Jump to content

ఇంటర్ స్టెల్లర్

వికీపీడియా నుండి
Interstellar
A ringed spacecraft, revolves around a wormhole, here depicted as a reflective sphere.
Theatrical release poster
దర్శకత్వంChristopher Nolan
రచన
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంHoyte van Hoytema
కూర్పుLee Smith
సంగీతంHans Zimmer
పంపిణీదార్లు
విడుదల తేదీs
అక్టోబరు 26, 2014 (2014-10-26)(TCL Chinese Theatre)
నవంబరు 5, 2014 (North America)
నవంబరు 7, 2014 (United Kingdom)
సినిమా నిడివి
169 minutes[2]
దేశాలు
  • United Kingdom
  • United States[1]
భాషఆంగ్ల భాష
బడ్జెట్$165 million[3]
బాక్సాఫీసు$660.6 million[3]

ఇంటర్ స్టెల్లర్ (2014) (ఆంగ్లం: Interstellar) చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కదానాయకుడిగా "మాథ్యు మెక్ కానవె" నటించారు. ఈ చిత్రం యొక్క కథ క్లుప్తంగా " భూమి మీద మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు విశ్వంలొ ఇంకేదైనా పాలపుంతలొ మనుష్యులు జీవించుటకు అనువైన స్థలం ఉందేమో వెతుకుటకు బయలు దేరిన నలుగురు వ్యొమగాములు యొక్క కథ. ఈ చిత్రాన్ని పారా మౌంట్, సిన్ కాపి, వార్నర్ బ్రదర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ చిత్రానికి హాన్స్ జిమ్మర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం పూర్తిగా ఐమాక్స్ విధానం లొనె చిత్రించారు. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ ను "డబుల్ నెగిటివ్" సంస్థ అందించింది.
ఈ చిత్ర ప్రీమియర్ ప్రదర్శన అక్టోబరు 24, 2014 నార్త్ అమెరికా లోని లాస్ ఎంజెల్స్ లో ప్రదర్శితమైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా $660.6 మిలియన్ డాలర్లు ఆర్జించింది. చిత్ర విమర్శకులు ఈ చిత్రం లోని వైజ్ఞానిక అంశాలతొ పాటు నటీనటుల నటనకు సంగీతానికి. ప్రశంసలు లభించాయి. ఈ చిత్రం 87వ ఆస్కార్ అవార్డుల అయిదు విభాగాలలో (Best Original Score, Best Sound Mixing, Best Sound Editing, Best Visual Effects and Best Production Design) స్థానం సంపాదించింది. విజువల్ ఎఫెక్ట్స్ లో ఆస్కార్ గెలుచుకుంది.

