Coordinates: 15°50′N 80°11′E / 15.83°N 80.19°E / 15.83; 80.19

ఇంకొల్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవెన్యూ గ్రామం
పటం
Coordinates: 15°50′N 80°11′E / 15.83°N 80.19°E / 15.83; 80.19
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంఇంకొల్లు మండలం
Area
 • మొత్తం33.65 km2 (12.99 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం17,581
 • Density520/km2 (1,400/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి960
Area code+91 ( 08594 Edit this on Wikidata )
పిన్‌కోడ్523167 Edit this on Wikidata


ఇంకొల్లు, బాపట్ల జిల్లా, ఇంకొల్లు మండలం లోని గ్రామం.ఇది అదే మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన చీరాల నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4935 ఇళ్లతో, 17581 జనాభాతో 3365 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8972, ఆడవారి సంఖ్య 8609. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3799 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 688. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590739[2].పటం

సమీప గ్రామాలు[మార్చు]

గోల్లపాలెం 4 కి.మీ; పావులూరు 5 కి.మీ; భీమవరం 6 కి.మీ; చినమల్లవరం 7 కి.మీ.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 15,538. ఇందులో పురుషుల సంఖ్య 7,888, మహిళల సంఖ్య 7,650, గ్రామంలో నివాస గృహాలు 3,840 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 3,365 హెక్టారులు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 15, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. 3 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. గ్రామంలో ఒక ప్రైవేటు మేనేజిమెంటు కళాశాల ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల వేటపాలెంలో ఉంది. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్ వేటపాలెంలోనూ ఉన్నాయి. సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలులో ఉంది.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ఇంకొల్లులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో 7 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు నలుగురు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

ఇంకొల్లులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

ఏడు రోడ్ల జంక్షను[మార్చు]

1. ఒంగోలు రోడ్డు. 2. ముప్పవరం రోడ్డు. 3.మార్టూరు రోడ్డు. 4.గుంటూరు రోడ్డు. 5. చీరాల రోడ్డు. 6. వేటపాలెం రోడ్డు. 7. కడవ కుదురు రోడ్డు.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

ఇంకొల్లులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 280 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 80 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 3004 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2984 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 20 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ఇంకొల్లులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 20 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

ఇంకొల్లులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

  • వరి, ప్రత్తి, మిర్చి, శనగ

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు ఉన్నాయి. బాలబడి ఇంకొల్లులోను, మాధ్యమిక పాఠశాల లో, ఇటీవల తిరుపతిలో నిర్వహించిన విద్యావైఙానిక ప్రదర్శనలో, ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న కె.సంధ్య ప్రదర్శన, ఋతురాగంలో అపశృతి (ఎల్ నినో) కు ప్రశంసాపత్రం లభించింది. ఈ ప్రశంసాపత్రాన్ని, కేంద్రమంత్రి శ్రీ సుజనాచౌదరి చేతులమీదుగా, సంధ్యకు అందజేసినారు. [7]

రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్[మార్చు]

1991 నుండి రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ హేతువాద మానవవాద ఉద్యమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

డి.సి.ఆర్.ఎం.డిగ్రీ కళాశాల[మార్చు]

ఇంకొల్లు గ్రామానికి చెందిన నారపరాజు వెంకటపద్మినితనూజ ఈ కళాశాలలో చదువుచున్నది. ఈమె జాతీయస్థాయి యోగా పోటీలలో పాల్గొనుటకు అర్హత సంపాదించింది. ఈమె ఇటీవల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, చిలకలూరిపేటలో నిర్వహించిన అంతర్ కళాశాలల యోగా పోటీలలో తన ప్రతిభ కనబరచి ఈ అర్హత సాధించింది. ఈమె 2015, డిసెంబరు-22 నుండి 26 వరకు హర్యానాలో అఖిల భారత స్థాయిలో నిర్వహించు అంతర్ విశ్వవిద్యాలయాల యోగా పోటీలలో పాల్గొంటుంది. పూసపాడులోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఇంకొల్లులోను, ఇంజనీరింగ్ కళాశాల వేటపాలెంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ వేటపాలెంలోను, మేనేజిమెంటు కళాశాల ఇంకొల్లులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం ఇంకొల్లులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ ఆధ్వర్యం

ఎన్.ఆర్.వి.ఎస్.అర్.బాలికోన్నత పాఠశాల[మార్చు]

2016, జనవరి-19 నుండి 23 వరకు బెంగుళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నలాజికల్ మ్యూజియంలో ఆరు రాష్ట్రాల స్థాయి విద్యా వైఙానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో, బుక్ అవార్డ్ విభాగంలో, ఈ పాఠశాల విద్యార్థినులు బి.మన్విత, టి.రిషిత ప్రదర్శించిన, ఇంకొల్లు బాలికోన్నత పాఠశాల సమగ్ర గణాంక సమాచారం తృతీయస్థానంలో నిలిచింది.

బ్యాంకులు[మార్చు]

  • ఆంధ్రా బ్యాంకు.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • కెనరా బ్యాంకు
  • HDFC బ్యాంక్

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

ఇంకొల్లులో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన కుంట ఉన్నది, దీని నుండి నీటిని సేద్యం, త్రాగునీటి వనరులకు వాడతారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ తానికొండ వెంకటేశ్వర్లు, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ స్థలాలు/ప్రార్ధనా ప్రదేశాలు[మార్చు]

  • శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం.
  • పావులూరులో ప్రసిద్ధిగాంచిన పొలిమేర ఆంజనేయస్వామి గుడి ఉంది. దీనికి ప్రతి సంవత్సరం మే నెలలో తిరుణాల జరుగుతుంది.

