWood1994 (help)
 25. Reno, Philip L.; Lovejoy, C. Owen (2015-04-28). "From Lucy to Kadanuumuu: balanced analyses of Australopithecus afarensis assemblages confirm only moderate skeletal dimorphism". PeerJ (in ఇంగ్లీష్). 3: e925. doi:10.7717/peerj.925. ISSN 2167-8359. PMC 4419524. PMID 25945314.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
 26. Lovejoy, C. Owen (2009-10-02). "Reexamining human origins in light of Ardipithecus ramidus". Science. 326 (5949): 74e1–8. Bibcode:2009Sci...326...74L. doi:10.1126/science.1175834. ISSN 1095-9203. PMID 19810200.
 27. McPherron, Shannon P.; Zeresenay Alemseged; Curtis W. Marean; Jonathan G. Wynn; Denne Reed; Denis Geraads; Rene Bobe; Hamdallah A. Bearat (2010). "Evidence for stone-tool-assisted consumption of animal tissues before 3.39 million years ago at Dikika, Ethiopia". Nature. 466 (7308): 857–860. Bibcode:2010Natur.466..857M. doi:10.1038/nature09248. PMID 20703305.
 28. Larry L Mai; Marcus Young Owl; M Patricia Kersting (2005). The Cambridge Dictionary of Human Biology and Evolution. Cambridge & New York: Cambridge University Press. p. 45. ISBN 978-0-521-66486-8.
 29. Ward, C. V.; Kimbel, W. H.; Johanson, D. C. (2011). "Complete Fourth Metatarsal and Arches in the Foot of Australopithecus afarensis". Science. 331 (6018): 750–3. Bibcode:2011Sci...331..750W. doi:10.1126/science.1201463. PMID 21311018.
 30. Amos, Johnathan (10 February 2011). "Fossil find puts 'Lucy' story on firm footing". BBC News. BBC Online. Archived from the original on 13 February 2011. Retrieved 13 February 2011.
 31. Silvey, Janese (10 February 2011). "Fossil marks big step in evolution science". The Columbia Daily Tribune. Archived from the original on 14 February 2011. Retrieved 13 February 2011.
 32. Mitchell, P. J.; Sarmiento, E. E.; Meldrum, B. J. (2012). "The AL 333-160 fourth metatarsal from Hadar compared to that of humans, great apes, baboons and proboscis monkeys: Non-conclusive evidence for pedal arches or obligate bipedality in Hadar hominins". HOMO: Journal of Comparative Human Biology. 63 (5): 336–67. doi:10.1016/j.jchb.2012.08.001. PMID 22995931.
 33. Nancy Minugh-Purvis (May 2005). "Review of "The Skull Of Australopithecus afarensis" by William H. Kimbel, Yoel Rak and Donald C. Johanson" (PDF).
 34. "Description of "The Skull Of Australopithecus afarensis" by William H. Kimbel, Yoel Rak and Donald C. Johanson".
 35. Wong, Kate (2006-09-20). "Lucy's Baby: An extraordinary new human fossil comes to light". Scientific American. Archived from the original on 2007-10-13.

మరింత చదవడానికి[మార్చు]

బయటి లింకులు[మార్చు]