ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (E)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిఘంటువు

  • This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added), published by Asian Educational Services, New Delhi in 2002.
  • You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
  • PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks

19 Aug 2015.

E

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • E, e, symbol (1) ఇంగ్లీషు వర్ణమాలలో అయిదవ అక్షరం; (2) ఒక విటమిన్ పేరు;
  • each, adj. ప్రతిఒకటి; ప్రతిఒకరు; ప్రతిఒక; తలా; తలా ఒక; చెరి;
    • half -, చెరి సగం;
    • one -, తలా ఒక; చెరి ఒక; (note) తలా ఒక is used when the number of recipients is more than two and చెరి ఒక when the number of recipients is two ;
  • eager, adj. ఆత్రుత; లాలస; సంతోషంతో ఎదురు చూడు; see also anxious;
  • eagerness, n. ఆత్రుత; తమకం; లాలసం; కుతి;
  • eagle, n. డేగ; గూళి;
  • eaglet, n. గూళి పిల్ల;
  • eagle wood, n. అగరు చెట్టు;
  • ear, n. (1) చెవి; కర్ణం; వీను; జునుగు; (2) పొత్తు; కంకి; వెన్ను; బీజమంజరి;
  • ear of corn, ph. మొక్కజొన్న పొత్తు; జొన్న కంకి;
  • ear canal, ph. కర్ణ రంధ్రం; శ్రవణ కుహరం; శ్రవణ రంధ్రం;
  • eardrum, n. కర్ణభేరి; గూబ;
  • earlier, adj. మునపటి; మునుపు; లోగటి; తొల్లి; తొలి; తొలినాటి;
  • earlier than now, ph. ఇంతకు మునుపు;
  • earlobe, n. కర్ణలత; తమ్మి;
  • early, adj. మొదటి;
  • early, adv. పెందలకడనే; మొదట; పెందరాళే; వేగిరం;
  • earmark, v. t. కేటాయించు;
  • earn, v. i. సంపాదించు;
  • earnestness, n. మనస్ఫూర్తి; అత్యాదరం; అక్కర;
  • earnings, n. సంపాదన; ఆర్జన; గణన; (rel.) income;
  • ear rings, n. pl. కర్ణభూషణాలు; కుండలాలు; పోగులు; కమ్మలు;
  • ear studs, n. pl. దుద్దులు;
  • Earth, n. భూమి; భూగోళం; భువి; ధర; ధరణి; పృథ్వి; ప్రపంచం; అవని; అవనీ మండలం;

---Usage Note: earth, world, land

  • ---When Earth is discussed as a specific planet or celestial body, it is capitalized: It takes six to eight months to travel from Earth to Mars. When Earth is a proper noun, "the" is usually omitted. When you are talking about the ground or soil as a surface or stratum, then you must lowercase the word: The archaeologists excavated the earth at the site. It is acceptable to leave earth lowercase and use the with earth if you are talking about it as the planet we live on: The earth rotates on its axis.The world is a place with people, countries, etc. Use land when you compare earth's surface to the ocean.
  • earth, n. మట్టి; మన్ను;
  • earthen, adj. మట్టితో చేసిన; మృణ్మయ; చిళ్ళ;
  • earthenware, n. కుండలు; మట్టితో చేసిన సామాను; మృణ్మయ సామగ్రి; చిళ్ళ;
    • pieces of -, చిళ్ళ పెంకులు;
  • earthly, adj. ఐహుకమైన; సాంసారికమైన;
  • earthly minded, adj. సంసారబంధము కల;
  • earthquake, n. భూకంపం;
  • earthworm, n. ఎర్ర; వానపాము; ఏలిక పాము;
  • earwax, n. గులిమి; గుబిలి;
  • ease, n. సౌలభ్యం; సుఖం; సుళువు; అవలీల;
  • easel, n. ఫలకం; రాత ఫలకం; ముక్కాలి ఫలకం; చిత్రఫలకం;
  • easement, n. సదుపాయపు హక్కు;
  • easily, adv. తేలికగా; సులభంగా; చలాగ్గా; సుళువుగా; సునాయాసంగా; తేరగా;
  • east, n. తూర్పు; ప్రాచ్యం; సూర్యుడు దూరి వచ్చే దిక్కు;
    • far -, దూర ప్రాచ్యం;
  • easterly, adj. తూర్పు నుండి వచ్చెడు; తూర్పున ఉన్న;
  • eastern, adj. పూర్వ; ప్రాచీన;
  • eastward, adv. పూర్వాభిముఖంగా; తూర్పువైపు;
  • easily, adv. తేలికగా; సులభంగా; చులాగ్గా; తేరగా;
  • easy, adj. తేలికయిన; సులభమయిన; చులాకయిన; సుళువైన;
    • - chair, ph. పడక కుర్చీ; ఆసందీ;
    • - going man, ph. పూచాటువాడు;
  • eat, v. i. తిను; భుజించు; ఆస్వాదించు;
  • eatable, n. తినుభండారం; తినడానికి వీలయినది;
  • eaves, n. చూరు; వాచూరు; పెణక; చేతికి అందొచ్చే ప్రదేశం దగ్గర ఉన్న ఇంటి కప్పు;
  • eavesdrop, n. చూరు చెంత చేరి వినడం; చాటుగా వినడం; చూచాయగా వినడం;
  • ebb, n. ఆటు; క్షీణదశ; ప్రవాహం వెనుకకు పోవుట; (ant.) flow; tide;
  • ebb and tide, ph. ఆటుపోట్లు; పాటుపోట్లు;
  • ebony, n. తుమికి కర్ర; తుమికి చెట్టు; తుమిద; నల్లచేవ; కోవిదారు; తిందుక వృక్షం; ఈ చెట్టుకర్ర నల్లగా ఉంటుంది; [Note] ఈ చెట్టుని తునికి చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టుకి బీడీఆకు చెట్టు అనే పేరు ఉంది. [bot.] Diospyros melanoxylon; Diospurus glutimosa Rex; Embryopteris glutinofera Linn;
  • ebullition, n. పొంగు; పొంగుట; ఉబుకుట;
  • eccentric, adj. విపరీత; అసాధారణ;
  • eccentricity, n. చాదస్తం; పిచ్చి; విపరీత మనస్తత్వం; వైపరీత్యం; అసాధారణత;
  • ecdysis, n. కుబుసం విడచుట;
  • echo, n. (ఎకో) ప్రతిధ్వని; ప్రతిఘోష; అనునాదం;
  • echo, v. i. (ఎకో) ప్రతిధ్వనించు; పిక్కటిల్లు;
  • echo, v. t. [comp.] కీఫలకం మీద కొట్టినది తెర మీద కనిపించేలా చేయు;
  • eclectic, adj. విశిష్టమైన; నాణ్యమైన రకరకాలతో;
  • eclipse, n. గ్రహణం; ఉపరాగం;
    • annular -, కంకణ గ్రహణం;
    • beginning of an -, స్పర్శకాలం;
    • end of an -, మోక్షకాలం;
    • quarter of an -, పాతిక గ్రహణం; పాదోపరాగం;
    • total -, పూర్ణ గ్రహణం; పూర్ణోపరాగం;
  • eclipsing variables, n. గ్రహణకారక తారలు; ఒక తార చుట్టూ మరొక తార ప్రదక్షిణం చేస్తూ ఒకదానిని మరొకటి అడ్డుకునే చుక్కలు;
  • Eclipta alba, n. [bot.] గుంటకలగర; గుంటగలగర; భృంగ; భృంగరాజ; నీటి కాలువలు, గుంటల పక్కన, తేమగల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే కలుపు మొక్క గుంటగలిజేరు. గుత్తులుగా ఉన్న తెల్లని చిన్న పూలను పూస్తుంది.
  • ecliptic, n. [astro.] క్రాంతివృత్తం; రవిమార్గం; దాక్షాయణీ చక్రం; భచక్రం; ఆకాశంలో సూర్యుడు పయనించే ఊహా మార్గం;
    • pole of the -, కదంబం; రవి మార్గపు అక్షం ఆకాశాన్ని తాకే ఊహాబిందువు;
  • ecology, n. భూగృహశాస్త్రం; ఆవరణశాస్త్రం; జీవావరణశాస్త్రం; ఆశ్రమ శాస్త్రం; జీవులు నివసించే ప్రదేశాల గురించి విచారించే శాస్త్రం; [Gr. oikos = family];
  • economic; adj. ఆర్థిక; అర్థశా సంబంధమయిన; లాభసాటి;
    • - blockade, ph. ఆర్థిక దిగ్బంధం;
    • - boom, ph. ఆర్థిక విజృంభణ;
    • - crisis, ph. ఆర్థిక వైషమ్యం;
    • - depression, ph. ఆర్థిక మాంద్యం;
    • - exploitation, ph. ఆర్థిక దోపిడీ;
    • - holding, ph. లాభసాటి కమతం;
  • economical, adj. పొదుపైన; పోడిమి అయిన; మితవ్యయ సంబంధమైన; దుబారా చెయ్యని;
  • economically, adv. పొదుపుగా; పోడిమిగా; మితవ్యయంతో;
  • economics, n. ఆర్థిక శాస్త్రం; అర్థశాస్త్రం;
  • economize, v. t. పొదుపుచేయు; మితవ్యయం చేయు; పోడిమిగా జరుపుకొను;
  • economy, n. (1) ఆర్థిక పరిస్థితి; (2) పొదుపు; మితవ్యయం; (3) సంక్షిప్తత; క్లుప్తత;
  • ecstacy, n. మహదానందం; దివ్యానుభూతి; పరవశత; ఆనందంతో పరవశించడం;
  • ecstatic, adj. ఆనందభరితమైన; పరవశమైన; మైమరచిన;
  • ecto, pref. బహిర్; బాహ్య; బయటి;
  • ectoderm, n. [biol.] బహిశ్చర్మం; బయటి చర్మపు పొర;
  • ectomorphic, adj. [biol.] బక్కపలచని; సన్నటి శరీరం; పొడుగాటి కాళ్ళు చేతులు, సన్నటి కాళ్ళు, చేతులు, ఛాతీ, భుజస్కందాలు ఉన్న శరీరతత్వం;
  • ectoparasite, n. [biol.] బాహ్య పరాన్నజీవి; బాహ్య పరాన్నభుక్కి;
  • ectoplasm, n. [biol.] బహిర్‌ప్రసరం;
  • eczema, n. గజ్జి;
  • eddy, n. సుడి; ఆవర్తం; (rel.) సుడిగుండం;
  • eddy current, ph. [phy.] సుడి ప్రవాహం;
  • edema, oedema (Br.) n. [med.] నీరు పట్టడం; వాచడం; వాపు; చీయతం; శరీర ధాతువులలో ద్రవం చేరుట; see also dropsy;
  • Eden, n. నందనవనం; బైబిల్ లో ఏడం అనే వ్యక్తి ఈవ్ అనే అమ్మాయితో ఇటువంటి తోటలో ఉంటాడు;
  • edge, n. అంచు; మొన; గట్టు; ఉపాంతం; కోటి; వోర; ధార;
    • twin -, ph. కోటి యుగము; కోటి యుగ్మము;
  • edgewise, adv., ఓరవాటుగా; పక్కవాటుగా;
  • edible, adj. భోజ్య; ఆస్వాదనీయ; తినదగిన; భక్షించదగిన’ ఖాద్యమైన; ఖాదీ;
    • - oil, ఖాద్య తైలం;
  • edible, n. భోజ్యం; భోజ్యపదార్థం; భోక్తవ్యం; ఆస్వాదనీయం; ఆభ్యవహారికం; తినదగిన; తినడానికి వీలయినది; భక్షించదగిన’ ఖాద్యమైనది; ఖాదీ;
  • edict, n. శాసనం; ఆజ్ఞ;
  • edifice, n. దివ్యభవనం; భవంతి; కట్టడం; దొడ్డ ఇల్లు;
  • edit, v. t. సరిదిద్దు; కూర్చు; గ్రంథాన్ని కాని, సినిమాని కాని కూర్చు;
  • editing, n. కూర్పు; కూర్చడం; సవరించడం; అచ్చు వెయ్యడానికి గ్రంథముని సవరించడం; విడుదల అయేముందు సినిమా భాగాలని కూర్చి కథ నడిచే తీరుని తీర్చి దిద్దడం;
  • edition, n. కూర్పు; ముద్రణకై చేసిన కూర్పు;
    • first -, మొదటి కూర్పు;
  • editor, n. (1) సంపాదకుడు; పత్రికాధిపతి; పరిష్కర్త; (2) కూర్పరి; (rel.) publisher;
    • copy -, ప్రతి సంపాదకుడు
    • managing -, నిర్వాహక సంపాదకుడు; నిర్వాహక పరిష్కర్త;
  • editorial, n. సంపాదకీయం;
  • editorial section, ph. సంపాదకీయ విభాగం;
  • educate, v. t. విద్యనేర్పు; విద్యాబుద్ధులు గరుపు; చదివించు;
  • educated, adj. విద్యనేర్చిన; చదువుకున్న;
  • education, n. విద్య; చదువు; చదువు సంధ్యలు; శిక్ష; శిక్షా విధానం;
    • adult -, వయోజన విద్య;
    • continuing -, నిరంతర విద్య;
    • formal -, నియత విద్య;
    • informal -, అనియత విద్య;
  • educator, n. m. అధ్యాపకుడు; విద్య నేర్పువాడు; విద్య నేర్పే వ్యక్తి;
  • eel, n. పాములా ఉండే చేప; మలుగు చేప; బుక్కడం; కొమ్ముచేప; గడ్డిపాము; దుండు పాము; పాపమీను; తవుటిపాము;
  • effect, n. గుణం; ఫలం; ప్రభావం; పర్యవసానం; నైమిత్తికం; స్పందన; see also affect;
  • effective, adj. సఫలమైన; సార్థకమైన; ఉపయోగపడే;
  • efferent, adj. బహిర్ముఖ;
  • effervescence, n. పొంగు;

