ఇంగ్లీషు నెలలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మనమిప్పుడు ఇంగ్లీషు నెలల లని వాడుతున్న నెలల పేర్లు అసలు ఇంగ్లీషు వారు ఏర్పరచినవి కావు. పెక్కు ఏండ్లకు ముందే అనేకవిధాలుగా సంస్కృతి సంప్రదాయాలు సంపాదించి ఆదర్శప్రాయంగా జీవించిన రోమక దేశస్థులు ఈ పేర్లను ఆదిలో ఏర్పరచుకునారు. వారు తాము ప్రతినిత్యమూ కొలుస్తూఉన్న వివిధ దేవతల పేర్లనే నెలల పేర్లకు అతికించుకొని. ఆయా పండగ పర్వదినాల్లో ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు. ఆయా ఋతువులకు అనుగుణంగానే ఈ నామకరణం జరిగినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అనేక సౌకర్యాలనుబట్టి అనేక జాతులు వారు ఇప్పటికీ ఈ పేర్లను వాడుకుంటున్నారు.

ఆంగ్ల భాషా నెలలు (12).

1.జనవరి (రోజులు 31).

2.ఫిబ్రవరి (రోజులు 28 లీపు సంవత్సరము 29).

3.మార్చి (రోజులు 31).

4.ఏప్రిల్ (రోజులు 30).

5.మే (రోజులు 31).

6.జూన్ (రోజులు 30).

7.జూలై (రోజులు 31).

8.ఆగష్టు (రోజులు 31).

9.సెప్టెంబర్ (రోజులు 30).

10.అక్టోబర్ (రోజులు 31).

11.నవంబర్ (రోజులు 30).

12.డిసెంబర్ (రోజులు 31).