కూపర్ ఒక రైతు. పూర్వాశ్రమంలో నాసా పైలట్, అతనికి 15 ఏళ్ళ కొడుకు టామ్,10 ఏళ్ళ కూతురు మర్ఫీ. తన మావయ్యతో కలిసి జీవిస్తూంటాడు. మర్ఫీ తన గదిని ఏదొ అదృశ్య శక్తి ఆవహించిందని నమ్ముతుంది. ఒక రోజు దుమ్ము దూళీతొ కూడిన పెద్ద తూఫాను వచ్చినప్పుడు మర్ఫీ గదిలోని అదృశ్య శక్తి గురుత్వ తరంగాల ద్వారా ఒక సందేశం ఏర్పరుస్తుంది. అది కూపర్ ను, మర్ఫీని రహస్యంగా నడుపుతున్న నాసా కేంద్రానికి పంపుతుంది. డా. జాన్ బ్రాండ్ ఆద్వర్యంలో నాసా కేంద్రం పనిచేస్తుంటుంది. అప్పుడు బ్రాండ్ కూపర్కు వివరిస్తాడు, భూమి మీద ఏర్పడిన అనిశ్చిత స్థితి నుండి మానవ జాతిని కాపాడడానికి విశ్వంలో గ్రహాంతర జీవుల ద్వారా ఏర్పరచబడిన వాంహొల్స్ ఉన్నాయని వాటిని వాహకంలాగా వాడుకుని ఇతర గ్రహాలకు చేరుకునే అవకాశం ఉందని వివరిస్తాడు. ఆ విధంగా నాసా యొక్క "లాజరస్ మిషన్" అప్పటికే గార్గాంటా అనే కృష్ణబిలం (బ్లాక్ హొల్) చుట్టూ పరిభ్రమించే ఎడ్మండ్, మిల్లర్, మాన్, అనే మూడు అనుకూల గ్రహాలను కనుక్కున్నారని. ఆ గ్రహాలను కనుక్కుని వాటి సమాచారాన్ని సేకరించేందులు వెళ్ళిన ముగ్గురు నాసా వ్యొమగాముల పేర్లే ఆ గ్రహాలకు పేట్టామని వివరిస్తాడు. అయితే కూపర్ను ఆ మూడు గ్రహాల సమాచారం సేకరించి ఏ గ్రహం అనుకూలంగా ఉందొ కనుక్కుని రమ్మంటాడు.
కూపర్ తొ పాటు ఆ మిషన్ లో డా. జాన్ బ్రాండ్ యొక్క కూతురు జీవశాస్త్ర నిపుణురాలు అమీలియా బ్రాండ్, ఇద్దరు వ్యొమగాములు, టార్స్, కేస్ అనే రెండు రొబొట్లు కూడా ఉన్నాయని వివరిస్తాడు. అయితే జాన్ బ్రాండ్ తన దగ్గర ఉన్న రెండు ప్రతిపాదనలు కూపర్కు వివరిస్తాడు. (ప్లాన్-ఎ) మనుషులు మనుగడ సాగించగల గ్రహాన్ని వెతకడం. భూమ్మీది మనుషులను స్పేషిప్ ద్వారా తీసుకువెళ్ళడం. (ప్లాన్-బి) ఒకవేళ మూడు గ్రహాలు అనుకూలంగా లేని పక్షంలో తమవెంట తీసుకువెళ్ళిన ఫలదీకరణం చెందిన వివిధరకాల పిండాల్ని ఆ గ్రహాల మీద మనగలిగేలా చేయడం. అయతే కూపర్కు (ప్లాన్-బి) ఇష్టం ఉండదు. తను మాత్రం ఆ మూడు గ్రహాల మీద సమాచరం సేకరించి తిరిగి భూమిని చేరుకుని తన కూతురిని కలుసుకొవాలనుకుంటాడు. జాన్ బ్రాండ్ కు మాత్రం లోలోపల (ప్లాన్-ఎ) ఫలించదని తన ఆశలన్ని (ప్లాన్-బి) మీద మాత్రమే అని నమ్ముతాడు. కూపర్ ప్రయాణం మర్ఫీకి ఏమాత్రం ఇష్టం ఉండదు. అయితే కూపర్ తాను తప్పక తిరిగి వస్తానని వెళ్ళేటప్పుడు మర్ఫీకి ఒక వాచీని ఇచ్చి వెళతాడు. మర్ఫీ దానిని విసిరేస్తుంది. అది పుస్తకాల అరలో పడుతుంది. కూతురి జ్ణాపకాలతొ బయలుదేరుతాడు. వీరు ప్రయాణిస్తున్న స్పేస్ షటిల్ ను రాకెట్ రొదసిలోకి విడిచిపెడుతుంది. అది అప్పటికే భూమి చుట్టు పరిభ్రమిస్తున్న ఎండ్యూరెన్ స్ అనే స్పేస్ షటిల్కు అతుక్కుంటుంది. అక్కడ నుండి ఎండ్యూరెంస్ రొదసీయానం వేగంగా చేస్తుంది. సౌరమండలంలోని శనిగ్రహం దాటగానే వాంహొల్ను గుర్తిస్తారు.