Usage note: efficacy, efficiency

  • ---While efficacy has to do with whether or not something is able to be done at all, efficiency has to do with how something is done and whether or not it is done without must waste, effort, or time.
  • efficacy, n. ఫలోత్పాదన; కావలసిన ఫలితాన్ని ఇవ్వగలిగే శక్తి;
  • efficiency, n. సమర్ధత; సామర్ధ్యం; దక్షత; ఫలోత్పాదక శక్తి; త్రాణ;
  • efficient, adj. (1) నిమిత్త; (2) సమర్ధవంత; ప్రయోజనకరమైన;
  • efficient cause, ph. [logic] నిమిత్త కారణం;
  • Efficient Cause, ph. [phil] విశ్వసౌధపు నిర్మాత; (rel.) Material Cause = ఆ విశ్వాన్ని నిర్మించిన పదార్థపు నిర్మాత;
  • efficient tool, ph. నిమిత్త మాత్రం;
  • effigy, n. మనిషి ఆకారంలో బొమ్మ; ప్రతిమ; పటం;
  • efflorescent, adj. పూసిన; పుష్పించిన;
  • effluent, adj. బయటకు వచ్చే; ఉత్పన్నమైన; నిర్గతమైన; నిసృతమైన;
  • effluent, n. మురికి; మురికి జలం; బయటకు పోయే మురికి ద్రవం;
  • effort, n. కృషి; పరిశ్రమ; యత్నం; ప్రయత్నం; పురుష ప్రయత్నం; పౌరుషం; ఎత్తికోలు; గురణం; ఉద్యతి; ఉద్యోగము; పూనిక;
    • exhaustive -, ph. అనుశీలన;
    • non-stop -, ph. అనుశీలన;
  • effortless, adj. అయత్న; అప్రయత్న; యత్నరహిత; కృషిమాలిన; సహజ;
  • effortlessly, adv. సునాయాసంగా; అనాయాసంగా; అవలీలగా; అప్రయత్నంగా;
  • effulgence, n. దృశానం; తేజం; ప్రకాశం;
  • effused, adj. కారిన; స్రవించిన;
  • egalitarian society, ph. సమసమాజం;
  • egalitarianism, n. అర్థసమానత్వం; సమతావాదం;
  • egg, n. అండం; గుడ్డు;
    • - cluster, ఈపి కట్టు; esp. cluster of insect eggs floating on water;
    • primeval -, బ్రహ్మాండం; ఆద్యాండం;
    • solidified -, పొరటు;
    • white of an -, అండశ్వేతం; పచ్చ సొన;
    • yellow of an - అండపీతం; తెల్ల సొన;
  • ego, n. అహం; అహంకారం; దాష్టికం; గర్వం; ఆస్మితం; తిమురు;
  • egoism, n. స్వాతిశయం; "Egoism" is a preoccupation with oneself, but not necessarily feeling superior to others
  • egotism, n. అహంభావం; దురభిమానం; దాష్టికం;
  • egotist, n. దురభిమాని; అహంకారి; ఇతరుల కంటె తనే అధికుడననే (అందగాడిననే) భావం; The egotist feels superior to others physically, intellectually or in some other way.
  • egregious, adj. అతిశయించిన; శృతిమించిన; మితిమీరిన;
  • egregious blockhead, ph. శుద్ధ మూఢుడు;
  • egress, n. (1) బయటకుపోయే దారి; (2) బయటకి వెళ్లడం;
  • eight, n. ఎనిమిది; ఇరునాలుగు; అష్టకం;
  • eighteen, n. పద్ధెనిమిది; పదునెనిమిది; అష్టాదశం;
  • eighteenth, n. పద్ధెనిమిదివ; అష్టాదశ;
  • eighth, adj. ఎనిమిదవ; అష్టమ;
  • eighth, n. (1) ఎనిమిదవది; అష్టమం; (2) ఎనిమిదవ వంతు;
  • eighty, n. ఎనభై; ఎనుబది;
  • either, pron. ఇదైనా, అదిఅనా; రెండింటిలో ఒకటి;
  • either, adv. అయినా;
  • eject, v. t. నెట్టు; గెంటు; బయటకి తోయు;
  • eke, v. i. చాలీచాలని వనరులతో సర్దుబాటు చేసుకొను;
  • elaboration, n. (1) విపులీకరణ; విశదీకరణ; (2) నెరవిలి; సంగీతంలో ఒక రాగాన్ని పలువిధములుగా నెరవిలి చేసి పాడడం; రాగం, తానం, నెరవిలి, కల్పనస్వరం, పల్లవి అనే భాగాలు సంగీత కచేరీలో తప్పనిసరి అంశాలు;
  • elapsed, adj. గడచిన; భుక్తి అయిన; అతిక్రమించిన;
  • elapsed time, n. భుక్తి అయిన కాలం;
  • elastic, adj. ప్రత్యాస్థ; స్థితిస్థాపక గుణం కల;
  • elevator, n. ఎత్తుబండి;
  • either, adj. రెండింటిలో ఒకటి;
  • ejaculate, v. i. వెలిగక్కు; స్కలించు; వీర్యమును జార్చు;
  • elaborate, v. i. వివరించు; విస్తరించు; విశదీకరించు; విడమర్చి చెప్పు;
  • elapsed, v. i.గతించిన; జరిగిన; గడచిన;
  • elasticity, n. ప్రత్యాస్థత; స్థితిస్థాపకత;
  • elate, v. i. సంబరపడు; ఆనంద పడు;
  • elation, n. సంబరం; హర్షం; ఉల్లాసం; ఆనందం;
  • elbow, n. మోచేయి; కపోణి;
  • elbow, v. t. మోచేతితో పొడుచు;
  • elbow joint, ph. మోచేతి కీలు; కూర్పర సంధి;
  • elbow room, ph. ఇటూ, అటూ కదలాడడానికి చోటు;
  • elder, adj. పెద్ద; కుల పెద్ద; జ్యేష్ఠుడు;

Usage Note: elder, older

  • ---Use elder to talk about members of a family. Use older to compare the age of people or things.
  • elderly, n. పెద్దవారు; వయోధికులు; వృద్ధులు;
  • elders, n. (1) పెద్దవారు; గరువలు; (2) వయోధికులు; వృద్ధులు;
  • eldest, adj. జ్యేష్ఠ;
  • elect, v. t.ఎన్నుకొను; కోరుకొను; ఏర్చుకొను;
  • election, n. ఎన్నిక;
  • election manifesto, ph. ఎన్నికల ప్రణాళిక;
  • electoral college, n. నియోజక గణం;
  • electoral roll, n. ఓటర్ల జాబితా;
  • electorate, n. s. నియోజకవర్గం; ఓటర్లు;
  • electric, adj. విద్యుత్;
    • - current, ph. విద్యుత్ ప్రవాహం;
    • - motor, ph. విద్యుత్ చాలకం;
    • - shock, ph. విద్యుత్ ఘాతం;
    • - spark, ph. విద్యుత్ చెణుకు; విద్యుత్ విస్ఫులింగం;

