ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (P)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిఘంటువు

  • This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
  • This dictionary uses American spelling for the primary entry. Equivalent British spellings are also shown as an added feature.
  • You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
  • PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks

19 Aug 2015.

P

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • pace, n. (1) అంగ; (2) జోరు; వేగం; గతి;
  • pachyderm, n. మందమైన చర్మం గల జంతువు; ఏనుగు; ఖడ్గమృగం;
  • pacifier, n. m. పాలతిత్తి; పాలపీక; పసిపిల్లలని శాంతింపజేయడానికి నోట్లో పెట్టే తిత్తి;
  • pacifist, n. శాంతికాముకుడు; యుద్ధ వ్యతిరేకి;
  • pacify, v. t. శాంతింపజేయు; సమాధానపరచు;
  • pack, n. (1) పొట్లం; పెట్టె; (2) ముఠా; గుంపు;
  • pack of cigarettes, ph. సిగరెట్టు పెట్టె;
  • pack of thieves, ph. దొంగల ముఠా;
  • pack of wolves, ph. తోడేళ్ల గుంపు; తోడేళ్ల తండా;
  • package, n. బంగీ; కట్ట;
  • pack-animal, n. బరువులు మోసే జంతువు; గాడిద; కంచర గాడిద, ఎద్దు, మొ.
  • packet, n. చిన్నబంగీ; పెద్ద పొట్లం;
    • small -, పొట్లం;
  • pack-horse, n. కంట్లపు గుర్రం; పెరికె గుర్రం;
  • pack-saddle, n. గంత; జీను;
  • pact, n. ఒప్పందం; ఒడంబడిక; కరారు;
  • pad, n. ఒత్తు; మెత్త;
  • padlock, n. బీగం; కప్ప; తాళం కప్ప;
  • paddle, n. తెడ్డు; క్షేపణి;
  • paddy, n. వడ్లు; వరి; ధాన్యం; శాలి;
    • hulled -, దంపుడు బియ్యం;
    • rice -, మడి; వరి మడి;
  • pagan, n. ఏ మతం లేని వ్యక్తి; క్రైస్తవుల, యూదుల, ముసల్మానుల సమష్టి దృష్టిలో వారి మతం కానివాళ్ళంతా ఏ మతం లేని వాళ్ళ కిందే లెక్క;
  • page, v. t. పిలుచు;
  • page, n. (1) పుట; పేజీ; (2) పిలుపు; (3) సేవకుడు;
  • pageant, n. ఉత్సవం;
  • pageantry, n. ఉత్సవం; సమారోహం; సంబరం;
  • pager, n. పిలచే సాధనం; పిలపరి;
  • paid, pt. & pp. of pay;
  • pail, n. బొక్కెన; బాల్చీ; చెంబు; ముంత;
  • pain, n. నొప్పి; పీకు; తీపు; బాధ; సలుపు; కంటకం; అకము; వేదన; దూకలి; శూల; (note) sharp ache is pain; dull pain is ache;
    • menstrual -, రుతుశూల;
    • sharp -, శూల;
    • shooting -, పోటు; శూల;
    • throbbing -, తీపు; సలుపు;
  • painless, adj. నొప్పిలేని; నిష్కంటక; నాక; (ety.) నా + అక;
  • paint, n. (1) లేపనం; (2) వెల్ల; రంగు; బచ్చెన;
  • paint, v. t. (1) చిత్రించు; (2) రంగులు వేయు;
  • painted, adj. బచ్చెన;
  • painter, n. (1) ) m. చిత్రకారుడు; f. చిత్రకారిణి; (2) గోడలకి రంగులు వేసే వ్యక్తి; m. రంజకుడు; f. రంజకి;
  • painting, n. (1) వర్ణచిత్రం; చిత్తరువు; (2) చిత్రలేఖనం;
    • oil -, తైలవర్ణ చిత్రం;
    • wall -, కుడ్య చిత్రం;
    • watercolor -, జలవర్ణ చిత్రం;
  • pair, v. t. జోడించు; జంటకలుపు;
  • pair, n. జత; జంట; జోడీ; కవలలు; దంపతులు; యుగ్మం; యుగళం; కవ; ద్విత్వం; రెంట; దోయి
  • pair of breasts, ph; చనుగవ;
  • pair of eyeglasses, ph. కళ్లజోడు; కళ్ళ అద్దాల జత;
  • pair of eyes, ph. కనుగవ; కందోయి;
  • pair of gloves, ph. చేతి జోళ్ళు; చేతి తొడుగుల జత;
  • pair of hands, ph. హస్తయుగళం;
  • pair of shoes, ph. జోళ్ళు; చెప్పుల జత;
  • pal, n. నేస్తం; జతగాడు;
  • palace, n. ప్రాసాదం; సౌధం; ధామం; రాజగృహం; దేవిడీ,
    • palace politics, ph. రాచకోట రాజకీయాలు; రాచనగరి రాజకీయాలు; కోటలో కుతంత్రాలు; కోటలో కౌటిల్యాలు;
  • palanquin, n. పల్లకి;
  • palatable, adj. భోజ్య; తినదగ్గగా; తినడానికి వీలుగా; రుచిగా;
  • palatals, n. తాలవ్యములు; నాలుక, అంగుడి సహాయంతో పలికే హల్లులు; చ, ఛ, జ, ఝ, ఞ;
  • palate, n. (1) అంగుడు; అంగిలి; తాలువు; నోటి కప్పు భాగంలో దంతమూలాలకీ కొండ నాలుకకీ మధ్యనున్న భాగం; (2) అభిరుచి;
    • soft -, మృదు తాలువు; అంగిలిలో మెత్త భాగం;
  • palatalization, n. తాలువ్యీకరణం;
  • pale, adj. పాలిపోయిన; వివర్ణమైన; రంగులేని;
  • paleo, adj. పురాతన; పురా;
  • paleobotany, n. పురా వృక్షశాస్త్రం; పురాతన కాలంలో బతికిన చెట్లని, వాటి శిలాస్థుల ద్వారా గుర్తించి, అధ్యయనం చెయ్యడం;
  • paleontology, n. పురాజీవ శాస్త్రం; ప్రాక్తన శాస్త్రం; (Br.) paleontology;
  • paleolithic era, ph పురాతన రాతియుగం;
  • paleozoic era, ph. పురాతన జీవయుగం;
  • palimony, n. వివాహ బంధం లేకుండా ఇద్దరు కొన్నాళ్లు కాపురం పెట్టిన తరువాత విడిపోయినప్పుడు ఒకరు మరొకరికి ఇచ్చే భరణం;
  • palindrome, n. కచికపదం; కచిక; ఎటునుండి చదివినా ఒకే మాట వచ్చే పదాలు; ఉ. వికటకవి;
  • Palladium, n. పెల్లేడియం; పల్లాదం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 46, సంక్షిప్త నామం, Pd); [Gr. Pallas = goddess of wisdom];
  • palliative, n. ఉపశమనకారి; ఉపశాంతిని ఇచ్చేది;
  • pallid, adj. పాలిపోయిన; వెలవెలబోయిన;
  • pallor, n. పాలిపోయిన రంగు;
  • palm, n. (పామ్) (1) అరచేయి; చేర; కరతలం; (2) తాటిచెట్టు; తాళద్రుమం; తాళవృక్షం; (3) తాటి, ఈత, కొబ్బరి మొదలైన చెట్లు;
  • palm kernel, n. తాటిటెంక;
  • palm leaf, n. తాటాకు; తాటియాకు; తాటిఆకు; తాళపత్రం;
  • palm tree, n. తాటి చెట్టు; తాళద్రుమం;
  • palm oils, n. తాటి, ఈత, కొబ్బరి మొదలైన నూనెలు;
  • palmar, adj. అరచేతి; కరతలస్థ;
  • palmful, adj. చేరెడు;
  • palmistry, n. హస్తసాముద్రికం; చేతిలో రేఖలని బట్టి జాతకం చెప్పే పద్ధతి;
  • palmitic acid, n. తాళికామ్లం;
  • palmyrah, n. తాటిచెట్టు;
  • palpable, adj. ప్రత్యక్షమైన; స్పష్టమైన;
  • palpable error, ph. పచ్చి తప్పు; శుద్ధ తప్పు;
  • palpate, v. t. అప్పళించు; నొక్కు; వైద్యుడు పరీక్ష నిమిత్తం నొక్కడం;
  • palpitation, n. దడ; గుండె దడ; గుండె వడిగా కొట్టుకొనుట;
  • palpitation, n. గుండె దడ; దడ;
  • paltry, adj. పిసరంత;
  • pampas, n. pl. పంపాలు; దక్షిణ అమెరికాలోని విశాలమైన మైదానాలు;
  • pamphlet, n. కరపత్రం;
  • pan, pref. అఖిల;
  • pan American, అఖిల అమెరికా;
  • pan, n. పెనం; మూకుడు; చట్టి; తప్పేలా;
    • frying -, బాణలి; మూకుడు;
  • panacea, n. ఉపశమనం;
  • pancreas, n. క్లోమం; వృక్వకం; స్వాదుపిండం; అగ్నాశయం;
  • pancreatic juices, n. క్లోమరసాలు; స్వాదురసాలు;
  • pandal, n. [Ind. Engl.] పందిరి; డేరా;
  • pandemic, n. అఖిలమారి; ప్రపంచమారి; ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమందిని పట్టి పీడించే అంటుజాడ్యం;
  • pandemonium, n. దొమ్మీ; అల్లకల్లోలం; గలభా; కోలాహలం; నలబలం;
  • pandiculation, n. (1) ఒళ్లు విరుచుకోవడం; లేవగానే ఒళ్లు విరుచుకోవడం; (2) ఆవలింత;
  • pane, n. పలక;
    • glass -, గాజు పలక;
    • window -, కిటికీ పలక;
  • panentheism, n. జగదతీత దైవభావం; ప్రతి వస్తువులోనూ దేవుడు ఉన్నాడనే భావన;
  • pantheism, n. జగదభిన్న దైవభావం; భగవంతుడిలోనే అంతా ఉంది అనే భావన;
  • pang, n. వేదన; నొప్పి;
  • panhandler, n. ముష్టివాడు; ముష్టిది; తిరిపెం:
  • panic, n. భయాందోళన; కంగారు; గాభరా;
  • panorama, n. విశాల దృశ్యం; విస్తృత దృశ్యం; దృగావరణం;
  • panoramic, adj. విశాల; విస్తృత; దిగ్దర్శక; పరితోదర్శక;
  • panoramic view, ph. దిగ్దర్శక దృశ్యం; విస్తృత దృశ్యం;
  • panpsychism, n. సర్వాత్మ సిద్ధాంతం; విశ్వమంతా ఆత్మల సముచ్ఛయం అనే సిద్ధాంతం;
  • pant, v. i. ఎగరొప్పు; రొప్పు; ఒగర్చు;
  • pantheism, n. దేవుడే ప్రపంచం, ప్రపంచమే దేవుడు అనే నమ్మకం; విశ్వస్వరూపమే విష్ణుస్వరూపం:
  • pantheon, n. దేవుళ్ళు; దేవగణాలు; సకల దేవ సమూహం; అఖిల దేవతా గణం;
  • panther, n. కిరుబా;
    • black -, కరి కిరుబా;
  • pantomime, n. అభినయం; మూకాభినయం; నటీనటులు మాట్లాడకుండా హావభావాలతో ప్రదర్శించే నాటకం;
  • pantry, n. ఉగ్రాణం; వంట వార్పులకి అవసరమైన దినిసులని దాచుకునే గది;
  • pants, n. pl. పంట్లాం; షరాయి;
  • pantomime, n. తమాషా; వేడుక;
  • pantry, n. ఉగ్రాణం; కొట్టుగది; వంట ఇంటికి ఆనుకుని ఉన్న కొట్టుగది;
  • papa, n. అయ్య; అప్ప; నాన్న; తండ్రి;
  • papal, adj. పోపుకి సంబంధించిన; రోమన్ కేథలిక్ మతాధికారి అయున పోపుకి సంబంధించిన;
  • papaya, n. బొప్పాయి; పరంగి కాయ; పరింది; మదనానప కాయ;
  • paper, n. కాగితం; పత్రిక; పత్రం; కాకలం; పేపరు;
    • newspaper, వార్తాపత్రిక; పేపరు; % move to N
    • blank -, తెల్ల కాగితం; అలేఖం;
    • onionskin -, ఉల్లిపొర కాగితం;
    • question -, ప్రశ్న పత్రం;
    • tracing -, ఉల్లిపొర కాగితం;
    • tissue -, మృదువైన పల్చటి కాగితం;
    • white -, తెల్ల కాగితం; అలేఖం; శ్వేత పత్రం;
  • papilla, n. సూక్ష్మాంకురం;
  • paprika, n. ఒక రకం కారం లేని తియ్య, ఎండు మిరపకాయల పొడి; see also chilli and capsicum;
  • par, n. సమం; బరాబరు;
  • para, adj. pref. (1) పక్క; పార్శ్వ; (2) మరొక; అతీత;
  • parable, n. దృష్టాంతం; ఉదాహరణ; నీతిబోధ; దృష్టాంత కథ;
  • parabola, n. అనువృత్తం; పరవలయం;
  • parachute, n. గాలిగొడుగు; మరోగుమ్మటం; పేరాషూట్;
  • parade, n. ఊరేగింపు; ఖురళి; ఖళూరిక;
  • paradigm, n. విశ్వవీక్షణం;
  • paradigm shift, ph. విశ్వవీక్షణ విస్థాపనం;
  • paradise, n. స్వర్గం; స్వర్గలోకం; నాకం; నాకలోకం; దివి; భోగభూమి;
  • paradox, n. సత్యాభాసం; విరుద్ధోక్తి; విపర్యోక్తి; విరోధాభాసం; విరుద్ధమైన అభిప్రాయాలని ఒకే సందర్భంలో ఇరికించి చెప్పే ఉక్తి;
  • paraffin wax, n. రాతిమైనం; తెల్లమైనం; (ety.) [Lat. para + oleffin = paraffin = another type of fat]; [Gr. parum + affin = paraffin = one with little affection]; (note). bee's wax is slightly yellow in color;
  • paragraph, n. అనువాకం; పేరా; పేరాగ్రాఫు; (rel.) విభాగం; పరిచ్ఛేదం;
  • paragon, n. ఆదర్శప్రాయమైనది; ఆదర్శం;
Paraldehyde=పరాలంతం
  • paraldehyde, n. పరాలంతం; ఎసిటాల్డిహైడ్ కి "త్రిమూర్తి" రూపం; C6H12O3; (lit.) మరొక రకం అలంతం;
  • parallax, n. దృక్ఛాయ; కోణభ్రంశం; దూరములో ఉన్న వస్తువుని చూసినప్పుడు మన కదలిక వల్ల కోణములో కనిపించే మార్పు;
  • parallel, adj. (1) సమాంతర; సమానాంతర; (2) సాటి; తుల్య; సరిపోలే; పోటీ;
  • parallel lines, ph. సమాంతర రేఖలు;
  • parallel government, ph. పోటీ ప్రభుత్వం;
  • parallel operation, ph. సమాంతర క్రియ;
  • parallel planes, ph. సమాంతర తలములు;
  • parallelism, n. సమాంతరత్వం;
  • parallelogram, n. సమాంతర చతుర్భుజం; రెండు ఎదురెదురు భుజాలు సЮాంతరంగా ఉన్న చతుర్భుజం;
  • paralysis, n. పక్షపాతం;
  • paralyze, v. t. (1) స్తంభింపజేయు; అశక్తం చేయు; (2) పక్షవాతం కలుగజేయు;
  • parameter, n. (1) హద్దు; అవధి; (2) [math.] పరాంకం; పరరాసి; పరామితి; పరామాత్ర; మరొక కొలత; పరామీటరు; గణితంలో వచ్చే చలన రాసి కాక మరొక రాసి; (ety.) para = another; by the side of; metron = measurement; (rel.) స్థిరాంకం;
  • paramilitary, n. మరొక రకం సైన్యం;
  • paramount, adj. పరమ; సర్వోత్కృష్టమైన;
  • paranoia, n. ఇతరులు తనకి హాని చేద్దామని అనుకుంటున్నారనే ఆధారం లేని నమ్మకం;
  • paranormal, adj. అసాధారణమైన;
  • parapet wall, n. పిట్టగోడ;
  • paraphernalia, n. సరంజామా; సాధన సంపత్తి; హంగులు; హంగూ, ఆర్భాటం;
  • paraphrase, n. దండాన్వయం; మరొకరకం మాటలతో రాసిన అన్వయం;
  • parasitic, adj. పరాన్న;
  • parasitic plant, n. బదనిక; పరాన్నభుక్కుగా జీవించు ఉద్భిజ్జం;
  • parasite, n. ఉపజీవి; పరభాగ్యోపజీవి; పరాన్నభుక్కి; పరభుక్కి; పరాన్నజీవి; see also predator;
  • parasol, n. అరిగె; ఛత్రం; చిన్న గొడుగు; ఎండ గొడుగు; ఆతపత్రం; రాజుల సింహాసనాల మీద, దేవుడి విగ్రహాల దగ్గర అలంకారానికి వాడే గొడుగు;
  • parapsychology, n.అతీత మనస్తత్వ శాస్త్రం; మరొక రకం మనస్తత్వ శాస్త్రం;
  • paratyphoid, n. అతీత టైఫాయిడ్; మరొక రకం టైఫాయిడ్;
  • parboiled, adj. కొద్దిగా ఉడికించిన;
  • parboiled rice, ph. ఉప్పుడు బియ్యం;
  • parcel, n. బంగీ; కట్ట; మూట; పార్సెలు;
  • parched, adj. ఎండిపోయిన;
  • parchment, n. చర్మపత్రం; ఉల్లిపొర చర్మం;
  • pardon, n. క్షమాభిక్ష; క్షమాపణ; మాఫీ; మన్నింపు;
  • pardon, v. t. క్షమించు; మన్నించు;
  • pardon me, ph. క్షమించండి; క్షమించాలి; మాఫ్ చెయ్యండి; మన్నించండి;
  • pare, v. t. తొక్కతీయు; చివ్వు;
  • parent, n. తల్లి; తండ్రి;
  • parenthesis, n. s. కుండలీకరణం; వృత్తార్ధం; చిప్పగుర్తు; చిప్ప;
  • parentheses, n. pl. కుండలికరణాలు; వృత్తార్ధాలు; చిప్పగుర్తులు; చిప్పలు;
  • parents, n. pl. తల్లిదండ్రులు; మాతాపితలు; జననీజనకులు;
  • pariah, n. (పరయ్యా) వెలివేయబడ్డ వ్యక్తి; బహిష్కృతుడు; చండాలుడు;
  • parietal bone, n. సీమంతాస్థి;
  • parity, n. తుల్యత; సమత్వం;
  • parity bit, [comp.] ph. తుల్యతా ద్వింకం;
  • park, n. వనం; ఉపవనం; ఉద్యానవనం; ఎలదోట;
  • parliament, n. శాసన సభ; అంటే లోక్‌సభ, రాజ్యసభ, రాష్టప్రతుల సముదాయం;
    • lower house of the Indian -, లోక్‌సభ;
    • upper house of the Indian -, రాజ్యసభ;
  • parochial, adj. సంకుచిత; ప్రాంతీయ;
  • parochial school, ph. సంకుచిత దృక్పథం ఉన్న పాఠశాల; ప్రాంతీయ దృక్పథంతో నడిపే పాఠశాల; ఉ. కేథలిక్‌ చర్చి నడిపే పాఠశాల;
  • parody, n. హాస్యానుకృతి; వ్యంగ్యానుకరణ; ఎగతాళి;
  • parrot, n. చిలుక; రామచిలుక; శుకం; కీరం;
  • parse, v. t. అన్వయించు; అన్వయం చెప్పు; వాక్యంలోని కర్త, కర్మ, క్రియలని విశ్లేషించు; వ్యాకరించు; (rel.) ప్రస్తరించు అంటే గురు లఘువులని గుర్తించి పద్యపాదాన్ని గణ విభజన చేసి విశ్లేషించడం;
  • parsimonious, adj. మితవ్యయ; ఎక్కువ ఖర్చుకాని; క్లుప్త;
  • parsimony, n. లోభత్వం; పిసినిగొట్టుతనం; క్లుప్తత్వం;
  • parsley, n. పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా వండిన వంటకాలని అలంకరించడానికి వాడే కొత్తిమిర లాంటి ఆకు పత్రి; [bot.] Petroselinum;
  • part, n. (1) భాగం; వంతు; వాటా; పాలు; అంశం; అంశ; కోరు; (2) పాపిడి; కేశవీధి;
    • internal -, అంతర్భాగం;
  • partake, v. t. పుచ్చుకొను;