పరిశ్రమలు[మార్చు]

ఇంకొల్లులో ప్రైవేట్ యాజమాన్యంలో నడపబడుతున్న పెద్ద నూలు కర్మాగారం ఉంది. ఈ కర్మాగారం నుండి నూలుబట్ట, విదేశాలకు ఎగుమతి అగుచున్నది.

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • కొడాలి కమలాంబ (కమలమ్మ) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు.ఈమ బాపట్ల జిల్లా మోపర్రులో 1915లో జన్మించారు. ఈమె ఐదవ తరగతి వరకు చదువుకొని, ఆపైన తన స్వయంకృషితో హిందీ విశారద పరీక్ష పట్టభద్రురాలై, మహాత్మా గాంధీజీ చేతుల మీదుగా పట్టాను అందుకున్నారు. ఈమె తన 13వ ఏటనే స్వాతంత్ర్య ఉద్యమంలో చేరినారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారు. బ్రిటిష్ ప్రభుత్వం కమలమ్మను అరెష్టుచేసి రాయవెల్లూరులోని ప్రధాన కారాగారంలో 18 నెలలపాటు నిర్బంధించారు. కారాగారంలోనే ఈమె, ఆకుపసర్లు, ఇటుకలపొడి, ఖద్దరు వస్త్రం ఉపయోగించి జాతీయ జండా తయారుచేసి, చెట్టుపైకి ఎక్కి, జండా ఎగురవేసిన ధీశాలి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ప్రభుత్వం ఇచ్చుచున్న పింఛనును పేద విద్యార్థులకు, సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించేవారు. గోరా నాస్తిక మిత్ర మండలి స్థాపించి కుల, మత రహిత సమాజంకోసం, శ్రమించారు. గ్రామీణులకు వైద్యం అందించాలనే సదుద్దేశంతో, తన కుమారుడు శ్రీ ధర్మానందరావుచేత 1966లో ఇంకొల్లలో వైద్యశాల ఏర్పాటు చేయించి, వైద్యసేవలు అందించుచున్నారు. 13వ ఏట నుండి, తుదిశ్వాస విడిచేవరకూ ఖద్దరు ధరించిన ఈమె, "విరామమెరుగని పురోగమనం" అను పేరుతో స్వీయచరిత్ర ప్రకటించారు. వీరు తన 99వ ఏట, 2014, జూలై-11న తన స్వగృహం బాపట్ల జిల్లా ఇంకొల్లులో తుదిశ్వాస విడిచారు. అవయవదానం:- తన మరణానంతరం తన నేత్రాలను విజయవాడలోని స్వేచ్ఛాగోరా ఐ బ్యాంకుకూ, పార్ధివ దేహాన్ని విజయవాడలోని పిన్నమనేని వైద్యకళాశాలకూ అప్పగించాలని వీలునామాలో పేర్కొన్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు కమలమ్మ భౌతిక కాయాన్ని విజయవాడ తరలించారు. కమలమ్మ మృతదేహంపై జాతీయ జండా కప్పి నివాళులర్పించారు.
  • తూమాటి స్రవంతి అను విద్యార్థిని, యోగా నిపుణురాలు:- ఈమె 2013 మేలో థాయ్ ల్యాండ్ లో జరగబోయే అంతర్జాతీయ యోగా పోటీలలో భారతదేశం తరపున పాల్గొనబోవుచున్నది. ఇంజనీరింగ్ పట్టబాధ్రురాలయిన ఈమె ఒంగోలు హట యోగ కేంద్రం సభ్యురాలు.
  • శ్రీ బోడావుల నాగేశ్వరరావు, సహజకవి, శతకరచనలో మేటి.
  • ములుకుట్ల సదాశివశాస్త్రి హరికథా ప్రముఖులు (సాక్షి 30.9.2015), కళాప్రపూర్ణ, సాహిత్య భూషణ, హరికథా క్షీరసాగర, తెనాలి హరికథా గురుకులపతి (30.9.1915–3.1.1998)
  • కొల్లూరి నాయుడమ్మ వీరు 2008లో ఇంకొల్లులోని రామమందిరం నుండి తిరుపతి వరకు వెనుకనడకతో 20రోజులలో చేరుకుని వార్తల కెక్కినారు. ఇప్పుడు 70 సంవత్సరాల వయస్సులో ఉన్న అ వీరు, అన్నవరం నుండి తిరుపతికి, 720 కిలోమీటర్ల దూరాన్ని, 40 రోజులలో చేరుకొనడానికి, 2015, ఆగస్టు-21న, పాదయాత్ర చేయడానికి బయలుదేరినారు.

నాస్తిక , మానవవాద,హేతువాదులు[మార్చు]

1944 లోనే ఇంకొల్లులో రాడికల్ హ్యూమనిస్ట్ అధ్యయన శిబిరం నడిచింది. గౌరిబోయిన పోలయ్య పంతులు విమర్శ రామాయణం, పిలకరాయుళ్ళు గ్రంథాలను ప్రచురించారు. రావిపూడి వెంకటాద్రి 1943 లోనే ఇంకొల్లు మండలం నాగండ్లలో కవిరాజు త్రిపురనేని రామస్వామి స్మారకంగా కవిరాజాశ్రమం స్థాపించారు. తోటకూర వెంకటేశ్వర్లు చార్వాక పత్రిక స్థాపకులు. తోటకూర ప్రభాకరరావు పౌరాణిక నాటకాల్లో హేతువాదం అంశం మీద డాక్టరేట్ అందుకున్నారు. ఇంకొల్లు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చేగిరెడ్డి చంద్రశేఖరరెడ్డి హేతువాది శతకం, వెంకటాద్రి శతకం రచించారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఇంకొల్లు&oldid=4125843" నుండి వెలికితీశారు