Usage Note: electric, electrical

  • ---Use electric as an adjective before the names of things that need electricity to work. Use electrical as a generic word to talk about people and their work : Electrical Engineer.
  • electrical, adj. విద్యుత్;
    • - charge, ph. విద్యుత్ ఆవేశం;
    • - energy, ph. విద్యుత్ శక్తి;
    • - grid, ph. విద్యుత్ వలయం;
    • - induction, ph. విద్యుత్ ప్రేరణ;
    • - potential, ph. విద్యుత్ పీడనం;
    • - power, ph. విద్యుత్ పాటవం;
    • - shock, ph. విద్యుత్ ఘాతం;
  • electricity, n. విద్యుత్తు;
    • atmospheric -, వాతావరణ విద్యుత్తు;
    • hydro -, జల విద్యుత్తు;
    • positive -, ధన విద్యుత్తు;
    • negative -, రుణ విద్యుత్తు;
    • static -, స్థిర విద్యుత్తు;
  • electrification, n. విద్యుదీకరణం; విద్యుత్పూరణం;
  • electrode, n. విద్యుద్ధండం; విద్యుత్‌పాళా;
  • electrodynamics, n. విద్యుత్ చలనం; విద్యుత్ గతిశాస్త్రం;
  • electromagnet, n. విద్యుదయస్కాంతం; విద్యుత్ చుంబకం;
  • electromotive force, n. విద్యుత్‍చాలక బలం;
  • electrophilic, adj. [biol.] విద్యుత్ మిత్రత్వ;
  • electronic, adj. వైద్యుత;
  • electronic circuit, ph. వైద్యుత పరివాహం;
  • electrostatic, adj. ??
  • electuary, n. లేహ్యం; తేనెతో కాని, మరేదయినా తీపి పదార్థంతో కాని కలిపిన మందు;
  • elegy, n. సంస్మరణగీతం; శోకగీతిక; ఎలిజీ;
  • element, n. మూలకం; ధాతువు; అంశ; భాగం; భూతం;
    • chemical -, రసాయన మూలకం; రసాయన ధాతువు;
    • formed -, సాకార ధాతువు; రక్తంలో కనిపించే ఆకారం ఉన్న ధాతువులు;
    • formless -, నిరాకార ధాతువు; రక్తంలో ఉండే ఆకారం లేని ధాతువులు;
    • heavy -, గురు ధాతువు; గురు మూలకం;
    • rare-earth -, విరళ మృత్తిక మూలకం;
    • trace -, లేశ ధాతువు; లేశ మూలకం;
  • elemental, adj. ఆదిమ; ప్రథమ; ఆదిభూతమైన;
  • elementary, adj. ప్రారంభ; ప్రాథమిక; తేలికయిన;
    • - education, ph. ప్రాథమిక విద్య;
    • - particles, ph. ప్రాథమిక రేణువులు;
    • - school, ph. ప్రాథమిక పాఠశాల;
  • elephant, n. ఏనుగు; కరి; కరటి; దంతి; గజము; సామజం; కుంజరం; ద్విరదం; మాతంగం; వేదండం; నాగం;
  • elephant-apple, n. వెలగ;
  • elephant herd, ph. ఏనుగుల గుంపు; వేదండ తండం;
  • elephantiasis, n. బోదకాలు;
  • elevate, v. t. లేవనెత్తు; పైకెత్తు; వృద్ధిలోనికి తెచ్చు;
  • elevated, adj. పైకి ఎత్తిన; ఉన్నతమైన; ఘనమైన; సముక్షిప్త;
  • elevation, n. (1) ఎత్తు; ఉన్నతి; ఔన్నత్యం; (2) నిషా; మత్తు;
  • elevator, n. సముక్షిప్తి; పైకి లేవనెత్తేది;
  • eleven, n. పదకొండు; పదునొకటి; ఏకాదశం;
  • eleventh, adj. పదకొండవ;
  • elicit, v. t. రాబట్టు; పీకు; లోపలి నుండి పైకి లాగు;
  • eligibility, n. యోగ్యత; అర్హత; ఉపయుక్తత;
  • eliminate, v. t. తొలగించు; పరిహరించు;
  • elimination, n. బహిష్కరణ; విలోపన;
  • elision, n. [ling.] శబ్ద లోపం; ఒక మాటని ఉచ్చరించేటప్పుడు అన్ని అక్షరాలని పలకకుండా మింగేయడం; ఇంగ్లీషులో అయితే have not కి బదులు haven't అనడం, going to కి బదులు gonna అనడం వంటివి;
  • elite, n. pl. శిష్టులు; శిష్టజనులు; విద్య వల్ల కాని, ధనం వల్ల కాని సంఘంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు;
  • elk, n. కణుజు; దుప్పి;
  • ellipse, n. (1) దీర్ఘవృత్తం; (2) శబ్దలోపం; వాక్యలోపం;
  • ellipsis, n. అధ్యాహారం; వాక్యాన్ని మధ్యలో ఆపేసినప్పుడు, ఆ తర్వాత పెట్టే చుక్కలు;
  • elongate, v. t. పొడిగించు; సాగదీయు; లాగు;
  • elongated, adj. సోగ; కోల; పొడుగైన;
  • elongated eyes, ph. సోగ కన్నులు; సోగ కళ్ళు;
  • eloquence, n. వాగ్‌ధాటి; వాగ్ధాటి;
  • else, adv. లేకుంటే; లేకపోతే; కాకుంటే; కాకపోతే;
  • elsewhere, adv. ఇతరత్రా; అన్యత్ర; మరొకచోట; మరెక్కడయినా; see also otherwise;
  • elucidate, v. t. విశదీకరించు; విశదపరచు; వివరించు; తేటపరచు;
  • elude, v. t. తప్పించుకొను; ఏమార్చు; అర్ధం కాకుండా తప్పించుకొని పోవు; అందుబాటులో లేకుండా పోవు;
  • elysian, adj. స్వర్గతుల్యమైన;
  • emaciate, v. i. కృశించు; బాగా చిక్కు; బాగా నీరసపడు; ఎండిపోవు;
  • e-mail, n. విద్యుల్లేఖ; వి-టపా; వేగు;
  • emanate, v. i. పుట్టు; బయటకు వచ్చు;
  • emancipation, n. విముక్తి; విమోచన; దాస్య శృంఖలాల నుండి విముక్తి;
  • embankment, n. కట్ట; కరకట్ట; గట్టు; రోధస్సు; మడవ;
  • embargo, n. నిరోధాజ్ఞ;
  • embark, v. t. (1) ఎక్కు; ఓడ ఎక్కు; (2) ప్రారంభించు; మొదలు పెట్టు;
  • embassy, n. దౌత్యాలయం; రాయబారి కార్యాలయం;
  • embed, v. t. పొదుగు; తాపడం చేయు; సంస్తరించు;
  • embedded, adj. సంస్తరిత; పొదుగబడ్డ; తాపడం చేయబడ్డ;
  • embedding, n. సంస్తరించడం; పొదుగడం; తాపడం చేయ్యడం;
    • invariant -, ph. [math.] కూటస్థ సంస్తరణ: కూటస్థ తాపడం;
  • embellish, v. t. అలంకరించు;
  • embellishment, n. పసదనం; అలంకారశోభ;
  • ember, n. కణకణలాడే నిప్పు బొగ్గు;
  • embers, n. pl. నివురు; కాలే బొగ్గులపై నుసి; మంట మండడం అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిపోయిన వేడి వేడి అవశేషాలు;
  • embezzled, adj. అపహరించిన; తినేసిన; స్వామిద్రోహం చేసి దొంగిలించిన;
  • Emblica myrobalan, n. [bot.] పెద్ద ఉసిరి; అమలకం; (ety.) ఎంబ్లికా అన్న మాటకి మూలం సంసృతంలోని ఆమ్లం;
  • Emblica officinalis, n. [bot.] పెద్ద ఉసిరి; అమలకం; (ety.) అఫిసినేలిస్ అంటే ఉపయోగపడేదీ, దుకాణాలలో దొరికేదీ అని అర్థం;
  • Emblica ribes, n. [bot.] విడంగాలు;
  • embodied, adj. మూర్తీకరించిన; మూర్తించిన; దేహి అయిన;
  • embodiment, n. మూర్తిత్వం;
  • embody, v. i. మూర్తీభవించు;
  • embrace, n. ఆలింగనం; పరిరంభం; కౌగిలి;
  • embrace, v. t. ఆశ్లేషించు; ఆలింగన చేయు; కౌగలించు;
  • embroidery, n. బుట్టా; బుటేదారీ; బట్ట మీద పువ్వులు వేసి కుట్టడం;
  • embryo, n. పిండం; అంకురం; భ్రూణం; అర్భకం; కలలం; కడుపులో పిల్ల;
  • emerald, n. పచ్చ; గరుడపచ్చ; మరకతం; నవరత్నాలలో నొకటి; (ety.) from Prakrit maragada; a bright green, transparent precious stone; green variety of beryl;
  • emerge, v. i. వెలువడు; బయటపడు;
  • emergence, n. వెలువరింత; ప్రాదుర్భావం; జననం; ఉత్పన్నత;
    • sudden -, హఠాదుత్పన్నత;
  • emergency, adj. ఆత్యయిక; ఆపద్ధర్మ
    • - ward, ph. ఆత్యయిక వైద్యశాల; ఆపద్ధర్మ వైద్యశాల;
  • emergency, n. అత్యవసరం;
  • emeritus professor, n. గౌరవ ఆచార్యుడు; వానప్రస్థ ఆచార్యుడు;
  • emetic, n. వమనకారి; వాంతిని కలుగచేసే మందు;
  • emia, suff. ఒక ఇంగ్లీషు మాట చివర ఈ ప్రత్యయం వస్తే, ఆ మాట రక్త దోషాన్ని సూచిస్తుంది; ఉదా : ఎనీమియా; లుకీమియా, మొ॥
  • emigrant, n. ప్రోషితుడు; ఇతర దేశాలకి వలస పోయిన వ్యక్తి;
  • emigrate, v. i. వలస పోవు; ఒకరు తామున్న దేశాన్ని వదలి పెట్టి మరొక దేశానికి వలస పోవడం;