  • partaking, n. ఆస్వాదన; భోగం;
  • part-time, adj. అంశకాలిక;
  • parthenogenesis, n. [biol.] అనిషిక్తజననం; పురుష సంపర్కం లేకుండా జరిగే పుట్టుక;
  • partial, adj. అర్ధాంతర; పార్శ్వ; పాక్షిక; ఆంశిక;
  • partial distillation, ph. ఆంశిక శ్వేదనం;
  • partial fractions, ph. ఆంశిక భిన్నములు; పాక్షిక భిన్నములు;
  • partiality, n. పక్షపాతం; పక్షపాత బుద్ధి; వలపక్షం;
  • partially, adv. పాక్షికంగా; ఆంశికంగా; అర్ధాంతరంగా;
  • participate, v. t. పాల్గొను; పాలుపంచుకొను; పూనుకొను;
  • participle, n. క్రియావాచకాన్ని విశేషణాన్ని పోలిన క్రియాజన్యమైన పదం;
  • particle, n. నలుసు; రేణువు; సూక్ష్మకణం; శకలం;
  • particle accelerator, n. రేణుత్వరణి;
  • particle of matter, ph. పదార్థ శకలం;
  • particular, adj. ప్రాతిస్విక;
  • particulars, n. తబ్సీలు; వివరములు;
  • partisan, n. పక్షవాది; రెండు పక్షాలలో ఒక వైపు మొగ్గు చూపే వ్యక్తి;
  • partition, n. మందడి; భిత్తి; విభాగం;
  • partition function, ph. [math.] మందడి ప్రమేయం, maMdadi pramEyaM
  • partition number, ph. మందడి సంఖ్య;
  • partition wall, ph. మందడి గోడ; భిత్తిక;
  • partner, n. భాగస్వామి; భాగస్థుడు; పాలి; పాలేరు;
    • life's -, జీవిత భాగస్వామి; సహధర్మచారి; సహధర్మచారిణి;
  • partnership, n. భాగస్వామ్యం; పాలివ్యాపారం; పొత్తు;
  • partridge, n. కౌజు; కోడిని పోలిన ఒక పక్షి; చందమామ పులుగు;
  • parturition, n. కాన్పు; ప్రసవం; పురుడు;
  • party, n. (1) పక్షం; దళం; వైపు; తరఫు; జట్టు; పెళ్లివారు; మేళం; బృందం; (2) వేడుక; విందు;
    • birthday -, పుట్టినరోజు వేడుక;
    • bride's -, ఆడపెళ్లివారు;
    • opposition -, ప్రతిపక్షం;
    • prior -, ముందటి జట్టు; మొదటి ఆసామీ;
    • tea -, అల్పాహార విందు;
    • third -, అన్యుడు; ఇతరుడు; ఇరు పక్షాలకీ చెందని పైవాడు;
  • pass, n. (1) కనుమ; మార్గం; సందు; (2) పత్రం;
    • entrance -, ప్రవేశ ద్వారం;
    • Khyber -, ఖైబరు కనుమ;
  • pass, v. i. (1) ఒదులు; (2) కృతార్థుడగు; ఉత్తీర్ణుడగు;
  • pass, v. t. పంపు; పంపించు; దాటు;
  • passage, n. (1) ప్రయాణం; (2) దారి; మార్గం; నడవ; (3) ప్రయాణానికయే ఖర్చు; (4) ప్రయాణానికి కావలసిన టికెట్టు;
  • passage way, n. నడవ; మార్గం; నడిచే దారి;
  • passe, n. (పస్సే) [idiom] పాతచింతకాయ పచ్చడి; పాడిన పాటే పాడడం;
  • passenger, n. ప్రయాణీకుడు; యాత్రి; రధి; ముసాఫిర్; బండిలో ప్రయాణం చేసే వ్యక్తి;
  • passer-by, n. దారి వెంబడీ పోయేవాడు; దారిన పోయే దానయ్య;
  • passion, n. రాగం; ఎక్కువ ఇష్టం; మోజు;
  • passion fruit, n. హనుమాఫలం; (రామాఫలం; సీతాఫలం లా)
  • passive, adj. కలుగజేసుకోకుండా ఊరక ఉండు;
  • passive voice, n. కర్మార్ధకం; కర్మణి ప్రయోగం;
  • passport, n. గుర్తుపొత్తం; ఒక మనిషి ఎవ్వరో నిర్ద్వంద్వంగా గుర్తించడానికి, ఆ వ్యక్తి ఫొటో, పుట్టిన తేదీ, పౌరసత్వం వగైరాలతో ప్రభుత్వం ఇచ్చే చిరుపొత్తం; ఈ పుస్తకం లేకుండా దేశం వదలి ప్రయాణం చెయ్యడం కుదరదు;
  • password, n. సంకేతపు మాట; సంకేతపదం;
  • past, adj. జరిగిపోయిన; గతించిన; గడచిపోయిన; ఆగత; భూత;
  • past tense, ph. భూతకాలం; ఆగతకాలం;
  • past, n. జరిగిపోయినది; గతం; గతించినది;
    • in the -, లోగడ;
  • pasta, n. సేమ్యాని పోలిన పిండితో చేసిన; ఇటలీ దేశపు తిను భండారం; మనకి అన్నం ఎలాగో ఇటలీ వారికి పాస్టా అళాంటిది;
  • paste, n.ముద్ద; ఖమీరం; లేపనం; అంజనం; జిగురు;
    • tooth -, దంతధావన ఖమీరం;
  • pastel, n. రంగుల బొమ్మలు గియ్యడానికి రంజన ద్రవ్యాన్ని నీళ్లల్లో కలిపి చేసిన ముద్ద;
  • pastel colors, n. లేతరంగులు; లేత నీలం కాని, లేత గులాబీ కాని;
  • pastime, n. కాలక్షేపం; విరామ క్రీడ; క్రీడలు; ఆట; వినోద కాలక్షేపం;
  • pastor, n. క్రైస్తవ పురోహితుడు; ప్రొటెస్టెంట్ తెగకి చెందిన పురోహితుడిని పేస్టర్ అంటారు; ఇతను వివాహం చేసుకుని, సంసారం చెయ్యవచ్చు;
  • pastry, n. పిండివంటలు; పిండితో చేసిన వంటకాలు; ముఖ్యంగా బిస్కత్తులు; వగైరా;
  • past perfect, n. [gram.] గతంలో జరిగిన రెండు సంఘ్టనల గురించి చెప్పేటప్పుడు, రెండింటిలో ముందు జరిగిన సంఘటనని చెప్పే కాలం; ఉదాహరణకి, "మూర్తి వచ్చేసరికి నేను భోజనం చేసేసేను" అన్న దానిని ఇంగ్లీషులో "I had finished my meal before Murthy came” అన్నప్పుడు "had finished” అన్న పదబంధం past perfect tese లో ఉందన్నమాట; ఈ భావానికి సరితూగే భావం తెలుగు వ్యాకరణంలో లేదు;
  • pastry, n. పిండి, పాలు, వెన్న మొదలైన ఘటక పదార్ధాలతో చేసిన రొట్టెలు, పూర్ణానికి చుట్టే తావి, మొదలైన వంటకాలు, తియ్యటి కేకు, వగైరా;
  • pasteurization, n. సూక్ష్మజీవులని చంపడానికి పాల వంటి పదార్థాలని వేడి చేసి చల్లార్చే పద్ధతి;
  • pasture, n. పచ్చిక పొలం; పచ్చిక బయలు;
  • pat, v. t. తట్టు;
  • patch, n. (1) అతుకు; మాసిక; టాకా; (2) ముక్క; చిన్న ప్రదేశం;
  • patch of grass, ph. పచ్చిక చెక్క;
  • patch of paper, ph. కాగితం ముక్క;
  • patchwork, n. అతుకుల బొంత; తాటాదూటం;
  • patella, n. మోకాటిచిప్ప;
  • patent, adj. వ్యక్తమైన;
  • patent, n. ఏకస్వం; విశిష్టాధికారం; సన్నదు;
  • paternal, adj. పైతృక; తండ్రివైపు;
  • paternal aunt, ph. మేనత్త;
  • paternal aunt's daughter, ph. మేన వదిన; మేన మరదలు;
  • paternal aunt's son, ph. మేనబావ; మేనమరది; బావ;
  • paternal grand mother, ph. మామ్మ; నాయనమ్మ; బామ్మ;
  • path, n. బాట; పథం; మార్గం; దారి; తెరువు; తెన్ను; తోవ; అయనం; పుంత; డొంక; సరవి; చనుప; నడవ; చొప్పు; జాడ;
  • pathetic, adj. దయనీయ; కనికరపు; విషాదకరమైన; జాలి పుట్టించే; మనస్సుని కరిగించే;
  • pathetic, adj. దయనీయ; కనికరపు; మనస్సుని కరగించెడు;
  • pathogenic, adj. రోగాన్ని కలిగించే; రోగకారక;
  • pathogenic bacteria, ph. రోగాన్ని కలిగించే సూక్ష్మజీవులు;
  • pathology, n. రోగనిదాన తంత్రము; రోగ నిర్ణయ శాస్త్రం;
  • pathos, n. (1) జాలి; అనుభూతి; (2) కరుణ రసం; (3) రోగం;
  • pathological liar, n. రోగ లక్షణం అనిపించే విధంగా అబద్ధాలు చెప్పే వ్యక్తి;
  • patience, n. ఓరిమి; ఓర్పు; సహనం; సహన శక్తి; క్షమ; తాలిమి; సైరణ; క్షాంతి;
  • patient, adj. సహనంతోకూడిన;
  • patient person, ph. సహనవంతుడు; సహనవతి;
  • patient, n. రోగి; అస్వస్థుడు; వ్యాధిగ్రస్తుడు; రుజాగ్రస్తి; అభ్యమితి; నోవరి; నొప్పిగుంటి; ఉపతాపి; పరితాపి; ఆమయాని; ఆతురుడు; పీడితుడు;
  • patriarch, n. m. మూలపురుషుడు; మూలవిరాట్టు;
  • patriarchal, adj. పితృస్వామ్య; పితృతంత్ర; పితృయజమాన;
  • patriarchy, n. m. పితృస్వామ్యం; పితృతంత్రం; పితృ అధికారం;
  • patricide, n. పితృహత్య; పితృమేధం;
  • patrimony, n. పిత్రార్జితం;
  • patriotism, n. దేశభక్తి;
  • patrol, n. కావలి; గస్తు; పహరా;
    • foot -, కాలి కావలి;
    • highway -, రహదారి కావలి; దారి కావలి దండు;
  • patrol, v. t. గస్తీతిరుగు; ప్రహరించు; ప్రహరితిరుగు; కాపలా కాయు;
  • patron, n. m. ఘటకుడు; ప్రాపకుడు; ప్రాపు; పోషకుడు; f. ప్రాపకురాలు;
  • patronage, n. ప్రాపకం; ప్రాపు; అండ;
  • patronize, v. i. (1) జాలిపడ్డట్టు నటించడం; ఎదటివాడు అంతటి ముఖ్యుడు కానట్టూ, అంత తెలివైనవాడు కానట్టూ అనిపించేలా ప్రవర్తించడం; (2) రివాజుగా ఒకే వ్యాపార సంస్థకి బేరాలు ఇవ్వడం;
  • pattern, n. బాణీ; నమూనా; మచ్చు; మాదిరి; ప్రకారం; కైవడి;
    • plaid -, గళ్ళు;
    • polka dot -, చుక్కలు;
    • striped -, చారలు;
  • paucity, n. సంక్షోభం; ఎద్దడి; దొరకక పోవుట; కొరత; స్వల్పత;
  • pauper, n. అర్థహీనుడు; బీదవాడు; బికారి; దరిద్రుడు; నిరాధారి; అకించనుడు;
  • pause, v. t. నిలుపు; ఆపు; తాత్కాలికంగా ఆపు చేయు;
  • pave, v. t. గచ్చు చేయు; చదును చేయు;
  • pavement, n. చపటా; గచ్చు చేసిన భాగం;
  • paw, n. పంజా; పాదం; జంతువుల పాదం;
  • pawn, n. (1) బంటు; కీలుబొమ్మ; (2) పావు; పిక్క; నప్పు; (3) కుదువ; తాకట్టు;
  • pawn, v. t. కుదువబెట్టు; తాకట్టుబెట్టు;
  • pay, n. జీతం; కూలి;

---Usage Note: pay, salary, wage

  • ---Pay is the general word for money that someone gets for doing work. Income is the money you receive from any source : an investment income. A salary is what professional people get, for their services, every year: What is the yearly salary for a professor? A wage is the pay that someone earns every hour or every week.
  • pay, v. t. చెల్లించు; కట్టు; ఇచ్చు; తీర్చు;
  • payee, n. గ్రహీత; సొమ్ము పుచ్చుకొనేవాడు;
  • payer, n. దాయకుడు; దాత; సొమ్ము ఇచ్చేవాడు;
  • payment, n. చెల్లింపు;
  • pea, n. బటానీ గింజ;
    • field - , పొలాల్లో పండే బటానీ, [bot.] Pisum sativum;
    • garden - , తోట బటానీ, [bot.] Pisum hartense;
  • peace, n. శాంతి; శాంతం;
  • peaceful, n. ప్రశాంతము;
  • peacefully, adv. శాంతియుతంగా;
  • peacock, n. m. నెమలి; నెమలిపుంజు; మయూరం; శిఖి; కేకి; నీలకంఠం;
  • peahen, n. f. నెమలి; నెమలిపెట్ట; మయూరి; నెమ్మి;
  • peak, n. శిఖరం; శృంగం; కొన; అగ్రభాగం;
  • peanut, n. వేరుశెనగ; పల్లికాయ;
  • pear, n. (పేర్) బేరి; బేరిపండు;
  • pearl, n. ముత్యం; మంచి ముత్యం; నవ రత్నములలో నొకటి
    • mother of -, ముత్యపు చిప్ప;
  • pearl fishery, ph. ముత్యాల సలాపం;
  • pearl oyster, ముత్యపు చిప్ప; శుక్తి;
  • peas, n. pl. బటానీలు;
    • cooked -, పప్పు; ముద్దపప్పు; సూపం;
    • pigeon -, కందులు;
    • split -, బటానీ పప్పు;
    • split pigeon -, కందిపప్పు;
  • peasant, n. m. పల్లెటూరివాడు; కృషీవలుడు;
  • peasantry, n. రైతాంగం;
  • pebble, n. గులకరాయి;
  • pectoral, adj. గుండెవైపు; ఛాతీకి సంబంధించిన; కడుపువైపు; ఉదర;
  • peculiar, adj. విచిత్రమైన; అసమాన్యమైన;
  • pecuniary, adj. ఆర్థిక; ధనసంబంధ;
  • pedagogue, n. ఉపాధ్యాయుడు; శిక్షణ ఇచ్చే వ్యక్తి; ఒక నిర్ణీత పద్ధతిలో బోధన చెయ్యాలని చాదస్తపడే వ్యక్తి;
  • pedal, n. పాదుక; సైకిలు, కుట్టుమిషను, పియానో వగైరాలలో పాదంతో తొక్కే తులాదండం;
  • pedantic, adj. గ్రాంథిక; పాఠ్య;
  • peddler, n. వీధుల వెంబడి తిరుగుతూ సరుకులు అమ్ముకునే వ్యక్తి;
  • pedestal, n. పాదపీఠం:
  • pedestrian, n. పాదచారి; పదస్తలి; పాంథుడు; పథికుడు;
  • pedicel, n. పుష్పవృంతం; తొడిమె; పువ్వుకి ఉండే కాడ;
  • pedigree, n. వంశవృక్షం; వంశావళి; ప్రవర; వంగడం;
  • pedophile, n. లైంగిక దృష్టితో చిన్న పిల్లలని ప్రేమించే తత్వం ఉన్న వ్యక్తి;
  • peek, v. t. తొంగి చూచు; నక్కి చూడు;
  • peeking Tom, n. తలుపు కన్నాలనుండీ, కిటికి సందులనుండీ ఇళ్ళల్లోకి చూసే వ్యక్తి;
  • peel, n. తోలు; పట్ట; తొక్క;
  • peel, v. i. ఊడు; చర్మం ఊడు;
  • peel, v. t. ఒలుచు; తొక్క ఒలుచు;
  • peelings, n. తొక్కు; ఒలచగా వచ్చిన తొక్కు; తొక్కలు;
  • peer, n. సాటి; సహపాఠి; సహాధ్యాయి; తుల్యుడు;
    • he is his own -, వాడికి వాడే సాటి;
  • peers, n. pl. సాటివారు; సహాధ్యాయులు; తుల్యులు;
  • peerless, adj. సాటిలేని;
  • peerless, n. అసదృశం;
  • peeve, n. గోడు;
  • peevishness, n. చిరాకు; చిరుకోపం;
  • peg, n. (1) సీల; చీల; గుంజ; కర్ర మేకు; దబ్బ; (2) వీణ వంటి వాయిద్యాలలోని తీగలని బిగించడానికి చేత్తో పట్టుకుని తిప్పే చీల; (3) అంచనా వేసేటప్పుడు మెట్లవారీగా పైకో కిందికో మారే పరిమాణం; (4) మాదక ద్రవ్యాలని సేవించేటప్పుడు వాడే కొలమానం;
  • Pegasus, n. (1) ఉత్తరాభాధ్ర; (2) పేధ్వఘాశ్వం; అహిహననం;
  • pejorative, adj. పాడైన; అపకర్ష; ఒక మాట యొక్క అసలు అర్థం కంటె చెడ్డ అర్థాన్ని ఆపాదించే;
  • pelican, n. గూడకొంగ; పెద్దేటి కొంగ;
  • pellet, n. గుళిక; మాత్ర;
  • pell-mell, adv. ఓహరిసాహరిగా;
  • pelt, n. చర్మం; బొచ్చు ఉన్న జంతువుల చర్మం; సాన పట్టడానికి అనుకూలంగా తయారుచేయబడ్డ చర్మం;
  • pelt, v. t. విసరు; బాదు; మొత్తు;
  • pellate, adj. [bot.] ఛత్రాకార;
  • pelvic, adj. కూపక; వస్తిక; కటి;
  • pelvic cavity, ph. కూపక కుహరం; వస్తిక కుహరం;
  • pelvic girdle, ph. వస్తిక వేష్టం; కటి వలయం;
  • pelvis, n. కూపకం; వస్తికం; కటి;
  • pen, n. (1) కలం; పేనా; లేఖిని; పెన్ను; ఊటకలం; [Lat.] penna; [Sans. parna = feather]; (2) పశువుల కొట్టం; దొడ్డి;
    • fountain -, ఊట కలం;
    • pig -, పందుల దొడ్డి;
  • pen knife, n. చూరకత్తి;
  • pen name, n. కలం పేరు;
  • penal, adj. శిక్షా; శిక్షకి సంబంధించిన;
  • penal code, n. శిక్షాస్మృతి;
  • penalize, v. t. శిక్షించు;
  • penalty, n. శిక్ష; జరిమానా;
  • penance, n. (1) తపస్సు; (2) ప్రాయశ్చిత్తం;
  • pencil, n. (1) కుంచిని; పెన్సిలు; (2) శలాకం;
  • pencil of rays, ph. కిరణ శలాకం;
  • pendant, n. పతకం; తరళం; లంబనం; బావిలీ; కుండలం; వేలాడే వస్తువు;
  • pendulum, n. లోలకం;
  • penetrate, v. i. దూరు; ప్రవేశించు;
  • penetrate, v. t. దూర్చు; ప్రవేశపెట్టు;
  • pen-holder, n. కలందాను;
  • penicillin, n. బేక్టీరియా జాతి సూక్ష్మజీవులని హతమార్చడానికి వాడే ఒక మందు; ఇది వైరసు జాతి సూక్ష్మజీవుల మీద పని చెయ్యదు;
  • penis, n. పురుషాంగం; శిశ్నం; లింగం; మేడ్రం; పురుషుని జననాంగం;
  • peninsula, n. ద్వీపకల్పం; మూడు పక్కల నీటితో సమావృతమైన భూభాగం;
  • penitence, n. పశ్చాత్తాపం; అనుతాపం; తాను చేసిన తప్పు గురించి పడే చింత;
  • penitentiary, n. జైలు; ఖైదు; కారాగారం; శిక్షాగృహం; పశ్చాత్తాపగృహం;
  • penknife, n. అసిపుత్రి; చురకత్తి; చిన్న కత్తి;
  • penmanship, n. దస్తూరీ;
  • pennant, n. జెండా; పతాకం; ధ్వజం;
  • pension, n. ఉపకార వేతనం; పింఛను;
  • pensively, adv. సాలోచనగా; విచారగ్రస్తంగా; చింతగా;
  • pent, adj. కప్పబడ్డ; మూయబడ్డ;
  • pentagon, n. పంచభుజి; పంచాస్రం;
  • pentode, n. పంచోడు; ఐదు అంశాలు ఉన్న శూన్య నాళిక;
  • pentose, n. [chem.] పాంచక్కెర; పంచభుజి ఆకారంలో నిర్మాణశిల్పం ఉన్న ఒక రసాయనం;
  • penultimate, adj. ఉపాంత్య; ఉపధా; ఊనాంత, UnAMta; ఒకటి మినహాయించి ఆఖరుది; పెనాది; చివరిదాని ముందున్నది;
  • penultimate Saturday, ph. ఉపాంత్య శనివారం; సాధారణంగా ఇది నెలలో మూడవ శనివారం అవుతుంది;
  • penumbra, n. ఖండఛాయ; ఉపచ్ఛాయ;
