ఆస్ట్రలోపిథెకస్ గార్హి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆస్ట్రలోపిథెకస్ గార్హి
కాల విస్తరణ: Pliocene
శాస్త్రీయ వర్గీకరణ edit
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Mammalia
Order: Primates
Suborder: Haplorhini
Infraorder: Simiiformes
Family: Hominidae
Subfamily: Homininae
Tribe: Hominini
Genus: Australopithecus
Species:
A. garhi
Binomial name
Australopithecus garhi
Asfaw et al., 1997

ఆస్ట్రలోపిథెకస్ గార్హి 25 లక్షల సంవత్సరాల క్రితం నాటి గ్రెసైల్ ఆస్ట్రలోపిథెసిన్ జాతి. దీని శిలాజాలను 1996 లో బెర్హేన్ అస్ఫా, టిమ్ వైట్ నేతృత్వంలోని పాలియోంటాలజిస్ట్ పరిశోధన బృందం కనుగొంది. [1]

ఆస్ట్రలోపిథెకస్, హోమో ప్రజాతుల మధ్య పరివర్తన దశకు గార్హి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అవశేషాలు సూచిస్తున్నాయి.

కనుగోలు[మార్చు]

ఇథియోపియా అఫార్ డిప్రెషన్ లోని మధ్య ఆవాష్‌లో ఉన్న బౌరి ఫార్మేషన్లో 1996 లో మొదటి ఎ. గార్హి శిలాజాన్ని టిమ్ వైట్ కనుగొన్నాడు. ఈ జాతిని 1997 నవంబరు 20 న ఇథియోపియన్ పాలియో ఆంత్రోపాలజిస్ట్ యోహన్నెస్ హైలే-సెలాసీ ధృవీకరించాడు. "గార్హి" అనే పేరుకు స్థానిక అఫార్ భాషలో "ఆశ్చర్యం" అని అర్ధం.

శరీరనిర్మాణం, దాని వివరణలు[మార్చు]

BOU-VP-12/130 వంటి A. గార్హి శిలాజాల లక్షణాలు సాధారణంగా ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్, ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్‌లలో కనిపించే లక్షణాల కంటే కొంత భిన్నంగా ఉంటాయి. [1] హదార్‌లో లభించిన పై దవడను (ఎ. అఫారెన్సిస్) ఎ. గార్హి యొక్క బౌరి స్పెసిమెన్‌తో పోల్చినప్పుడు ఈ తేడాలను గమనించవచ్చు. ఎ. గార్హి కపాల సామర్థ్యం, ఇతర ఆస్ట్రలోపిథెసీన్‌లకు ఉన్నట్లు 450 సిసి ఉంటుంది.

అస్ఫా తదితరులు వర్గీకరించిన దవడ సాధారణంగా ఒకే జాతికి అనుకూలంగా ఉంటుందని భావించేలా నిర్మాణం ఉంది, అయినప్పటికీ అదే నిక్షేపాలలోనే మరొక హోమినిన్ జాతులు కనుగొనబడి ఉండవచ్చు. ప్రీమోలార్స్, మోలార్ దంతాలపై చేసిన అధ్యయనాల్లో గార్హికి, పారాంత్రోపస్ బోయిసీతో కొన్ని సారూప్యతలు ఉన్నాయని తేలింది. ఎందుకంటే అవి ఆస్ట్రలోపిథెకన్ యొక్క ఇతర గ్రెసిల్ రూపాలన్నిటి కంటే పెద్దవి. A. గర్హి హోమోల పూర్వీకుడు అయినటైతే (అంటే హోమో హ్యాబిలిస్ కు పూర్వీకుడు) పై దవడ నిర్మాణం సుమారు 2 - 3 లక్షల సంవత్సరాల్లోనే వేగంగా పరిణామం చెంది ఉంటుంది అని సూచించారు.

తొలి రాతి పనిముట్లు[మార్చు]

ఓల్దువన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా పోలి ఉండే కొన్ని ఆదిమ ఆకారపు రాతి పనిముట్లను A. గార్హి శిలాజాల వద్ద కనుగొన్నారు. ఇవి సుమారు 25 - 26 లక్షల సంవత్సరాల నాటివి. [2] మరింత ఆధునిక హోమినిన్లకు ప్రత్యక్ష పూర్వీకుడిగా భావించే హోమో హ్యాబిలిస్ వాడిన పనిముట్ల కంటే ఇవి పురాతనమైనవి అని శాస్త్రవేత్తలు సూచించారు. హోమో ప్రజాతికి చెందిన సభ్యులకు మాత్రమే అధునాతన పనిముట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని మానవ శాస్త్రవేత్తలు భావిస్తారు. ఓల్దువాన్, అషూలియన్ పనిముట్లలో ఉండే సాంకేతిక కుశలతలు ఈ పురాతన ముతక పనిముట్లలో ఉండవు. ఇథియోపియాలోని బౌరిలోని మరొక ప్రదేశంలో, సుమారు 25 లక్షల సంవత్సరాల నాటి 3,000 రాతి హస్తకృతులను కనుగొన్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Asfaw, B; White, T; Lovejoy, O; Latimer, B; Simpson, S; Suwa, G (1999). "Australopithecus garhi: a new species of early hominid from Ethiopia". Science. 284 (5414): 629–35. doi:10.1126/science.284.5414.629. PMID 10213683.
  2. De Heinzelin, J; Clark, JD; White, T; Hart, W; Renne, P; Woldegabriel, G; Beyene, Y; Vrba, E (1999). "Environment and behavior of 2.5-million-year-old Bouri hominids". Science. 284 (5414): 625–9. doi:10.1126/science.284.5414.625. PMID 10213682.

బయటి లింకులు[మార్చు]