---Usage Note: emigrate, immigrate, migrate

  • ---Use emigrate to talk about people who have left their country in order to live in another country. Use immigrate to talk about people who are entering a country. Use migrate to talk about birds and animals that go to another part of the world for spring, for calving, or for food.
  • emigration, n. పోవలస; ప్రోషితం;
  • eminence, n. ఘనత;
  • eminent scholar, ph. విశారదుడు; ప్రవీణుడు;
  • emissary, n. దూత; రాయబారి;
  • emission, n. ఉద్గమం; ఉద్గమనం; ఉద్గతం; ఉద్గారం; త్రేనుపు; కక్కు;
    • nocturnal -, స్వప్నస్ఖలనం;
  • emission of light, ph. కాంత్యుద్గమం;
  • emission spectrum, ph. ఉద్గమన వర్ణమాల;
  • emit, v. i. ఉద్గారించు; బయటకు పంపు; వెలిగక్కు; వెల్వరించు; వెలార్చు;
  • emmet, n. చీమ; పిపీలికం; ఇది ఇంగ్లండులో వాడుకలో ఉన్న ఒక ప్రాంతీయ పదం;
  • emolument, n. ప్రతిఫలం; వేతనం; జీతం;
  • emotion, n. ఉద్రేకం; ఉద్వేగం; ఆవేశం; ఆర్తి; భావోద్వేగం;
    • dominant -, స్థాయీ భావం;
    • responsive -, సాత్విక భావం;
    • transitory -, సంచార భావం;
  • emotional, adj. ఉద్రేకపూరిత; ఉద్వేగాత్మక; ఉద్వేగవంత;
  • emote, v. i. నటించు; ఆవేశంతో నటించు; అతిగా నటించు;
  • empathy, n. సహానుభూతి; మరొక వ్యక్తి ఆలోచనలతోటీ, సంవేదనలతోటీ, అనుభూతులతోటీ ఏకత్వం చెందటం;
  • emperor, n. m. సమ్రాట్టు; చక్రవర్తి;
  • emphasis, n. ఉద్ఘాటన;
  • emphasize, v. t. ఉద్ఘాటించు;
  • emphatic particle, n. [gram.] అవధారణార్థకం;
  • empire, n. సామ్రాజ్యం;
  • empirical, adj. ప్రయోగసిద్ధ; అనుభవ; పామర; సాంఖ్య; అనుభావిక;
  • empirical formula, ph. [chem] సాంఖ్యక్రమం; పామర సూత్రం;
  • empirical knowledge, ph. అనుభావిక జ్ఞానం;
  • empiricism, n. అనుభవవాదం;
  • employee, n. ఉద్యోగి; ఉద్యోగస్థుడు; పని చేసేవాడు;
  • employer, n. నియోగి; యజమాని; పని ఇచ్చేవాడు;
  • employment, n. పని; నౌకరీ; ఉద్యోగం;
  • empress, n. f. సామ్రాజ్ఞి; చక్రవర్తిని;
  • empty, adj. ఖాళీ; లొటారం; రిక్త; రిత్త; ఉత్త; శూన్య;
  • empty, n. ఖాళీ; లొటారం; రిక్తం; శూన్యం; లేబరం;
  • emulation, n. (1) అహంపూర్వికం; ఇతరులతో సమానత్వం, ఆధిక్యత, సాధించటానికి చేసే ప్రయత్నం; (2) ఒక కలనయంత్రం మీద మరొక కలనయంత్రపు స్వ్భావాన్ని ప్రతిసృష్టి చెయ్యటం;
  • emulsion, n. తరళపదార్థం; తరళం;
  • enact, v.t. అనుశాసించు; శాసనం అమలులలో పెట్టు;
  • enamel, n. (1) పింగాణి; (2) దంతిక; పంటిపై నిగనిగలాడే తెల్లటి పదార్థం;
  • encampment, n. శిబిరం;
  • encephalitis, n. [med.] మెదడు వాపు; మస్తిష్క శోఫ;
  • enchanted, adj. అభిమంత్రించబడ్డ; మంత్రానికి కట్టుబడ్డ; మంత్రముగ్ధుడైన; ఉల్లసించిన; ఆనందభరితుడైన;
  • encircle, v. t. చుట్టుముట్టు; చుట్టుకొను; పరివేష్టించు;
  • enclosure, n. (1) ప్రావృతం; ప్రావృత పత్రం; కవరులో పెట్టిన ఉత్తరం; (2) ప్రాంగణం; ప్రావృత ప్రదేశం;
  • encode, v. t. సంకేతించు;
  • encomium, n. పొగడ్త; స్తుతి; ప్రశంస;
  • encompass, v. t. ఆవరించు; చుట్టుకొను; పరివేష్టించు;
  • encounter, n. (1) తారసం; తటస్థపాటు; అనుకోని సమావేశం; (2) సంఘర్షణ; కొట్లాట;
  • encounter, v. i. తారసపడు; కలుసుకొను; తటస్థపడు; దాపరించు;
  • encounter, v. t. ఢీకొను; ఎదుర్కొను; కలహించు;
  • encourage, v. t. ప్రోత్సహించు; పురికొలుపు; ప్రేరేపించు;
  • encouragement, n. ప్రోత్సాహం; ప్రోద్బలం; ప్రేరణ;
  • encouraging, adj. ఆశాజనక; ప్రోత్సాహకారక;
  • encroach, v. t. ఆక్రమించు; అతిక్రమించు;
  • encrypt, v. t. గుప్తీకరించు; రహశ్యలిపిలో రాయు;
  • encumbrances, n. బాధ్యతలు; బరువులు;
  • encyclopedia, n. విజ్ఞాన సర్వస్వం; సర్వశాస్త్ర సముచ్చయం;
  • end, v. t. పూర్తిచేయు; కోసముట్టించు; ముగించు;
  • end, n. (1) అంతు; చివర; కొస; కొన; తుద; ముగింపు; (2) మరణం; చావు;
    • the very -, చిట్టచివర; కొట్టకొన; తుట్టతుద;
  • endearingly, adv. గోముగా;
  • endeavor, n. ప్రయత్నం; ఎత్తికోలు;
  • endemic, adj. ప్రాంతీయ; స్థానీయ;
  • endemic disease, ph. ప్రాంతీయ వ్యాధి; స్థానీయ వ్యాధి;
  • ending, n. ముగింపు; అంతం;
  • endless, adj. అనంత; దురంత; నిరంతర; అంతులేని;
  • endless misery, ph. దురంత తాపం;
  • endo, pref. అంతర్; లోపలి;
  • endocarp, n. టెంక;
  • endocrine glands, n. వినాళ గ్రంథులు; అంతస్స్రావ గ్రంథులు;
  • endodermis, n. [anat.] అంతశ్చర్మం;
  • endogamy, n. అంతర్వివాహం; సజాతిలోనే పెళ్ళి చేసుకొనుట;
  • endogenous, adj. అంతర్జనిత;
  • endorse, v. t. (1) సమర్ధించు; బలపరచు; (2) బేంకు కాగితం మీద సంతకం పెట్టు;
  • endospores, n. అంతస్సిద్ధ బీజాలు;
  • endothermic, adj. తాపక్షేపక; ఉష్ణగ్రాహక;
  • endow, v. t. ఇచ్చు; దానమిచ్చు; వరమిచ్చు;
  • endowment, n. ధర్మాదాయం; మాన్యం; శాశ్వత నిధి; శాశ్వతంగా ఆదాయాన్ని ఇచ్చే నిధి;
  • endurance, n. తాలిమి; దమ్ము; సహనం; సహనశక్తి; ఓర్మి; ఓర్పు; ఓరిమి; నిభాయింపు; తాళుకం; సహిష్ణుత;
  • endure, v. i. మన్ను;
  • endure, v. t. భరించు; సహించు; ఓర్చుకొను;
  • enduring, adj. శాశ్వతమైన;
  • encrust, v. i. పెచ్చు కట్టు;
  • enema, n. వస్తికర్మ; గుద ద్వారం ద్వారా పిచికారీతో లోనికి మందు ఎక్కించడం; (lit.) treatment to the hypo gastric part of the body;
  • enemy, n. శత్రువు; వైరి; విరోధి; పగవాడు; పగతుడు; మిత్తి; అరి; పరిపంధి; అరాతి; విపక్ష; జిఘాంసువు;
  • energetic, adj. శక్తిమంత; ఓజోమయ, OjOmaya
  • energy, n. ఊర్జితం; శక్తి; సత్తువ; ఓజస్సు; (rel.) power; strength;
    • electrical -, విద్యుత్ శక్తి;
    • kinetic -, గతిజ శక్తి;
    • potential -, స్థితిజ శక్తి; బీజరూప శక్తి;
  • enforce, v. t. జారీ చేయు; అమలులో పెట్టు;
  • engagement, n. (1) యుద్ధం; (2) ప్రధానం; పెళ్ళి చేసుకుందామనే ఒడంబడిక; (note) ఒకే మాటకి రెండు వ్యతిరేకార్ధాలు ఉన్న సందర్భం ఇది;
  • engagement ring, ph. ప్రధానపుటుంగరం; ఉంకుటుంగరం;
  • engine, n. యంత్రం;
  • engineer, n. యంత్రధారి; యంత్రధారకుడు; యంత్రకారుడు;
  • engineer, v. t. యంత్రించు;
  • engineering, n. సాంకేతిక శాస్త్రం; సాంకేతికం;
  • English, n. (1) ఆంగ్లం; ఇంగ్లీషు; (2) ఇంగిలీసులు; ఆంగ్లేయులు;
  • Englishman, n. ఆంగ్లేయుడు; ఇంగ్లీషువాడు; ఇంగ్లండుకి చెందినవాడు; (note) బ్రిటిష్ వాళ్లు అంతా ఇంగ్లీషు వాళ్లు కాదు;
  • English translation, ph. ఆంగ్లానువాదం;
  • engrave, v.t. చెక్కు; చిత్తరువులు చెక్కు;
  • engraver, n. పోగర; కంసాలి చెక్కడానికి వాడే పరికరం;
  • engulf, v. t. ముంచెత్తు;
  • enigma, n. ప్రహేళిక; పజిలు; పజిల్; తలబీకరకాయ; కైపదం; చిక్కు సమస్య; కుమ్ముసుద్దు; బురక్రి బుద్ధిచెప్పే సమస్య; మెదడుకి మేతవేసే మొండి సమస్య;
  • enhance, v. t. అతిశయింపచేయు; పొడిగించు; పెంచు; అభివృద్ధి చేయు; మెరుగు పరచు;
  • enjambment, n. ఒక వాక్యం కాని, సమాసం కాని, పద్యంలో ఒక పాదం నుండి తరువాతి పాదంలోనికి పదాంతంలో విరగకుండా ప్రవహించడం;
  • enjoyment, n. అనుభుక్తి; అనుభూతి; అనుభోగం; ఆహ్లాదం; సంతోషం;
  • enlargement, n. ప్రస్ఫుటం; వికసించినది;
  • enlightenment, n. జ్ఙానోదయం;
  • enlist, v.i. చేరు; v. t. చేర్చు;
  • en masse, adv. [Latin] ఓహరిసాహరిగా; ఆలండవలత్తు; ఒక్కుమ్మడి;
  • enmity, n. వైరం; విరోధత్వం; శత్రుత్వం; వైషమ్యం; కంటు; పగ; పోరు; మచ్చరం; విప్రతిపత్తి;
  • enormous, adj. బృహత్తరమైన; పేద్ద;
  • enough, adj. చాలినంత; తగినంత;
  • enough, n. చాలు;
    • not -, చాలదు; చాలలేదు; సరిపోలేదు; చాలవు;
  • enqueue, v. t. వరుసలో చేర్చు;