  • penury, n. బీదరికం; పేదరికం; లేమి; బీదతనం; దరిద్రం;
  • peon, (పియాన్, ప్యూన్) n. బంట్రోత్తు;
  • people, n. జనం; జనాలు; ప్రజలు; ప్రజ; ప్రజానీకం; మనుషులు; జనత; లోకులు;
    • displaced -, నిరాశ్రయులు;
    • movement of -, జనసంచారం;
    • selfish -, స్వార్థపరులు;
  • peoples, n. ప్రజానీకాలు;
  • pep, n. ఉత్సాహం;
  • pepper, n. (1) మిరియం; పిప్పలి; (2) మిరపకాయ;
    • black -, మిరియాలు;
    • green -, పచ్చి మిరపకాయలు; పచ్చ మిరపకాయలు;
    • long -, పిప్పలి;
    • red -, మిరపకాయలు; ఎర్ర మిరప కాయలు;
  • pepsin, n. జఠర రసం; జఠరం; కాలకం;
  • peptic, adj. ఆంత్ర;
  • peptic ulcer, ph. ఆంత్రశూల;
  • peptide link, n. జీర్ణ బంధం; ఒక రకమైన రసాయన కట్టడం;
  • peptide chain, n. జీర్ణ మాల; ఒక రకమైన రసాయన కట్టడం;
  • per, adv. చెరి; చొప్పున; ఒక్కంటికి;
  • perambulate, v. i. చుట్టు తిరుగు; ప్రదక్షిణం చేయు;
  • perambulator, n. తోపుడు బండి;
  • per capita, adj. ph. తల ఒక్కంటికి; తలసరి;
  • per capita income, ph. తలసరి ఆదాయం;
  • per head, ph. చెరి ఒక; తలా ఒక; తలసరి;
  • perceive, v. t. చూడు; గ్రహించు; గోచరించు;
  • percent, n. శాతం; శతాంశం; నూటికి; నూర్పాలు; ప్రతిశతం; డోకడా; శేకడా;
  • percentage, n. శతాంశం; ప్రతిశతం;
  • perception, n. పశ్యత; గోచరత్వం; గోచరింపు; గ్రాహ్యత; నిర్వికల్పం; అవగతి;
  • perception of senses, ph. ఇంద్రియ గోచరత్వం;
  • perch, v. i. వాలు;
  • perch, n. వాలుకొయ్య; పక్షులు వాలడానికి అనువైన కొయ్య;
  • percolate, v. i. స్రవించు;
  • percussion, n. సంఘట్టనం; వేళ్ళతో మీటడం; వేళ్ళతో కొట్టడం;
  • percussion instruments, n. pl. వేళ్ళతో మీటడం వల్ల శబ్దం పుట్టించే వాద్యాలు; వీణ, మద్దెల మొ.;
  • peremptory, adj. ప్రశ్నించడానికి వీలులేని; ఖండితమైన;
  • peremptory command, ph. వశిష్ట వాక్యం; ఖండితాజ్ఞ;
  • perennial, adj. సంవత్సరం పొడుగునా;
  • perennial plants, ph. సంవత్సరం పొడుగునా బతికే మొక్కలు;
  • perennial rivers, ph. జీవనదులు; సంవత్సరం పొడుగునా ప్రవహించే నదులు;
  • perfect, adj. పూర్ణ; పరిపూర్ణ; బ్రహ్మాండ; సమగ్ర;
  • perfect number, ph. [math.] పరిపూర్ణ సంఖ్య; according to number theory, the number 6 is a perfect number because it can be expressed as the sum of its factors, namely 1, 2 and 3. Similarly, the number 28 is also a perfect number, because 28 = 1+2+4+7+14;
  • perfection, n. పూర్ణత్వం; సమగ్రత;
  • perforate, v. t. చిల్లు పెట్టు;
  • perforated, adj. చిల్లుల; చిల్లులు ఉన్న; చిల్లు చేయబడ్డ; జల్లి; సచ్ఛిద్ర;
    • - cathode, ph. సచ్ఛిద్ర రుణధ్రువం; బెజ్జాలు ఉన్న రుణ ధ్రువం; జల్లి రుణ ధ్రువం;
    • - plate, ph. జల్లెడ;
    • - pot, ph. జల్లి మూకుడు;
    • - spoon, ph. జల్లి గరిటె; జల్లి చెంచా;
  • perforation, n. చిల్లు; జల్లు; రంధ్రము; బెజ్జం; ఛిధ్రం;
  • perforator, n. చిల్లు కారి; చిల్లులు పొడిచే పనిముట్టు; చిల్లులు పొడిచేవాడు;
  • perform, v. t. నిర్వర్తించు; నిర్వహించు; నెరవేర్చు; చేయు;
  • performance, n. (1) నిర్వర్తన; (2) ఆట; ప్రదర్శన;
    • dance -, నృత్య ప్రదర్శన; నాట్య ప్రదర్శన;
    • musical -, గాన కచేరీ; పాట కచేరీ;
  • performance arts, n. ప్రదర్శక కళలు;
  • performer, n. (1) యాజి; కర్మచారి; (2) నటి; నటకుడు;
  • performing arts, n. ప్రదర్శక కళలు; ప్రేక్షకుల ఎదుట ప్రదర్శించడానికి అనువైన సంగీతం, నాట్యం, నాటకం, మొదలైన కళలు;
  • perfume, n. సుగంధ ద్రవ్యం; పరిమళ ద్రవ్యం;
  • perfunctory, adj. మొక్కుబడికి చేసినట్లు; శ్రద్ధలేని;
  • perhaps, adv. బహుశ; కాబోలు; ఒకవేళ;
  • perigee, n. పరిజ్యము; సమీప బిందువు; భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేసే ఉపగ్రహాల దీర్ఘవృత్తపు కక్ష్యలో నాభికి (అనగా, భూమికి) అత్యంత సమీపంలో ఉన్న బిందువు; సూర్యుడి చుట్టూ తిరిగే శాల్తీల విషయంలో ఈ మాట కి బదులు perihelion అన్న మాట వాడతారు; (ant.) apogee;
  • peril, n. ప్రమాదం; విపత్తు; ఆపద; బారి; ఉపద్రవం; గండం; సంకటం;
  • mortal -, ప్రాణ సంకటం;
  • perilous, adj. విపత్కర;
  • perimeter, n. చుట్టు ఉండే అవధి; కైవారం; చుట్టుకొలత;
  • period, n. (1) బిందువు; వాక్యం చివర వచ్చే బిందువు; (2) ఆవర్తన కాలం; ఆవర్తి; గచ్ఛాంకం; (3) కాలం; వ్యవధి; గడువు; సేపు; (4) సమయం; దశ; కాలాంశ; (5) బహిష్టు అయే వేళ;
    • - of oscillation, ph. ఆవర్తన కాలం;
  • periodic, adj. నియత్‌కాలిక; ఆవర్తన; ఆవర్తిక; గచ్ఛిక; ముహుర్ముహు;
    • - classification, ph. ఆవర్తిక వర్గీకరణ;
    • - law, ఆవర్తన సూత్రం;
    • - table, n. ఆవర్తన పట్టిక; నియత్‌కాలిక పట్టీ;
  • periodical, adj. అనుకాలిక;
  • periodical, n. (1) పత్రిక; వార్తాపత్రిక; (2) ఆవర్తకం;
  • periodically, adv. కాలే కాలే;
  • periodicity, n. ఆవర్తన కాలం; ఆవర్తత; అవర్తిత్వం; గచ్ఛత్వం;
  • perish, v. i చచ్చు; నశించు;
  • perishable, adj. క్షర; నశించే; కుళ్ళిపోయే; పాడయిపోయే; పాడేు;
  • perjury, n. అబద్ధపు సాక్ష్యం; దొంగ సాక్ష్యం; అప్రమాణం; అబద్ధం; కూటసాక్ష్యం;
  • permanent, adj. శాశ్వత; శాశ్వతమైన; నియతం; అతైంతిక; పక్కా;
  • permanent color, ph. పక్కా రంగు;
  • permeable, adj. పారగమ్యమైన;
  • permission, n. అనుమతి; ఆనతి; అంగీకారం; అనుమోదం; సెలవు;
  • permit, n. అనుమతి పత్రం; అంగీకార పత్రం; ఫర్మానా చీటీ; ఒప్పునామా; పెర్మిట్;
  • permit, v. t. అనుమతించు; ఉత్తరువు ఇచ్చు; అనుజ్ఞ ఇచ్చు;
  • permutation, n. ప్రస్తారము; వినిమయం; ఫిరాయింపు; క్రమచయనం; తారుమారు; ఒక వస్తు సముదాయపు వరుస క్రమాన్ని తారుమారు చెయ్యడం;
  • permute, v. t. ప్రస్తారించు; తారుమారు చేయు;
  • pernicious, adj. ప్రమాదకరమైన; అతి హానికరమైన; ప్రాణాంతకమైన;
    • - anemia, ph. ప్రమాదకరమైన రక్తలేమి; ప్రాణాంతకమైన రక్తలేమి;
  • perpendicular, adj. లంబమాన;
  • perpendicular, n. లంబం;
  • perpetual, adj. సదా; నిరంతర; అనుశృత; శాశ్వత; అనవరత; సతత; ఎల్లప్పుడూ;
  • perpetual motion, ph. సదా గతి; సతత చలనం; నిరంతర చలనం;
  • perpetual motion machine, ph. సదా గతి యంత్రం; అనుశృత చలన యంత్రం; నిరంతర చలన యంత్రం;
  • perplexity, n. వ్యగ్రత; కలవరపాటు;
  • perquisite, n. పరిలబ్ది; కులుకులబ్ది; same as perk;
  • per se, prep. [Lat.] తనంత తానుగా, మరొక ఊత లేకుండా;
  • Perseus, n. యయాతి; నక్షత్రములో ఒకటి;
  • perseverance, n. నిష్ట; పట్టుదల; తితీక్ష; అధ్యవసాయం; ఓర్పు;
  • Persian lilac, n. తురక వేప;
  • person, n. (1) వ్యక్తి; ఆసామీ; శీలి; ఘటం; (2) పురుష; పురుషం; (3) పురుషుడు; స్త్రీ;
    • first -, [gram.] ఉత్తమ పురుష;
    • in -, స్వయంగా;
    • mean -, తులువ;
    • third -, [gram.] ప్రథమ పురుష;
  • person, suff. అళువు; శాలి; శీలి; కోరు; వంతుడు; పరుడు; అయ్య; అమ్మ; వతి; ఘటం;
    • affable -, సౌమ్యుడు; సౌమ్యురాలు;
    • ambitious -, చికీర్షకుడు;
    • angry -, కోపి;
    • attentive -, శ్రద్ధాళువు;
    • blessed -, ధన్యుడు; ధన్యురాలు;
    • block-headed -, మొద్దు;
    • capable -, ధురంధరుడు;
    • childless -, నిస్సంతు;
    • competent -, సమర్ధుడు; సమర్ధురాలు;
    • contentious -, పరిస్పర్ధాళువు;
    • corrupt -, లంచగొండి; ఉత్కోచకుడు;
    • courageous -, ధైర్యశాలి; ధైర్యవంతుడు; ధైర్యవతి;
    • curious -, అభిరతుడు; అభిరతి;
    • daring -, సాహసి;
    • deceitful -, దగాకోరు;
    • disabled -, అంగహీనుడు;
    • dull-witted -, మొద్దు;
    • duty bound -, వ్రతశీలి;
    • eccentric -, తిక్కశంకరయ్య;
    • emotional -, ఉద్రేకి;
    • enthusiastic -, ఉత్సాహి;
    • experienced -, అనుభవశాలి; అనుభవజ్ఞఉడు
    • famous -, యశశ్వి;
    • far-sighted -, దీర్ఘదర్శి;
    • friendly -, స్నేహశీలి;
    • good-natured -, మనస్వి; సౌమ్యుడు; సౌమ్యురాలు; సౌశీల్యుడు; సౌశీలి;
    • good -, మంచి మనిషి; సత్పురుషుడు; సాధ్వి;;్
    • happy -, సంతోషి;
    • honest -, నిజాయతీపరుడు;
    • humble -, దీనుడు; దీనురాలు;
    • ignorant -, బొప్పడు;
    • ill-fated -, దైవోపహతుడు;
    • incapable -, చవట; క్రియాశూన్యుడు; అసమర్ధుడు;
    • jealous -, ఈర్ష్యాళువు;
    • just -, న్యాయవర్తనుడు;
    • kind -, దయాళువు;
    • lean -, అలిపిరి; అలిపిరిది;
    • lonely -, ఏకాంగి; ఏకాకి;
    • merciful -, కృపాళువు;
    • mild -, మేదకుడు; మేదకురాలు;
    • naive -, వెర్రినాగమ్మ;
    • obstinate -, మొండి ఘటం; మొండి పీనుగు; శఠుడు;
    • parasitic -, పరభాగ్యోపజీవి;
    • pig-headed -, ఉలిపి; ఉలిపి కట్టె;
    • practical -, క్రియాశీలి; క్రియావంతుడు;
    • progressive minded -, పురోగామి;
    • pugnacious -, పేచీకోరు;
    • resourceful -, ఉపమరి;
    • rude -, ధూర్తుడు; ధూర్తురాలు;
    • senile old -, ముదివెర్రి; పిచ్చి పట్టిన ముదుసలి;
    • shocked -, నిర్విణ్ణుడు;
    • stubborn -, మొండి ఘటం; మొండి పీనుగు;
    • stupefied -, నిర్విణ్ణుడు;
    • stupid-, చవట; తెలివి తక్కువ వాడు; బుద్ధిహీనుడు;
    • slovenly -, ఎబ్రాసి;
    • strong -, బలి; బలిష్ఠి;
    • talkative -, వాచాలుడు; వాచాలి;
    • timid -, భయస్థుడు; భయస్థురాలు;
    • ugly -, అనాకారి; కురూపి;
    • uncultured -, సంస్కారహీనుడు;
    • unhappy -, నిస్సంతోషి;
    • unwise -, అవివేకి;
    • wise -, వివేకి;
    • - with initiative, ప్రయత్నశీలి;
  • personal, adj. వ్యక్తిగత; వ్యక్తిగతమైన; స్వకీయమైన; స్వంత; సొంత; ఏదర; పురుషవాచక;
  • personal, n. వ్యక్తిగతం; స్వకీయం; స్వంతం; ఏదర;
  • personality, n. వ్యక్తిత్వం; మూర్తిత్వం;
  • personally, adv. స్వయంగా; వ్యక్తిగతంగా;
  • personification, n. (1) మూర్తి; (2) జీవం లేని వస్తువుకి చైతన్యం ఆపాదిస్తూ చెప్పే అలంకారం;
  • personify, v. i. మూర్తీభవించు;
  • personnel, n. సిబ్బంది; పనివారు; పని చేసేవారు; ఉద్యోగస్తులు;
  • perspective, n. దృక్కోణం; దృక్పధం;
  • perspiration, n. చెమట; స్వేదం; స్వేదజలం; స్వేదోదకం; ఘర్మజలం;
  • persuade, v. t. ఒప్పించు; నచ్చజెప్పు;
  • pertinent, adj. సందర్భోచితమైన;
  • perturbation, n. జూక; వైకల్యం; కొందలం; ఉత్తలపాటు; పల్లటం; [music] సంగతి;
  • pertussis, n. కోరింత దగ్గు; ---whooping cough; a disease caused by the bacterium Bordetella pertusis (Hemophilus p.) which triggers the accumulation of thick, sticky mucus in the windpipe; this bacterium makes at least nine different proteins, thus making it difficult to develop a vaccine;
  • pervasive, adj. అభివ్యాపకమైన; వ్యాప్తి చెందే;
  • pervert, n. విపరీత బుద్ధులు కల వ్యక్తి;
  • pessimism, n. నిరాశావాదం; నైరాశ్యం; శల్య సారధ్యం;
  • pessimist, n. నిరాశావాది;
  • pest, n. తెగులు; చీడపురుగు;
  • pester, v. t. వేధించు; పీడించు; పీకుకొని తిను; నసపెట్టు; సతాయించు; షంటు;
  • pesticide, n. అరిష్టారి; క్రిమి సంహారిణి;
  • pestilence, n.అరిష్టం; ఈతిబాధ;
  • pestle, n. పొత్రం; రోకలి; బండ; గూటం; పేషణి;
  • pet, adj. పెంపుడు; ప్రీతిపాత్రమైన; అనుంగు;
  • pet, n. పెంపుడు జంతువు; సాధారణంగా ఇంట్లో ఉంచుకొనే కుక్కలు, పిల్లులు, చిలుకలు, మొదలైన వాటిని ఉద్దేశించి వాడతారు; (rel.) domesticated; (ant.) wild;
  • pet, v. t. దువ్వు; నిమురు; ముద్దు చేయు;
  • petal, n. దళం; రేకు; పత్రం; పుష్పదళం; ఆకర్షణపత్రం;
  • petite, adj. సన్నంగా; కురచగానే ఉన్నప్పటికీ అందంగా ఉన్న ఆడదాన్ని ఉద్దేశించి వాడే విశేషణం;
  • petit mal, n. బాలపాపచిన్నె; చిన్న పిల్లలకి వచ్చే మూర్చ రోగం;
  • petition, n. దరఖాస్తు; విన్నపం; మనవి; అర్జీ;
    • citizens' -, మహజర్నామా;
  • petition document, n. అర్జీదాస్తు; మహజర్నామా;
  • petitioner, n. అర్జీదారు; దరఖాస్తుదారు; విన్నపస్థుడు;
  • petrified, adj. (1) శిలీభవించిన; శిలగా మారిన; రాయి అయిన; ప్రస్తరీభూత; (2) కోపంతో కాని ఆశ్చర్యంతో కాని స్థాణువుగా మారిన;
  • (3) భయకంపితమగు; భయంతో అవాక్కగు;
  • petro, adj. శిలా; రాతి; పత్తర;
  • petrol, n. పత్తరాయిల్; పెట్రోలు;
  • petroleum, n. శిలతైలం; రాతిచమురు; రాతి నూనె; మట్టినూనె; ముడి చమురు;
  • petroleum jelly, n. శిలతైల ఖమీరం; దీనినే వెసలీను అనే వ్యాపారనామంతో అమ్ముతారు;
  • petticoat, n. లంగా; పావడా; అంగదట్టం; తాబందు; లోపల వేసుకొనే పరికిణీ;
  • pettifogger, n. చిల్లర మోసగాడు; చిల్లర మోసకత్తె;
  • petting, n. (1) దువ్వడం; పెంపుడు జంతువుల శరీరం మీద చెయ్యివేసి దువ్వడం; (2) ప్రేమికులు ఒకరి శరీరం మీద మరొకరు చెయ్యివేసి దువ్వడం;
  • petty, adj. (1) చిన్న; చిల్లర; ముఖ్యమైనది కాని; (2) చవకబారు; స్వల్ప బుద్ధితో;
  • petty cash, n. చిల్లర నగదు; దిన వెచ్చం;
  • petty larceny, n. చిన్న దొంగతనం;
  • peurile, adj. చిన్నపిల్లలవలె; కైశోరక;
  • pewter, n. సత్తు; తగరంతో సీసాన్ని కాని, రాగిని కాని కలపగా వచ్చిన మిశ్రమలోహం;
  • phagocytes, n. కణభక్షకులు; భక్షక కణములు; రక్తంలోని తెల్ల కణములు ఈ భక్షక కణముల జాతివి;
  • phallus, n. లింగం; లింగానికి ప్రతిరూపమైన విగ్రహం; శివలింగం వంటి ఆకారం;
  • phallus of mercury, ph. రసలింగం;
  • pharmaceutical, adj. ఔషధీయ; ఔషధ;
  • pharmaceutical chemistry, ph. రసాయనం;
  • pharmacist, n. అగదంకారుడు; మందులు కలిపే వ్యక్తి;
  • pharmacology, n. ఔషధ శాస్త్రం;
  • pharmacopoeia, n. ఔషధ సంగ్రహం; ఔషధ కోశం; భేషజకల్పసూత్ర సంహితం;
  • pharmacy, n. దవాఖానా; ఔషధశాల; మందులని అమ్మే స్థలం; మందుల కొట్టు;
  • pharynx, n. సప్తపథ; గొంతుకలోని కండరాల కట్టడం;
  • phase, n. దశ; కళ; దఫా; ఘట్టం;
    • meta -, మధ్యదశ; కణ విభజనలో మధ్య దశ;
    • pro -, తొలిదశ; కణ విభజనలో తొలి దశ;
    • telo -, అంత్యదశ; కణ విభజనలో అంత్య దశ;
  • phases, n.pl. కళలు; దశలు;
  • phases of the moon, ph. చంద్ర కళలు;
  • phenomenon, n. దృగ్విషయం; ఆదిభౌతికం; జ్ఞానేంద్రియాలతో గ్రహించి మాటలతో వర్ణించగలిగే ప్రకృతి సంభవమైన విషయం; ఉ. సూర్యగ్రహణం; ఇంద్రధనుస్సు మొ.