ఎండ్యూరెంస్

అక్కడ నుండి స్పేష్ షటిల్ ద్వారా మొదటగా మిల్లర్ గ్రహానికి చేరుకుంటారు. గ్రావిటేషన్ టైం డైలేషన్ (గురుత్వాకర్షణ ఎక్కువగా ఉన్న చొట సమయం నెమ్మదిగా నడుస్తుంది. ఈ సిద్దాంతాన్ని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1907లో ప్రతిపాదించారు.) మిల్లర్ గ్రహం పైన ఒక గంట, భూమ్మీద 7 సంవత్సరాలతొ సమానం. మిల్లర్ గ్రహం పూర్తీగా సముద్రాలతొ నిండి ఉంటుంది. అక్కడ ఒక చొట దిగి సమాచారాన్ని సేకరించే క్రమంలో వందల అడుగుల ఎత్తులో అలలు రావడంతొ ఆ గ్రహం మానవుకు నివాసయోగ్యం కాదని తిరుగుప్రయాణమవుతారు. ఆ క్రమంలో ఒక పెద్ద అల ఢీకొనడంతొ డొయల్ అనే వ్యొమగామి మరణిస్తాడు. వారు తిరిగి ఎండ్యూరెన్ ను చేరుకొవడానికి 3 గంటల సమయం పడుతుంది. అప్పటికి భూమ్మిద 23 సంవత్సరాలు గడుస్తాయి. కూపర్ కూతురు మర్ఫీ పెద్దదై బ్రాండ్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంది. కొడుకు టాం పెళ్ళి చేసుకుని తన సంతానాన్ని video conference ద్వారా చూపిస్తాడు. ఆ సమయంలో కూపర్ చాలా ఉద్వేగానికి లోనవుతాడు. వీలైనంత త్వరగా మషన్ను పూర్తి చేయాలనుకుంటాడు. ఎండ్యూరెంస్ లో ఇంధనం తక్కువగా ఉండటం వలన మిగిలిన రెండు గ్రహాలలో ఒకదానిని చేరుకొవడానికి మాత్రమే వీలుంటుంది.

మాన్ గ్రహం సన్నివేశాలు చిత్రీకరించిన స్వినఫెల్స్ జొకుల్ లోని గడ్డకట్టిన ప్రాంతం

ఆ సమయంలో మాన్ గ్రహం మీదనుండి సంకేతాలు రావడంతొ ఆ గ్రహానికి చేరుతారు. దీర్ఘనిద్రలో ఉన్న మాన్ ను నిద్ర లేపుతారు. ఆగ్రహం అంతా గడ్డకట్టిన మంచులా ఉంటుంది. ఆ గ్రహంలో 67 గంటలు రాత్రి, 67 గంటలు పగలు. కూపర్ ఈ గ్రహం కూడా నివాసయొగ్యం కాదని గ్రహిస్తాడు. అయితే మాన్ కు కూడా ఈ విషయం తెలుసు. (ప్లాన్-బి) మాత్రమే ఈ మిషన్ యొక్క లక్ష్యం అని. కేవలం తనను రక్షిస్తారనే అనవసరమైన డాటాను పంపిస్తుండగా ఎండ్యూరెంస్ కు సంకేతం అందుతుంది. ఆ క్రమంలో ఒక సారి కూపర్ను చంపే ప్రయత్నం చేస్తాడు మాన్. అతని స్పేస్ సూట్ యొక్క వైజర్ను తొలగిస్తాడు. మాన్ ఎండ్యూరెంస్ ద్వారా భూమిని చేరుకొవాలనుకుంటాడు. ఈ దశలో మాన్ అమర్చిన బాంబు ద్వారా రొమిలీ అను వ్యొమగామి మరణిస్తాడు. అమీలియా ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూపర్ను కాపాడుతుంది. తిరిగి వారిద్దరు ఎండ్యూరెంస్ కు ప్రయాణమవుతారు. అక్కడ మాన్ తన స్పేస్ షటిల్ను ఎండ్యూరెంస్ కు అతుక్కునే ప్రయత్నం చేస్తాడు. సరైన పాస్వర్డ్ తెలియక పొవడం వలన ఎయిర్లాక్ ప్రేలిపొయి మాన్ మరణిస్తాడు. ఎండ్యూరెంస్ కూడా ప్రమాదం సంభవిస్తుంది. దానిని కూపర్ తన కార్గొషిప్ ద్వారా తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు.