---Usage Note: inquiry and enquiry

  • The words inquiry and enquiry are interchangeable. However, it is becoming preferable to use inquiry to denote an investigation, and enquiry to denote a question.
  • enquire, v. i. విచారణ చేయు; దర్యాప్తు చేయు; వాకబు చేయు; అడుగు; కనుక్కొను;
  • enquiry, n. ప్రశ్నించడం; విచారణ; పృచ్ఛ; వాకబు; చర్చిక; దర్యాప్తు; ఆనుయోగం; ప్రశ్నించడం;
  • enroll, v. i. చేరు; లావణములో చేరు;
  • enroll, v. t. చేర్చు; జాబితాలో వేయు; నమోదు చేయు; లావణములో చేర్చు;
  • en route, adv. [Latin] దారిలో;
  • entangle, v. i. చిక్కుకొను;
  • entanglements, n. చిక్కులు;
  • enter, v. i. ప్రవేశించు; చొరబడు; చొచ్చు; చొచ్చుకొనిపోవు; తూకొను; దూరు; లోనికి వెళ్లు;
  • enter, v. t. దఖలు పరచు; దఖలు చేయు;
  • enteritis, n. ఆంత్రశోఫ; ఆంత్రప్రకోపం; పేగుల వాపు;
  • entertainment, n. వినోదం;
  • entertainment program, ph. వినోద కార్యక్రమం;
  • enthusiasm, n. ఆసక్తి; ఉత్సాహం; ఉత్సుకత; ఔత్సుక్యం; అభినివేశం; వీరావేశం;
  • entice, v. i. వలలో వేసికొను; ఆశ చూపి వంచించు; పుసలాయించు; నయనవంచన చేయు;
  • entire, adj. యావత్తూ; అంతా; సాంతం; పూర్తి; సాకల్య; అఖిల; అశేష;
  • entirely, adv. సాంగోపాంగంగా; సాంతంగా; పూర్తిగా; సాకల్యంగా; అశేషంగా;
  • entitled, n. హక్కుదారు;
  • entitlement, n. హక్కు; అధికారం; లాంఛనంగా రావలసినది; లాంఛనం; ముట్టవలసినది;
  • entomology, n. కీటకశాస్త్రం; [Gr. entoma = insect];
  • entourage, n. పరివారం; బలగం;
  • entrance, n. ప్రవేశం; ద్వారం; గుమ్మం;
    • front -, వీధి గుమ్మం; ముఖ ద్వారం;
    • main -, సింహ ద్వారం;
    • rear -, దొడ్డి గుమ్మం; పెరటి గుమ్మం;
  • entrance fee, ph. ప్రవేశ రుసుం;
  • entrance frame, ph. ద్వారబంధం;
  • entree, n. (ఆంట్రే) ప్రధాన వంటకం;
  • entrepreneur, n. పెట్టుబడిదారు;
  • entropy, n. [phy.] సంకరత; అబందరం; అబందరమాత్రం, అబంత్రం; కల్లోలకం; గత్తర; యంతరపి; a measure of disorder; (ety.) en tropos means 'in chaos' or 'turning into,' అబందరం means disorder; కల్లోలం means chaos; entropy can be viewed as the amount of heat flowing into (or out of) a body divided by the temperature of that body;
  • entrust, v.t. అప్పగించు; బెత్తాయించు;
  • entry, n. (1) ప్రవేశం; (2) దఖలు; పుస్తకంలో రాసుకునే పద్దు; (3) ఆరోపం; జాబితాలో వేసుకునేది;
    • main - words, ప్రధాన ఆరోపములు;
    • sub - words, ఉప ఆరోపములు;
  • entry in a ledger, ph. దఖలు;
  • entry in a list, ph. ఆరోపములు;
  • entry words, ph. ఆరోపములు; పదారోపములు;
  • entwine, v. i.. చుట్టుకొను; పెనవే్సుకొను; మెలివేసుకొను;
  • enumerate, v. t. లెక్కించు; లెక్కపెట్టు;
  • enunciate, v. t. ప్రవచించు; ప్రకటించు; ప్రచురించు;
  • envelope, n. (ఆన్‌వొలోప్) సంచి; ఉత్తరాన్ని పెట్టడానికి వాడే సంచి; కవరు; లిఫాఫా;
  • envelope, v. i. చుట్టుకొను;
  • envelope, v. t. చుట్టుముట్టు; కప్పు; మరుగు పరచు;
  • enviable, adj. ఈర్ష్యపడదగ్గ; ఈర్ష్య పొందదగిన;
  • envious, adj. ఈర్ష్యగల;
  • environment, n. పర్యావరణం; పరిసరప్రాంతాలు;
  • envoy, n. దూత; రాయబారి;
  • envy, n. ఈర్ష్య; అసూయ; మత్సరం; కడుపుమంట; active expression of jealousy;
  • envy, v. i.. ఈర్ష్య చెందు; అసూయ పడు;
  • enzyme, n. అజము; ఫేనక ప్రాణ్యం; [en zyme = in yeast];
  • eon, aeon [Br.], n.యుగం;
  • ephemeral stream, n. దొంగేరు;
  • ephemeris, n. పంచాంగం; గంటల పంచాగం; నభోమూర్తులు ఆకాశంలో ఇప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కనబడతాయో సూచించే పంచాంగం;
  • epic, n. ఇతిహాసం; పురాణం; మహాకావ్యం; వీరగాథ;
  • epicenter, n. కేంద్రం; నాభి; అధికేంద్రం;
  • epicycle, n. ఉపచక్రం; ఉపవృత్తం;
  • epidemic, n. మహామారి; ప్రజామారి; ప్రజలమీద విరుచుకుపడి ఎక్కువగా మనుషులని చంపే వ్యాధి; [Gr. epi = మీద; demos = ప్రజలు];
  • epidermis, n. ప్రభాసిని; బహిస్తరం;; చర్మం యొక్క పైపొర;
  • epiglottis, n. పలక; ఘంటిక; తిన్న తిండి శ్వాస నాళికలోకి వెళ్లకుండా అడ్డుకునే చిన్న పలక; (ety.) epi = మీద; glottis = నాలుక కనుక epiglottis = నాలుక మీద ఉన్నది అని అర్థం వస్తుంది. నోరు తెరిస్తే నాలుక మీద కనిపించేది కొండనాలుక కనుక కొందరు epiglottis అన్న మాటని కొండనాలుక అని అనువదించేరు, కాని అలా అనువదించడం తప్పు;
  • epigram, n. (1) ఛలోక్తి; see also aphorism; (2) చాటుపద్యం;
  • epilepsy, n. అపస్మారం; మూర్ఛ; సొలిమిడి; సొమ్మ; కాకిసొమ్మ;
  • epilepsy of childhood, n. చేష్ట; బాలపాపచిన్నె;
  • epilogue, n. భరతవాక్యం; తుదిపలుకు; ఆఖరి మాట;
  • episode, n. ఉదంతం; ఉపాఖ్యానం; ఉప కథ; కథాంగం; సంఘటన;
  • epistemology, n. జ్ఞానాన్వేషణ; జ్ఞానాన్వేషణ పద్ధతి;
  • epitaph, n. స్మృత్యంజలి; చరమశ్లోకం;
  • epithelium, n. శరీరంలో తారసపడే నాలుగు రకాల కణరాశులలో ఇది ఒకటి; శరీరపు అంగాలని కప్పిపుచ్చే పలచటి పొరలా ఉంటుంది; మిగిలిన మూడు నాడీ తంతులలోను, కండరాలలోను, నరాల లోను కనిపిస్తాయి;
  • epithet, n. మారుపేరు; వర్ణనాత్మకమైన మరోపేరు;
  • epitome, n. (ఎపిటమీ) సారాంశం; సంగ్రహం;
  • e pluribus unum, ph. భిన్నత్వంలో ఏకత్వం;
  • epoch, n. దశ; దీర్ఘకాలం; యుగం; శకం;
  • Epsom salt, n. భేది ఉప్పు; magnesium sulfate; MgSO4,7H2O; దీనిని మోతాదుగా నీటిలో కలుపుకు తాగితే విరేచనం అవుతుంది;
  • equal, n. సమానం; సమం; సరి సమానం; సాటి; సదృశం; సరి; ఈడు; జోడు; జత; ప్రాయం;
  • equality, n. సమానత; సమానత్వం; సమత; సామ్యం; సదృశం; సమీకరణం; తౌల్యం;
  • equalize, v. t. సమం చేయు; సమపరచు;
  • equalizer, n. సమవర్తి;
  • equally, adv. సరి సమానంగా; సమంగా;
  • equanimity, n. స్థితప్రజ్ఞ; సమభావం; కష్టసుఖాలని సమభావంతో ఎదుర్కొన గలిగే నిబ్బరం;
  • equate, v. t. సమీకరించు;
  • equation, n. [math.] సమీకరణం;
    • algebraic -, బీజీయ సమీకరణం;
    • binomial -, ద్విపద సమీకరణం;
    • cubic -, ఘన సమీకరణం; త్రిఘాత సమీకరణం; ఉ. ax3+bx2+cx+d = 0
    • linear -, సరళ సమీకరణం; ax+b = 0
    • polynomial -, బహుపద సమీకరణం; బహుపది;
    • quadratic -, వర్గ సమీకరణం; ద్విఘాత సమీకరణం; ఉ. ax2+bx+c = 0
    • quartic -, చతుర్ ఘాత సమీకరణం; ఉ. ax4+bx3+cx2+dx+e = 0
    • quintic -, పంచ ఘాత సమీకరణం, ఉ. ax5+bx4+cx3+dx2+ex+f = 0
  • equator, n. మధ్యరేఖ; గ్రహమధ్యరేఖ;
    • celestial -, ఖగోళ మధ్యరేఖ; విషువద్ వృత్తం;
    • Jovian -, గురు మధ్యరేఖ;
    • lunar -, ఐందవ మధ్యరేఖ; చాంద్రయ మధ్యరేఖ;
    • terrestrial -, భూమధ్యరేఖ;
  • equatorial, adj. మధ్య; గ్రహమధ్య; భూమధ్య;
  • equatorial plane, ph. గ్రహమధ్య తలం;
  • equilateral, adj. సమబాహు;
    • - triangle, ph. సమబాహు త్రిభుజం;
  • equilibrium, n. నిశ్చలత; సమతౌల్యత; సమస్థితి; సమతాస్థితి; సరితూకం;
  • equipment, n. pl. సరంజామా; సంభారాలు; సంపత్తి; పరికరావళి; సాధనసామగ్రి; సామగ్రి;
  • equinox, n. విషువత్తు; విషువం; సూర్యుడు భూమధ్య తలాన్ని దాటే సమయం; (lit.) equi = సమానమైన, nox = రాత్రులు; ఈ రోజున రాత్రి, పగలు సమానమైన పొడుగు ఉంటాయి;
    • autumnal -, శరద్ విషువత్తు; సూర్యుడు కన్యా రాసి నుండి తుల లోకి జరిగే సమయం; సెప్టెంబరు 23వ తేదీ; దక్షిణాయనం మొదలు;
    • spring -, వసంత విషువత్తు; వసంత సంపాతం; సూర్యుడు మీన రాసి నుండి మేషం లోకి జరిగే సమయం; మహా విషువం; మార్చి 21 వ తేదీ; ఉత్తరాయణం మొదలు;
    • vernal -, వసంత విషువత్తు; వసంత సంపాతం; సూర్యుడు మీన రాసి నుండి మేషం లోకి జరిగే సమయం; మహా విషువం; మార్చి 21 వ తేదీ; ఉత్తరాయణం మొదలు;
  • equinoxal points, ph. విషువత్ బిందువులు;
  • equisetum, n. అశ్వవాలం; ఒక రకం మొక్క; గాలికీ, నీటికీ మట్టి కోరుకు పోకుండా ఉండడానికి ఈ మొక్కలని రక్షణగా వాడతారు; horse tails; scouring rush; a flowerless bush useful in preventing erosion;
  • equable, adj. సరిసమానంగా; సమతుల్యంగా;
    • - climates, ph. సమతుల్యంగా ఉన్న వాతావరణాలు;
  • equitable, adj. న్యాయమైన; నిష్పక్షపాతమైన;
    • - distribution of wealth, ph. న్యాయంగా పంపిణీ జరిగిన ఆస్తి; అందరికీ సమానంగా ఇచ్చినది కాదు, ఎవ్వరికి డబ్బు ఎక్కువ అవసరం ఉందో వారికి ఎక్కువ ఇవ్వడం న్యాయం కదా!
  • equity, n. (1) న్యాయం; నిష్పక్షపాతం; (2) నికరమైన రొక్కపు విలువ; ఒక ఆస్తి యొక్క బజారు విలువలో అప్పులు పోను నికరంగా చేతికి వచ్చే డబ్బు విలువ;
  • equivalence, n. సమతుల్యత; తత్తుల్యం; ప్రాయం;
  • equivalent, adj. తుల్యమైన; తత్తుల్యం; సమతుల్యమైన; తత్సమమైన; సమానార్థక; ప్రాయం;
  • equivalent weight, n. తుల్యభారం;
  • equivalent, n. తుల్యాంశం; తత్సమం; ప్రాయం; సవతు;
    • chemical -, రసాయన తుల్యాంశం;
    • mathematical -, గణిత తుల్యాంశం;
    • physical -, భౌతిక తుల్యాంశం;
    • - to an animal, ph. పశుప్రాయుడు;
    • - to a dead person, ph. మృతప్రాయుడు;
    • - to a straw, ph. తృణప్రాయం;
  • equivocal, adj. సంధిగ్ధ; అనిశ్చిత; అస్పష్ట; రెండు పక్కలా పలకడం;
  • equivocate, n. సంధిగ్ధంగా మాట్లాడడం; గోడమీద పిల్లిలా మాట్లాడడం; తుని తగవు తీర్చినట్లు మాట్లాడడం;
  • er, suff. అరి; "doer"; maker; ఇంగ్లీషులోని క్రియావాచకాన్ని నామవాచకంగా మార్చే ఉత్తర ప్రత్యయం;
    • lie + er = liar = కల్లరి; one who tells a lie;
    • pot + er = potter = కుమ్మరి;
    • forge + er = forger = కమ్మరి;
    • idea + maker = వెరవు + అరి = వెరవరి;
  • era, n. మహాయుగం; యుగం; శకం;
    • Archaeozoic -, ఆదిజీవ మహాయుగం;
    • Christian -, క్రీస్తు శకం;
    • Cenozoic -, ఆధునికజీవ మహాయుగం;
    • Common -, సాధారణ శకం; క్రీస్తు శకానికే మరోపేరు;
    • Mesozoic -, మధ్యజీవ మహాయుగం;
    • Paleozoic -, పురాజీవ మహాయుగం; (Br.) Palaeozoic;
    • Proterozoic -, ప్రథమజీవ మహాయుగం;
  • eradicate, v. t. నిర్మూలించు; రూపుమాపు; ఉత్పాటించు;
  • eradicated, n. నిర్మూలించబడినది; ఉత్పాటితం; రూపుమాపబడినది;
  • eradication, n. నిర్మూలన; ఉత్పాటనం; రూపుమాపడం; పెరికివేయడం;
  • erect, adj. నిట్రం;
  • erect pole, ph. నిట్రాట;
  • erect stone, ph. నిట్రాయి;
  • erection, n. (1) కట్టడం; నిర్మాణం; (2) అంగస్తంభన; రిక్కింపు; పురుషుని లింగం గట్టిపడి నిటారుగా నిలబడడం;
  • erected, adj. రిక్కించిన;
  • erected ears, ph. రిక్కించిన చెవులు;
  • erosion, n. కోత; కృశింపు; నశింపు; క్రమక్షయం;
  • eroticism, n. శృంగారం;
  • errand, n. ప్రాతివేశం; చిన్న చిన్న పనులు చెయ్యడానికి వెళ్లే తిరుగుడు;
  • errand boy, ph. పనులు చెయ్యడానికి తిరిగే కుర్రాడు;
  • errands, n. చిల్లర పనులు;
  • errata, n.pl. ముద్రారాక్షసాలు; తప్పొప్పుల పట్టిక;
  • erroneous, adj. తప్పు; తప్పుడు;
  • error, n. (1) తప్పు; పొరపాటు; తప్పిదం; స్ఖాలిత్యం; (2) లోపం; లొసుగు; దోషం;
    • basic -, పూర్తిగా తప్పు;
  • error of commission, ph. అతిరిక్త దోషం;
  • error of omission, ph. న్యూన దోషం;