  • phenomenal, adj. (1) దృగ్విషయాత్మక; ఆదిభౌతిక; (2) అసాధారణ; మెచ్చదగ్గ; హర్షణాత్మక;
  • phenomenological, adj. దృగ్విషయాత్మక; ఆదిభౌతిక;
  • phil, pref. [Grk.] ప్రేమ; ఆసక్తి; అభిరుచి;
  • philatelist, n. తపాలా బిళ్లలని సేకరించే వ్యక్తి; తపాలా బిళ్లల మీద ప్రేమ;
  • philanthropist, n. దాత; లోకోపకారి; (ety.) philein అంటే ప్రేమించడం; anthropos అంటే మనిషి; సాటి మనిషిని ప్రేమించే వ్యక్తి అని అర్థం;
  • philanthropy, n. దాతృత్వం; దానశీలత;
  • philology, n. భాషాశాస్త్రం; శబ్దశాస్త్రం; లక్షణశాస్త్రం; భాష మీద ప్రేమ;
  • philosopher, n. తత్త్వవేత్త; తాత్త్వికుడు; దార్శనికుడు; వేదాంతి;
    • idealist -, భావవాద తాత్వికుడు;
  • philosopher's stone, n. స్పర్శవేది; పరసువేది; నీచ లోహాలని ఉత్తమ లోహాలుగా మార్చగలిగే మహత్తర శక్తి ఉన్న రాయి; ఇటువంటి రాయి ఇంతవరకు ఎవ్వరికీ తారసపడలేదు;
  • philosophy, n. తత్త్వశాస్త్రం; తత్త్వం; జ్ఞఆన తృష్ణ;
    • analytic -, తర్క మీమాంశ;
    • natural -, భౌతిక శాస్త్రం;
    • Vedantic -, వేదాంత తత్త్వం;
  • philosophical, adj. తత్త్వ; దార్శనిక;
  • phlebitis, n. ధమనుల వాపు; ధమని శోఫ;
  • phlegm, n. (ఫ్లెమ్) శ్లేష్మం; కఫం; తెమడ; కళ్ల;
    • thick-, కళ్ల;
  • phobia, n. భయం; జడుపు; అర్థంలేని భయం; మానసిక బలహీనత;
    • acrophobia, ఎత్తు ప్రదేశాలంటే భయం;
    • afiliophobia, అహిభయం; సర్ప భయం; పాము అంటే భయం;
    • anthropophobia, మనుషులంటే భయం;
    • aquaphobia, నీళ్లంటే భయం; జలజడుపు;
    • arachneophobia, సాలెపురుగులంటే భయం;
    • arithmophobia, లెక్కలంటే భయం:
    • claustrophobia, మూసేసిన స్థలాలంటే భయం;
    • cynophobia, కుక్కలంటే భయం; కుక్కజడుపు;
    • gephyrophobia, వంతెనలంటే భయం;
    • kleptophobia, దొంగలంటే భయం;
    • musaphobia, ఎలకలంటే భయం;
    • nyctophobia, చీకటి అంటే భయం;
    • ochlophobia, జనాల గుంపులు అంటే భయం;
    • ombrophobia, వానపిరికి; వర్షం అంటే భయం;
    • ophidiophobia, పాము అంటే భయం;
    • pathophobia, రోగాలంటే భయం;
    • phasmaphobia, దయ్యాలంటే భయం;
    • pyrophobia, మంటలు అంటే భయం;
    • thanatophobia, చావు అంటే భయం;
    • triskaidekaphobia, పదమూడు అంటే భయం;
    • xenophobia, కొత్తవాళ్లు అంటే భయం;
  • phone, n. (1) శబ్దం; స్వరం; (2) ఫోను; టెలిఫోను;
  • phoneme, n. వర్ణం; వాక్‌శబ్దం; ప్రాథమిక శబ్దం; హలంతాక్షరం;
  • phonetician, n. శబ్దశాసనుడు;
  • phonetic, adj. శబ్దమును అనుసరించెడి;
  • phonetics, n. శిక్షాశాస్త్రం; శబ్దశాస్త్రం;
  • phonetic script, ph. ధ్వన్య లిపి; శబ్ద లిపి;
  • phonetic symbol, ph. ధ్వని సంకేతం;
  • phonon, n. కంపాణువు; analogous to photon, this is a packet of vibrational energy of the crystal lattice;
  • phony, adj. నకిలీ; అవాస్తవిక; నిజం కాని;
  • phonology, n. శబ్ద శాస్త్రం; ఉచ్చారణ శాస్త్రం; ఉచ్చారణ నియమాలని అధ్యయనం చేసే శాస్త్రం;
  • phosphorescent, adj. స్పురదీప్త; Unlike fluorescence, phosphorescent material does not immediately re-emit the radiation it absorbs. The slower time scales of the re-emission are associated with "forbidden" energy state transitions in quantum mechanics. As these transitions occur very slowly in certain materials, absorbed radiation is re-emitted at a lower intensity for up to several hours after the original excitation. (see also) fluorrescent;
  • Phosphorous, n. భాస్వరం; ఒక రసాయన మూలకం; (అణు సంఖ్య 15, సంక్షిప్త నామం, Ph); [Gr. phosphoros = giving light];
  • photo, n. ఫోటో;
  • photo, pref. ఫోటో; తేజో; ఛాయా; కాంతి;
  • photochemical, adj. తేజోరసాయన;
  • photoelectric, adj. తేజోవిద్యుత్తు;
  • photograph, n. ఛాయాచిత్రం; ప్రతిచ్ఛాయ; ఫోటో;
  • photographer, n. ఛాయాచిత్రకారుడు;
  • photographic, adj. ఛాయాచిత్ర; ప్రతిచ్ఛాయ;
  • photographic plate, ph. ఛాయాచిత్ర ఫలకం;
  • photography, n. [cinema] ఛాయాగ్రహణం;
  • photomultipliers, n. pl. దృశ్యగుణకారులు;
  • photon, n. ఫోటాను; కాంతికణం; తేజాణువు;
  • photosphere, n. తేజోవరణం;
  • photosynthesis, n. రవిసంధానం; కిరణజన్య సంయోగక్రియ; కిరణ సంధానం;
  • phrase, n. పదబంధం; విస్తృతపదబంధం; క్రియలేని మాటల సముదాయం; పదబంధాలు నాలుగు రకాలు, సమాసం, నుడికారం, శబ్దపల్లవం, నుడికారం;
  • phylloplane, n. పత్రతలం;
  • phyllosphere, n. పత్రావరణం; భూతలానికి పైన ఉన్న వృక్షసంబంధమైన, సూక్ష్మజీవుల భుక్తికి అనువిన పదార్థం;
  • phylum, n. ప్రజాతి; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు రెండవ వర్గానికి పెట్టిన పేరు; [see also] kingdom, phylum, class, order, family, genus, and species;
  • physical, adj. (1) భౌతిక; ప్రకృతి సంబంధమైన; (2) ఐహిక; శారీరక; కాయ;
  • physical body, ph. భౌతిక దేహం; భౌతిక కాయం;
  • physical character, ph. భౌతిక లక్షణం;
  • physical chemistry, ph. భౌతిక రసాయనం;
  • physical labor, ph. కాయకష్టం;
  • physical law, ph. భౌతిక ధర్మం;
  • physician, n. వైద్యుడు; భిషక్కు;
  • physics, n. భౌతిక శాస్త్రం; ప్రకృతి లక్షణాలని అధ్యయనం చేసే శాస్త్రం;
    • classical -, సంప్రదాయక భౌతిక శాస్త్రం;
  • physiology, n. శరీర శాస్త్రం; ఇంద్రియ శాస్త్రం;
    • plant -, వనస్పతింద్రియ శాస్త్రం;
  • pial, n. అరుగు; తిన్నె; జగిలె; ఇంటి ముందు కూర్చునే తీనె వంటి వసారా;
  • piazza, n. రచ్చబండ;
  • pick, v. t. (1) ఏరు; ఎంచు; ఎన్నిక చేయు; కోయు; (2) పొడుచు; గొలుకు;
  • pick axe, n. గడ్డపలుగు; గడ్డపార; పికాసి; గుద్దలి;
  • picketing, n. ధర్నా; పికెటింగు;
  • pickle, n. ఊరుగాయ; అవదంశం; ఉపదంశం;
  • pickled, adj. ఊరబెట్టిన; భావన;
  • pickled cumin, ph. భావన జీలకర్ర;
  • pickled ginger, ph. భావన అల్లం;
  • pickling, n. ఊరబెట్టడం; భావన చెయ్యడం;
  • pickpocket, n. జేబుదొంగ; కత్తెరదొంగ; ఎత్తుబరిగాడు;
  • picnic, n. వనభోజనం; వినోదయాత్ర; పిక్‌నిక్;
  • pictographic symbol, ph. దృశ్య సంకేతం;
  • picture, n. బొమ్మ; చిత్రం; చిత్తరువు;
  • piece, n. (1) ముక్క; ఖండం; తునక; తుత్తునియ; శకలం; నుగ్గు; (2) కాయ; పిక్క; పావు; ఆటలలో వాడే పిక్క; (3) ఉరువు;
    • of baggage, ph. ఉరువు;
  • piecemeal, adv. ముక్కలు ముక్కలుగా; ఇదో పిసరు, అదోపిసరు మాదిరి; ఏకాండీగా కాకుండా;
  • piecemeal, n. ముక్కలు ముక్కలుగా; విడివిడిగా; ఏకాండీగా కాకుండా;
  • pier, n. (1) రేవు; ఓడలు నిలిచే స్థలం; (2) వంతెన కట్టడానికి వాడే స్తంభం;
  • pierce, v. t. పొడుచు; గుచ్చు; కుమ్ము;
  • piety, n. భక్తి; భగవంతుని యెడల, తల్లిదండ్రుల యెడల, సంప్రదాయాల పట్ల భక్తి విశ్వాసాలు;
  • piety, n. దయ; కరుణ; జాలి;
  • piezoelectricity, n. పీడన విద్యుత్తు; కొన్ని పదార్థాల మీద పీడనం ప్రయోగించినప్పుడు పుట్టే విద్యుత్తు;
  • pig, n. పంది; ఊరపంది; సూకరం; వరాహం; పోత్రి; విట్చరం;
  • pigeon, n. పావురం; కపోతం; గువ్వ; see also dove; In general, the terms "dove" and "pigeon" are used somewhat interchangeably. Pigeon is a French word that derives from the Latin pipio, for a "peeping" chick, while dove is a Germanic word that refers to the bird's diving flight. In ornithological practice, "dove" tends to be used for smaller species and "pigeon" for larger ones, but this is in no way consistently applied, and historically, the common names for these birds involve a great deal of variation between the terms;
    • carrier -, టపా పావురం; వీటినే homing pigeons అనిన్నీ messenger pigeons అనిన్నీ కూడ అంటారు; [biol.] Columba livia domestica;
    • passenger -, పాంథ పావురం; ఈ పావురం జాతి 1 సెప్టెంబరు 1914 తేదీన అమెరికాలోని సిన్‌సినాటీ జంతు ప్రదర్శన శాలలో విలుప్తం అయిపోయింది; [biol.] Ectopistes migratorius
  • piggy bank, n. డిబ్బీ; డబ్బుల డిబ్బీ;
  • pigheaded, adj. మొండి; ఉలిపి; దూరాలోచనలేని; మూర్ఖపు;
  • piglet, n. పందిపిల్ల; సలుగు;

---Usage Note: pigment, dye

  • ---In a nutshell, the difference between pigments and dyes boils down to mud vs sugar-water. Pigments, like mud, are finely ground particles of color which are suspended in a medium (such as water) to create a paint or coloring agent. Dyes are chemicals, like sugar, that are dissolved in a medium (such as water) to create a paint or coloring agent. In a pigment the coloring agent is suspended, in a dye it is dissolved.
  • pigment, n. (1) రంజనం; రంగునిచ్చే పదార్థం; వర్ణద్రవ్యం; వర్ణదం; see also dye; (2) ఛాయ;
    • bile -, పిత్త రంజనం;
    • inorganic -, వికర్బన వర్ణదం; మూలక వర్ణదం;
    • luminous -, కాంతిమంత వర్ణదం;
    • metal -, లోహ వర్ణదం;
    • natural -, సహజ వర్ణదం;
    • organic -, కర్బన వర్ణదం;
    • synthetic -, సంశ్లేషిత వర్ణదం;
  • pile, v. i. పోగవు;
  • pile, v. t. పోగుచేయు; పేర్చు; బొత్తిపెట్టు;
  • pile, n. పోగు; కుప్ప; తిప్ప; రాశి; బొత్తి; దొంతర; దొంతి; ఒలికి; కట్ట; వామి; మేటు;
  • pile of bricks, ph. ఇటికల వామి;
  • pile of hay, ph. గడ్డివామి;
  • piles, n. మూలశంక; మొలలు;
  • pilferer, n. లూటీకోరు; పశ్యతోహరుడు;
  • pilgrimage, n. (1) తీర్థ యాత్ర; (2) జీవిత యాత్ర;
  • pill, n. మాత్ర; గుళిక; వటుకం;
  • pillage, n. దోపిడీ; అలజడి సమయాలలో జరిగే దోపిడీ;
  • pillar, n. స్తంభం; కంబం;
  • pill box, n. భరిణె; కరండం;
  • pillow, n. దిండు; తలగడ; మెత్త;
  • pillow case, n. గలేబు;
  • pilot, n. కర్ణధారి; వైమానికుడు; చోదకుడు; మాలిమి; పీలిగాడు; పడవని కాని విమానాన్ని కాని తోలే వ్యక్తి;
  • pimento, n. ఒక రకం తియ్య మిరపకాయలు; "పెప్పర్‍" అంటే మిరియాలా, మిరపకాయలా అని స్పష్టత పోయేసరికి బుడతగీచులు పిమెంటో అనే మాటని తయారు చేసి మిరపకాయలని ఆ పేరుతో పిలవమన్నారు కాని ఆ పేరు ఒక రకం తియ్య మిరపకి స్థిరపడి పోయింది;
  • pimp, n. తాపిగాడు; వేశ్యలకు విటులని సంపాదించి పెట్టేవాడు;
  • pimples, n.pl. మొటిమలు; యవగండాలు; అవగండాలు; avagaMDAlu; చెమరకాయలు;
  • pin, n. సూది; గుండుసూది; పిన్ను; పిన్నీసు;
    • headed - , గుండుసూది; అల్పీ; అల్పనాతు సూది;
    • safety -, పిన్నీసు; సూదిబొత్తం;
  • pin, v. t. గుచ్చు;
  • pincers, n. శ్రావణము; పటకారు;
  • pinch, n. చిటికెడు;
  • pinch, v. t. గిల్లు; చిదుము; నొక్కు; పిండు; గిచ్చు;
  • pine, v. i. బెంగపెట్టుకొను; తపించు;
  • pine, n. (1) దేవదారు చెట్టు; (2) తపన;
  • pineal gland, n. త్రికోణ కుండలి; మెదడులో వెన్ను పాము బయలుదేరే సంగమ స్థానంలో ఉండే వినాళ గ్రంథి; ఇక్కడ తయారయే "మెలటోనిన్," "సెరటోనిన్" అనే హార్మోనులు నిద్రా చక్రాన్ని నియంత్రిస్తాయి;
  • pineapple, n. అనాస; అనాస పండు; మొగలిపనస; అనాసపనాస;
  • ping, n. పింగు; కంప్యూటర్‍ రంగంలో, అంతర్జాలంలో సమాచార రవాణా సాధనాలలో ఎక్కడ లోపాలు ఉన్నాయో కనుక్కుందుకి వాడే ఒక ఉపయుక్తి; ఒక స్థలం నుండి మరొక స్థలానికి చిన్న సమాచారపు పొట్లం పంపుతారు. అది అద్దరి చేరుకుని సురక్షితంగా తిరిగి వస్తే "పింగ్‍" అని శబ్దం చేస్తుంది. అప్పుడు సమాచారం ప్రయాణం చేసే దారి సుగమంగా ఉందని నిర్ధారణ అయినట్లు లెక్క;
  • pin hole, n. సూదిబెజ్జం;
  • pink, n. లేత ఎరుపు రంగు;
  • pinnacle, n. శిఖరం; మొన; శృంగం; పరాకాష్ట;
  • pint, n. (పైంట్) పన్నెండు అవున్సుల ద్రవ్యమానం;
  • pin worm, n. నులిపురుగు;
  • pipe, n. గొట్టం;
  • pipette, n. (పైపెట్) బుల్లిగొట్టం; చిరుగొట్టం;
  • pipit, n. జిట్టంగి;
  • Pisces, n. మీనం; మీనరాశి;
    • zeta of -, ph. రేవతి; రేవతి నక్షత్రం;
  • pisceivorous, adj. మత్స్యభక్షక; చేపలని తినే;
  • piss, v. t. see urinate;
  • pistachio nut, n. పిస్తా పిక్క;
  • pistil, n. గర్భకేసరం; పువ్వులలో ఒక భాగం;
  • pistol, n. పిస్తోలు; చేతి తుపాకీ;
  • piston, n. ముషలకం; ముసలకం; పిస్టను;
  • piston rod, n. ముషలక దండం;
  • pit, n. (1) గొయ్యి; దాలిగుంట; కూపం; ఖాతం; గాతం; బొంద; (2) పిక్క; గింజ; విత్తు; టెంక;
  • pitch, v. t. బంతిని విసురు; (rel.) bowl;
  • pitch, n. (1) గంజిత్తు; కీలు; తారు; (2) కీచుతనం; ఒక సెకండు కాల వ్యవధిలో ఇమిడే ధ్వని తరంగాల సంఖ్య; (3) శృతి; (4) అమ్మకానికి వేసే పథకం;
    • high -, కీచుతనం; కీచు;
    • low -, బొంగురుతనం; బొంగురు;
  • pitch-in, v. t. (1) సాయం చేయు; ఒక చెయ్యి వేయు; (2) బిఛాణా వేయు; (3) బంతిని రువ్వు; (4) అమ్మకానికి పథకం వేయు;
  • pith, n. (1) దవ్వ; దంటు; (2) జీలుగు;
  • pitiful, adj. దయనీయ;
  • pit-oven, n. గాడిపొయ్యి, gADipoyyi
  • pitted, adj. పిక్క తీసిన;
  • pitted tamarind, ph. పిక్క తీసిన చింతపండు;
  • pituitary gland, n. పీనస గ్రంథి;
  • pity, n. దయ; కనికరం; సానుభూతి; కారుణ్యం; అక్కటికం;
    • self-pity, ఆత్మకారుణ్యం; ఆత్మానుకంపం; % move to S
  • pivot, n. కీల; కీలకం; భ్రమక కీలకం; ఉతక; (rel.) ఇరుసు;
  • pivotal, adj. కీలకమైన; అతి ముఖ్యమైన;
  • placate, v. t. శాంతింపజేయు; ఊరడించు; ఉపశమింపజేయు; అనునయించు;
  • place, n. స్థలం; స్థానం; చోటు; తావు; జాగా; ఎడ; వంక; చక్కి; ప్రదేశం; ప్రోలు; ఇరవు; ఇక్కువ; నెలవు;
    • take -, జరుగు; సంభవించు;
  • place, suff. ధి;
    • - of water, ph. ఉదధి; జలధి;
  • placebo, n. తధాస్తు; తధాస్తు మాత్ర; తధాస్తు మందు;
    • - effect, తధాస్తు ప్రభావం;
  • placemat, n. ఆస్తరణం; చిత్రచాప;
  • placenta, n. మావి; మాయ; జరాయువు; ఉల్భకోశం;
  • placental water, n. ఉమ్మనీరు; ప్రసవ జలం;
  • placid, adj. ప్రశాంతమైన;
  • plagiarism, n. గ్రంథచౌర్యం; భావచౌర్యం;
  • plaid, adj. గడి ఉన్న; గడి ఉన్న బట్త;
  • plain, adj. సాదా; సాదాసీదా;
  • plain, n. మైదానం;
  • plaint, n. దావా; మొర; ఫిర్యాదు;
  • plaintiff, n. వాది; ఫిర్యాది; దావాదారు; దాయి; అర్ధి; అభియోక్త; అభియోగి; అభియోగం తీసుకొచ్చిన వ్యక్తి; దావా వేసిన వ్యక్తి; నేరం మోపినవాడు; అభిశంసి; అభిశంశకుడు;
  • plait, n. పురి;
  • plait, v. t. అల్లు; పురి ఎక్కించు;
  • plan, n. పథకం; ప్రణాళిక; పన్నిక; పన్నుగడ; యోజనం; యుక్తి;
    • five-year -, పంచ వర్ష పథకం; పంచ వర్ష ప్రణాళిక; పంచ వర్ష యోజనం;
  • plan, v. i పన్ను;
  • planar, adj. సమతల; తలానికి పరిమితమైన;
  • plane, n. (1) తలం; సమతలం; (2) విమానం; (3) చిత్రిక; దువ్వోడ;
    • inclined -, వాలు తలం;
  • plane mirror, n. సమతల దర్పణం;
  • plane of vibration, ph. కంపన తలం;
  • planer, n. చిత్రిక; దువ్వోడ; వడ్రంగి వాడే పరికరం;
  • planet, n. (1) గ్రహం; సూర్య ప్రదక్షిణాలు చేసే భారీ ఖగోళ పిండం; (2) దిమ్మరి; తిరుగుబోతు;
  • planetary motion, n. గ్రహచారం;
  • planetary orbit, n. గ్రహ గతి;
  • planetoid, n. గ్రహశకలం; "ఏస్టరోయిడ్" కి మరొక పేరు;
  • planets, n. గ్రహాలు;
    • inner-, అంతర్ గ్రహాలు; సూర్యుడికీ, గురుడుకీ మధ్యనున్న గ్రహాలు;
    • mother-, మాతృ గ్రహాలు; చంద్రుడికి భూమి మాతృ గ్రహం;
    • primary-, ప్రథాన గ్రహాలు; సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు;
    • inferior -, భూమి కక్ష్య లోపల ఉన్న గ్రహాలు; ఉదా. శుక్రుడు, బుధుడు;
    • superior -, భూమి కక్ష్య బయట ఉన్న గ్రహాలు; ఉదా. ాంగారకుడు, గురుడు, శని, మొ.