శాస్త్రవేత్తల సిద్దాంతం ప్రకారం వాంహొల్

ఇప్పుడు కూపర్ ముందు రెండు లక్ష్యాలుంటాయి. ఒకటి తన కూతురు దగ్గరకు చేరడం. లేదా ఎడ్మండ్ గ్రహాన్ని చేరడం. అమీలియా లక్ష్యం మాత్రం ఎడ్మండ్ గ్రహాన్ని చేరడం. ఆమె అంతర్యం అర్థం చేసుకున్నాక కూపర్ అమెనుండి విడిపొవాలనుకుంటాడు. ఎండ్యూరెంస్ లో ఇంథనం తక్కువగా ఉండడం వలన అమీలియాను ఎడ్మండ్ వైపు పయనమైయ్యేలా "స్లింగ షాట్" ఆపరేషన్ చేస్తారు. (ఇంధన శక్తిని ఉపయొగించకుండా ఒక గ్రహపు గురుత్వశక్తిని ఉపయొగించుకుని వేగంగా ప్రయాణించే ప్రక్రియే స్లింగ్ షాట్.) కూపర్ విడిపొయి టార్స్ తొ పాటు విశ్వంలో పడిపొతాడు. అలా విశ్వంలో ప్రయాణిస్తుండగా ఎక్ట్రాడైమన్ షనల్ టెస్సిరాక్ట్ (ఫొర్త్ డైమన్ షన్)లో భూత, వర్తమాన కాలాలు అందులో బంధించబడి ఉంటాయి. మర్ఫీ చిన్ననాటి నుండి పెద్దదయ్యే వరకు ప్రతీది అందులో కనబడుతుంది. అప్పుడు కూపర్కు అర్థం అవుతుంది. విశ్వంలో ఉండే గ్రహాంతర జీవులే మానవులని వారే ఈ టెస్సిరాక్ట్ ను నిర్మించారని దీని ద్వారా కూపర్ మర్ఫీకి గురుత్వ తరంగాల ద్వారా మానవజాతిని కాపాడే స్ందేశాన్ని పంపుతుంటాడు. టార్స్ ఆ సమాచారాన్ని కొడింగ్ పద్ధతిలో మర్ఫీయొక్క చిన్నప్పుడు తన తండ్రి ఇచ్చిన గడియారంలో సందేశానుసారంగా కదులుతుంది. మర్ఫీ దానిని గ్రహించి బ్రాండ్ యొక్క సూత్రాల ద్వారా క్రొడీకరిస్తుంది. ఈ విదంగా మానవ జాతిని కాపాడుతుంది. ఆ తర్వాత టెస్సిరాక్ట్ నుండి వెలువడ్డాక కూపర్ స్పృహ కొల్పొతాడు. అప్పటికి మానవాళీ స్పేస్ ఫారింగ్ సొసైటి (అంతరిక్షంలో నివసించగల సంఘం) ఏర్పడి ఉంటుంది. కుపర్ కళ్ళు తెరిచేసరికి శనిగ్రహం ఆవరణలోని స్పేస్ స్టేషన్లొ ఉంటాడు. అప్పటీకి కూపర్ వయస్సు 125 ఏళ్ళు. గ్రావిటేషనల్ టైం డైలేషన్ ద్వారా 40 ఏళ్ళ వాడిలాగా కనబడుతాడు. తనకూతురు మర్ఫీ 94 ఏళ్ళ వయసులో అవసాన దశలో కలుసుకుంటాడు. మర్ఫీ తన తండ్రిని ఎడ్మండ్ మీదున్న అమీలియాను కలవాల్సిందిగా కొరుతుంది. కూపర్ టార్స్ తొ కలిసి ఎడ్మండ్ గ్రహానికి ప్రయాణమవడంతొ సినిమా ముగుస్తుంది.

టెస్సిరాక్ట్ యొక్క నమూనా

ఇతర విషయాలు

[మార్చు]

ఈ చిత్రానికి కథను సమకూర్చమని జానథన్ నొలన్ను ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ నియమించాడు. జానథన్ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన మరింత అవగాహనకు కాలిఫొర్నియా ఇన్ స్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సాపేక్షతా సిద్దాంతం లాంటి విషయాలు నేర్చుకున్నాడు. కథారచనకు హాలివుడ్ లో వచ్చిన చిత్రాలు WALL-E (2008) and Avatar (2009) ప్రేరణనిచ్చాయని తెలిపాడు. ఈ చిత్ర రచనకు సుమారు 4 సంవత్సరాల సమయం పట్టింది. అయితే స్పీల్బర్గ్ ఈ చిత్రం నుంచి తప్పుకున్న తరువాత తన సొదరుడు క్రిస్టొఫర్ నొలన్ను సంప్రదించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Interstellar (2014)". British Film Institute. Archived from the original on 2015-12-08. Retrieved December 10, 2014.
  2. "INTERSTELLAR". British Board of Film Classification. Retrieved October 20, 2014.
  3. 3.0 3.1 "Interstellar (2014)". Box Office Mojo. Retrieved January 6, 2015.