Usage Note: error, mistake, bug

  • ---A mistake is something you do by accident, or that is a result of bad judgment. An error is something that you do not realize you are making, that can cause problems. Errors made during the writing of a computer program are called bugs.
  • error control, ph. దోష నియంత్రణ;
  • error correction, ph. లోపమును సవరించుట; దోషమును దిద్దుట; ప్రాయశ్చిత్తం;
  • eructation, n. త్రేనుపు; ఉద్గారం;
    • sour -, పులి త్రేనుపు;
  • erudition, n. పాండిత్యం;
  • eruption, n. (1) పేలుడు; (2) దద్దురు; బొబ్బ; పొక్కు;
  • eruption of a rash, ph. పేత పేలడం;
  • eruption of a volcano, ph. అగ్నిపర్వతం పేలడం;
  • eruptions, n. pl. (1) దద్దుర్లు; బొబ్బలు; (2) తట్టు; ఒక చర్మరోగం;
  • erysipelas, n. సర్పి; చప్పి; ఒక రకం చర్మ రోగం;
  • erythema, n. కందడం; చలితం; ఎలర్జీ వంటి ఒక చర్మ వ్యాధి;
  • erythrocytes, n. ఎరక్రణాలు; రక్తంలో ఉండే ఒక రకం కణాలు;
  • erythroplasts, n. రుధిరాధి కణాలు;
  • escape, n. పలాయనం; పరారీ;
  • escape velocity, ph. పలాయన వేగం; ఒక ఖగోళం యొక్క ఆకర్షణ శక్తిని తప్పించుకుని వెళ్ళడానికి కావలసిన వేగం;
  • escape, v. i. తప్పించుకొను; పారిపోవు;
  • eschew, v. i. వర్జించు; మానుకొను;
  • escort, n. తోడు; సాయం; పరివారం; పరిజనం;
  • escort, v. t. దిగబెట్టు; తోడు వెళ్లు; సాయం వెళ్లు;
  • esophagus, aesophagus; (Br.) n. అన్నవాహిక; ఆహారనాళం; ఆహారవాహిక; కృకం;
  • especially, adv. విశేషించి;
  • espionage, n. గూఢచర్యం; వేగు; బాతిమ; చారచక్షుత;
  • espionage agent, n. బాతిమదారు; బాతి; వేగులవాడు; గూఢచారి;
  • essay, n. వ్యాసం; సంగ్రహం;
  • essence, n. సారం; సారాంశం; పస; పసరు; అంతస్సారం;
  • essential, adj. ముఖ్యమైన; ఆవశ్యక; సారభూత;
  • essential amino acids, ph. ఆవశ్యక నవామ్లాలు; ఇక్కడ essential అనే మాటకి "ఆరోగ్యానికి అత్యవసరమైన" అని అర్థం;
  • essential fatty acids, ph. ఆవశ్యక ఘృతికామ్లములు; ఇక్కడ essential అనే మాటకి "ఆరోగ్యానికి అత్యవసరమైన" అని అర్థం;
  • essential oils, ph. పుష్పసారములు; సారభూత తైలాలు; సుగంధ తైలాలు; అత్తరులు; ధృతులు; స్థిర తైలాలు; ఒక మొక్కకి తనదంటూ ఒక ప్రత్యేకమైన శీలాన్ని ఇచ్చే తైలం; ఇక్కడ essential అనే మాట essence నుండి వచ్చింది; ఈ తైలాలు తీయడానికి సాధారణంగా వేడి ఆవిరిని ఉపయోగిస్తారు; see also cold pressed oils;
  • establish, v. i. నెలకొను; స్థిరపడు;
  • establish, v. t. (1) నిర్ణయించు; నిర్ధారించు; నిర్ధారణ చేయు; (2) స్థాపించు; నెలకొల్పు; నిర్మించు;
  • established, adj. నిర్ణయించబడ్డ; స్థాపించబడ్డ; నెలకొన్న; సుస్థాపిత; పరినిష్టితమైన; పాతుకుపోయిన;
  • establishment, n. సంస్థ; వ్యవస్థాపనం; ఉట్టంకణం;
  • establishment, v. t. స్థాపన;
  • estate, n. ఆస్థి; జమీ; భూస్థితి;
  • ester, n. విస్పరి; ఆల్కహాలు; ఆమ్లము సంయోగం చెందగా వచ్చిన లవణం వంటి పదార్థం;
  • esterification, n. విస్పరీకరణం;
  • esthetic, aesthetic (Br.), adj. అలంకార;
  • estimable, adj. గౌరవించదగ్గ; గౌరవప్రదమైన;
  • estimate, v. t. అంచనా వేయు; మదింపు చేయు; లెక్కకట్టు; ఉజ్జాయించు;
  • estimate, n. అంచనా; మదింపు; ఉజ్జ; ఉజ్జాయింపు; అందాజు; అడసట్టా; ఎస్టిమేటు;
  • estrogen, n. స్త్రీ శరీరంలో తయారయే ఉత్తేజితపు జాతికి చెందిన ఒక రసాయనం;
  • estrus, n. రుతుకాలం; పశుపక్ష్యాదులు ఈ కాలంలోనే లైంగిక వాంఛ చూపుతాయి; (rel.) rut;
  • estuary, n. విశాలసంగమం; సంగమస్థానం; సాగర సంగమం; నదీ ముఖ ద్వారం; నది సముద్రంలో కలిసే చోట విశాలమైన సంగమ స్థలం; (rel.) backwater; fjord; sound;
  • et al, n. ప్రభృతులు; తదితరులు; ఆదులు; (ety.) short for et alii;
  • etc., n. వగైరా; ఇత్యాదులు; మొదలగునవి; మున్నగునవి; (ety.) short for et cetera;
  • eternal, adj. అభంగురమైన; శాశ్వతమైన; నిత్య; అనశ్వర; సనాతన;
  • eternal, n. అభంగురం; శాశ్వతం; అనశ్వరం;
  • ethics, n. (1) నీతిశాస్త్రం; (2) pl. నడవడిని, ప్రవర్తనని నియంత్రించే ధర్మ పన్నాలు;
  • ethane, n. ద్వియీను; రంగు, వాసన లేని ఒక రసాయన వాయువు; రెండు కర్బనపుటణువులు ఉన్న ఉదకర్బనం; CH3CH3; same as ethylene;
  • ethene, n. ద్వియీను; కంపుతో, రంగు లేని, భగ్గుమని మండే ఒక రసాయన వాయువు; రెండు కర్బనపుటణువులు ఉన్న ఉదకర్బనం; CH2CH2; ఈ వాయువు సమక్షంలో పండబెట్టిన కాయలకి మంచి రంగు వస్తుంది;
  • ethic, n. నీతి, నియమం, నడవడి, ప్రవర్తన, మొదలైనవాటిని నియంత్రించే కట్టుబాటు;
  • ethos, n. యుగధర్మం; జాతిశీలత; నైతిక, సామాజిక విలువల సముదాయం;
  • etiology, n. కారణశాస్త్రం; ఏ జబ్బు ఎందువల్ల వచ్చిందో నిర్ణయించే శాస్త్రం;
  • etiquette, n. మర్యాద; ఒకరినొకరు గౌరవించుకోడానికి పాటించే నియమావళి;
  • etymon, n. [ling.] ధాతువు; అనేక భాషలలోని సజాతీయ మాటలకి మూలం;
  • etymology, n. పదప్రవర; పదప్రవర శాస్త్రం; నిరుక్తం; శబ్దవ్యుత్పత్తి శాస్త్రం; ఏ మాట ఎక్కడనుండి వచ్చిందో నిర్ణయించే శాస్త్రం;
  • etymologists, n. పదప్రవరులు; పదవ్యుత్పత్తి తెలిసిన పండితులు;
  • eucalyptus oil, n. యూకలిప్టస్ తైలం; నీలగిరి తైలం;
  • eukaryotic, eucaryotic, adj. కణిక సంహిత; కణికతో కూడిన; కణిక ఉన్న; నిజకేంద్రక; (ety.) eu + caryo + ote; (ant.) prokaryotic;
  • eulogy, n. ప్రశంస; పొగడ్త; కీర్తిగానం;
  • eunuch, n. నపుంసకుడు; కొజ్జా;
  • euphemism, n. సభ్యోక్తి; శిష్టోక్తి; తీపిమాట; చెవికింపుమాట; చెప్పదలుచుకున్న మాటని డొంకతిరుగుడుగా చెప్పడం; నాజూకుగా చెప్పిన మాట : "చచ్చిపోయాడు" అనడానికి "స్వర్గస్తుడయాడు" అనడం, ‘లేవు’ అనడానికి ‘నిండుకున్నాయి’ అనడం, "క్షయరోగం" అనడానికి బదులు ఇంగ్లీషులో "టి.బి." అనడం ఉదాహరణలు :
  • euphonic, adj. శ్రావ్యమైన; చెవికి ఇంపైన;
  • euphony, n. శ్రావ్యత; ఇంపు;
  • European, adj. పరంగి; ఐరోపా ఖండానికి చెందిన; పరదేశాలకి చెందిన;
  • European quarters, ph. పరంగి పురం;
  • Eustachian tube, n. కంఠకర్ణ నాళం; గొంతుకకి, చెవికి మధ్యనున్న గొట్టం;
  • euthanasia, n. విపరీతంగా బాధ పడుతూన్న రోగి అవస్థ చూడలేక, జాలితో రోగికి సునాయాసంగా మరణం కలిగేటట్లు చూడడం;
  • evacuate, v. i. ఖాళీ చేయు;
  • evade, v. i. తప్పించుకొను; ఠలాయించు;
  • evaluate, v. i. వెలకట్టు; విలువ కట్టు; నాణ్యం కట్టు;
  • evaluation, n. మూల్యాంకనం; వెల కట్టడం; విలువ కట్టడం;
  • evangelist, n. క్రైస్తవ మత ప్రచారకుడు; క్రైస్తవ మతంలో చేరమని ఊరూరా తిరుగుతూ ప్రచారం చేసే వ్యక్తి;
  • evaporate, v. t. ఇగుర్చు; పరిశోషించు;
  • evaporation, n. (1) ఇగురు; ఇగర్చడం; పరిశోషణం; (2) బాష్పీభవనం;
  • eve, n. (1) ముందు రోజు; ఒక పర్వదినానికి ముందు రోజు; (2) సాయంకాలం;
  • even, adv. సయితం; సైతం;
  • even, adj. సరి; సమ మట్టంగా;
  • even-handed, adj. బలపక్షం లేకుండా; న్యాయపరంగా;
  • even number, ph. సరి సంఖ్య;
  • evening, n. సాయంకాలం; సాయంత్రం; ప్రదోషం; ప్రదోషకాలం; మునిమాపు; మాపు; మునిచీకటి; అసురసంధ్య;
  • evening star, ph. శుక్రగ్రహం;
  • event, n. సంఘటన; ఘటన; ఘట్టం; నడితి; సన్నివేశం;
  • event horizon, ph. [phy.] సంఘటన దిగ్మండలం; సంఘటన దిక్‌చక్రం;
  • eventful, adj. సంఘటనాత్మక; చరిత్రాత్మక;
  • eventually, adv. ఎట్టకేలకు; ఆఖరికి; చివరికి; ఎప్పుడో ఒకప్పుడు; నిలకడమీద;
  • ever, adj. సతతం; కలకాలం; ఎల్లవేళల;
  • evergreen, n. సతత హరితం; నిత్యశ్యామలం;
  • every, adj. అను; ప్రతి; పరి;
  • every day, ph. అనుదినం; ప్రతి దినం;
  • every moment, ph. అనుక్షణం; ప్రతి నిముషం;
  • everybody, pron. అందరూ; అంతా; సర్వులూ;
  • everyday, adj. ప్రతిరోజు; నిత్యం;
  • everyone, pron. అందరూ; అంతా; సర్వులూ;