  • plank, n. (1) బల్లచెక్క; (2) ఎన్నికలలో ఒక పార్టీ మద్దతునిచ్చే ముఖ్యాంశం;
  • plankton, n. ప్లవకం; సముద్రాలలోను, సరస్సులలోను, నదులలోను తేలియాడుతూ ఉండే ఒక రకం సూక్ష్మజీవులు;
  • plant, n. మొక్క; కర్మాగారం; కట్టడం;
  • plant, v. t. పాతు; నాటు;
  • plantain, n. బొంత అరటి; కూర జాతి అరటి;
  • plaque, n. (1) పతకం; బహుమాన పతకం; (2) గార; పిప్పిక; పంటి మీద చేరే కల్మషం;
    • silver -, రజత పతకం;
  • plasma, n. (1) రసి; జీవద్రవ్యం; ప్లాస్మా; (2) భౌతిక పదార్థాల తురీయ స్థితి; ఘన, ద్రవ, వాయు స్థితులకు అతీతమైన తురీయ స్థితి;
  • plaster, n. (1) గిలాబీ; గోడలకి పూసే సున్నం; గార; (2) పాలాస్త్రి; దెబ్బలకి వేసే కట్టు;
    • fine -, సన్న గార;
  • plaster of Paris, n. బొమ్మ సున్నం; పేరిస్ పలా;
  • plastic, adj. ప్రహత; మైశీల; స్థితిస్థాపక గుణం లేని; అనుభూతులు లేని; ప్లేస్టిక్;
  • plastic, adj. మైశీలి; మైనం వంటి స్వభావం కలది; కుమ్మట్టి; కుమ్మరి మట్టి వంటి గుణం కలది; ప్లేస్టిక్కు; స్నిగ్ధం;
  • plasticity, n. మైశీలత్వం; అంకవంకం; కుమ్మట్టితనం; స్నిగ్ధత; (ant.) brittleness;
  • plate, n. పళ్లెం; తాంబాళం; ఫలకం; కంచం; పళ్లెరం; తలియ; తటి; రేకు; తగడు; తళిగ;
    • dinner -, కంచం; తలియ; తాలీ; తళిగ;
  • plateau, n. పీఠభూమి;
  • platform, n. చప్టా; చపటా; మంచె;
  • platform, n. (1) వేదిక; (2) రైలు ఆగే స్థలం; (3) భావవేదిక; (4) ఇలారం; పొలాలలో కాపు కాయడానికి వాడే బడ్డీ;
  • plated, adj. ఛురిత; కప్పబడిన; మలామా చేయబడ్డ;
  • plate glass, n. గాజు పలక;
  • platelet, n. పళ్లెరం; బింబాణువు; రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే కణం;
  • plating, n. మలామా; లేపనం; లేపరం; జలపోత; ఒక వస్తువుమీద లోహపు పూత పుయ్యడం;
    • electro -, విద్యుత్ లేపనం; విద్యుయిత్ ఛురితం;
    • gold -, బంగారు మలామా; సునర్ణ ఛురితం;
  • Platinum, n. ప్లేటినం; మహారజతం; ఒక రసాయన మూలకం; (అణు సంఖ్య 78, సంక్షిప్త నామం, Pt.); [Sp. platina = silver];
  • platoon, n. పౌజు; దండు; దళం; మూక;
  • plausible, adj. సమంజసమైన; సహేతుకమైన;
  • play, n. (1) ఆట; క్రీడ; కేళి; విలాసం; చెలగాటం; (2) నాటకం; రూపకం;
    • comedy -, ప్రహసనం;
    • one act -, నాటిక; ఏకాంకిక;
  • play, v. t. (1) ఆడు; (2) ఊదు; వాయించు; కొట్టు; (3) వ్యవహారంలో పాల్గొను;
  • player, n. (1) ఆటగాడు; క్రీడాకారుడు; (2) పాత్రధారి;
  • playfully, adv. అలవోకగా;
  • playfulness, n. ఆటకాయతనం; అలవోక;
  • playground, n. ఆటస్థలం; బంతులబీడు; క్రీడా మైదానం; కేళీరంగం;
  • playing cards, n. చీట్లపేక; పేక; పేకముక్కలు;
    • game of -, చీట్లాట; పేకాట;
  • playwright, n. నాటకకర్త;
  • plea, n. మొర; ఈళ; ఆక్రోశన;
  • plead, v. t. (1) వాదించు; (2) బతిమాలు;
  • pleader, n. వకీలు; న్యాయవాది;
  • pleasant, adj. ఆహ్లాదకరమైన; మనోహరమైన;
  • please, adv. దయచేసి;
    • - come in, ph. దయ చెయ్యండి; దయచేసి లోపలకి రాండి;
    • - leave, ph. దయచెయ్యండి; (note) a sarcastic way of asking some one to leave; a subtle change in the tone of the voice makes the distinction between "come in" and "leave";
    • - sit down, దయచేసి కూర్చోండి;
  • please, v. t. మెప్పించు;
  • pleasing, adj. హితవైన; కమనీయ; కమ్మని; మనోజ్ఞ;
    • - to the ear, ph. శృతిహితం;
    • - voice, ph. కమ్మని కంఠం;
  • pleasure, n. ఆహ్లాదం;
  • pleasure bargain, ph. ఈళ బేరం;
  • pleat, n. s. మడత; రెంట;
  • pleats, n. pl. కుచ్చెళ్లు; మడతలు;
  • plebiscite, n. సర్వజన తీర్మానం; జనవాక్యం; ప్రజాభిప్రాయం; ప్రజావాణి;
  • pledge, n. (1) వాగ్దానం; ఉపనిధి; ప్రతిజ్ఞ; (2) కుదువ; తాకట్టు;
  • Pleiades, n. (ప్లయేడ్స్, ప్లయెడీస్‍) కృత్తిక; కృత్తికలు; వృషభరాశిలో కంటికి కనిపించే ఆరు చుక్కల గుంపు; 430 జ్యోతిర్ వర్షాల దూరంలో ఉన్న ఒక నక్షత్ర సమూహం; దూరదర్శనిలో చూస్తే ఈ గుంపులో వేల కొద్దీ తారలు కనిపిస్తాయి;
  • plenary, adj. సమగ్ర; సంపూర్ణ; సర్వజన; అవధులు లేని;
  • plenary session, ph. సర్వజన సమావేశం;
  • plentiful, n. అక్షయం; కొల్లలు; పుష్కలం; ఎక్కీతొక్కి;
  • plentifully, adv. మస్తుగా; పుష్కలంగా; బాహుళంగా; సమృద్ధిగా; మెండుగా; విస్తారంగా; అవారిగా;
  • plenty, adj. సమృద్ధిగా; కొల్లలుగా; విశేషంగా; ఎక్కువగా; పుష్కలంగా; విస్తారంగా; లావుగా; అక్షయంగా; భూరి; మెండు;
  • plethoric constitution, ph. స్రావాలు (liquid discharges) ఎక్కువగా అయే తత్త్వం;
  • pleura, n. పునవేష్ట్రం; ఊపిరితిత్తులని పరివేష్టించి ఉండే పల్చని పొర;
  • pleurisy, n. పునవేష్టప్రు వాపు; పార్శ్వ శూల; ఊపిరి తిత్తులని పరివేష్టించి ఉండే పొర వాపు;
  • pliable, adj. నమ్య;
  • pliers, n. పట్టుకారు;
  • plight, n. గోడు; రోదన; దీన స్థితి; దురవస్థ;
  • plosive, n. స్పర్శవర్ణం;
  • plot, n. (1) కథాకథనం; ఇతివృత్తం; భూమిక; (2) బొమ్మ; చిత్రం; (3) కుట్ర; పన్నాగం; కుయుక్తి; (4) స్థలం;
  • plow, [Br.] plough, n. (1) నాగలి; మడక; నడుకసిరి; అరక; హలం; గొర్రు; (2) సప్తర్షి మండలం; పెద్ద ఎలుగుబంటి; Ursa Major;
    • handle of a -, మేడి;
  • plowing, ploughing, v.t. దున్నుట;
  • plug, n. (1) బిరడా; (2) పక్కు; గసిక; (3) ఉతక; see also socket;
  • plug, v. t. బిరడా పెట్టు; బిగించు; మూయు;
  • plum, n. [bot.] Prunus domestica; శీతల దేశాలలో దొరికే ఒక పండు; ఎండబెట్టిన ద్రాక్షని కిస్‌మిస్ అన్నట్లే ఎండబెట్టిన ప్లమ్‌ని ప్రూన్ అంటారు;
  • plumage, n. పింఛం;
  • plumb level, n. మూలమట్టం;
  • plumb line, n. తూగుపలక; వడంబం;
  • plume, n. పురి; పొగపురి;
  • plump, adj. పొతకలాంటి; దుబ్బుగా ఉన్న; బొద్దుగా ఉన్న; కండ పట్టిన;
  • plunder, v. t. దోచు; కొల్లగొట్టు;
  • plunge, v. i ములుగు; మునుగు;
  • plunge, v. t. (1) ముంచు; (2) దూకు;
  • plunger, n. ములక;
  • plunk, v. i. గుమ్మరించు; డబ్బు పోయు;
  • plural, n. బహువచనం; నామవాచకాలైన మాటలకే బహువచనాలు ఉంటాయి;
    • double -, ద్విరుక్త బహువచనం; for example, candelabras (singular, candelabrum; plural, candelabra) or sixpences (singular, penny; plural, pence).
  • plurality, n. చాలామంది; చెప్పుకోదగ్గంత మంది;
  • pluralistic, adj. సమిష్టివాద;
  • Pluto, n. ప్లూటో గ్రహం; ప్లూటో;
  • plutocracy, n. ధనికవర్గాధిపత్యం; ధనికస్వామ్యం; ధనస్వామ్యం; ధనికులచే పరిపాలన;
  • pneumatic, adj. వాత; గాలికి సంబంధించిన; ఎక్కువ పీడనముతో నింపిన గాలితో చేయబడ్డ;
  • pneumonia, n. నుమోనియా; పుఫూజ్వరం; రక్తష్ఠీవి సన్నిపాతం;
  • pocket, n. (1) జేబు; కోశిక; (2) మూల;
  • pocket money, n. జేబుఖర్చు; దినవెచ్చం;
  • pod, n. కాయ; చిక్కుడు; బటానీ కంది మె. దినుసు మొక్కల కాయ;
  • podiatrist, n. పాదాలకి వచ్చే జబ్బుల మీద ప్రావీణ్యత ఉన్న వ్యక్తి; ఈ వ్యక్తి అసలయిన వైద్యుడు కానక్కర లేదు;
  • podium, n. వేదిక; పీఠం;
  • poem, n. (పోమ్) పద్యం; పద్యమాల; పద్య కావ్యం; see also verse;
  • poet, n. m. కవి; f. కవయిత్రి;
  • poet laureate, ph. ప్రతిభావంతమైన కవిగా పురస్కారం అందుకున్న వ్యక్తి; ఆస్థాన కవి;
  • poetic license, ph. ఆర్ష ప్రయోగం;
  • poetry, n. కవనం; కవిత్వం;
    • modern -, నవ కవనం; ఆధునిక కవిత్వం;
  • poignant, adj. (పయోన్యంట్) హృదయాన్ని అంటెడు; ఆర్ర్ద;
  • point, n. (1) బిందువు; మొన; (2) ఓకు; (3) అసలు విషయం; అంశం;
    • fine -, సూక్ష్మాంశం;
    • turning -, క్రాంతి బిందువు;
  • point of incidence, ph. పతన బిందువు;
  • pointer, n. చూపుడుపుల్ల; సూచి; సూచిక; తర్జని;
  • poise, n. చందం;
  • poison, n. విషం; హాలాహలం;
  • poisonous, adj. విష; విషాక్త;
  • poisonous snake, ph. విషసర్పం;
  • poke, n. పొడుచు; కుమ్ము;
  • Polaris, n. ధ్రువనక్షత్రం;
  • polar, adj. ధ్రువ; ధ్రువీయ; చుక్క;
    • - axis, ph. ధ్రువ యష్టి;
    • - bodies, ph. ధ్రువ కాయములు;
    • - bond, ph. [chem.] ధ్రువ బంధం;
    • - circle, ph. ధ్రువ వృత్తం;
    • - molecule, ph. [chem.] ధ్రువ బణువు;
    • - opposite, ph. చుక్కెదురు;
  • Polaris, n. ధ్రువనక్షత్రం; ధ్రువతార; ఉత్తర ధ్రువ నక్షత్రం; ప్రస్తుతం ఔత్తానపాది లేదా Polaris అనే నక్షత్రం ఉత్తర ధ్రువతారగా చెలామణీ అవుతోంది; దక్షిణ ధ్రువ తారగా చెలామణీ అవడానికి ప్రకాశవంతమైన తార ఏదీ లేదు;
  • polarization, polarisation (Br.) n. తలీకరణ; విద్యుదయస్కాంత తరంగాలని ఒకే తలంలో ప్రకంపించేలా చెయ్యడం; (exp.) In English, polarization is a misnomer; it has nothing to do with poles;
  • polarize, v. t. తలీకరించు;
  • pole, n. (1) ధ్రువం; (2) రాట; నిట్రాట; స్తంభం;
    • Flag -, ధ్వజ స్తంభం;
    • North -, ఉత్తర ధ్రువం;
    • South -, దక్షిణ ధ్రువం;
    • - of celestial equator, ph. కదంబం; రవిమార్గ అక్షాన్ని అనంతంగా పొడిగిస్తే ఖగోళానికి తగిలే బిందువు;
    • - of Ecliptic, ph. ధ్రువం; భూ అక్షాన్ని అనంతంగా పొడిగిస్తే ఖగోళానికి తగిలే బిందువు;
  • polemics, n. తర్కవితర్కాలు; వాదవివాదాలు;
  • Polestar, n. ధ్రువనక్షత్రం; ధ్రువతార;
  • police, n. pl. రక్షకభటులు; పోలీసు;
  • police, v. t. కట్టడిలో ఉంచు;
  • police station, n. ఠాణా; పోలీసు స్టేషను;
  • policy, n. (1) పట్టా; పట్టా పత్రం; పాలసీ; (2) అమలులోనున్న పద్దతి;
  • polish, n. మెరుగు ; నునుపు;
  • polish, v. t. మెరుగు పెట్టు; సాన పట్టు; నున్నపరచు;
  • Polish, (పోలిష్) adj. పోలండ్ దేశానికి సంబంధించిన;
  • political chicanery, n. రాజకీయ కుతంత్రం;
  • politicization, n. రాజకీయీకరణం;
  • politics, n. రాజకీయాలు;
    • palace politics, ph. రాచకోట రాజకీయాలు; రాచనగరి రాజకీయాలు; కోటలో కుతంత్రాలు; కోటలో కౌటిల్యాలు;
  • polity, n. రాజ్యతంత్రం;
  • pollen, n. పరాగం; పుప్పొడి; రజం; రజను; మధూళిక;
  • pollen grain, ph. పుప్పొడి రేణువు; సుమనోరజం;
  • pollen sac, ph. పుప్పొడి తిత్తి;
  • pollination, n. పరాగసంపర్కం; సంపర్కం;
    • self -, స్వజాతి సంపర్కం;
    • cross -, మిశ్రమ సంపర్కం;
  • pollute, v. t. కలుషితం చేయు;
  • polluted, adj. కలుషితమైన;
  • polluted, n. కలుషితం;
  • polluter, n. పాంసాళువు; పాంసవుడు; కలుషితం చేసే వ్యక్తి;
  • pollution, n. కల్మషం; కాలుష్యం; కశ్మలం; పంకిలం; పాంశువు;
  • Pollux, n. పునర్వసు చుక్కలలో ఒకటి; మిథునరాశిలో ఒక నక్షత్రం;
  • poltergeist, n. పెంకి దయ్యం; ఈ రకం దయ్యం; చప్పుడు చేయడం, రాళ్ళు విసరడం, సామానులు విరగ్గొట్టడం వంటి పెంకి చేష్టలు చేస్తుంది;
  • poly, adj. బహు; అతి;
  • polyandry, n. బహుభర్తుత్వం;
  • polybasic, adj. బహులవణత్వం; బహులవణధారత్వం;
  • polyculture, n. బహుసాయం; ఒక పొలంలో పంటలని మార్చి వేసే ఆచారం;
  • polydipsia, n. అతిదాహం;
  • polyethylene, n. [chem.] బహువిదీను; ---(note) polyethene; polythane; a plastic widely used in making transparent sheets and bags;
  • polygamy, n. బహుభార్యాత్వం;
  • polyglot, n. బహుభాషాభాసి;
  • polygon, n. బహుభుజి; బహుకోణి; బహుస్రం;
    • irregular -, అక్రమభుజి;
    • regular -, క్రమభుజి;
  • polyglycine, n. బహుగ్లయిసీను;
  • polyglycine backbone, ph. బహుగ్లయిసీను కాండం; బహుగ్లయిసీను వెన్ను;
  • polyhedron, n.బహుఫలకం; ఎన్నో ముఖాలు ఉన్న ఘనస్రం;
  • polymath, n. బహుముఖ ప్రజ్ఞఆశాలి;
  • polymer, n. బహుభాగి; గొలుసులా ఎన్నో భాగాలు ఉన్న ఒక ఆంగిక రసాయనం;
  • polymerize, v. t. [chem.] దండించు; దండలా చేయు; బణువులని దండలా గుచ్చు; బహుభాగి వలె మార్చు;
  • polymerism, n. బహుభాగత్వం;
  • polymorphism, n. బహురూపత;
  • polymorphous, adj. బహురూప;
  • polynomial, n. బహుపది; బహునామి; రెండు కాని అంతకంటె ఎక్కువ పదాలు ఉన్న గణిత సమాసం;
  • polyolefin, n. బహుతైలం; రెండు, మూడు రకాల చమురుల సముదాయం;
  • polypeptide chain, n. [biochem.] బహుజీర్ణమాల;
  • polypetalous, adj. బహుదళ; బహుదళాయుత; ఎన్నో రేకులు గల;
  • polyphenol, n. బహుఫీనాలు;
  • polypleagra, n. అత్యాకలి;
  • polyploids, n. బహుస్థితికాలు; జీవకణాలో ఉండే వారసవాహిక లలో ఒక రకం;
  • polysaccharide, n. [biochem.] బహుచక్కెర; రెండు, మూడు రకాల చక్కెరల మిశ్రమం;
  • polytechnic college, n. బహుకళాశాల; రకరకాల వృత్తి విద్యలు నేర్పే కళాశాల;
  • polytheism, n. బహుదేవత్వం; బహుదేవతారాధన;
  • polyunsaturated, adj. బహుఅసంతృప్త;
  • polyuria, n. అతిమూత్రం;
  • polyvinyl, n. బహువినైల్; ఎన్నో వినైల్ బణువులని దండించగా ఏర్పడ్డ రసాయన పదార్థం;
  • pomegranate, n. దానిమ్మ;
  • pomelo, n. పంపరపనస; [bot.] Citrus maxima;
  • pometo, n. potato + tomato; పిండి టొమేటో:
  • pomiculture, n. ఫలసాయం; పండ్లని పండించడం;
  • pomology, n. ఫలశాస్త్రం; ఫలవిజ్ఞానం;
  • pomp, n. ఆడంబరం; అంగరంగవైభవం; పటాటోపం;
    • verbal -, వాగాడంబరం;
  • pomp and circumstance, ph. అంగరంగవైభవం;
  • pompelmos, n. పంపరపనస; పెద్ద దబ్బపండంత ఉండే నారింజ జాతి పండు;
  • pompous, adj. జంభమైన; డంభమైన; ఆడంబరమైన;
  • pompous, adj. జంభమైన; డంబమైన; ఆడంబరమైన;
  • pond, n. కొలను;
  • ponder, v. i. ఆలోచించు; పర్యాలోచించు; మననం చేయు; వితర్కించు;
  • pony, n. తట్టు; పొట్టి గుర్రం;
  • pool, n. (1) కొలను; మడుగు; పల్వలం; (2) వర్గం;
    • business -, వ్యాపార వర్గం;
    • swimming -, ఈత కొలను;
  • pool, v. i. చందావేసుకొని; కలుపుకొని;
  • poor, adj. బీద; పేద;
  • poor, n. pl. బీదవారు; పేదవారు; దరిద్రులు;
    • poorest of the -, దరిద్రనారాయణులు;
  • popcorn, n. లాజలు; లాజజొన్నలు; పేలాలు;
  • populace, n. ప్రజానీకం; జనానీకం; లోకం; ప్రజ; జనబాహుళ్యం;
  • popular, adj. జనరంజక; జనతా; లోక;
  • popular custom, ph. లోక మర్యాద;
  • popularization, n. జనీకరణ;
  • popular opinion, ph. ప్రజాభిప్రాయం; జనాభిప్రాయం; లోక ప్రవాదం;
  • population, n. జనాభా; జనసంఖ్య; జనులు; జనాలు; ప్రజలు;
    • over -, జనభారం:
  • populous, adj. జనసమ్మర్దమైన; జనసంకీర్ణమైన; జనాకీర్ణమైన;
  • porcelain, n. పింగాణీ; నున్నటి మెరుగున్న ఒక రకం మట్టి; see also china;
  • porcelain boat, n. పింగాణీ చిప్ప;
  • porch, n. మొగిసాల; తలవాకిటి వసారా; వరండా; సరంబీ; పయాలు; మండపం;
    • front -, ముఖ మండపం; మొగిసాల;
  • porcine, adj. సూకర; వరాహ; పోత్ర; పందికి సంబంధించిన;
  • porcupine, n. ఏదుపంది; ముండ్లపంది;
  • pore, n. బెజ్జం; రంధ్రం; సుషి; తూటు;
  • pork, n. పంది మాంసం; (rel.) ham; bacon;
  • pornography, n. అశ్లీల రచనలు; లైంగికలేఖనం; బూతులు; బూతుబొమ్మలు;
  • porosity, n. సారంధ్రత; సచ్ఛిద్రత;
  • porous, adj. సారంధ్ర; సచ్ఛిద్ర;
  • porpoise, n. శింశుమారం;
  • port, n. (1) రేవు; ఓడరేవు; బందరు; (2) ఓడకిగాని విమానానికిగాని ఎడమవైపు భాగం; (3) చిక్కని ఎరుపు రంగు వున్న తియ్యని ద్రాక్ష సారా; (4) కంప్యూటరు లోపలికి వెళ్ళే ద్వారం, బయటకు వచ్చే ద్వారం;
  • portal, n. దేవిడి; ద్వారం; గుమ్మం; చిన్న ద్వారం; ద్వారకి;
  • portal to portal, ph. గుమ్మం నుండి గుమ్మం దాకా;
  • portent, n. దుశ్శకునం; వ్యతీపాతం; గండం;
  • porter, n. (1) ద్వారపాలకుడు; గేటు కాపరి; (2) సామానులు మోసే కూలివాడు;
  • portfolio, n. దస్త్రం;
  • portico, n. మండపం;
  • portion, n. వాటా; పాలు; అంశం; భాగం;
  • portrait, n. రూపచిత్రం; పటం; బొమ్మ; చిత్తరువు; చిత్రం;
  • portrayal, v. t. చిత్రీకరణ;
  • port side, n. దావుబోడిద; దాపల; left side of a boat or ship as one faces forward;
  • Portuguese, adj. బుడతకీచు;
  • pose, n. భంగిమ; పోజు;
  • posit, v. t. పెట్టు; ఉంచు; అనుకో;
  • position, n. (1) పదవి; స్థితి; (2) స్థలం; స్థానం; ఇరవు;
  • positional value, n. స్థానబలం;
  • positive, adj. ధన; ధనాత్మక; ఆస్థి;
  • positive charge, ph. ధనావేశం;
  • positive electricity, ph. ధన విద్యుత్తు;
  • positive force, ph. ఆస్థి బలం;
  • positive quantity, ph. ధన రాశి;
  • positive sign, ph. ధన సన్న;
  • positively charged particle, ph. ధనావేశ శకలం;
  • possession, n. స్వాధీనం;
  • possibility, n. వల్ల; వీలు; పొసగు; అలవి;
  • post, n. (1) రాట; స్తంభం; (2) స్థానం; ఉద్యోగం; (3) టపా; తపాలు;
  • post, pref. ఉత్తర; తర్వాత;
  • post natal, ph. పుట్టుక తర్వాత; జన్మానంతర;
  • post precipitation, ph. ఉత్తర అవక్షేపణ; మడ్డి కిందకి దిగిన తర్వాత;
  • post prandial, ph. భోజనానంతర;
  • post and telegraph, ph. తంతి, తపాలా;
  • posterior, adj. పరాంత; అనంతరపు; వెనక; చివరి; ఆఖరి; (ant.) anterior;
  • posterity, n. భావితరం; సంతతి;
  • postfix, adj. తర్వాత వచ్చే; చివరన వచ్చే;
  • postfix, n. ప్రత్యయం; ఉత్తరపదం; వెనక అంటించేది;
  • postgraduate, adj. స్నాతకోత్తర;
  • posthaste, adv. హుటాహుటిగా; అతిత్వరగా; వెంటనే;
  • posthumous, adj. మరణానంతర;
  • posthumous child, ph. తదనంతర సంతానం; తండ్రి మరణించిన తర్వాత పుట్టిన బిడ్డ; m. గోలకుడు; పౌనర్భవుడు; f. గోలకి; పౌనర్భవి;
  • posting, n. నియామకం;
  • postman, n. పోస్టుమేను;
  • postmortem, n. (1) అన్వీక్షణ; చూసిన తరువాత, విన్న తరువాత; (2) శవపరీక్ష; (3) పరామర్శ;
  • postnatal, adj. బాలెంత;
  • post office, n. టపా ఠానా; తపాలా ఆఫీసు; పోస్టాఫీసు;
  • postpartum, adj. బాలెంత;
  • postpartum blues, ph. బాలెంతరాళ్ళు అనుభవించే నిస్పృహ, వెలితితనం;
  • postpone, v. t. వాయిదావేయు;
  • postponement, n. వాయిదా; కాలవిక్షేపం; విలంబనం;
  • postulate, n. స్వీకృతం; స్వీకృత సిద్ధాంతం;
  • posture, n. భంగిమ;
  • post velar stop, n. కంఠ పశ్చిమ స్పర్శం;
  • pot, n. పాత్ర; వంట గిన్నె; ముంత; కుండ; కడవ; కుంభం; స్థాలి; గూన; బాన; డేగిసా; కాగు; ఘటం;
    • earthenware -, కుండ; మట్టికుండ; మండ; మృత్పాత్ర; మృణ్మయపాత్ర;
  • potable, adj. పేయ; తాగదగిన;
  • potable water, ph. పేయ జలం; తాగదగిన నీరు; మంచినీళ్ళు;
  • potash, n. సర్జిక; కుంభస్మము; పొటాసియం నైట్రేటు; పొటాష్; (ety.) pot + ash;
  • potato, n. బంగాళాదుంప; ఉరలగడ్డ; ఆలుగడ్డ;
    • couch -, శయ్యాళువు;
    • sweet -, చిరగడదుంప; చిలగడ దుంప; గెనుసు గడ్డ; (note) Sweet potato is different from yam;
  • Potassium, n. పొటాసియం; పటాసు; (అణుసంఖ్య 19, సంక్షిప్త నామం, K);
  • Potassium permanganate, n. సినాల రంగు; KMnO4;
  • potbelly, n. బొజ్జ; గుండ్రటి బొజ్జ; బీరుబొజ్జ;
  • potent, n. శక్తిమంతమైన;
  • potency, n. శక్తి; బలం;
  • potentate, n. శక్తిమంతుడు; రాజు;
  • potential, n. (1) విభవం; పీడనం; శక్మం; (2) అంతర్గతంగా దాగి ఉన్న సామర్థ్యం;
    • positive -, ధనవిభవం;
  • potential difference, n. విపీడనం; పీడన తారతమ్యం; విభవ వ్యత్యాసం; శక్మాంతరం;
  • potential drop, n. శక్మపాతం;
  • potential energy, n. స్థితిజశక్తి; బీజరూప శక్తి; బీజశక్తి;
  • potentiometer, n. శక్మమాపకం; variable resistor;
  • potholes, n. గతుకులు; వీధులలో గతుకులు, గోతులు;
  • potluck, n. సమేతం; ఎవరి మేత వారు తెచ్చుకుని, నలుగురూ కలసి భోజనం చేసే వేడుక;
  • potpourri, n. (పో పురి) కలగూరగంప; కలగాపులగం;; కలగలుపు; కరంబము; కదంబము;
  • pots and pans, n.pl. గిన్నె; ముంతా; ముంతా, తప్పేలా;
  • potshot, n. (1) గుడ్డి గురప్రు తాపు; (2) పరోక్ష విమర్శ;
  • potter, n. కుమ్మరి; కుంభకారి;
  • pouch, n. (1) సంచి; తిత్తి; పొంకణం; (2) శిశుకోశం; మర్సూపియం;
  • poultice, n. పిండికట్టు; కురుపుల మీద వేసి కట్టే పిండికట్టు;
  • poultry, n. కోళ్లపెంపకం;
  • pounce, v. t. లంఘించు; గెంతు; మీదకి ఎగురు;
  • pound, v. t. దంచు; గూటించు; బాదు;
  • pound, n. (1) పౌను; బరువును తూచే కొలమానం; (2) పౌను; ఇంగ్లండులో డబ్బుని కొలిచే ద్రవ్యమానం;
  • pour, v. t. పోయు; ఒంపు;
  • pour out, ph. పారబోయు;
  • poverty, n. బీదరికం; బీదతనం; పేదరికం; లేమి; ఎద్దడి; దరిద్రం; నిప్పచరం; అనగా ఒక వ్యక్తి మనుగడకి కావలసిన కనీస అవసరాలు, అనగా తినడానికి తిండి, కట్టడానికి బట్త, ఉండడానికి వసతి సౌకర్యం లేకపోవడం; కటిక దరిద్రం అంటే ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా సరిపోయే అంత తిండి (కేలరీలు, పోషకాలు) కూడ దొరకకపోవడం; సాపేక్ష దరిద్రం అంటే అదే సంఘంలో ఉన్న మిగిలిన వారితో పోల్చినప్పుడు సరిపోయే వసతులు, వనరులు లేకపోవడం;
  • powder, n. (1) గుండ; పిండి; పొడుం; చూర్ణం; నుగ్గు; నలి; తుమురు; (2) బుక్కా; పౌడరు;
    • bleaching -, నిరంజన చూర్ణం;
    • colored -, బుక్కా;
    • scented -, బుక్కా;
    • talcum -, సుద్ద పొడి;
    • tooth -, దంతధావన చూర్ణం;
  • power, n. (1) పాటవం; పటిమ; సామర్థ్యం; బలం; బలీయత; లావు; అలవు; త్రాణ; శక్తి; శక్తత; సత్తువ; సత్వం, satvaM; (2) ఘాతం; సూచిక; (3) అధికారం; (4) విద్యుత్తు;
    • electrical -, విద్యుత్ పాటవం; విద్యుత్ సత్వం;
    • horse -, అశ్వ పాటవం; అశ్వ సామర్థ్యం; అశ్వ సత్వం;
  • power factor, n. [engr.] పాటవ గుణకం; విద్యుత్తులో ఉన్న శక్తిని లెక్కకట్టేటప్పుడు ఈ గుణకాన్ని వాడతారు;
  • power house, ph. పాటవ గృహం; విద్యుత్తుని తయారుచేసే భవనం;
  • powerful, adj. బలీయ;
  • powerless, adj. శక్తిమాలిన;
  • practical, adj. ప్రయోగాత్మక; ఆచరణాత్మక; ఆచరణీయ; ప్రాయోగిక; కార్యశీల; కార్యవాద; ఔపయోగిక; వ్యవహారిక;
  • practical difficulties, ph. సాధకబాధకాలు;
  • practical person, ph. కార్యవాది; కార్యశీలి;
  • practicals, n. ప్రయోగాలు; పరీక్షలలో ప్రయోగాల భాగం;
  • practice, n. (1) సాధకం; సాధన; అభ్యాసం; ఆచరణ; వ్యాసంగం; (2) వాడుక; సంప్రదాయం; (3) పద్ధతి; విధానం;
  • practice, v. i. అభ్యసించు; ఆచరించు;
  • practitioner, n. సాధకుడు;
  • pragmatics, n. వాడుక; వాడుక శాస్త్రం; భావాన్ని వెల్లడి చెయ్యడానికి భాషని ఎలా వాడాలో తెలిపే శాస్త్రం;
  • pragmatism, n. కార్యవాదం;
  • pragmatist, n. కార్యవాది;
  • prairie, n. ప్రయరీ; అమెరికాలోని విశాలమైన గడ్డి మైదానాలు;
  • praise, v. t. మెచ్చుకొను; కొనియాడు; పొగడు; కొండాడు; కీర్తించు; శ్లాఘించు; ప్రశంసించు; స్తోత్రం చేయు; స్తుతించు; వినుతించు; కైవారం చేయు; భూషించు; అభినుతించు;
  • praise, n. మెచ్చుకోలు; పొగడ్త; ప్రశంస; మన్నన; స్తుతి; స్తోత్రం; శ్లాఘన; భూషణ; కైవారం; వినుతి; అభినుతి:
  • praiseworthy, adj., ప్రశంసాత్మకమైన; కొనియాడతగిన; వినుతికెక్కిన;
  • praiseworthy, n. ప్రశంసాత్మకం; శ్లాఘనీయం; కొనియాడదగ్గది; వినుతి;
  • prank, n. జిత్తు; టక్కరి పని; ఠవళి;
  • prankster, n. జిత్తులమారి;
  • prawn, n. రొయ్య;
  • prayer, n. ప్రార్థన; ఉక్తం;
  • preach, v. t. ప్రబోధించు;
  • preacher, n. ఉపదేశకుడు; ప్రబోధకుడు; ప్రబోక్త;
  • preamble, n. ప్రస్తావన; ఉపోద్ఘాతం; అవతారిక; పీఠిక; ఉద్దేశ వివరణం;
  • precaution, n. ముందుజాగ్రత్త; అప్రమత్తత; చేకాపు;
  • precedent, n. పూర్వప్రమాణం;
  • preceding, adj. గత; పూర్వగత; ఇందాకటి;
  • preceptor, n. ఆచార్యుడు; కుల గురువు; ఉపదేశికుడు; విద్యాదాత;
  • precession, n. విషువత్ చలనం; అయనాంశ;
    • - of the equinoxes, ph. విషువత్ చలనం; అయన చలనం; భూ అక్షం నక్షత్రగోళం మీద స్థిరంగా నిలవక, బహు నెమ్మదిగా, రాశి చక్రానికి వ్యతిరేక దిశలో , (అంటే మేషం, మీనం, కుంభం, ...అనే విలోమ క్రమంలో), తిరుగుతూ, ప్రతి 25,800 సంవత్సరాలకి ఒక వృత్తం పూర్తి చేస్తుంది; ఈ కదలిక వలన విషువత్ సంక్రమణ స్థానాలు కూడ కదులుతాయు;
  • precinct, n. ఆవరణ; ప్రాంతీయ పరిధి;
    • [note] అయనాంశ is a correction term to account for the difference between the tropical and siderail zodiacs and this difference is due to the precession of the equinoxes. Thus the computed positions of the planets and houses may differ depending on whether ayanAMSa is used or not and also, if it is used, on the specific algorithm employed to compute it!
  • precious, adj. విలువైన;
  • precious stone, ph. పొడి; రత్నం; వజ్రం; పచ్చ, నీలం, కెంపు, మొ.;
  • precipitate, n. (1) మడ్డి; అవక్షేపం; (2) కారణభూతం కావడం;
  • precipitation, v. i. మడ్డిలా కిందకి దిగడం; అవక్షేపణం;
  • precipitation, v. t. మడ్డిలా కిందకి దిగేటట్టు చేయడం; అవక్షేపణం;
  • precipitation, n. అవపాతనం; ఆకాశం నుండి కిందకి పడే నీరు; వాన, మంచు, వగైరా;
  • precision, adj. సున్నితపు; కచ్చితపు;
    • - balance, ph. సున్నితపు త్రాసు;
    • - calculation, ph. సున్నితపు లెక్క;
  • precocious, adj. వయస్సుకి మించిన తెలివి, నైపుణ్యం కల;
  • precursor, n. పూర్వగామి;
  • predation, n. దొంగిలించి బతకడం; ఒకరిది తస్కరించి బతకడం; మరొక జీవిని తిని బతకడం;
  • predator, n. పిండారి; తస్కరి; దొంగ; మరొక జంతువుని తిని బతికేది; see also parasite;
  • predatory, adj. పిండారీ; దోపిడీ;
  • predicament, n. దురవస్థ; అవస్థ; క్లిష్టపరిస్థితి;
  • predicate, n. అఖ్యానం; అఖ్యాతం; వాక్యంలో కర్తను గురించి చెప్పేది;
  • predicate logic, n. అఖ్యాత తర్కం;
  • prediction, n. జోస్యం;
  • pre-existing, adj. పూర్వస్థిత;
  • preface, n. పీఠిక; భూమిక; ముందుమాట; ఒక రచయిత కాని, ప్రచురణకర్త కాని ఒక రచనలోని విషయాన్ని విశదీకరిస్తూ రాసే చిన్న వ్యాసం; ఉపోద్ఘాతం; (rel.) foreword, introduction;
  • preference, n. ఇష్టత; అధిగణ్యత;
  • prefix, n. ఉపసర్గ; పూర్వప్రత్యయం; ఉపపదం; ప్రాదు; పూర్వలగ్నం; తల; దాపలతోక;
  • pregnancy, n. గర్భం; కడుపు; చూలు; గర్భధారణ; కడుపుతో ఉండడం;
    • first -, తొలి చూలు;
  • pregnancy, n. గర్భం; కడుపు;
  • pregnant, n. గర్భం; కడుపు;
  • pregnant with meaning, ph. భావగర్భితం;
  • pregnant woman, ph. గర్భిణి; గర్భవతి; కడుపుతోవున్న మనిషి; చూలింతరాలు; చూలాలు; గర్భశ్రాంత;
  • prejudice, n. ఇతరుల యెడల నీచభావం;
    • racial -, జాత్యహంకారం;
  • preliminary, adj. ఆరంభ; ప్రథమ; ఆదిమ; ప్రారంభ; ఉపక్రమణిక;
  • preliminary investigation, ph. ఉపక్రమణిక పరిశోధన; ప్రథమ పరిశోధన;
  • prelude, n. ప్రవేశిక; నాంది;
  • premature, adj. పరిపక్వము కాని; పూర్తిగా ఎదగని; నెలలు నిండని;
  • premeditated, n. పూర్వసంకల్పితం; ప్రయత్నపూర్వకం;
  • premise, n. s. ఆధారవాక్యం; పూర్వసిద్ధాంతం;
  • premises, n. pl. ప్రాంగణం; దివాణం;
  • premium, n. (1) అడితి; బీమాకిస్తు; ప్రీమియం; (2) నిజమైన విలువ కంటె ఎక్కువ చెల్లింపు;
    • level -, మట్టపు అడితి; మట్టపు ప్రీమియం;
  • pre-occupation, n. అన్యమనస్కత; పూర్వగ్రహణం;
  • preparation, n. (1) సన్నాహం; (2) తయారైనది; తయారీ; వంటకం;
  • prepare, v.i. తయారగు; సిద్ధమగు;
  • prepared, adj. సమాయత్త;
  • prepare, v. t. తయారు చేయు; సిద్ధము చేయు;
  • preparedness, n. సంసిద్ధత;
  • preponderance, n. అత్యధికంగా ఉన్నటువంటి;
  • preponderance of evidence, ph. [law] అత్యధికంగా ఉన్నటువంటి సాక్ష్యాధారాలు;
  • preposition, n. విభక్తి ప్రత్యయం; (note) ఇంగ్లీషులో preposition అంటే విశేష్యానికి ముందు వచ్చేది అని అర్థం, కాని తెలుగులో విభక్తి ప్రత్యయం నామవాచకానికి తర్వాత వస్తుంది; ఒక విధంగా చూస్తే విభక్తి ప్రత్యయానిది post position; ఇదే ఇంగ్లీషులో వాక్య నిర్మాణానికీ, తెలుగులో వాక్య నిర్మాణానికీ మధ్యనున్న ఒక పెద్ద తేడా;
  • prerogative, n. విశిష్టాధికారం;
  • presbyopia, n. దీర్ఘదృష్టి; దూరపు వస్తువులు కనిపించడం, దగ్గరవి బాగా కనిపించకపోవడం;
  • prescribed, adj. నిర్దేశిత; విధించబడ్డ; నియోగింపబడ్డ; విహిత;
  • prescribed duty, ph. విధ్యుక్త ధర్మం;
  • prescribed standard, ph. నిర్దేశిత ప్రమాణం; విహిత ప్రమాణం;
  • prescription, n. నిర్దేశం; అనుశాసనం; విహితం; మందుచీటీ;
  • prescriptive, adj. నిర్దేశాత్మక; శాసనాత్మక; అనుశాసన; విహితాత్మక;
  • prescriptive, n. నిర్దేశాత్మకం; శాసనాత్మకం; విహితాత్మకం;
    • Suri's grammar is -, సూరి వ్యాకరణం శాసనాత్మకం;
  • presence, n. (1) స్పూర్తి; ఉనికీ; హాజరు; సమక్షం; సముఖం; (2) ప్రత్యక్ష ఉపస్థితి;
  • presence of mind, ph. సమయస్పూర్తి;
  • present, n. (1) ప్రస్తుతం; వర్తమానం; ఇప్పుడు; (2) బహుమానం; ఈనాం;
  • present, v. i. హాజరు; ఉండు;
  • present, v. t. (1) బహుమతి ఇచ్చు; (2) పొందుపరచు;
  • present continuous tense, ph. [gram.] వర్తమానార్థకం;
  • presently, adv. iMtalO;
  • present perfect tense, ph. [gram.] తద్ధర్మార్థకం;
  • present tense, ph. [gram.] వర్తమాన కాలం;
  • preservative, n. పరిరక్షకం;
    • food - , ph. ఆహార పరిరక్షకం;
  • preserve, v. t. (1) కాపాడు; రక్షించు; సంరక్షించు; పరిరక్షించు; (2) నిల్వ చేయు;
  • preserve, n. బచావు; నిల్వ ఉంచినది; ఊరుగాయ;
  • preserver, n. స్థితికారకుడు; రక్షకుడు; సంరక్షకుడు;
  • president, n. (1) అధ్యక్షుడు; అధ్యక్షురాలు; సభాపతి; (2) రాష్టప్రతి;
  • press, n. (1) గానుగ; (2) అచ్చు యంత్రం; ముద్రకి; (3) విలేకరులు; పాత్రికేయులు; పత్రికలవారు;
  • press, v. t. (1) నొక్కు; ఒత్తు; (2) పట్టుబట్టు; (3) ఇస్త్రీచేయు;
  • pressman, n. విలేకరి; పాత్రికేయుడు;
  • press reporter, n. పత్రికా విలేకరి; పాత్రికేయుడు;
  • press representative, n. పత్రికా ప్రతినిధి;
  • pressure, v. t. పీడించు; ఈండ్రించు; ఒత్తిడి చేయు; తొందర పెట్టు; ఈండ్రము చేయు;
  • pressure, n. పీడనం; పోటు; భారం; ఒత్తిడి; ఈండ్రము; ఆమర్దం; నొక్కుడు; తొందర;
    • blood -, రక్తపు పోటు;
    • partial -, అంశిక పీడనం; the pressure exerted by an individual gas in a mixture of gases;
  • pressure gauge, ph. భారమితి; పీడన మాపకం;
  • pressure energy, ph. ప్రేషక శక్తి; ప్రేష శక్తి;
  • prestigious, adj. ప్రతిష్టాత్మక;
  • pretender, n. కపటి; వేషధారి; నటుడు;
  • pretense, n. (1) మిష; నెపం; (2) నటన; భేషజం;
  • pretext, n. మిష; సాకు; నెపం; వంక;
  • prevalent, adj. చలామణీలో ఉన్న; అమలులో ఉన్న; వచ్చేటటువంటి;
  • prevailing, adj. అక్కడ వుండే; ప్రస్తుతపు; అమలులలోవున్న;
  • prevailing market price, ph. ప్రస్తుతపు బజారు ధర; అమలులోనున్న బజారు ధర;
  • prevailing winds, ph. అక్కడ వీచే గాలి;
  • prevalence, n. ప్రాబల్యం; ప్రబలత;
  • prevaricator, n. అబద్ధాలు చెప్పే వ్యక్తి; నిజాన్ని కప్పిపుచ్చే వ్యక్తి;
  • prevent, v. t. నివారించు; వారించు; ఆపు; అడ్డు; అడ్డగించు; నిరోధించు; అటకాయించు;
  • prevention, n. నివారణ; నిరోధం; అటకాయింపు;
  • preventive, adj. నివారక; నిరోధక;
  • preventive maintenance, ph. నివారక పరిపోషణ; నిరోధక సంరక్షణ;
  • previous, adj. ఇందాకటి; ఇదివరకటి;
  • previously, adv. ఇదివరకు;
  • price, n. ధర; మూల్యం; కిమ్మత్తు; వెల; అర్జు;
    • fair -, గిట్టుబాటు ధర;
    • fixed -, నిరకు;
    • market -, బజారు ధర; అర్జుబాజారీ;
    • retail -, చిల్లర ధర;
    • wholesale -, టోకు ధర;
  • priceless, n. అమూల్యం;
  • prickle, n. ముల్లు; దూగర ముల్లు;
  • prickly chaff, n. ఉత్తరేణి;
  • prickly heat, n. పేత;
  • prickly pear, n. (1) నాగజెముడు; (2) నాగఫణి; నాగజెముడు పండు;
  • pride, n. (1) అతిశయం; స్వాతిశయం; గర్వం; పొగరు; అహంకారం; డాంబికం; (2) అభిమానం; స్వాభిమానం; (3) సింహాల గుంపు; సటాఝూటం;
  • priest, n. m. పురోహితుడు; కేథలిక్ తెగకి చెందిన పురోహితుడిని ప్రీస్ట్ అంటారు. ఇతను వివాహం చేసుకోకూడదు, జీవితాంతం బ్రహ్మచర్యమే పాటించాలి; చర్చిలో హోదా పెరిగే కొద్దీ బిషప్, కార్డినల్ వగైరా బిరుదులు కనిపిస్తాయి. వీటిలో అత్యున్నతమైన స్థానం పోప్;
  • prig, n. పొగరుబోతు; అహంకారి; గర్విష్టి;
  • prima facie, adj. మొదట ఏర్పడిన అభిప్రాయం ప్రకారం; తొలి చూపులో ఏర్పడిన అభిప్రాయం ప్రకారం;
  • primapara, n. (1) తొలిచూలు; మొదటి కాన్పు; (2) తొలిచూలు స్త్రీ;
  • primary, adj. ప్రాథమిక; ముఖ్యమైన; ప్రాగ్, prAg
  • primary form;, ph. ప్రాగ్రూపం;
  • primate, n. ప్రాగ్‌వానరం; నరవానరం; మనిషి, కోతి జాతులకి చెందిన జంతువులని సూచించడానికి కలగలుపుగా వాడే మాట;
  • prime, adj. ప్రధాన; ముఖ్యమైన;
  • prime factor, ph. ప్రధాన కారణాంకం;
  • prime, n. ప్రధానాంకం; ప్రధాన సంఖ్య; అభేద్య సంఖ్య;
  • prime number, ph. ప్రధానాంకం; ప్రధాన సంఖ్య; అభేద్య సంఖ్య;
    • absolute -, ph. నిరపేక్ష ప్రధాన సంఖ్య; A permutable prime, also known as anagrammatic prime, is a prime number which, in a given base, can have its digits' positions switched through any permutation and still be a prime number. In base 10, all the permutable primes with fewer than 49,081 digits are known: 2, 3, 5, 7, 11, 13, 17, 31, 37, 71, 73, 79, 97, 113, 131, 199, 311, 337, 373, 733, 919, 991, R19 (1111111111111111111), R23, R317, R1031, ... where the "repunit" R19 stands for a sequence of 19 one's.