---Usage Note : every one, everyone

  • ---Use every one to talk about each single person or item in a group. Use everyone to mean all people in a group.
  • everything, adj. సర్వస్వం; సర్వం; అన్నీ; అంతా;
  • everywhere, adj. ప్రతిచోట;
  • evict, v. t. గెంటు; బయటకి తగులు; చట్టం ప్రకారం బయటకు వెళ్ళగొట్టు;
  • eviction, n. గెంటడం; బయటకి తగిలెయ్యడం; జప్తు చెయ్యడం;
  • evidence, n. నిదర్శనం; తార్కాణం; రుజువు; ప్రమాణం; సాక్ష్యం; దాఖలా;
    • direct -, ప్రత్యక్ష ప్రమాణం;
    • circumstantial -, అనుమాన ప్రమాణం; సందర్భ ప్రమాణం;
    • indirect -, అనుమాన ప్రమాణం; అప్రత్యక్ష ప్రమాణం;
  • evident, n. విదితం;
    • self -, స్వయం విదితం;
  • evil, n. (1) అభం; చెడు; (2) దౌష్ట్యం; దుష్కృత్యం; కంటకం, kaMTakaM
  • evil, adj. చెడు; దుర్మార్గమైన; అవినీతికరమైన;
  • evolution, n. పరిణామం; ఊర్ధ్వముఖ పరిణామం; క్రమ పరిణామం; వికాశం; పరిణామ సృష్టి;
    • theory of-, పరిణామ సృష్టి వాదం; పరిణామ సృష్టి సిద్ధాంతం;
    • - of language, భాషా వికాశం;
  • ex, adj. మాజీ;
  • exacerbation, n. ప్రకోపం; ఉద్రేకం; రోగ ఉద్రేకం;
  • exact, adj. నిర్దిష్టంగా; సమంగా; సరిగ్గా; నిర్ధారణగా;
  • exactly, adv. సమంగా; సరిగ్గా; కచ్చితంగా; అచ్చంగా;
  • exaggeration, n. అతిశయోక్తి; కోత; కోతలు కోయడం; గోరంతని కొండంత చెయ్యడం;
  • examination, n. పరీక్ష; పరిశీలన;
    • in depth -, శలాక పరీక్ష; శల్య పరీక్ష; సూక్ష్మ పరిశీలన; పరామరిక;
    • final -, సంవత్సరాంతపు పరీక్ష;
  • examine, v. t. పరీక్షించు; పరికించు; పరిశీలించు; పరకాయించు;
  • example, n. ఉదాహరణ; దృష్టాంతం; నిదర్శనం; తార్కాణం; మచ్చు; ఉదాహారం; ఉదాహృతం;
    • counter -,,ప్రత్యుదాహరణ;
  • exasperate, v. i. విసుగెత్తిపోవు;
  • excavate, v. t. తవ్వు;
  • excavation, n. తవ్వకం;
  • exceed, v. i. మించు; మీరు; మితిమీరు; అతిక్రమించు; అధిగమించు; పెచ్చుపెరుగు; పురివిచ్చు; విజృంభించు;
  • excellence, n. ప్రకర్ష; ప్రాశస్త్యం; ఉత్కర్ష, utkarsha
  • excellent, adj. బ్రహ్మాండమైన; లోకోత్తర; నెర;
  • except, adv. తప్ప; మినహా; వినా;
  • exception, n. మినహాయింపు; వినాయింపు; అపవాదం; భిన్నవాదం; కారణాంతరం;
  • exceptional, adj. అనూహ్యమైన;
  • excerpt, n. ఖండిక; రచనాభాగం;
  • excess, n. అధికం; అదనం; ఉల్బణం; ఉత్కటం;
  • excess tax, ph. అదనపు పన్ను; జాస్తి పన్ను;
  • excessive, adj. అధికం; అదనం; అతి;
  • excessively, adv. అత్యధికంగా; హేరాళంగా; మస్తుగా;
  • exchange, n. మారకం; వినిమయం; ఫిరాయింపు; వర్గావర్గీ; అదలుబదలు; ఇచ్చిపుచ్చుకోలు;
  • exchange of ideas, ph. భావ వినిమయం;
  • exchange rate, ph. మారకం రేటు;
    • foreign -, విదేశీ మారకం;
  • exchange energy, ph. వినిమయ శక్తి;
  • exchange forces, ph. వినిమయ బలాలు;
  • exchange, v. t. మార్చు; ఫిరాయించు; తారుమారు చేయు;
  • exchange the order, ph. తారుమారు చేయు;
  • exchequer, n. ఖజానా; ప్రభుత్వపు ఖజానా;
  • excise, adj. అబ్కారి; వ్యాపారపు; ప్రత్యేక;
  • excise tax, ph. ఒక ప్రత్యేకమైన జాబితా ఉన్న అంశాల మీద వేసే అమ్మకపు పన్ను; ఈ జాబితాలో సాధారణంగా అత్యవసరం కాని విలాస వస్తువులు ఉంటూ ఉంటాయి; ఉదా. నగలు, అత్తరులు, సిగరెట్లు, మద్య పానీయాలు, కార్లు, వగైరా; అబ్కారి పన్ను; వ్యాపారపు పన్ను;
  • excitation, n. ప్రేరేపణ; ప్రేరణ; స్ఫూర్తి; ఉద్విగ్నత;
  • excite, v. t. ప్రేరేపించు; ఉద్రేకపరచు; ఉత్తేజపరచు;
  • excited, adj. ఉద్రేకం చెందిన; ఉద్విగ్న; ప్రోద్ధుత;
  • excitement, n. ఉత్సాహం; ఉత్తేజం; ఉద్విగ్నం; ఉద్వేగం; ఉద్విగ్నత;
  • exciting, n. ఉద్వేగభరితం;
  • exclamation, n. రాగం; ప్రశంసార్థకం; ఆశ్చర్యార్ధకం;
  • exclamation mark, ph. రాగ చిహ్నం; ప్రశంసార్థకం;
  • exclude, v. t. మినహాయించు; పరిహరించు; నిరవసించు; వర్జించు;
  • excluded, n. pl. నిరవాసులు;
  • exclusion, n. పరిహరణ; వర్జనం; మినహాయింపు;
  • excommunicate, v. t. బహిష్కరించు; వెలివేయు;
  • excrement, n. అశుద్ధం; అమేధ్యం; పియ్యి; విరేచనం;
    • animal -, పేడ; పెంటిక; లద్ది;
    • human -, పియ్యి; విరేచనం;
  • excrete, v. i. (1) విసర్జించు (2) ఏరుగు;
  • excretion, v. i. విసర్జన;
  • excretions, n. విసర్జించబడినవి; మొక్కలనుండి కారే రసాదులు;
    • bodily -, మల మూత్రాదులు;
  • excretory, adj. విసర్జక;
  • excretory organs, ph. విసర్జక అవయవాలు;
  • excursion, n. విహారం;
  • excusable, n. క్షంతవ్యం;
  • excuse, n. (1) నెపం; సాకు; మిష; వంక; సందు; అపదేశం; (2) క్షమార్పణ; మన్నింపు; మాపు;
    • lame -, కుంటి సాకు;
  • excuse, v. t. క్షమించు; మన్నించు;
  • excuse me, ph. క్షమించండి; మన్నించండి; ఏమీ ఆనుకోకండి;
  • execute, v. t. (1) అమలుజరుపు; నెరవేర్చు; నిర్వహించు; (2) ఉరితీయు;
  • executive power, phy. నిర్వహణాధికారం;
  • execution, n. (1) నిర్వహణ; (2) ఉరితీత; ఉజ్జాసనము;
  • exegesis, n. భాష్యం; ఒక పుస్తకం మీద చేసే వ్యాఖ్య; see also hermeneutics;
  • exemplar, n. మేలుబంతి; ఒజ్జబంతి, ojjabaMti; ఒరవడి; తలకట్టు; నమూనా; మాదిరి; ప్రతిరూపం; మోస్తరు; మచ్చుతునక; ఆదర్శవంతమైనది; అనుకరించడానికి వీలయినది; ప్రశస్తమయినది; శ్రేష్ఠం;
  • exemption, n. మినహాయింపు; వినాయింపు; విముక్తత;
  • exercise, n. (1) అభ్యాసం; సాధకం; (2) వ్యాయామం; కసరత్తు;
    • aerobic -, వ్యాయామం; ఊపిరితీతకి ప్రాధాన్యం ఇచ్చే వ్యాయామం;
    • mental -, మెదడుకి మేత;
    • physical -, కసరత్తు;
  • exercise, v. i. వ్యాయామం చేయు; కసరత్తు చేయు;
  • exercise, v. t. చెలాయించు; వ్యవహరించు;
    • futile -, కాకదంత పరీక్ష; కంచిగరుడసేవ;
  • exercise notebook, n. రూళ్ళు గీసిన కాగితాలతో కుట్టిన పుస్తకం;
  • exertion, n.ప్రయాస;
  • exhalation, n. రేచకం;
  • exhale, v. i. నిశ్వసించు; ఊపిరి వదలు;
  • exhaust, n. రేచకం; రేచకథూమం; బయటకి పోయేది;
  • exhaust fumes, n. రేచకం; రేచకథూమం; బయటకి పోయే వాయువులు;
  • exhaustion, n. శోష; శోషణం; బడలిక;
  • exhaustively, adv. కూలంకషంగా;
  • exhibit, v. t. ప్రదర్శించు;
  • exhibition, n. ప్రదర్శన;
  • exhibitor, n. m. ప్రదర్శకుడు; f. ప్రదర్శకి;
  • exhort, v. t. ఉద్బోధించు; ప్రోత్సాహ పరచు;
  • exhume, v. t. పాతిపెట్టిన శరీరాన్ని తిరిగి వెలికి తీయు;
  • existence, n. అస్థిత్వం; ఉనికి; మనుగడ;
    • doubtful -, అస్థినాస్తి;
    • independent -, స్వతంత్ర మనుగడ;
  • existence theorem, n. అస్థిత్వ సిద్ధాంతం;
  • existing, adj. ఇప్పటి; సజీవ;
  • existentialism, n. అస్థిత్వవాదం;
  • exit, n. నిర్గమం; నిర్గతి; నిష్‌క్రమణం; నిష్క్రాంతి; బయటకు పోయే దారి;
  • exo, pref. బాహ్య; బహిర్;
  • exogamy, n. బహిర్వివాహం; కులాంతర, మతాంతర వివాహం;
  • exogenous, adj. బహిర్జాత; బహిర్జనిత;
  • exorbitant, adj. అత్యధికమైన; అమితమైన;
  • exorcism, n. భూతవైద్యం;
  • exorcist, n. భూతవైద్యుడు; దయ్యములను బయటకు వెడలగొట్టేవాడు;
  • exosphere, n. బాహ్యావరణం;
  • exothermic, adj. తాపచూషక; బాహ్యతప్త; ఉష్ణమోచక; వేడిని వెలిగక్కే;
  • expand, v. i. వ్యాకోచించు; విస్తరించు; వికసించు;
  • expansion, n. వ్యాకోచం; వికాసం; విక్షేపం; విస్తరణ; పొలయిక;