    • regular -, ph. క్రమ ప్రధాన సంఖ్య; In number theory, a regular prime is a special kind of prime number, defined by Ernst Kummer in 1850 to prove certain cases of Fermat's Last Theorem. Regular primes may be defined via the divisibility of either class numbers or of Bernoulli numbers. The number p is regular if (and only if) it does not divide the numerator of any of the Bernoulli numbers Bk for k=2, 4, 6, ..., p-3. For example, 691 divides the numerator of B12, so 691 is not regular (we say it is irregular).
  • primer, n. (ప్రిమర్) శిశుబోధ; బాలబోధ; ప్రాథమిక వాచకం;
  • primeval atom, n. బ్రహ్మాణువు;
  • primeval egg, n. బ్రహ్మాండం;
  • primeval fireball, n. ఆదిజ్వాల;
  • primeval ocean, n. నారము;
  • primogeniture, n. ప్రథమ సంతానం;
  • prince, n. యువరాజు; రాకుమారుడు;
  • princess, n. యువరాణి; రాకుమార్తె;
  • principal, adj. ప్రథానమైన; ముఖ్యమైన; కూకటి; అసలైన;
  • principal, n. (1) ప్రథాన అధ్యాపకుడు; ప్రధాన ఆచార్యుడు; ప్రాంశుపాలుడు; (2) అగ్రణి; అగ్రిముడు; అగ్రిమము; (3) అసలు; అసలు సొమ్ము; మూలధనం; పరిపణం;
  • principle, n. (1) సూత్రం; నియమం; తత్వం; (2) నైతికమైన విలువ;
    • in -, సూత్రప్రాయంగా; సూత్రానుగుణంగా; పద్ధతి ప్రకారం;
    • uncertainty -, అనిశ్చితత్వ నియమం;
  • print, n. ముద్ర; ముద్రణ;
    • fingerprint, వేలిముద్ర;
    • footprint, పాదముద్ర;
  • print, v. t. (1) అచ్చువేయు; ముద్రించు; అచ్చొత్తు; (2) చెక్కు; గొలుసుకట్టుగా కాకుండా అచ్చువేసినట్లు రాయు;
  • print shop, n. ముద్రాక్షర శాల;
  • printed, adj. ముద్రించబడిన;
  • printer, n. (1) ముద్రాపకుడు; (2) ముద్రాపకి; ముద్రణ యంత్రం; ముద్దరి;
    • dot matrix -, బిందు మాత్రిక ముద్దరి;
    • laser -, లేసర్ ముద్దరి;
  • printer's devil, n. ముద్రారాక్షసం; అచ్చు తప్పు;
  • printing press, n. ముద్రణా యంత్రం;
  • prior, adj. మొదటి; ముందటి; పూర్వ; పురోగామ్య;
  • prior right, ph. మొదటి హక్కు;
  • prior mortgage, ph. పూర్వపు తనఖా;
  • prior party, ph. ముందటి ఆసామీ;
  • prism, n. పట్టకం;
  • prison, n. ఖైదు; కారాగారం; కారాగృహం; బందిఖానా; బందె; చెరసాల; బుయ్యారం; జైలు;
  • prisoner, n. ఖైదీ; బందీ;
  • pristine, adj. నిష్కల్మష; పాడు కాని; ప్రత్యగ్ర;
  • private, adj. స్వంత; సొంత; వ్యక్తిగత; స్వకీయ; ఖానిగీ; ఖాసా; వ్యష్టి; ఏకాంత; ఛన్న; (ant.) సమష్టి;
  • private land, ph. ఖానిగీ భూమి;
  • privacy, n. మరుగు;
  • privation, n. లేమి; జీవితంలో నిత్యావసరాల లేమి; శూన్యత; హీనత;
  • privilege, n. ప్రత్యేకార్హత;
  • pro, pref. తొలి; ప్రథమ; ప్రథాన; ముఖ్య; ప్రాణ్య;
  • pro. adv. అనుకూలంగా; (ant.) con;
  • probability, n. సంభావ్యత;
    • joint -, సంయుక్త సంభావ్యత;
  • probably, adv. బహుశ;
  • probe, n. శలాకం; పుడక; పుల్ల; ఏషణి;
  • probe, v. t. తరచి చూడు; తరచి తరచి పరీక్షించు;
  • probity, n. నిజాయితీ;
  • problem, n. సమస్య; ప్రశ్న; ఉపపాద్యం; కైపదం;
  • problematical, adj. సమస్యాత్మక;
  • prokaryotic, adj. కణిక లేనివి; కణిక రహిత;
  • prokaryotic cell, ph. కణికలేని కణములు; కణిక రహితములు; కణిక రహిత కణములు;
  • procedural, adj. విధానపరమైన;
  • procedure, n. విధానం; పద్ధతి; వ్యవహార పద్ధతి; విధివిధానం; తంతు; రీతి; ప్రక్రియ;
  • proceed, v. i. కానిచ్చు; కొనసాగించు;
  • proceeds, n. వసూళ్లు; వసూలైన డబ్బు;
  • process, n. ప్రక్రియ; గతి; పద్ధతి; సంవిధానం; పరికర్మ; క్రమం; గత్వం; వ్యాపారం;
    • life -, జీవన ప్రక్రియ;
    • mental -, మనోవ్యాపారం;
    • peace -, శాంతి గత్వం;
    • physical -, భౌతిక వ్యాపారం;
    • thought -, ఆలోచనా విధం; ఆలోచనా ప్రక్రియ; తలపుల బాట;
  • processing, n. సంవిధానం;
  • procession, n.ఊరేగింపు;
  • proclaim, v. t. ప్రకటించు; చాటించు;
  • proclamation, n. ప్రకటన; చాటింపు; నివాకం; ఇస్తిహారు;
  • proclivity, n. చిత్తాభిముఖం; మొగ్గు;
  • procrastinate, v. t. నాన్చు; తాత్సారం చేయు; చెయ్యవలసిన పనిని వెంటనే చెయ్యకుండా బకాయి వేయు;
  • procrastination, n. తాత్సారం;
  • procreation, n. ప్రజననం;
  • procure, v.i. చేకూర్చు; సంతరించు;
  • procurement, n. చేకూర్పు; సంతరింపు;
  • Procyon, n. (ప్రోసియాన్) లఘు లుబ్దకం రాసిలో ప్రకాసించే ఒక తార; (lit.) before the dog, because it rises before Sirius, the Dog Star;
  • prod, n. ములుకు; ముల్లు; సూది; ముల్లు కర్ర; అంకుశం;
  • prod, v. t. ముందుకి తోయు; పొడుచు;
  • prodigy, n. ఉత్పాతపిండం; విశిష్ట వ్యక్తి; బాల మేధావి;
  • produce, n. (ప్రోడ్యూస్) పంట; సస్యం; కాయగూరలు; పండ్లు వగైరా;
  • produce, v. t. (ప్రొడ్యూస్) (1) హాజరుపరచు; (2) నిర్మించు; తయారు చేయు; (3) ఉత్పన్నం చేయు; ఉత్పత్తి చేయు; ఉత్పాదించు;
  • produced, adj. సంజనిత; తయారు కాబడ్ద;
  • producer, n. నిర్మాత; ఉత్పత్తిదారుడు; ఉత్పాదకుడు; ఉత్పాదాళువు;
  • product, n. (1) పంట; ఉత్పాదితం; ఉత్పన్నం; ఉత్పత్తి ; ఉత్పత్తి చేయబడినది; (2) లబ్దము; లభించినది; ఫలితం;
    • food -, ఆహార ఉత్పత్తి;
  • production, n. ఉత్పత్తి; ఉత్పాదన; నిర్మాణం;
  • production capacity, n. ఉత్పాదన శక్తి;
  • production cost, n. ఉత్పత్తి ధర; ఉత్పత్తికేు ఖర్చు;
  • production rule, n. ఉత్పాదన నియమం;
  • productive, adj. ఉత్పాదక; ఉత్పాదకమైన; ఫలప్రదమైన;
  • productive capacity, ph. ఉత్పాదక శక్తి;
  • productive power, ph. ఉత్పాదక శక్తి;
  • productivity, n. ఉత్పాదకత;
  • profane, adj. అసభ్యమైన; అశ్లీలమైన[ బూతు; అపవిత్రమైన; సాధారణంగా ఈ విశేషణాలు భాషని గురించి మాట్లాడేటప్పుడు వాడతారు;
  • profanity, n. అసభ్యం; అశ్లీలం; బూతు; అసభ్యపు మాట; బూతు మాట; బజారు భాష; మోటు భాష;
  • profession, n. వృత్తి; ఉద్యోగం; జీవిక; జీవనోపాయం; కాయకం; పని;
  • professional, adj. వృత్తి; వృత్తిపరమైన; ఉద్యోగపరమైన; వృత్తిగత; వృత్తిసంబంధిత; వ్యావసాయిక;
  • professional studies, ph. వృత్తి విద్యలు;
  • professional, n. నిఖార్సయిన వ్యక్తి;
  • professionally, adv. వృత్తిగతంగా; వృత్తిపరంగా; వ్యావసాయికంగా;
  • professor, n. ఆచార్య; ఆచార్యుడు;
  • proficiency, n. ప్రావీణ్యత;
  • profile, n. (1) వైఖరి; సరళి; (2) పార్శ్వవైఖరి; కపోలము; పక్కనుండి చూస్తే కనిపించే వైఖరి;
    • statistical -, సాంఖ్య వైఖరి;
  • profit, n. లాభం; లబ్ది; ఫాయిదా; ఆదా; ఫలం; ఫలోదయం; కిట్టుబాటు; గిట్టుబడి; కూడుదల;
    • gross -, మొత్తం లాభం;
    • net -, నికరపు లాభం;
  • profitable, adj. లాభదాయక;
  • profitability, n. కిట్టుబాటు;
  • profit and loss, ph. లాభనష్టాలు;
  • proforma, n. నమూనాపత్రం;
  • profound, adj. గంభీర; లోతైన;
  • profuse, adj. విస్తారమైన;
  • progenitors, n. pl. పూర్వులు; పితరులు; పితృదేవతలు; నేటి సంతతికి నాటి కారణభూతులు;
  • progeny, n. సంతానం; సంతతి; పిల్లలు; పరంపర;
  • prognosis, n. ముందుగా చెప్పగల జ్ఞానం;
  • program, n. (1) కార్యక్రమం; ప్రోగ్రాం; (2) క్రమణిక;
    • computer -, క్రమణిక;
  • programmer, n. క్రమకర్త; క్రమనికలు రాసే వ్యక్తి;
  • progress, n. (1) ప్రగతి; అభ్యుదయం; మెరుగుదల; అభివృద్ధి; పురోభివృద్ధి; పురోగతి; పురోగమనం; వికాసం; ఉత్కర్ష; (2) గమనం;
    • technological -, సాంకేతిక వికాసం;
  • progression, n. (1) ప్రగతి పథం; (2) శ్రేణి; శ్రేఢి; అనుపాతం; పరంపర; ముందుకి నడుచుకుంటూ వెళ్ళేది;
    • arithmetic -, సంకలితోత్తర శ్రేణి; సంకలితం; ఒక క్రమంలో అంకెలని కలుపుకుంటూ వెళ్ళడం;
    • geometric- , గుణోత్తర శ్రేణి; ఉత్కలితం; ఒక క్రమంలో వర్గీకరించిన అంకెలని కలుపుకుంటూ వెళ్ళడం;
  • progressive, adj. అభ్యుదయ; పురోగమన; ప్రగతిశీల; ఊర్ధ్వగమన;
  • prohibited, n. నిషిద్ధం;
  • prohibition, n. నిషేధం; నిషిద్ధం;
  • project, v. i. (ప్రొజెక్ట్) ముందుకు పొడుచుకుని వచ్చు;
  • project, v. t. (ప్రొజెక్ట్) ముందుకు దూసుకుని వచ్చేలా చేయు;
  • project, n. (పోజెక్ట్) పథకం; సాధించవలసిన పని;
  • projectile, n. ప్రక్షిప్తం; ముందుకు దూసుకుని వచ్చే వస్తువు; విసరిన వస్తువు; ఎగరవేసిన వస్తువు;
  • projection, n. విక్షేపం; ముందరకి తొయ్యడం;
  • projector, n. విక్షేపణి; ముందరకి తోసేది;
  • prolapse, n. భ్రంశం; చ్యుతి; దిగజారుట; జాకారుట; పతనం;
  • prolapse of anus, ph. గుద భ్రంశం;
  • prolapse of gut, ph. ఆంత్ర భ్రంశం; పేగు జారుట;
  • proliferation, n. బహుదాకరణం; తామరతంపర వలె వృద్ధి చెందడం;
  • proletariat, n. శ్రామిక వర్గం; పాటకజనం; శ్రామికులు;
  • prolific, adj. విరివిగా సృష్టించగలిగే సామర్థ్యం గల;
  • prolific writer, ph. విరివిగా రచనలు చేసిన వ్యక్తి;
  • prologue, n. ప్రస్తావన; పీఠిక; అవతారిక; తొలిపలుకు; నాంది; ముందుమాట; పూర్వరంగం;
  • prolong, v. i. పొడిగించు; సాగదీయు;
  • prominent, adj. పేరున్న; స్పుటమైన; బాగా కనిపించే;
  • promise, n. (1) బాస; మాట; వాగ్దానం; (2) బాగుపడే అవకాశం; వృద్ధిలోకి వచ్చే అవకాశం;
  • promise, v. i. బాసచేయు; మాటయిచ్చు;
  • promising, adj. బాగుపడే అవకాశం ఉన్న; వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉన్న;
  • promisory note, ph. వాగ్దాన పత్రం; ప్రోనోటు;
  • promote, v. t. వృద్ధిచేయు; అధికం చేయు;
  • promotion, n. (1) పదోన్నతి; ఉద్యోగపు హోదా పెరగడం; (2) వ్యాపారంలో వస్తువుల అమ్మకం వృద్ధి పొందడానికి చేసే హడావిడి;
  • prompt, v. t. ప్రేరేపించు;
  • promptly, adv. అవ్యవధానంగా: అవిలంబంగా; వెనువెంటనే; వెంటనే; ఆలశ్యం చెయ్యకుండా;
  • promulgate, v. t. ప్రకటించు;
  • prone, adj. బోర్లా;
  • pronoun, n. సర్వనామం;
    • demonstrative -, సూచక సర్వనామం; ఏతత్తదర్ధక సర్వనామం;
    • indefinite -, అనిర్దిష్ట సర్వనామం;
    • interrogative -, ప్రశ్నవాచక సర్వనామం; యత్కిమర్ధక సర్వనామం;
    • nominal -, ఆఖ్యాత సర్వనామం;
    • numerical -, సంఖ్యావాచక సర్వనామం;
    • personal -, పురుషవాచక సర్వనామం; యుష్మదస్మదర్థక సర్వనామం;
    • reflexive -, ఆత్మార్థక సర్వనామం;
    • relative-, సంబంధంవాచక సర్వనామం;
  • pronounce, v. i. ఉగ్గడించు; ఉచ్చరించు;
    • pronunciation, n. ఉచ్చారణ;
  • pronunciation loan, ph. ఉచ్చారణా దానం;
  • proof, n. ఋజువు; దాఖలా; నిదర్శనం; ప్రమాణం; తార్కాణం; నిరూపణం; ఉపపత్తి; దృష్టాంతం; మూదల; మూదలిక;
    • - by contradiction, ఖండన ఉపపత్తి;
  • proofs, n. అచ్చు చిత్తులు; చిత్తు ప్రతులు;
  • prop, n. ఊత; దన్ను; ఆనురాట; ఆలంబం; అండ; దండ; ప్రాపు; ఊతకోల; ఆధారం; పట్టుగొమ్మ; అవష్టంభం;
  • propaganda, n. ప్రచారం;
  • propagate, v. t. ప్రచారం చేయు; వ్యాపింప చేయు;
  • propagation, n. ప్రసరణ; వ్యాప్తి;
  • propane, n. తదేను; త్రేును; మూడు కర్బనపు అణువులు ఉన్న ఒక రసాయన వాయువు; C3H8; ఈ వాయువుని వంట వాయువుగా ఉపయోగించవచ్చు;
  • propanol, n. త్రయోల్; ప్రొపనోల్; propyl alcohol;
  • propellant, n. క్షేపణ పదార్థం; చోదక ద్రవ్యం;
  • propeller, n. క్షేపణి; చోదక యంత్రం;
  • propene, n. తదీను; మూడు కర్బనపు అణువులు, జంట బంధం ఉన్న ఒక రసాయన వాయువు; propylene; C3H6;
  • propensity, n. ఉన్ముఖత;
  • proper, adj. తగిన; క్రమమైన; క్రమ; స్వకీయ; నిజ; యుక్తమైన; వెరవైన;
    • - divisor, ph. క్రమ విభాజకం;
    • - fraction, ph. క్రమభిన్నం;
    • - motion of a star, ph. తార యొక్క స్వకీయ గమనం; నిజ గతి; నక్షత్రాలు ఏవీ స్థిరంగా లేవు; అవి వేరు వేరు దిశలలో వేరు వేరు వేగాలతో - సెకండుకి అనేక కిలోమీటర్ల వేగంతో - కదులుతున్నాయి;
  • proper, n. భావ్యం; సరైనది; యుక్తం; వెరవు;
  • property, n. (1) లక్షణం; గుణం; ధర్మం; (2) ఆస్తి; సొత్తు; సంపద; సంపత్తి;
    • characteristic -, అభిలాక్షణిక ధర్మం;
    • chemical -, రసాయన ధర్మం;
    • fixed -, స్థిరాస్తి;
    • inherent -, స్వభావం;
    • intellectual -, మేథో సంపత్తి; మేయ్హో సంపద;
    • movable -, చరాస్తి;
    • paternal -, పిత్రార్జితం;
    • personal -, ఏదర;
    • rudimentary -, తన్మాత్ర;
    • self-acquired -, స్వార్జితం;
  • prophase, n. తొలిదశ; కణ విభజన జరిగే సమయంలో తొలి దశ;
  • prophecy, n. అనాగతం; భవిష్యద్వాక్యం; సోదె;
  • prophet, n. అనాగతవేది; భవిష్యత్తును చెప్పు వ్యక్తి; సోదె చెప్పు వ్యక్తి;
  • propitiate, v. t. సంతోషపెట్టు; శాంతింప చేయు; పొగుడు; కీర్తించు; పొంగించు;
  • proportion, n.అనురూప్యం; అనుపాతం; వాటా; పాలు; వంతు; నిష్పత్తి;
    • direct -, క్రమ అనుపాతం; సరళ అనుపాతం; అనులోమ అనుపాతం;
    • indirect-, విలోమ అనుపాతం;
  • proportional, adj. అనురూప్య; అనుపాత;
  • proportionately, adj. అనురూప్యంగా; అనురూప్యేణా; వాటాలవారీగా; వంతుల ప్రకారం; నైష్పత్తికంగా; పరస్పరానుగుణంగా;
  • proposal, n. ప్రతిపాదన; ఉపపాద్యం;
  • propose, v. t. (1) ప్రతిపాదించు; ఉపపాదించు; (2) పెండ్లాడమని అడుగు;
  • proposer, n. ప్రతిపాదకుడు; ప్రస్థావకుడు;
  • propositon, n. ప్రాతిపదిక; ఉపపాద్యం; ప్రవచనం;
  • proprietor, n. యజమాని; సొంతదారు; ఏలిక; see also manager;
  • propriety, n. ఔచిత్యం; యుక్తత; మర్యాద;