  • ex parte, adj. [legal] ఏక పక్షంగా; ఒక వైపు నుండి మాత్రం;
  • expect, v. i. ఆశించు; నమ్ము; నిరీక్షించు; ఎదురుచూచు;
  • expectation, n. (1) ఆశ; ఆకాంక్ష; నమ్మకం; అవుతుందని అనుకున్నది; (2) సగటు; సరాసరి;
  • expected value, n. సగటు విలువ; సరాసరి విలువ; ఊహించిన విలువ;
  • expectorant, n. కఫహరి; కళ్లెని వెడలగొట్టేది;
  • expediency, n. సులభాశ్రయత;
  • expedition, n. (1) యాత్ర; ప్రయాణం; సాహస యాత్ర; పరిశోధక యాత్ర; (2) దండయాత్ర;
  • expeditiously, adv. సత్వరంగా;
  • expel, v. t. బహిష్కరించు; తరిమివేయు; తొలగించు;
  • expenditure, n. ఖర్చు; వ్యయం; వినియోగం; వెచ్చం; పోబడి; యాపన;
    • bad -, దుర్‌వ్యయం;
    • good -, మంచి ఖర్చు; సద్‌వ్యయం;
  • expenditure of time, ph. కాలయాపన;
  • expense, n. ఖర్చు; వ్యయము; వెచ్చము;
  • expense and exertion, ph. వ్యయ ప్రయాసలు;
  • expensive, adj. ఖరీదయిన;
  • expensive, n. ఖరీదయినది; బహుకం; బాగా డబ్బు పోసి కొన్నది;
  • experience, v. t. అనుభవించు; ఆస్వాదించు;
  • experience, n. అనుభవం; అనుభూతి;
    • transcendental -, ఆధిభౌతికానుభవం, అశరీరానుభూతి. దేహాతీత అనుభవం, దేహాతీత అనుభూతి; నిధిధ్యాసము; మేవెలి;
  • experienced person, n. అనుభవశాలి; అనుభవజ్ఞుడు;
  • experiment, n. ప్రయోగం; శోధన; ప్రయత్నం;
  • experiment, v. t. ప్రయోగించు; శోధించు;
  • experimental, adj. ప్రాయోగిక;
  • experimental proof, ph. ప్రాయోగిక నిదర్శనం;
  • experimentalist, n. ప్రయోక్త; శోధకుడు;
  • experimented, n. ప్రయుక్తము;
  • experimenter, n. ప్రయోక్త; శోధకుడు;
  • expert, adj. ఫామేదా; చెయ్యితిరిగిన;
  • expert, n. దిట్ట; నేర్పరి; శిఖామణి; ప్రోడ; ఘనాపాఠీ; చెయ్యి తిరిగిన మనిషి; ఆరిందా; ఫామేదా; నిపుణుడు; ప్రవీణుడు; నిష్ణాతుడు; విశారదుడు; కోవిదుడు; చాతురి, cAturi
  • expertise, n. నిపుణత; నైపుణ్యత; ప్రావీణ్యత; వైదగ్ధ్యత; శేముషి; నేర్పరితనం;
  • expiation, n. ప్రాయశ్చిత్తం; పాప పరిహారం;
  • expiration, n. నిశ్వాసం;
  • expire, v. i. (1) మురిగిపోవు; కాలదోషం పట్టు; lapse; (2) మరణించు; చచ్చిపోవు;
  • explain, v. t. వివరించు; విశదీకరించు;
  • explanation, n. వివరణ; స్పష్టీకరణ; విపులీకరణ; వివేచన;
  • explicit, adj. సువ్యక్త;
  • exploration, n. అన్వేషణ;
  • explore, v. t. అన్వేషించు;
  • explorer, n. అన్వేషకి; అన్వేషకుడు;
  • explosion, n. పేలుడు; పెట్లు; విస్పోటనం; స్పోటనం;
  • exponent, n. (1) భాష్యకారుడు; (2) ఘాతాంకం; ఘాతం; ధ్వజాంకం; చక్రవృధ్యాంకం;
  • exponential, adj. ఘాతీయ; ఘాత; చక్రవృద్ధీయ;
  • exponential growth, ph. ఘాతీయవృద్ధి;
  • export, n. ఎగుమతి;
  • expose, v. t. బయట పెట్టు; చూపించు; బట్టబయలు చేయు; బయలుపరచు; వెలార్చు;
  • exposition, n. వివరణ; భాష్యం; వ్యాఖ్యానం; ఉపన్యాసం; ప్రవచనం; ఆవిష్కరణ:
  • expounder, n. వ్యాఖ్యాత; వక్త;
  • express, v. i. వెలిబుచ్చు; వ్యక్తపరచు; వెల్లడి చేయు; అభివ్యక్తీకరించు;
  • express your opinion, ph. మీ అభిప్రాయమును వెలిబుచ్చునది;
  • expression, n. (1) సమాసం; ఉక్తి; ఉక్తిసమాసం; సముచ్ఛయం; సంహతి; పలుకుబడి; (2) హావం; (3) వ్యక్తీకరణం; అభివ్యక్తీకరణ;
    • colloquial -, వాడుకలో ఉన్న పలుకుబడి;
    • facial -, హావం; ముఖకళవళిక;
    • mathematical -, గణిత సమాసం; గణిత వ్యక్తీకరణం;
  • exorcism, ఉచ్చాటణ; extracting a demon out of a person's body;
  • exponential growth, ph. చక్రవృద్ధి;
  • expulsion, n. బహిష్కారం; ఉద్వాసన; see also send off;
  • expunge, v. t. తీసివేయు; కొట్టివేయు; రద్దుచేయు;
  • extant, adj. సజీవ; ఇంకా ఉన్న
  • extant cultures, ph. సజీవ సంస్కృతులు;
  • extempore, adj. ఆశువుగా; ముందుగా తయారవకుండా;
  • extend, v. i. చాపు; బారచాపు;
  • extend, v. t. పొడిగించు;
  • extensive, adj. pref. పరి; సమగ్ర;
    • extensive search, ph. పరిశోధన;
  • extensively, adv. విరివిగా; విస్తారంగా; విస్తృతంగా; సమగ్రంగా; ముమ్మరంగా; అపరిమితంగా; సువిశాలంగా; సుదీర్ఘంగా;
  • extent, n. మేర; పరిణాహం;
    • to that -, అంత మేరకి;
  • exterminate, v. t. సమూలంగా నాశనం చేయు; నిర్మూలించు;
  • extermination, n. విచ్ఛిత్తి; సర్వనాశనం;
  • external, adj. బాహ్య; బహిరంగ; బాహిర; బహిర్గత;
  • external joint, ph. బాహిర సంధి;
  • externalization, n. బాహ్యీకరణ;
  • extinct, adj. చ్యుత; పరిచ్యుత; నిరాస్థులైన; అస్తిత్వం లేని; విలుప్తమైన; హరించిపోయిన; పరిమృత; సమూలంగా నాశనం అయిపోయిన;
  • extinct life forms, ph. నిరాస్థులైన జీవకోటి; హరించిపోయిన జీవకోటి;
  • extinct organisms, ph. పరిమృత జీవులు; పరిమృత ప్రాణులు;
  • extinct, n. విలుప్తం;
  • extinction, n. పరాసత్వం;
  • extinguish, v. i. ఆరు; కొండెక్కు;
  • extinguish, v. t. ఆర్పు;
  • extol, v. t. మెచ్చుకొను; కీర్తించు;
  • extortion, n. ఘరానా దోపిడీ;
  • extra, adj. (1) అదనపు; ఇతర; బాహిర; బయట; (2) అసమానమైన; మహామానమైన;
  • extra corporeal, ph. శారీరకేతర;
  • extra expenditure, ph. అదనపు వ్యయం;
  • extra solar, adj. సూర్యకుటుంబానికి బయట;
  • extra, n. అదనం;
  • extract, n. సారం; అర్కం; ధృతి; కషాయం; సత్తు; అరఖు; సారభూతం;
  • extract, v. t. గుంజు; పీకు; పిండు; రాబట్టు; వెలికి తీయు; నిష్కర్షించు;
  • extracted, adj. సాధ్య;
  • extracted oil, ph. సాధ్య తైలం;
  • extraction, n. గుంజడం; పీకడం; పిండడం; రాబట్టడం; వెలికి తీయడం; నిష్కర్షణ;
  • extracurricular, adj. పాఠ్యాంశేతర;
  • extradition, n. ప్రత్యర్పణం; విదేశాలలో దాగున్న నేరస్తుని పీకి స్వదేశానికి రాబట్టడం;
  • extraneous, adj. ఇతరేతర;
  • extraordinary, adj. అసమాన్యమైన; అసాధారణమైన; మహామాన్యమైన;
  • extraordinary person, ph. అసమాన్యుడు; మహామాన్యుడు; అసమాన్యురాలు; మహామాన్యురాలు;
  • extrapolate, v. t. బహిర్వేశం చేయు;
  • extrapolated, adj. బహిర్వేశిత;
  • extrapolation, n. బహిర్వేశం;
  • extrasensory, adj. అతీంద్రియ; ఇంద్రియాతీతమైన;
  • extrasensory perception, ph. అతీంద్రియ శక్తి; ఇంద్రియాతీతమైన గ్రహణ శక్తి; దివ్యదృష్టి;
  • extreme, adj. పరమ; అతి; చరమ; మహా;
  • extremely, adv. అధి; తెగ; పరమ; మహా;
  • extremely friendly, ph. అధిమిత్ర; పరమ స్నేహశీలమైన;
  • extremist, n. విపరీతవాది;
  • extremity, n. కొస; కొన; పరమావధి;
  • extrovert, n. m. బహిర్ముఖుడు; f. బహిర్ముఖి;
  • extrude, v. t. బహిస్సరించు;
  • exude, v. i. ఊరు; కారు;
  • exudation, n. (1) ఊట; రసం; (2) ఊరుట; చెమర్చుట;
  • exultation, n. ప్రహర్షం;
  • ex wife, ph. మాజీ భార్య;
  • eye, v. i. చూచు;
  • eye, n. కన్ను; నేత్రం; నయనం; అక్షి; చక్షువు; లోచనం; కక్ష; దేహదీపం;
    • compound -, సంయుక్త నేత్రం;
  • eyeball, n. కంటి గుడ్డు; నేత్ర గోళం; తెల్లగుడ్డు;
  • eyebrow, n. కనుబొమ;
  • eyelash, n. కనువెంట్రుక; కనురెప్పల చివర ఉండే రోమ విశేషం;
  • eyelet, n. కంటికంత;
  • eyelid, n. కనురెప్ప; రెప్ప;
  • eyeglasses, n. కంటద్దాలు; కళ్లజోడు; సులోచనాలు;
  • eyes, n. pl. కళ్లు, కండ్లు; నయనములు; నేత్రములు; చక్షువులు; లోచనములు;
  • eyesore, n. కంటికి ఇంపుగా లేని దృశ్యం; చూడ్డానికి అసహ్యంగా ఉన్నది;
  • eyewitness, n. సాక్షి; (ety.) స + అక్షి.= కళ్లతో చూసినది;

మూలం