  • proprioceptor, n. స్వంతగ్రాహకి, one's own receptor;
  • props, n. pl. రంగాలంకరణ సామగ్రి;
  • propyne, n. తదైను; మూడు కర్బనపు అణువులు ఒక త్రిపుట బంధం ఉన్న ఒక రసాయన వాయువు; C3H4;
  • pros and cons, ph. అనుకూల ప్రతికూలతలు; ముందువెనుకలు; లాభనష్టాలు; మంచి చెడ్డలు;
  • prosaic, adj. పస లేని; నీరసమైన; చప్పగా ఉన్న;
  • proscribe, v. t. నిషేదించు; కూడదని చెప్పు;
  • prose, n. వచనం; గద్యం; యజుస్సు;
    • literary -, గద్యం; యజుస్సు;
    • conventional -, వచనం;
  • prosecution, n. (1) జరిపించడం; పని జరిపించడం; కృషి; (2) ఒక వ్యక్తి నేరస్తుడని రుజువు చెయ్యడానికి ప్రభుత్వం తరఫున జరిగే కృషి;
  • prosecutor, n. కృషీవలి; ఒక వ్యక్తి నేరస్తుడని రుజువు చెయ్యడానికి ప్రభుత్వం తరఫున కృషి చేసే వ్యక్తి;
  • prosody, n. ఛందస్సు; పద్యరచనకి నియమావళి;
  • prospect, n. ఉత్తరాపేక్ష; ఆశ;
  • prospective, adj. భవిష్యత్తుకు సంబంధించిన; కాబోయే;
  • prospectus, n. పరిచయ పత్రం; పరిచయ పొత్తం; వివరణ పత్రం;
  • prosper, v. i. ప్రబలు;
  • prosperity, n. ఐశ్వర్యం; సౌభాగ్యం; క్షేమం; శ్రేయస్సు; అభివృద్ధి;
  • prostate gland, n. వస్తి గ్రంధి;
  • prostitute, n. వ్యభిచారిణి; జారిణి; ముండ; రండ; లంజ; తొత్తు; రంకులాడి; వాడవదిన; గణిక;
    • son of a -, లంజకొడుకు; తొత్తుకొడుకు;
  • prostitution, n. వ్యభిచారం; పడుపు వృత్తి; జారత్వం; లంజతనం; రంకుతనం;
  • prostrate, v. t. సాష్టాంగపడు;
  • protect, v. t. రక్షించు; పోషించు; కాపాడు; ఏలు; గుప్తించు; ఓము;
  • protected, adj. రక్షిత;
  • protecting, adj. రక్షణ;
  • protection, n. రక్ష; రక్షణ; సంరక్షణ; పరిరక్షణ; కాపు; కాపుగడ; ప్రోపు; పోషణ; గుప్తి; అనుపాలన; ఓమిక;
    • complete -, అభిరక్షణ;
  • protective, adj. రక్షక;
  • protective coating, ph. రక్షక లేపనం;
  • proteins, n. ప్రాణ్యములు; మాంసՠуత్తులు;
  • protest, n. ఆక్షేపణ; ఫిర్యాదు;
  • proto, pref. ప్రథమ; ముఖ్య; ఆది; మూల;
  • protocol, n. పద్ధతి; ప్రవర్తనా నిЯమావళి; మర్యాద; అంతస్తుకి తగిన మర్యాద; ఇచ్చి పుచ్చుకొనే పద్ధతి;
  • protagonist, n. నాయకుడు; నాయకురాఉ; ప్రథాన పాత్రధారి;
  • protondry, n. పుంభాగ ప్రథమోత్పత్తి;
  • protonema, n. ప్రథమతంతువు;
  • protoplasm, n. ఆదిపదార్థం; జీవపదార్థం; see also cytoplasm;
  • protozoa, n. ఆదిజీవులు; ఆదిజంతువులు; తొలేలులు (తొలి + ఏలులు); ఇవి బేక్టీరియా కంటె పెద్దవి; ఎమీబా వల్ల కలిగే గ్రహణి, మలేరియా మొదలైన వ్యాధులు ఈ రకం సూక్ష్మజీవుల వల్లనే కలుగుతాయి;
  • prototype, n. ఆద; మచ్చు;
  • protractor, n. కోణమాని; కోణమితి; కోణవిపరికరం;
  • protracted, adj. నానుడు; ఆలశ్యం చేసిన; విలంబిత;
  • proud, adj. (1) అభిమానం గల; ఆత్మాభిమానం గల; (2) గర్వం గల;
  • prove, v. t. రుజువు చేయు; నిరూపించు; మూదలించు;
  • proverb, n. సామెత; సామెం; లోకోక్తి; ఆభాణకం;
  • provide, v. t. సిద్ధం చేయు; ఇచ్చు;
  • providential, n. దైవికం;
  • providentially, adv. దైవికంగా; అవశాత్తుగా; అనుకోకుండా;
  • province, n. పరగణా; దేశంలో ఒక విభాగం;
  • provision, n. ఏర్పాటు; సదుపాయం; నియమం; నిబంధన;
  • provisions, n. కిరానా; చిల్లర దినుసులు; రస్తు;
  • provisionally, adv. అందాకా; ప్రస్తుతానికి;
  • proviso, n. షరతు; మినహాయింపు; షరా;
  • provoke, v. t. రేకెత్తించు; రెచ్చగొట్టు; ప్రకోపింపచేయు; ఉత్తేజపరచు;
  • prowess, n. షరతు; పరాక్రమం;
  • prowl, v. i. నక్కు; పొంచి ఉండు;
  • prowler, n. పొంచి సంచరించే జంతువు లేదా వ్యక్తి;
  • proximate, adj. ఉప; సమీపపు; సన్నిహితమైన;
  • proximate instruction, ph. ఉపనిషత్;
  • proximate theorem, ph. ఉప సిద్ధాంతం;
  • proximity, n. చెంత; చేరువ; చెంగలి; పొడ; తరి; దరి; దాపు; సరస; సమీపం; సామీప్యం; సన్నిధి; సాన్నిధ్యం; సన్నిధానం; దరిదాపు; దండ; అంతికం; నేదిష్టం; అందిక; నైకట్యం;
  • proxy, n. ఒకరి తరఫున వ్యవహరించడానికి మరొకరికి ఇచ్చే అధికారం; ప్రాతినిధ్యం; వకీల్తా: అటువంటి అధికారం పొందిన వ్యక్తి; వకీలు;
  • prude, n. అతివినయం ప్రదర్శించే వ్యక్తి;
  • prudence, n. ప్రాజ్ఞత;
  • prune, n. అలబకారా; ఎండిన ప్లమ్ అనే పండు;
  • prune, v. t. కత్తిరించు; త్రుంచు; పత్రించు; మొక్కల కొమ్మలను కత్తిరించు; తగ్గించు;
  • pruner, n. కత్తెర; పత్రిక;
  • pruning, n. పత్రింపు; ఎదిగేదానిని కత్తిరించడం;
  • psalm, n. ప్రార్ధనా గీతం; బైబిలులో ఒక భాగం;
  • pseudo, adj. కుహనా; మిథ్యా; అబద్ధపు; మారు;
  • psuedomorphism, n. అభాసరూపత్వం;
  • pseudonym, n. గోప్యనామం; కుహనా నామం; మారుపేరు;
  • pseudopod, n. కూటపాదం; జీవకణాలు కదలికకు కణసారం కోలగా సాగి పాదం మాదిరి ఉపయోగపడే సాధనం;
  • psyche, n. మనస్సు; భావజాలం;
  • psychiatrist, n. మానసిక వైద్యశాస్త్రం ప్రకారం మానసిక రోగాలకి మందులిచ్చి కుదిర్చే వైద్యుడు;
  • psychic, adj. అతీంద్రియ;
  • psychic, n. అతీంద్రియాళువు; అతీంద్రియ శక్తులు ఉన్న వ్యక్తి;
  • psychoanalysis, n. మానసిక విశ్లేషణ;
  • psychological, adj. మానసిక;
  • psychologist, n. మనస్తత్వ శాస్త్రం ప్రకారం మానసిక దౌర్బల్యాలని విశ్లేషించే వ్యక్తి;
  • psychology, n. (1) మనస్తత్వ శాస్త్రం; (2) మనస్తత్వం; మనుస్స్వభావం;
  • psychosomatic, adj. మానసిక రుగ్మతకి భౌతికమైన లక్షణాలు పొడచూపే;
  • psychotherapy, n. మానసిక చికిత్స;
  • psychosis, n. గజిబిజగా, ఆందోళనకరంగా ఉండే ఆలోచనలు, లేనివి ఉన్నట్లు అనిపించే భ్రాంతి, మొదలైన లక్షణాలు ఉన్న మనో స్థితి;
  • pub, n. short for “public house”; the name for a small bar cum restaurant in the U. K.;
  • puberty, n. తారుణ్య దశ; ఈడు; యవ్వనం;
  • public, adj. (1) బాహాటపు; బాహాటమైన; బహిరంగ; బహిరంగమైన; రట్టయిన; రచ్చ; పబ్లిక్‌గా; (2) ప్రజా; పౌర; జనహితైక; సర్వజనిక; (3) ప్రభుత్వ; రాజ్యస; దివాణపు; సర్కారు;
    • - decency, ph. నలుగురిలో మర్యాద; ఔచిత్యం;
    • - good, ph. ప్రజాశ్రేయస్సు;
    • - health, ph. ప్రజారోగ్యం;
    • - interest, ph. ప్రజాహితం;
    • - officer, ph. ప్రభుత్వోద్యోగి;
    • - opinion, ph. ప్రజాభిప్రాయం;
    • - performance, ph. బహిరంగ ప్రదర్శనం;
    • - relations, ph. పౌర సంబంధాలు;
    • - road, ph. రహదారి; రచ్చబాట;
    • - safety, ph. ప్రజాక్షేమం;
    • - school, ph. సార్వజనిక పాఠశాల;
    • - sector, ph. ప్రభుత్వ రంగం;
    • - secret, ph. బహిరంగ రహశ్యం;
    • - servant, ph. ప్రజా సేవకుడు; ప్రభుత్వోద్యోగి;
    • - spirit, ph. లోకోపకార బుద్ధి;
    • - worship, ph. సర్వజనక పూజ;
  • public, n. జనసామాన్యం; ప్రజలు; పౌరులు; పురజనులు;
  • publication, n. (1) ప్రచురణ; వెలయింపు; ప్రచురించబడినది; (2) గ్రంథం; వార్తాపత్రిక; ఇస్తిహారు;
  • publicity, n. ప్రచారం; ప్రాచుర్యం; బాహాటం; వెల్లాటకం;
  • publicly, adv. బాహాటంగా;
  • publish, v. t. ప్రచురించు; వెలయించు;
  • publishers, n.pl. ప్రచురణకర్తలు; ప్రకాశకులు;
  • pucker, v. t. అప్పళించు;
  • puddle, n. నీటి గుంట; వర్షపు నీరు చేరిన గుంట;
  • pudding, n. పిండి, పాలు, ధాన్యాలు, పండ్లు, గుడ్లు మొ. పదార్థాలతో చేసే తియ్యని మెత్తని వంటకం;
    • rice -, పరమాన్నం; క్షీరాన్నం;
  • puerile, adj. కౌమార; వయస్సుకి తగని; (rel.) adolescent; juvenile; immature; childish;
  • puerperal, adj. పురిటికి సంబంధించిన; పురిటి; ప్రసూతి; సూతికా;
  • puerperal ailment, ph. సూతికా రోగం;
  • puff, v. t. ఊదు;
  • puff, v. i. గుల్లబారు; గుల్లవిచ్చు; ఉబ్బు; పొంగు;
  • puffed cheeks, n. బూరె బుగ్గలు;
  • pug mark, n. జంతువుల పాదముద్ర;
  • pugnacious person, n. పేచీకోరు;
  • pull, v. t. పీకు; లాగు; పెరుకు;
  • pulley, n. కప్పీ; నేమి; త్రికాసి; గిరక, giraka; గిలక, gilaka
  • pulley attached to a well, ph. గిలక;
  • pull-ups, n. pl. దండీలు; ఒక రకం వ్యాయామం; ఎత్తుగా, క్షితిజ సమాంతరంగా వేల్లాడదీసిన చిన్న కర్రని పట్టుకుని వేల్లాడుతూ, గడ్డం కర్రకి తగిలే వరకూ శరీరాన్ని లేవనిత్తడం;
  • pulmonary, adj. పుఫుస; ఊపిరితిత్తులకి సంబంధించిన;
  • pulmonary artery, ph. పుపుస ధమని;
  • pulmonary circulation, ph. పుపుస ప్రసరణం;
  • pulmonary vein, ph. పుపుస సిర;
  • pulp, adj. చవకబారు;
  • pulp fiction, ph. చవకబారు కాల్పనిక సాహిత్యం;
  • pulp, n. గుజ్జు; తాండ్ర;
    • mango -, మామిడి తాండ్ర;
    • paper -, కాగితపు గుజ్జు;
  • pulse, n. నాడి; ధాతునాడి; ఆరోగ్యమైన మగవాడి నాడి నిముషానికి డెబ్భయ్‍ సార్లు కొట్టుకుంటుంది;
  • pulses, n. pl. కాయ ధాన్యములు; అపరాలు;
  • pulverization, n. పేషణము;
  • pulverize, v. i. గుండగు; పిండగు; నుగ్గగు; చూర్ణమగు;
  • pulverize, v. t. గుండచేయు; నూరు; పిండిచేయు; నుగ్గుచేయు; చూర్ణముచేయు; పేషించు;
  • pulverizer, పేషకి; పేషకం; పేషణ యంత్రం; పిండి మర;
  • pump, n. పంపు; బొంబాయి; తోడిక;
    • hand -, బొంబాయి;
    • sump -, కూప తోడిక; మురికి నీళ్లు ఒక గోతి (కూపం) లోకి చేరుకున్నప్పుడు ఆ నీటిని బయటకు తోడే సాధనం;
  • pump, v. t. కుంభించు; తోడు;
  • pumpkin, n. గుమ్మడి; తియ్య గుమ్మడి; భద్రపర్ణి; కూశ్మాండం;
  • pun, n. అక్షరక్రీడ; శ్లేష; ఒకే మాటని రెండర్ధాలు వచ్చేలా ప్రయోగించటం;
  • punch, n. (1) పిడిగుద్దు; (2) పంచి; అయిదు రుచులతో కూడిన పానీయం; (3) పడి అచ్చు; లోహపు రేకులమీద అచ్చువేసే పనిముట్టు;
  • punch line, n. పతాక వాక్యం;
  • punctuality, n. సమయపాలన; తరితనం;
  • punctually, adv. ఠంచనుగా;
  • punctuation mark, n. విరామ చిహ్నం;
  • puncture, n. తూటు; బెజ్జం; చిల్లు; పంక్చరు; పంచేరు;
  • puncture, v. i. తూటు పడు; బెజ్జం పడు; చిల్లు పడు;
  • puncture, v. t. తూటు పెట్టు; చిల్లు పెట్టు;
  • pungent, adj; ఘాటైన;
  • punish, v. t. దండించు, daMDiM
  • punishment, n. దండన; శిక్ష; శాస్తి, adj. శిక్షాత్మక;
    • capital -, ఉరిశిక్ష;
  • punk, n. పనికిమాలినది; పనికిమాలినవాడు;
  • punish, v. t. దండించు; శిక్షించు;
  • puny, adj. బుల్లి; అల్పరూపి అయిన;
  • pup, n. కుక్కపిల్ల; కుక్కజాతి జంతువుల పిల్ల;
  • pupa, n. కోశస్థం;
  • pupil, n. (1) కంటిపాప; కంటిగుడ్డు; కన్నుయొక్క నల్లగుడ్డు; అక్షకూటం; తారక; కనీనిక; (2) అంతేవాసి; విద్యార్థి; m. శిష్యుడు; f. శిష్యురాలు;
  • puppet, n. కీలుబొమ్మ; తోలుబొమ్మ; సాలభంజిక;
  • purchase, n. క్రయం; కొనుగోలు;
  • purchase, v.t. కొను;
  • purchasing power, ph. కొనుగోలు శక్తి;
  • pure, adj. (1) పవిత్రమైన; నిష్కళంకమైన; పావన; (2) శుద్ధ; పరిశుద్ధ; స్వచ్ఛ; స్వచ్ఛంద; జాను; పాళా; ప్రత్యగ్ర; అప్పటము; కల్తీకాని; నిష్కల్మషమైన; ఔపపత్తిక; చొక్కం;
  • pure gold, ph. పాళా బంగారం;
  • pure mathematics, pa. ఔపపత్తిక గణితం; జాను గణితం;
  • pure science, ph. ఔపపత్తిక శాస్త్రం; జాను శాస్త్రం;
  • pure Telugu, ph. జాను తెలుగు;
  • puree, n. కట్టు; ఉడికించి, బాగా జారుగా అయేవరకూ ఎనిపిన వంటకం;
  • puree of toor dal, ph. కంది కట్టు;
  • purgative, n. విరేచనకారి;
  • purgatory, n. నరకం; క్రైస్తవ మతంలో నరకం;
  • purge, v. t. పరిహరించు; కత్తిరించు; శుద్ధిచేయు;
  • purity, n. శుద్ధత; శౌచం;
  • purple, n. ఊదా; ఎరుపు, నీలం కలసిన రంగు; ధూమ్రవర్ణం;
  • purport, n. తాత్పర్యం; సారాంశం; ఫలితార్థం;
  • purpose, n. ప్రయోజనం; ఉద్దేశం; ఉపయోగం;
    • general -, విశాల ప్రయోజనం;
    • special -, పరిమిత ప్రయోజనం;
  • purposelessness, n. నిష్ప్రయోజనం; వ్యర్థం;
  • purposive, adj. ప్రయోజనార్ధక;
  • purse, n. ముల్లె; డబ్బు సంచి; కీసా; పొంకణం;
  • push, adj. తోపుడు;
  • push cart, ph. తోపుడు బండి;
  • push, n. చొరవ;
  • push-ups, n. pl. బస్కీలు; ఒక రకం వ్యాయామం; కాళ్లతోటీ, చేతుల తోటీ నేలని దన్ను చేసుకొని, బోర్లా ఉన్న భంగిమలో, నేలకి మోకళ్లు తగలకుండా, శరీరాన్ని పైకి లేపడం;
  • Pusian lilac, n. మహానింబ;
  • purslane, n. పావిలాకు;
  • pursue, v. t. (1) వెంబడించు; వెంటతరుము; అనుసరించు; (2) అనుకున్న పనిని సాధించడానికి ప్రయత్నం చేయు;
  • purulent, adj. చీము కలిగినట్టి; చీము పట్టిన;
  • purview, n. పరిధి; దృక్ పరిధి; చూపుమేర; ఎరికె;
  • pus, n. చీము; see also రసి;
  • push, v. t. తోయు; నెట్టు;
  • pushy, adj. చొరవ;
  • pussyfoot, v. i. నాన్చు; వివాదాస్పదమైన విషయంలో ఎటూ మొగ్గకుండ నాన్చు;
  • pustule, n. చీముతో నిండిన, చిన్న, గుండ్రని పొక్కు;
  • putrid, adj. కుళ్లు; కుళ్లిన; పూతి;
  • putrid odor, ph. కుళ్లు కంపు; పూతి గంధం;
  • puzzle, n. అరోచకం; ప్రహేళిక; పజిలు; పజిల్;
    • crossword -, గళ్లనుడికట్టు; పదకేళి;
  • pyol, n. అరుగు; చీడీ; ఇంటిని ఆనుకుని ఉండే ఎత్తయిన తీనె;
  • pyol, n. అరుగు; ఇంటి ముందు, ఇంటికి ఆనుకుని ఉన్న ఎత్తయిన తిన్నె;
  • pyre, n. చితి; ఒలికి;
  • pyro, adj. మంటకి సంబంధించిన;
  • pyroelectricity, n. తాప విద్యుత్తు;
  • pyrometer, n. బాగా ఎక్కువ వేడిని కొలిచే తాపమాపకం; ఉడుకుతున్న వస్తువుల వేడిని కాని, మండుతున్న వస్తువుల వేడిని కాని కొలిచే తాపమాపకం;
  • pyrotechniques, n. pl. బాణసంచా;
  • python, n. కొండచిలువ; పెనుబాము;
  • pyorrhea, pyorrhoea (Br.) n. పూతిదంతం; దంతవేష్టి; చీము పట్టిన పన్ను;

మూలం